కరోనా సెకండ్ వేవ్ ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ తీసుకునే విధాంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక చాలా సంస్థలు ప్రజలు ఉద్యోగంలో ఉండాలంటే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ని తప్పనిసరి చేసింది.
(చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!)
దీంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకాడుతున్న వారు సైతం ఇప్పుడు సర్టిఫికెట్ల కోసం అయిన వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇదంతా ఒకఎత్తేయితే కొంతమంది ప్రబుద్ధులు మాత్రం ఈ మహమ్మారి సమయంలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని కూడా సంపాదన మార్గంగా ఎంచుకున్నారు. ఇండోనేషియాలో ఒక వ్యక్తి కేవలం 4 వేల రూపాయలకు ఇతరుల పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్నాడు.
వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసినప్పటి నుండి చాలా మంది ఈ వ్యాక్సిన్ తీసుకోవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండోనేషియాలోని సౌత్ సులవేసి నివాసి అయిన అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తి ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోని తప్పుడూ మార్గంలో డబ్బు సంపాదించే ప్రారంభించాడు. ఈ విధంగా అతను రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ను సుమారు 14 సార్లు తీసుకున్నాడు.ఆ తరువాత అతను ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్లను 4 వేలకు అమ్మేసేవాడు. పైగా ఇంజక్షన్ లేకుండా ఎవరికైనా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ కావాలంటే తనను సంప్రదించండి అంటూ ఒక వీడియో తీసి ప్రచారం చేసుకుని మరీ చెబుతుండటం గమనార్హం. విసషయం తెలుకున్న పోలీసులు అబ్దుల్ రహీమ్‌ను అరెస్టు చేశారు.
(చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!)
Comments
Please login to add a commentAdd a comment