కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బుధవారం ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ పరీక్ష చేయగా కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్‌లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక, ఈ రెండు స్ట్రెయిన్‌లు కలిగిన కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాల్లు ఉన్నట్లు తెలిపింది. రెండు వేరియంట్ల కరోనా గురించి తెలుసని, ఈ కొత్త వేరియంట్ వల్ల ఎటువంటి ముప్పు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ పాండమిక్ రెస్పాన్స్ చీఫ్ సల్మాన్ జర్కా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ వ్యాప్తి, కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందడం లేదని తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు రోగులకు ప్రత్యేక చికిత్స కూడా అవసరం లేదని ఆయన అభిప్రాపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్‌లోని సుమారు 92 లక్షల మంది ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడు డోసులు పొందినట్లు సల్మాన్ జర్కా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment