న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,86,384 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. వైరస్‌తో నిన్న మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,03,71,500 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 4,91,700 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 22,02,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,76,77,328 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.
చదవండి: మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment