vaccine distribution
-
మీరు బతికున్నారంటే మోదీ చలవే.. 'డోసు' పెంచిన బిహార్ మంత్రి
పట్నా: ప్రధాని నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తారు బిహార్ మంత్రి, బీజేపీ నేత రామ్ సూరత్ రాయ్. ప్రజలు ఇప్పుడు బతికున్నారంటే అది మోదీ చలవే అన్నారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసి, ప్రజలందరికీ ఉచితంగా టీకా డోసులు అందించి అందరి ప్రాణాలను ప్రధాని కాపాడారని పేర్కొన్నారు. ముజఫర్‌పుర్‌లో శుక్రవారం ఓ ర్యాలీకి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కరోనా తర్వాత ప్రపంచ దేశాలు ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే చిక్కుకుని ఉంటే, భారత్ మాత్రం వేగంగా ఆర్థిక పురోగతి సాధిస్తోందని రామ్‌సూరత్ రాయ్ అన్నారు. పొరుగు దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి ఎలా ఉందో టీవీలో చూస్తే అర్థమవుతోందన్నారు. భారత్ మాత్రం శాంతియుతంగా ఉందని తెలిపారు. కరోనా టీకాల క్రెడిట్ మొత్తం మోదీకే ఇస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ये बिहार सरकार में राजस्व मंत्री रामसूरत राय हैं जिनके अनुसार अगर आप ज़िंदा हैं तो इसके लिए प्रधान मंत्री @narendramodi का शुक्रगुज़ार होना चाहिए @ndtvindia pic.twitter.com/MDN3FzZbUr — manish (@manishndtv) July 31, 2022 జులై 17నాటికి దేశంలో 200 కోట్ల కరోనా టీకా డోసులు పంపణీ చేశారు. అంతేకాదు 18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగా బూస్టర్ డోసు ఇవ్వాలని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు దేశంలో ఆదివారం కొత్తగా 19,673 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 39 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,43,676 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 204 కోట్ల 25లక్షల 69వేలకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు. చదవండి: ‘ఆ డబ్బులు నావి కావు.. కాలమే సమాధానం చెబుతుంది’ -
వేగంగా ప్రికాషన్ డోసు టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకాకు సంబంధించిన ప్రికాషన్ డోసు పంపిణీపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. 18–59 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ నెల 15 నుంచి ఈ టీకా పంపిణీని ప్రారంభించారు. ఇప్పటివరకూ 15,53,703 మందికి పంపిణీ చేశారు. అత్యధికంగా 1,15,076 మందికి ఇవ్వడం ద్వారా కర్నూల్ జిల్లా తొలి స్థానంలో ఉంది. అనంతరం.. 1.04 లక్షలతో విశాఖపట్నం, 85,569 మందితో శ్రీకాకుళం తర్వాత స్థానాల్లో నిలిచాయి. సెప్టెంబర్ నెలాఖరులోగా 3.43 కోట్ల మందికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా రాష్ట్రంలో 3.43 కోట్ల మందికి ఈ ప్రికాషన్ టీకాను పంపిణీ చేయాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకూ 15.53 లక్షల మందికి వేశారు. గడువులోగా లక్ష్యం పూర్తికి వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వారంలో రెండ్రోజులు కాలేజీలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో టీకా పంపిణీ చేపడుతున్నారు. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం మందగించింది. కానీ, అవి ఇప్పుడు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో టీకా పంపిణీని వేగవంతం చేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు జిల్లాల వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించి పురోగతిపై ఆరా తీస్తున్నారు. రెండో డోసు టీకా వేసుకుని ఆర్నెలలు పూర్తయిన వారందరికీ ప్రికాషన్ డోసు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 73 శాతం పూర్తి మరోవైపు.. ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు 76,95,871 మందికి వేయాల్సి ఉండగా 56.19 లక్షల మందికి (73.02%) పూర్తయింది. అలాగే, హెల్త్‌కేర్ వర్కర్లు 98.46%, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 85.46 శాతం, 60 ఏళ్లు పైబడి 67.39 శాతం మందికి ప్రికాషన్ టీకా వేశారు. 99.02% మంది పిల్లలకు రెండు డోసులు ఇక 12–14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా రెండు డోసుల పంపిణీ దాదాపు పూర్తయింది. రాష్ట్రంలో ఈ వయసు పిల్లలు 14.90 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించగా.. అనతికాలంలోనే ఆ లక్ష్యాన్ని అధిగమించి తొలి డోసు పంపిణీని వైద్యశాఖ పూర్తిచేసింది. 99.02 శాతం మందికి రెండో డోసు టీకా ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ఏలూరు జిల్లాల్లో రెండు డోసుల పంపిణీ వంద శాతం ముగిసింది. కనిష్టంగా విజయనగరం జిల్లాలో 93.5 శాతం, ఏఎస్ఆర్ జిల్లాలో 95.73 శాతం మందికి రెండు డోసుల టీకా వేశారు. మిగిలిన అన్ని జిల్లాల్లో 97 శాతానికి పైగా రెండు డోసులు పంపిణీ చేపట్టారు. -
Booster Dose: ఇకపై ఫ్రీగా కరోనా బూస్టర్ డోస్
ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే 199.72 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు 18-59 ఏళ్ల వారికి రెండు డోసులు ఉచితంగా అందించింది కేంద్రం. ఆ తర్వాత ఏప్రిల్ 10న ప్రికాషన్ డోసుల పంపిణీ ప్రారంభించింది. అయితే.. 18-59 ఏళ్ల వారు ప్రికాషన్ డోస్‌ను ప్రైవేటు కేంద్రాల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. అలాగే 60 ఏళ్లుపైబడిన వాళ్లకు, ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లకు మూడో డోసు ఫ్రీగానే అందించింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటం, ప్రికాషన్ డోస్‌పై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవటం వల్ల ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా ప్రికాషన్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. జులై 15న మొదలై 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ప్రత్యేక డ్రైవ్‌ను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 18-59 ఏళ్ల వారికి సైతం ఉచితంగా మూడో డోసు అందించనున్నారు. 'దేశ జనాభాలో ఎక్కువ మంది తొమ్మిది నెలల క్రితమే రెండు డోసులు తీసుకున్నారు. ఐసీఎంఆర్, ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బూస్టర్ డోస్ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలింది. 75 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అందులో 18-59 ఏళ్ల వారికి ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా ప్రికాషన్ డోసు అందించనున్నారు. జులై 15న ప్రారంభం కానుంది.' అని అధికారులు తెలిపారు. కేవలం ఒక శాతమే.. ఇప్పటి వరకు దేశంలోని 77 కోట్ల మంది ఉన్న 18-59 ఏళ్ల వయసు వారిలో కేవంల 1 శాతం మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నారు. అర్హత కలిగిన 60 ఏళ్లు పైబడినవారు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 16 కోట్ల మంది ఉండగా.. అందులో 26 శాతం మంది మూడో డోసు తీసుకున్నారు. వ్యవధి తగ్గింపు.. కొద్ది రోజుల క్రితమే ప్రికాషన్ డోసు వ్యవధిని తగ్గించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకోవాల్సి ఉండగా.. ఆ సమయాన్ని ఆరు నెలలకు కుదించింది. వ్యాక్సినేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్ వేగం పెంచేందుకు ఇంటింటికీ టీకా 2.O పథకాన్ని జూన్ 1న ప్రారంభించింది కేంద్రం. ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలోని 96 శాతం మంది తొలి డోసు తీసుకోగా.. 87 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. ఇదీ చదవండి: కోవిడ్ టీకా తీసుకున్నవారికి రూ.5 వేల రివార్డు.. నిజమెంత? -
వేగంగా కరోనా టీకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయింది. ఈ వయసు పిల్లలకు 14,90,000 మందికి టీకా లక్ష్యం కాగా 14,55,314 మందికి తొలి డోసు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 80.82 శాతం అంటే 11,76,227 మందికి రెండు డోసులు వేశారు. అనంతపురం జిల్లాలో లక్ష్యానికి మించి 100.43% మంది పిల్లలకి 2 డోసులు వేశారు. ఈ జిల్లాలో 75,521 మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా 77,269 మందికి వేశారు. మరోవైపు 15 నుంచి 18 ఏళ్ల వారిలో 25,18,766 మందికి 2 డోసులు వేశారు. 71.36 శాతం మందికి ప్రికాషన్ డోసు రాష్ట్రంలో ఉన్న హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో 71.36 శాతం మందికి ప్రికాషన్ డోసు టీకా వేశారు. జనవరిలో వీరికి ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో ఇప్పటివరకు 30,06,318 మందికి ప్రికాషన్ టీకా వేయాల్సి ఉంది. వీరిలో 21,45,404 మందికి వేశారు. మే నెలలో 18,61,030 మందికి ప్రికాషన్ డోసు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వీరిలో హెల్త్ కేర్ వర్కర్లు 90,940 మంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 4,01,635 మంది, వృద్ధులు 13,68,455 మంది ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ 12 ఏళ్ల నుంచి వృద్ధుల వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని డోసుల టీకా పంపిణీనే లక్ష్యంగా పెట్టుకున్నాం. వైద్య సిబ్బందికీ లక్ష్యాలు నిర్దేశిస్తున్నాం. అర్హులైనప్పటికీ, కొందరు వృద్ధులు ప్రికాషన్ డోసు వేసుకోవడం లేదు. వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్ వస్తుంది. లేదంటే దగ్గరలోని టీకా కేంద్రానికి వెళితే అక్కడి వైద్య సిబ్బంది టీకా వేస్తారు. వైరస్ వ్యాప్తి పూర్తిగా కనుమరుగు అవలేదు. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి జాగ్రత్తలు పాటించాలి. టీకాలు సక్రమంగా వేయించుకోవాలి. -
12–14 ఏళ్ల పిల్లలకు నేటి నుంచి టీకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు బుధవారం నుంచి కరోనా టీకా పంపిణీ చేయనున్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో టీకా వేస్తామని అధికారులు చెప్పారు. 14.90 లక్షల మంది పిల్లలకు టీకా వేయనున్నారు. బయోలాజికల్ ఇ సంస్థ అభివృద్ధి చేసిన ‘కార్బెవ్యాక్స్’ టీకాను పిల్లలకు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేస్తుంది. తొలి డోసు వేసుకున్న 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తారు. టీకా వేయించుకోవడానికి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్‌కు మంగళవారం నుంచి అవకాశం కల్పించారు. 15 – 18 ఏళ్లు నిండిన 97 శాతం మందికి టీకా రాష్ట్రంలో 15–18 ఏళ్ల పిల్లలకు రెండు డోసుల టీకా పంపిణీ 97 శాతం పూర్తయింది. గత జనవరిలో వీరికి టీకా కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలో 24.41 లక్షల మందికి టీకా వేయలన్నది లక్ష్యం కాగా, అంతకు మంచి 25.21 లక్షల మందికి తొలి డోసు పంపిణీ పూర్తి చేశారు. వీరిలో 24.33 లక్షల మందికి రెండో డోసు కూడా పూర్తయింది. ప్రభుత్వాస్పత్రుల్లోనూ రిజిస్ట్రేషన్ : ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి 2008 మార్చి 15 నుంచి 2010 మార్చి 15 మధ్య పుట్టిన పిల్లలందరూ ఇప్పుడు టీకాకు అర్హులు. ప్రభుత్వాస్పత్రుల్లోని టీకా కేంద్రాల వద్దే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 15.21 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. 0.5 ఎంఎల్ చొప్పున వేస్తాం. 12 ఏళ్ల లోపు పిల్లలకు టీకా వేయం. టీకా పంపిణీపై జిల్లా వైద్యాధికారులకు మార్గదర్శకాలు ఇచ్చాం. -
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై నేటికి ఏడాది!!
కరోన మహమ్మారితో విలవిలలాడిపోయిన భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి నేటికి ఏడాది పూర్తైయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ "ప్రపంచంలో అత్యంత విజయవంతమైనది"గా పేర్కొన్నారు. గతేడాది ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన అభినందించారు. ఈ మేరకు మాండవ్వ మాట్లాడుతూ.." ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి నేటికి ఒక ఏడాది పూర్తైయింది. 'సబ్కే ప్రయాస్'తో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభించిన ఈ ప్రక్రియ నేడు ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ ప్రక్రియగా అభివర్ణించారు. అంతేకాదు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌కి సహాయ సహకారాలు అందించిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, దేశ ప్రజలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను" అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పైగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ ఏవిధంగా ప్రారంభమైందో ఎలా విజయవింతమైందో వంటి విషయాలకు సంబంధించిన గ్రాఫికల్ చార్ట్‌లను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ జనవరి 16, 2021న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ దాదాపు 156.76 కోట్లకు పైగా డోసులను అందించింది. గత 24 గంటల్లో సుమారు 66 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందిచారు. అంతేగాక భారత్‌లో గడిచిన 24 గంటల్లో 2,71,202 కొత్త కోవిడ్ -19 కేసులు, 314 మరణాలు సంభవించగా, 1,38,331 రికవరీలు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. Have a look at the journey of #1YearOfVaccineDrive, that gives glimpses of the nation's collective fight against #COVID19 under the visionary and inspiring leadership of PM @NarendraModi Ji. pic.twitter.com/Hit9Ku8rzS — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 16, 2022 (చదవండి: ‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్) -
చెకోడీలమ్మినట్లు వ్యాక్సిన్ సర్టిఫికేట్లు అమ్మకానికి పెట్టాడు!
కరోనా సెకండ్ వేవ్ ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ తీసుకునే విధాంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాక చాలా సంస్థలు ప్రజలు ఉద్యోగంలో ఉండాలంటే కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ని తప్పనిసరి చేసింది. (చదవండి: అందంగా అలంకరించిన ఆ క్రిస్మస్ చెట్టే వాళ్లను జైలుపాలు చేసింది!!) దీంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకాడుతున్న వారు సైతం ఇప్పుడు సర్టిఫికెట్ల కోసం అయిన వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇదంతా ఒకఎత్తేయితే కొంతమంది ప్రబుద్ధులు మాత్రం ఈ మహమ్మారి సమయంలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని కూడా సంపాదన మార్గంగా ఎంచుకున్నారు. ఇండోనేషియాలో ఒక వ్యక్తి కేవలం 4 వేల రూపాయలకు ఇతరుల పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్నాడు. వాస్తవానికి కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసినప్పటి నుండి చాలా మంది ఈ వ్యాక్సిన్ తీసుకోవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇండోనేషియాలోని సౌత్ సులవేసి నివాసి అయిన అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తి ఇలాంటి వాటిని సద్వినియోగం చేసుకోని తప్పుడూ మార్గంలో డబ్బు సంపాదించే ప్రారంభించాడు. ఈ విధంగా అతను రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్‌ను సుమారు 14 సార్లు తీసుకున్నాడు.ఆ తరువాత అతను ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్లను 4 వేలకు అమ్మేసేవాడు. పైగా ఇంజక్షన్ లేకుండా ఎవరికైనా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ కావాలంటే తనను సంప్రదించండి అంటూ ఒక వీడియో తీసి ప్రచారం చేసుకుని మరీ చెబుతుండటం గమనార్హం. విసషయం తెలుకున్న పోలీసులు అబ్దుల్ రహీమ్‌ను అరెస్టు చేశారు. (చదవండి: పోలీస్ కమిషనర్ పేరుతో పోలీసులనే బురిడి కొట్టించాడు!!) -
డల్లాస్‌లో వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టిన నాట్స్
డల్లాస్,టెక్సాస్: అమెరికాలో తెలుగువారికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగువారి కోసం ఉచితవ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో డల్లాస్‌లో దాదాపు 500 మందికిపైగా తెలుగు చిన్నారులకు వ్యాక్సిన్స్ వేశారు. ఇందులో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అందించారు. ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న పెద్దలకు బూస్టర్ డోస్ ఇచ్చారు. గ్రేట్ ఫార్మసీ, ఇండిపెండెన్స్ ఫార్మసీల సహకారంతో నాట్స్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్, వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, బోర్డ్ డైరెక్టర్స్ కిషోర్ వీరరగంధం, ఆది గెల్లి, కిషోర్ కంచర్ల, ప్రేమ్ కుమార్ లతో పాటు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ భాను లంక, చాప్టర్ కోఆర్డినేటర్ రాజేంద్ర కాట్రగడ్డ, రాజేంద్ర యనమల తదితర స్థానిక డల్లాస్ నాట్స్ విభాగ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారంతా నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలపైప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని టెక్సాస్ చాప్టర్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. -
100 కోట్ల టీకా డోసుల పంపిణీ
-
అన్నీ ఆలోచించాకే పిల్లలకు టీకాపై నిర్ణయం
న్యూఢిల్లీ: శాస్త్రీయంగా, హేతుబద్ధంగా అధ్యయనం చేసి, కోవిడ్–19 వ్యాక్సిన్ల పంపిణీ పరిస్థితుల్ని అంచనా వేసుకున్నాకే పిల్లలు, కౌమార దశలో ఉన్న వారికి వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని కరోనా టాస్క్‌ఫోర్స్ చీఫ్ వి.కె.పాల్ చెప్పారు. ఇప్పటికే చాలా దేశాలు 18 ఏళ్లలోపు వారికి టీకా డోసులు ఇస్తున్నారని, అయితే తాము అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే పిల్లల వ్యాక్సిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఆదివారం చెప్పారు. భారత్ బయోటెక్ కోవాగి్జన్ టీకాను 2–18 ఏళ్ల వయసు వారికి ఇవ్వొచ్చునని డీసీజీఐ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగి్జన్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. 2–18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌పై శాస్త్రీయ అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వి.కె.పాల్ స్పష్టం చేశారు. -
థాంక్స్ టు ఇండియా
ఐక్యరాజ్యసమితి: కరోనాపై పోరాటంలో సరైన సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల్ని ప్రపంచ దేశాలకు పంపిణీ చేసినందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి వేదికగా భారత్‌కు వివిధ దేశాలు కృతజ్ఞతలు తెలిపాయి. సెప్టెంబర్ 21–27 వరకు జరిగిన సదస్సులో వివిధ దేశాధినేతలు భారత్‌కు ధన్యవాదాలు చెప్పారు. టీకా డోసులు ఎగుమతితో పాటు, ఇతర అత్యవసర మందులు కూడా పంపిణీ చేసినందుకు భారత్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. నైజీరియా, ఘనా, ఫిజి, డొమినికా, నేపాల్, భూటాన్ తదితర దేశాలకు చెందిన నాయకులు భారత్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాగ్జ్ కార్యక్రమంలో భాగంగా భారత్ 100కిపైగా దేశాలకు 6.6 కోట్ల టీకా డోసుల్ని ఎగుమతి చేసింది. ఏప్రిల్‌లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఎగుమతుల్ని నిలిపి వేసింది. మళ్లీ అక్టోబర్ నుంచి ఎగుమతుల్ని ప్రారం భిస్తామని క్వాడ్ సదస్సు వేదికగా తెలిపింది. భారత్ సహకారం లేనిదే ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్రమంగా జరిగేది కాదని నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారి ప్రశంసిం చారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను యూకే గుర్తించకపోవడాన్ని కూడా పలు దేశాధినేతలు తప్పు పట్టారు. మరోవైపు భారత్ టీకా ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని అమెరికాలో రిపబ్లికన్ పార్టీ సెనెటర్ స్వాగతించారు. అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్‌కి తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచాలని సెనేటర్ జిర్ రిస్చ్ చెప్పారు. -
2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు చూసి
పనాజీ: దేశవ్యాప్తంగా శుక్రవారం రికార్డు స్థాయిలో 2.5 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు వేయడంతో తన 71వ పుట్టిన రోజు ఎంతో ఉద్వేగంగా జరిగిందని, మరపురాని రోజుగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఇలాంటి అరుదైన ఘనతని సాధించలేకపోయాయని అన్నారు. వ్యాక్సినేషన్‌పై విమర్శలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ డ్రైవ్ చూసిన ఒక రాజకీయ పార్టీకి జ్వరం వచ్చిందని ఎగతాళి చేశారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోవాలోని ఆరోగ్య కార్యకర్తలు, వ్యాక్సిన్ తీసుకున్న వారితో ముచ్చటించారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా గోవా నిలిచిన నేపథ్యంలో మోదీ వారితో మాట్లాడారు. ‘నా జీవితంలో ఈసారి జరిగిన పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం. టీకా వేసుకుంటే జ్వరం వస్తుందని అనుకుంటారు. కానీ నా పుట్టిన రోజున 2.5 కోట్ల టీకా డోసులు ఇవ్వడం చూసి ఒక రాజకీయ పార్టీ జ్వరం వచి్చంది’అని మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. ఒకేరోజు ఈ స్థాయిలో టీకాలు ఇవ్వడం చిన్న విషయం కాదని, గంటకి 15 లక్షల డోసులు, ప్రతీ నిముషానికి 26 వేలు, సెకండ్‌కి 415 డోసులు ఇచ్చారని భావోద్వేగంతో చెప్పారు. ప్రతిరోజూ పుట్టినరోజు కావాలి: కాంగ్రెస్ ప్రధాని∙మోదీ ప్రతీ రోజూ పుట్టిన రోజు జరుపుకుంటే కొన్ని బీజీపీ పాలిత రాష్ట్రాలు సాధారణ రోజుల కంటే అధికంగా టీకాలు పంపిణీ చేస్తాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. రికార్డు స్థాయిలో 2.5 కోట్ల టీకా డోసులు ఇచ్చామంటూ కేంద్రం జబ్బలు చరుచుకుంటోంది కానీ, జనాభాకి ప్రతీ రోజూ ఇదే స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. -
వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపొందాలి
శంషాబాద్ రూరల్: కరోనాపై పోరాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీల్లో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోవాగ్జిన్ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న ట్రస్టు ఆవరణలో వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు వీడాలని కోరారు. దేశీయంగా తయారీతో తగ్గిన ఖర్చు: దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అన్ని ప్రాంతాలకు టీకాలు అందించే వీలుంటుందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని కేంద్రాల నుంచి కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉష పాల్గొన్నారు. -
వ్యాక్సిన్ డెలివరీలో సంచలనం! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..
Medicine From The Sky Project: కరోనా వ్యాక్సిన్ డెలివరీలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించేందుకు రెడీ అయ్యింది. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగంగా చేసేందుకు వీలుగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగించనుంది. ఈ ప్రయోగం తెలంగాణలో సఫలమైతే దేశమంతటా అమలు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా రోజుల లక్షల సంఖ్యలో వ్యాక్సినేషన్ జరుగుతున్నా అందులో సగానికి పైగా నగర, పట్టణ ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, అటవీ గ్రామాల ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సినేషన్ అందని ద్రాక్షగానే మిగిలింది. కేవలం వ్యాక్సిన్లను అత్యంత చల్లని ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేసే అవకాశం గ్రామీణ ప్రాంతాల్లో లేదు. దీంతో పట్టణ, నగర ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ జరుగుతోంది. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణలో చేపట్టనున్నారు. గంట వ్యవధిలో జిల్లా కేంద్రాల్లో ఉండే ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమాల ప్రాంతంలో ఉండే గ్రామాలకు గంటల వ్యవధిలోనే వ్యాక్సిన్లను తరలించేలా మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. భూమి నుంచి 500ల నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించే డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లను చేరవేయనున్నారు. స్టాక్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్‌కి కేవలం గంట వ్యవధిలో చేరాలా చూస్తారు. దీని వల్ల తక్కువ సమయంలోనే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు గమ్య స్థానాలకు చేరుకుంటాయి. ఉష్ణోగ్రత సంబంధిత కారణాల వల్ల వ్యాక్సిన్లు పాడవకుండా ఉంటాయి. సెప్టెంబరు 9 నుంచి మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ట్రయల్స్ రన్ని 2021 సెప్టెంబరు 9 నుంచి ప్రారంభించనున్నారు. తక్కువ ఎత్తులో కంటికి కనిపించేలా డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్లను ఎంపిక చేసిన గమ్యస్థానానికి నిర్దేశిత సమయంలోగా చేరేలా చూస్తారు. ఆ తర్వాత మూడు సార్లు కంటికి కనిపించనంత ఎత్తులో అత్యంత వేగంగా వ్యాక్సిన్లను గమ్య స్థానాలకు చేరుస్తారు. సెప్టెంబరు నుంచి అక్టోబరు మూడో వారం వరకు ఈ ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే మెడిసన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. తొలుత వికారాబాద్ మెడిసిన్స్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు చేపట్టేందుకు హైదారాబాద్‌కి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లాను ఎంచుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న 16 పీహెచ్‌సీలకు తొలిసారిగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. మూడు దశల్లో జరిగే ట్రయల్ రన్లో లోటు పాట్లు గుర్తించి వాటిని సవరించుకుంటారు. కేంద్రం అనుమతి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించుకుని అత్యవసర సమయాల్లో మెడిసన్లు, వ్యాక్సిన్లు, రక్తం తదితర అత్యవసర వైద్య సేవలు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది కేంద్ర ఏవియేషన్ నుంచి అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వంతో ఎనిమిది సంస్థలు సంయుక్తంగా కలిసి పని చేస్తున్నాయి. -
వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, మరింత పెరగనున్న ఇళ్ల కొనుగోళ్లు
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో (హైదరాబాద్ సహా) ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు ఇక్రా తెలిపింది. 68.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు విక్రయమయ్యాయి. కానీ, ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలోని విక్రయాలతో పోలిస్తే 19 శాతం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి)లో 84.7 మిలియన్ చదరపు అడుగుల ఇళ్లు అమ్ముడుపోయాయని.. 2011–12 సంవత్సరం నుంచి చూస్తే రెండో అత్యధిక త్రైమాసికం అమ్మకాలుగా ఇక్రా తన నివేదికలో తెలిపింది. ఈ అధిక బేస్ కారణంగా.. జూన్ త్రైమాసికంలో విక్రయాల క్షీణత కనిపిస్తోందని వివరించింది. నివాస గృహాల విక్రయాలు 2020 జూన్ త్రైమాసికంలో 33.7 మిలియన్ చదరపు అడుగుల మేరే అమ్ముడుపోవడం గమనార్హం. ఆ విధంగా చూస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మంచి డిమాండ్ దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం కొనసాగుతుండడం, ఆర్థిక కార్యకలాపాలను అనుమతించడం వల్ల స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి ఇళ్ల విక్రయాలు ఇంకా పుంజుకుంటాయని ఇక్రా అంచనా వేసింది. అంతర్గతంగా డిమాండ్ ఈ పరిశ్రమలో నెలకొని ఉన్నట్టు తెలిపింది. కనిష్టాల్లో రుణాల రేట్లు, కార్యాలయంతోపాటు ఇంటి నుంచి కూడా పనిచేసుకోగలిగిన వాతావరణం వల్ల ఇళ్లకు డిమాండ్ కొనసాగుతుందని పేర్కొంది. చదవండి: రూ.90 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్లను తెగకొనేస్తున్నారు -
Nalgonda: వ్యాక్సిన్ డోసులు ఫుల్.. స్పందన నిల్
సాక్షి, సూర్యాపేట(నల్లగొండ): నెల రోజుల క్రితం వరకు వ్యాక్సిన్ కోసం ఆస్పత్రుల ఎదుట బారులే బారులు కన్పించేవి. సరిపడా వ్యాక్సిన్ లేక అందరికీ ఇవ్వలేకపోయేవారు. దీంతో ధర్నాలు రాస్తారోకోలు చేసేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డోసులు అందుబాటులో ఉన్నా వాక్సిన్ వేసుకోవడానికి మాత్రం ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడంలేదు. సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంత ప్రజలు కరోనా బారినపడకుండా రెండు డోసులు వేయించుకుంటున్నా పల్లెవాసులు మాత్రం అంతగా శ్రద్ధకనబర్చడంలేదు. జిల్లా వ్యాప్తంగా 10.50లక్షల జనాభా ఉంటే 7.50లక్షల మందికి టీకా వేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా ఏడునెలల కాలంలో కేవలం 3.24లక్షల మంది మాత్రమే వేయించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3.24 లక్షల డోసులు పూర్తి.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ప్రక్రియ ప్రారంభమైంది. విడతల వారీ గా జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2,65,546 శాంపిల్స్ సేకరించగా.. 23,435 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ నెల 17 వరకు ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, ప్రైవేట్ ఆస్పత్రుల పరిధిలో వ్యాక్సినేషన్న్ ప్రక్రియ రెండు డోసులు కలిపి 3.24 లక్షలు పూర్తయింది. ఇందులో మొదటి డోసు 2,41,825 కాగా రెండో డోసు 82,901. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ ఉన్న చోట వ్యాక్సినేషన్ కూడా ఇదే స్థాయిలో ఉంది. కానీ పీహెచ్‌సీల పరిధిలో మాత్రం పాజిటివ్ కేసులు తక్కువ శాతం ఉన్న చోట ఎక్కువగా వ్యాక్సినేషన్జరుగుతోంది. పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకోకుండా.. జనాభా ఆధారంగానే వ్యాక్సిన్ వేస్తున్నట్లు సమాచారం. పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నచోట టీకాలు ఎక్కువ మందికి వేస్తేన్కరోనాకు కళ్లెం పడనుంది. అవగాహన కల్పించకే.. కేసులు నమోదు..? రాష్ట్ర స్థాయిలోనే జిల్లాలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి అధికారుల బృందం రెండుసార్లు జిల్లాలో పర్యటించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉన్న కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎక్కువ కేసులు నమోదుకావడానికి గల కారణాలను రాష్ట్రస్థాయి బృందం జిల్లా వైద్యాధికారుల నుంచి ఆరా తీసింది. సరిహద్దున బెల్ట్ షాపులు అధికంగా ఉండటం, రెండు రాష్ట్రాలకు రాకపోకలు జరుగుతుండటం తదితర కారణాలతో ఇక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు జిల్లా అధికారుల బృందం రాష్ట్రస్థాయి అధి కారులకు వివరించింది. అయితే ఈ బృందం పర్యటించిన తర్వాత పాజిటివ్ కేసుల శాతం తగ్గింది. ఏ ప్రాంతంలో పాజిటివ్ కేసుల శాతం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో కరోనా కట్టడికి అదేస్థాయిలో వ్యాక్సినేషన్జరగాలి. వైద్య ఆరోగ్య శాఖ ముందు చూపు లేకపోవడమో.. ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడం లేదా.. ప్రజలకు అవగాహన లేకపోవడమేమో కానీ వ్యాక్సినేషన్లో వేరియేష¯న్ ఉన్నట్లుగా బృందం గుర్తించి పరీక్షలు, టీకాలు పెంచాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆ వైపు అడుగులు వేయడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. రెండు నెలలకు సరిపడా టీకాలు ఉన్నాయి జిల్లాలోని ప్రజలకు కోవిడ్ టీకాలు రెండు నెలలకు సరిపడా అందుబాటులో ఉన్నాయి. 60 వేలకు పైగా కోవిడ్ టీకాలు సిద్ధంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో టీకాలు వేసుకునేందుకు ప్రజలు ముందుకువస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారికి కరోనా టీకాలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకుంటే మహమ్మారి నుంచి రక్షించబడతారు. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా టీకాల అధికారి కేసులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో ఏయే ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా యో గుర్తిస్తున్నాం. ఆయా చోట్ల పటిష్టచర్యలతో పాటుగా పరీక్షలు పెంచి టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రెండోదశ కరోనా కొంతమేర తగ్గుముఖం పట్టినట్లయింది. మూడో దశను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాం. ప్రజలు విధిగా మాస్క్, శానిటైజర్‌ను వినియోగించాలి. – డాక్టర్ కోటాచలం, జిల్లా వైద్యాధికారి -
నేడు 6 లక్షల రేబీస్ టీకాలు
సాక్షి, అమరావతి: సంక్రమిత వ్యాధుల దినోత్సవం (జూనోసిస్ డే) కోసం పశుసంవర్ధక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తారు. 200కు పైగా వ్యాధులు పశుపక్ష్యాదుల నుంచి మనుషులకు సంక్రమిస్తున్నాయని గుర్తించారు. వాటిలో ప్రధానంగా కుక్కల నుంచి రేబీస్, చిలుకల నుంచి సిట్టకోసిస్, పాడి పశువుల నుంచి క్షయ, అంత్రాక్స్, బ్రూసెల్లోసిస్, కోళ్ల నుంచి బర్డ్ ఫ్లూ, పందుల నుంచి మెదడు వాపు, స్వైన్ ఫ్లూ, ఎలుకలు, అడవి జంతువుల ద్వారా లెప్టోస్పైరోసిస్ వంటివి వ్యాపిస్తున్నాయి. సంక్రమిత వ్యాధుల్లో రేబీస్ ప్రాణాంతకమైనందున జూనోసిస్ డే నాడు కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పశువైద్యశాలలు, పాలీక్లినిక్‌లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కనీసం 6 లక్షల కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం.. జూనోసిస్ డే సందర్భంగా పెంపుడు కుక్కలకు టీకాలు వేయించుకోవాలి. çసంక్రమిత వ్యాధులను ఏ విధంగా ఎదుర్కోవాలో పెద్ద ఎత్తున అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాం. –డాక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
కోవిషీల్డ్ రెండో డోసు గడువు మళ్లీ పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిషీల్డ్ టీకా రెండో డోసు గడువును వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి పెంచింది. ప్రస్తుతం మొదటి డోసు పొందిన తర్వాత 12–16 వారాల మధ్యలో రెండో డోసు ఇస్తుండగా, ఈ గడువును 14–16 వారాలకు పెంచుతూ ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు బుధ వారం ఉత్తర్వులు జారీచేశారు. అంటే కోవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న 14 నుంచి 16 వారాల మధ్యలోనే రెండో డోసు టీకాను తీసు కోవాల్సి ఉంటుంది. కాగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందజేస్తున్నట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. -
యూకే పోటీలో రూ. 4.9 కోట్లు గెలిచిన హైదరాబాదీ
హైదరాబాద్ : నూతన ఆవిష్కరణలు, సరికొత్త సేవలు అందివ్వడంలో హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. జాతీయంగానే కాదు అంతర్జాతీయ వేదికల మీద సైతం ప్రశంసలు పొందుతున్నాయి. బెస్ట్ అవార్డులకు అర్హత సాధిస్తున్నాయి. కోవిడ్ కాంటెస్ట్ డేటా ఆధారిత కోవిడ్ సేవలకు సంబంధించి యూకేకి చెందిన ట్రినిటీ ఛాలెంజ్ సంస్థ ఇటీవల పోటీలు నిర్వహించగా గచ్చిబౌలిలో ఉన్న స్టాట్విగ్ సంస్థకు చెందిన వ్యాక్సిన్ లెడ్జర్ స్టార్టప్ రూ. 4.9 కోట్ల బహుమతి గెలుచుకుంది. ఫైనల్స్‌కి మొత్తం 16 స్టార్టప్స్ పోటీ పడగా వ్యాక్సిన్ లెడ్జర్ మూడో విజేతగా నిలిచింది. పనితీరు ఇలా టీకా తయారైంది మొదలు అది తీసుకునే వ్యక్తి వరకు వ్యాక్సిన్ వయల్ ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి పరిస్థితిలో ఉందనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం వ్యాక్సిన్ లెడ్జర్ ప్రత్యేకత. వ్యాక్సిన్ తయారీ నుంచి ఎయిర్‌పోర్టు, వ్యాక్సిన్ వెహికల్, స్టోరేజీ సెంటర్, రీజనల్ సెంటర్, సబ్‌సెంటర్, అంతిమంగా లబ్ధిదారుడు... ఇలా వ్యాక్సిన్ ప్రయాణించే ప్రతీ చోట అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంది. ఆ పరిస్థితుల్లో వ్యాక్సిన్ పాడవకుండా ఉందా ? లేదా ? ఇలా అన్ని అంశాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. బ్లాక్ చైయిన్ టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యాక్సిన్ లెడ్జర్ పని చేస్తుంది. 2 కోట్ల టీకాలు ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా టీకాలను వ్యాక్సిన్ లెడ్జర్ ట్రాక్ చేసింది. ఎక్కడైనా ఉష్ణోగ్రత పెరిగిపోతే వెంటనే అలెర్ట్‌లు అందించింది. దీంతో పాటు చెడిపోయిన వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటిప్పుడు వ్యాక్సిన్ లెడ్జర్ తెలియజేసింది. దీంతో వ్యాక్సిన్ వేస్టేజ్ గణనీయంగా తగ్గిపోయింది. రెండేళ్ల శ్రమ - చక్రవర్తి (స్టాట్విగ్, సీఈవో) బ్లాక్ చైన్ టెక్నాలజీపై 25 సభ్యులతో కూడి మా టీం రెండేళ్ల పాటు శ్రమించింది. యూనిసెఫ్ ఆర్థిక సహకారం అందించింది. మా వ్యాక్సిన్ లెడ్జర్ డేటా ఎనాలసిస్‌లో... టీకా తయారీ నుంచి లబ్ధిదారుడికి చేరేలోపు ప్రతీ 10 టీకాలలో 3 టీకాలు వృధా అవుతున్నట్టు తేలింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో ప్రతీ టీకా ఎంతో కీలకమైన దశలో... మా వ్యాక్సిన్ లెడ్జర్ని అందుబాటులోకి రావడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. చదవండి : ప్రపంచంలో శక్తివంతమైన మైక్రోచిప్ అభివృద్ధి చేసిన టెస్లా -
ఏపీ ప్రభుత్వానికి US కాన్సులేట్ అభినందనలు
-
ఏపీ రికార్డ్: ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ ముగిసింది.. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కొవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ రికార్డ్ నెలకొల్పింది. 13 లక్షల మందికిపైగా వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ వేసింది. రాష్ట్రంలో లక్ష్యాన్ని మించి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్ నడిచింది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.43 లక్షలు. కృష్ణా జిల్లాలో 1.31 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.10 లక్షల మందికి, గుంటూరు జిల్లాలో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసింది. కాగా, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకే లక్ష్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది. ఇక్కడ చదవండి: ఏపీ: నేడు ఒకేరోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్ -
కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్లు
న్యూఢిల్లీ: దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం కేంద్రం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. డ్రోన్ల సాయంతో టీకా డోసుల్ని పంపించాలని నిర్ణయించిన కేంద్రం దీనికి సంబంధించి బిడ్లను కూడా ఆహ్వానించింది. డ్రోన్ల సాయంతో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను పంపించడానికి గల సాధ్యాసాధ్యాలపై ఐఐటీ కాన్పూర్ సహకారంతో కేంద్రం ఇప్పటికే అధ్యయనం నిర్వహించింది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ.. డ్రోన్లు)తో టీకా డోసులు పంపించడానికి వీలవుతుందని ఆ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రీసెర్చ్ మెడికల్ ఆర్గనైజేషన్ (ఐసీఎంఆర్) తరఫున హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రా టెక్ సర్వీస్ లిమిటెడ్ డ్రోన్ల సాయంతో టీకా డోసుల్ని పంపించడానికి ఆసక్తి కలిగిన కంపెనీలు జూన్ 22లోగా తమ బిడ్లను దాఖలు చేయాలని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రోన్లకు నాలుగు కేజీల బరువుని మోసే సామర్థ్యం ఉండాలని, 100 మీటర్ల ఎత్తులో 35 కి.మీ. వరకు ప్రయాణించి, తిరిగి వెనక్కి రాగలిగేలా ఉండాలని హెచ్ఎల్ఎల్ స్పష్టం చేసింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి వ్యాక్సిన్ ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సవాల్‌గా మారింది. ఇప్పటివరకు దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ తరహా ఆలోచన చేసింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ సహకారంతో డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు టీకా డోసుల్ని పంపించేలా ఆరు రోజుల పైలెట్ ప్రాజెక్టుని కూడా నిర్వహించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పుడే కేంద్రమే ముందుకు రావడంతో త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందనుంది. -
ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులను గుర్తించండి
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వీరు ఎంతమంది ఉన్నారో గుర్తించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డా.గీతాప్రసాదిని ఆదేశించారు. భవిష్యత్‌లో చిన్నారులకు కరోనా సోకినా తల్లులకు సోకకుండా ఉండేందుకు వీలుగా వారికీ వ్యాక్సిన్ వేయాలని ఈనెల 7న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ తల్లులను గుర్తించేందుకు ఆదేశాలిచ్చారు. ఒకరోజు ముందే టోకెన్లు ఇచ్చిన అనంతరం వీరిని వ్యాక్సిన్ సెంటర్‌కు తీసుకువచ్చే బాధ్యతను ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు అప్పజెప్పారు. కాగా, వ్యాక్సిన్ అవసరమైన తల్లులు 15 లక్షల మందికి పైగానే ఉంటారని అంచనా. వయస్సుతో నిమిత్తం లేకుండా వీరికీ వ్యాక్సిన్ వేస్తారు. ఈ విధానం తలపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. -
అత్యంత చవకగా కార్బేవ్యాక్స్
హైదరాబాద్: భారత్‌లో అత్యంత చవకైన కోవిడ్–19 వ్యాక్సిన్స్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్–ఇ ఫార్మా కంపెనీ అందించనుంది. ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ‘కార్బేవ్యాక్స్’ ప్రతి డోసుకు రూ. 200.. ఇంకా అంతకంటే తక్కువ ఉండే అవకాశాలున్నాయి. కార్బేవ్యాక్స్ మొదటి, రెండోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి కార్బేవ్యాక్స్‌కు అనుమతులు రావాల్సి ఉంది. రెండు డోసులకు కలిపి రూ.400 కంటే తక్కువ ధర ఉండొచ్చని బయోలాజికల్–ఇ మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల ఒక ఇంటర్వ్యూలో సంకేతాలిచ్చారు. అయితే, అంతిమ ధరను ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారుచేస్తున్న కోవిషీల్డ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.300 డోసు చొప్పున, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600కు డోసు చొప్పున విక్రయిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తమ కోవాగ్జిన్‌ను రాష్ట్రాలకు రూ.400కు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ,1200కు డోసు చొప్పున అమ్ముతోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్–వీ టీకాను రెడ్డి ల్యాబ్స్ డోసుకు రూ.995కు విక్రయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్బోవ్యాక్స్ 30 కోట్ల డోసులను బుక్ చేసుకుంది. దీనికోసం బయోలాజికల్– ఇ సంస్థకు రూ.1,500 కోట్లు అడ్వాన్సుగా చెల్లించనుంది. ఆగస్టు నాటికి నెలకు 7.5 నుంచి 8 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల స్థితిలో ఉంటామని ఎండీ మహిమా దాట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. -
అమెరికా, భారత్, చైనాల వాటా 60%
ఐక్యరాజ్యసమితి: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు పంపిణీ అయిన సుమారు 200 కోట్ల కోవిడ్ టీకా డోసుల్లో భారత్, అమెరికా, చైనాల వాటాయే 60% వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. కోవిడ్ డోసుల పంపిణీలో 200 కోట్ల మైలురాయిని ఈ వారంలో అధిగమిస్తామని డబ్ల్యూహెచ్‌వో సీనియర్ అడ్వైజర్ బ్రూస్ అయిల్వార్డ్ తెలిపారు. ప్రస్తుతం 212 దేశాల్లో టీకా పంపిణీ అవుతోందని ఆయన పేర్కొన్నారు. 200 కోట్ల డోసుల్లో 10 దేశాల వాటా 75% వరకు ఉందనీ, మొత్తం డోసుల్లో భారత్, అమెరికా, చైనాలు కలిపి 60% వరకు పంపిణీ చేశాయని ఆయన వెల్లడించారు. ఈ మూడు దేశాలు దేశీయంగానే టీకాలు సేకరించి, పంపిణీ చేశాయన్నారు. అన్ని దేశాలకు టీకాలను సమానంగా అందజేయాలనే ఉద్దేశంతో డబ్ల్యూహెచ్‌వో చేపట్టిన కోవాక్స్ కార్యక్రమం కింద 127 దేశాలకు ఇప్పటి వరకు 8 కోట్ల టీకా డోసులు అందజేశామన్నారు. టీకాల కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చాలా దేశాలు ‘కోవాక్స్’సాయంతోనే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాయని ఆయన చెప్పారు. అయితే, ప్రపంచ జనాభాలో 10% వరకు కలిగిన పేద దేశాలకు మొత్తం డోసుల్లో కేవలం 0.5% మాత్రమే అందడం విచారకరమని ఆయన అన్నారు. ప్రధానంగా, భారత్‌లో సెకండ్ వేవ్ కారణంగా కోవాక్స్ కింద సీరమ్ ఇన్స్టిట్యూట్ సరఫరా చేయాల్సిన టీకా డోసులు ఆగిపోయాయని చెప్పారు. వచ్చే రెండు నెలల్లో ఈ సమస్య పరిష్కారమై, కోవాక్స్ కింద పేద దేశాలకు ఇచ్చిన హామీ మేరకు 15 కోట్ల టీకా డోసులను సరఫరా చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రపంచ జనాభాలో కనీసం 30–40 శాతం మందికి టీకా అందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. భారత్‌లో మొత్తమ్మీద మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందన్నారు. -
వ్యాక్సిన్ విధానం న్యాయబద్ధంగా లేదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ పంపిణీ విధానం న్యాయబద్ధంగా లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘టీకాలను కేంద్రమే కొనుగోలు చేయాలి. రాష్ట్రాలు పంపిణీ చేయాలని మొదట్నుంచీ చెబుతూనే ఉన్నా. టీకా పంపిణీపై ప్రభుత్వం విధానం సరిగా లేదు. మోదీ ప్రభుత్వం తీరు అసమానతలకు తావిస్తోంది’అని పేర్కొన్నారు. దేశంలోని కేవలం 9 ప్రైవేట్ ఆస్పత్రులు 50 శాతం టీకాలు పొందాయని, కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకా డోసుల్లో 80 శాతం వరకు ఆరు నగరాలకు సరఫరా అయ్యాయంటూ వచ్చిన వార్తలను ఆయన ట్విట్టర్లో0 ఉదహరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా ట్విట్టర్లో.. సెకండ్ వేవ్ సమయంలో ప్రజలు ఆస్పత్రుల్లో బెడ్ల కొరతతో ఇబ్బందులు పడుతుండగా, కేంద్రం మాత్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం కోవిడ్‌పై గెలుపు సాధించిందంటూ జనవరిలో ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లను 36%, ఐసీయూ బెడ్లను 46%, వెంటిలేటర్ల బెడ్లను 28% మేర తగ్గించారని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్య వసతులను మెరుగుపర్చాలన్న సూచనలను ప్రధాని పక్కనబెట్టారు. ప్రస్తుత పరిస్థితికి ఎవరు బాధ్యులు అని ఆమె ప్రశ్నించారు. ‘ప్రజారోగ్యంపై నిపుణుల సూచనలను, పార్లమెంటరీ కమిటీల సిఫారసులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాలను మెరుగు పరుస్తామంటూ చేసిన హామీలనుకూడా ప్రభుత్వం విస్మరించింది’అని ప్రియాంక పేర్కొన్నారు. 2014 నుంచి కొత్తగా ఒక్క ఎయిమ్స్ కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదన్నారు. -
ఉచితంగా టీకా వేయాలనుకోవడం తప్పా?
సాక్షి, అమరావతి: వ్యాక్సిన్ సరఫరా అనేది కేంద్రం చేతుల్లో ఉన్న విషయం టీడీపీ వారికి తెలిసినా పనికట్టుకొని, దురుద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సరఫరా పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా అని ప్రశ్నించారు. కేంద్రం అనుమతి లేక గ్లోబల్ టెండర్లకు ఎవరూ రాలేదని, అందుకే కేంద్రమే దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నదాంట్లో తప్పేముందని నిలదీశారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘45 ఏళ్లు దాటిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు టీకా వేయించుకున్నారా లేదా? వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు? ఏపీలోనా లేక తెలంగాణలోనా? తన బంధువు కంపెనీ భారత్ బయోటెక్ వాళ్ల వ్యాక్సిన్ కోవాగ్జిన్ వేయించుకున్నారా? లేక కోవిషీల్డ్ వేయించుకున్నారా?’’ అన్నది ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారో టీడీపీ వాళ్లకు తెలియదా? ఆ స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకుని కోర్టులో కేసులు వేసింది టీడీపీ వాళ్లు కాదా? చివరికి అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రాఫికల్ బ్యాలెన్స్ పోతుందని నిస్సిగ్గుగా కోర్టుకు చెప్పింది మీరు కాదా అని నిలదీశారు. సీఎం జగన్ మంచి చేస్తుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులతో ఇళ్ల పథకానికి ఎన్టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకోలేదా, దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
డ్రోన్ల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ల డెలివరీ !
హైదరాబాద్: కొవిడ్ కల్లోల సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్లకు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. అంతకు రెండు నెలల ముందు అవయవమార్పిడి సందర్భంగా స్పీడ్ డెలివరీ కోసం హైదరాబాద్ మెట్రోలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాటిని మించిన వేగంతో అత్యవసర ఔషధాలు అందించే సేవలు భాగ్యనగర వాసులకు అందుబాటులోకి రాబోతున్నాయి. మెడిసిన్స్ ఫ్రం స్కై పేరుతో డ్రోన్ల ద్వారా మెడిసిన్స్ డెలివరీ చేసేందుకు డూన్జో సంస్థ అనుమతులు సాధించింది. అతి త్వరలోనే ఈ సేవలు హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సేవలు అందుబాటులోకి వస్తే కొవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్లు, ఇతర అత్యవసర మందులు డ్రోన్ల ద్వారా ఇంటికే తెప్పించుకోవచ్చు. డ్రోన్ డెలివరీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మెడిసిన్ ఫ్రం స్కై పేరుతో పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను డూన్జో సంస్థ అందివ్వనుంది. మెడిసిన్స్ ఫ్రం స్కైలో భాగంగా అత్యవసర ఔషధాలతో పాటు కొవిడ్ మెడిసన్లు, వ్యాక్సిన్లను సైతం డ్రోన్ల ద్వారా ఎంపిక చేసిన చిరునామాకు డెలివరీ చేసే వీలుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని డూన్జో తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక సమాచారం రాలేదు. మెడ్- ఎయిర్ కన్సార్టియం గూగూల్‌తో పాటు వైద్యరంగానికి సంబంధించిన నిపుణులతో ఏర్పాటైన మెడ్-ఎయిర్ కన్సార్టియం మెడిసిన్ డ్రోన్ డెలివరీ సిస్టమ్‌పై కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తోంది. మెడిసిన్ డ్రోన్ డెలివరీని బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS)గా ప్రస్తుతం పేర్కొంటున్నారు. ఇటీవల బీవీఎల్ఓఎస్ పద్దతిలో అత్యవసర ఔషధాల డెలివరీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. 8 నగరాల్లో కేంద్రం నుంచి అనుమతి రావడంతో మెడ్-ఎయిర్‌కన్సార్టియం , డూన్జోతో కలిసి దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనే, గురుగ్రాం, జైపూర్ మొత్తం 8 నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా మెడిసిన్స్ ఫ్రం స్కై చేపట్టాలని నిర్ణయించాయి. మలిదశలో దేశంలోని 22 నగరాలకు ఈ సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెడిసిన్స్ ఆన్లైన్ డెలివరీకి డిమాండ్ పెరగిందని డూన్జో అంటోంది. జనవరి నుంచి మే వరకు ఔషధాలకు సంబంధించి ఆన్లైన్లో ఇరవై రెండు వేల ఆర్డర్లు వచ్చినట్టు ఆ సంస్థ ప్రకటించింది. మెడిసిన్స్ డెలివరీలో 350 శాతం వృద్ధిరేటు నమోదు అయ్యిందని తెలిపింది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేసింది. .. -
రాష్ట్రంలో కోటి డోసుల టీకా పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం సాయంత్రానికి కోటి డోసుల కరోనా టీకా వేశారు. 2021 జనవరి 16న దేశవ్యాప్తంగా మొదలైన టీకా ప్రక్రియ అదేరోజు మన రాష్ట్రంలోనూ మొదలైంది. నాలుగున్నర నెలలు పూర్తయ్యే సరికి కోటి డోసుల టీకాలు వేయడం రాష్ట్రంలో పూర్తయింది. జూన్ 1న సాయంత్రానికి 1,00,74,471 డోసుల టీకా వేశారు. టీకా ప్రారంభమైన తొలి రెండు మూడు మాసాలు టీకా కోసం సరిగా ముందుకు రాలేదు. చాలామంది అవగాహన పెంచుకుని టీకా కోసం వచ్చేసరికి తర్వాత టీకాకు కేంద్రం రేషియో విధించడంతో రాష్ట్రానికి ఎంత కేటాయింపులో అంతే వేయాల్సి వచ్చింది. కొంతమేరకు రాష్ట్రమే వెచ్చించి టీకాను కొనుగోలు చేసిన విషయమూ తెలిసిందే. రోజుకు 6 లక్షలు తక్కువ కాకుండా టీకాలు వేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. కానీ సరిపడా టీకాలు లేకపోవడం వల్లే జాప్యం జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
ఇదేం టీకా విధానం?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కోవిడ్ టీకా విధానంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకా విధానంలోని తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. టీకాల ఉత్పత్తి, సేకరణ నుంచి ప్రజలకు వయస్సుల వారీగా టీకాలను ఇవ్వాలన్న నిర్ణయం వరకు.. టీకాల ధరల నుంచి, టీకా కోసం ‘కోవిన్’యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేయడం వరకు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నవారు క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని వ్యాఖ్యానించింది. మునుపెన్నడూ ఎరగని ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తత అవసరమని పేర్కొంది. టీకా ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడమని కేంద్రాన్ని ఆదేశించింది. ‘కోవిన్’ యాప్‌లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిర్ణయం తీసుకునే ముందు డిజిటల్ ఇండియా వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సూచించింది. దేశ ప్రజలందరికీ అది సాధ్యమేనా అన్న విషయం ప్రభుత్వం ఆలోచించలేదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల సౌలభ్యం ఎంత? నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎలా రిజిస్టర్ చేసుకోగలరు? అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్‌ఎన్‌రావు, జస్టిస్ రవీంద్ర భట్ సభ్యులుగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నించింది. వాస్తవ పరిస్థితులను గమనిస్తూ, తదనుగుణంగా ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాల్లో మార్పులు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దేశంలో డిజిటల్ నిరక్షరాస్యత అధికంగా ఉందని వ్యాఖ్యానించింది. ధర్మాసనం ప్రశ్నలకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిస్తూ.. రెండో డోసు టీకా వేసుకోవాల్సిన వారిని గుర్తించడానికి ‘కోవిన్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేశామన్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కోసం కమ్యూనిటీ సెంటర్లు ఉన్నాయన్నారు. దీనిపై.. ఇదంతా సాధ్యమేనా? అని కోర్టు ప్రశ్నించింది. అలాగే, సంబంధిత విధాన నిర్ణయ పత్రాన్ని తమ ముందుంచాలని ఆదేశించింది. కోవిడ్ టీకా నిర్వహణపై సుమోటోగా ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. పంజాబ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు టీకాల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని నిర్ణయించడం, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఇప్పటికే కొన్ని బిడ్లను స్వీకరించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రం లేదా ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ స్వయంగా టీకాలను సేకరించుకోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమా? లేక కేంద్రం నోడల్ ఏజెన్సీగా ఉండి టీకాలను కొనుగోలు చేసి, రాష్ట్రాలకు సరఫరా చేస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. టీకా కొనుగోలు, పంపిణీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తమకు స్పష్టత కావాలని, సంబంధిత ఫైల్స్‌ను తమకు అందించాలని ఆదేశించింది. ‘45 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపించింది. 18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారి విషయంలో రెండు విధానాలు అవలంబిస్తోంది. దాని ప్రకారం.. 50% టీకాలను ఉత్పత్తి సంస్థలు కేంద్రం నిర్ణయించిన ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయాలి. మిగతా 50% ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేయాలి.ఈ నిర్ణయం వెనుక హేతుబద్ధత ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం కన్నా రాష్ట్రాలకు ఎక్కువ ధర ఎందుకు నిర్ణయించారని ప్రశ్నించింది. అలాగే, టీకాలకు ధరలను నిర్ణయించే అధికారం ఉత్పత్తి సంస్థలకు ఇవ్వకుండా, కేంద్రమే దేశవ్యాప్తంగా ఒకటే ధరను నిర్ణయించాలి కదా!? అని వ్యాఖ్యానించింది. అలాగే, 45 ఏళ్లు పైబడినవారిపైనే కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుందని కేంద్రం చెప్పిందని, కానీ రెండో వేవ్‌లో 18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారిపైనే అది ఎక్కువ ప్రభావం చూపిందని గుర్తు చేసింది. మే 1 నుంచి మే 24 మధ్య నమోదైన కోవిడ్ కేసుల్లో దాదాపు 50% 18 – 44 వయస్సు వారిలోనే నమోదైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ద్వంద్వ ధరల విధానం వద్దు టీకా ధరల విధానాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు ఎందుకని ప్రశ్నించింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను వ్యాక్సిన్ల కోసం మీలో మీరే పోటీ పడండి అని వాటి మానాన వాటిని వదిలేయడం సరికాదని వ్యాఖ్యానించింది. భారత్ రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 స్పష్టంగా చెబుతోందని పేర్కొంది. రాష్ట్రాలను తమలో తామే పోటీ పడమని కేంద్రం వదిలేసింది అనడం సరికాదని తుషార్ మెహతా వాదించారు. రాష్ట్రాలకు అందించే టీకా ధరపై కేంద్రమే ఉత్పత్తి సంస్థలతో మధ్యవర్తిత్వం జరిపిందన్నారు. అయినా, ఇలాంటి విధాన నిర్ణయాలపై సమీక్షించే అధికారం కోర్టులకు పరిమితంగా ఉంటుందని మెహతా వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం.. ‘మేం ప్రభుత్వం.. సరైనదేదో మాకే తెలుసు అని మీరు భావించకూడదు. అవసరమైతే మేం గట్టిగా నిలదీయగలం’ అని స్పందించింది. ప్రైవేటు నుంచి సందేశాలు ‘కోవిన్’లో రిజిస్టర్ చేసుకోగానే ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సందేశాలు వస్తున్నాయని, ప్రైవేటుగా టీకా తీసుకుంటే నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం దాదాపు రూ. 4 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఈ కేసులో ఎమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జస్టిస్ భట్ స్పందిస్తూ.. ధరను ప్రభుత్వం నిర్ణయించలేదు కాబట్టి.. డిమాండ్ పెరిగితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వాటి ధర మరింత పెరిగే ప్రమాదముందన్నారు. ‘కోవిన్’లో రిజిస్టర్ చేసుకున్నవారికి స్లాట్లు దొరకని పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉందన్నారు. భారత్‌లో అర్హులైన వారందరికీ ఈ సంవత్సరం చివరలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఫైజర్ సంస్థతో టీకాల కొనుగోలుపై చర్చలు జరుపుతున్నామని, అవి సఫలమైతే, మరింత ముందుగానే వ్యాక్సినేషన్ ముగుస్తుందని వెల్లడించింది. విమర్శించడం మా ఉద్దేశం కాదు విచారణ చివరలో.. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, ఇందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా వెళ్లి చర్చలు జరపడాన్ని ధర్మాసనం ప్రశంసించింది. ఎవరినీ విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని కోర్టు వివరించింది. ఈ సందర్భంగా, వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ‘టీకా ఉత్పత్తి సంస్థలు పరిమితంగా ఉన్నాయి. ఈ సమయంలో టీకా ధరలపై కోర్టు ఏవైనా ఆదేశాలిస్తే.. టీకా ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలకు ఆటంకం కలుగుతుంది. అది వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని తుషార్ మెహతా అభ్యర్థించారు. దీనిపై.. దేశ సంక్షేమానికి అడ్డుతగలాలని కోర్టు భావించడం లేదని ధర్మాసనం పేర్కొంది. తమ ప్రశ్నలు, ఆందోళనలకు రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్‌తో సమాధానమివ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. థర్డ్ వేవ్‌పై ఆందోళన కరోనా మూడో వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న వార్తలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామాలపైనా దీని ప్రభావం భారీగా ఉండబోతోందన్న వార్తలను ప్రస్తావించింది. ఈ వార్తలపై శాస్త్రీయ అధ్యయనం ఏదైనా చేపట్టారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించారా? అని ప్రశ్నించింది. రెమిడెసివిర్ వంటి కోవిడ్ ఔషధాల ధరలు ఆకాశాన్ని అంటడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కేంద్రం మే 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త సరళీకృత విధానం ప్రకారం.. రాష్ట్రాలు తమ టీకా అవసరాల్లో 50% ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, కేంద్రం చెల్లిస్తున్న ధర కన్నా ఇది సాధారణంగా ఎక్కువ ఉంటుంది. అలాగే, ప్రైవేటు ఆసుపత్రులు మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా వేర్వేరుగా ధరలను నిర్ణయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. టీకాల ద్వారా కూడా లాభాలు ఆర్జించాలని కేంద్రం భావిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. -
రాష్ట్రాలకు నాస్తి.. ప్రైవేటుకు జాస్తి
సాక్షి, అమరావతి: దేశంలో అర్హులందరికీ సకాలంలో ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యానికి ‘ప్రైవేటు సరఫరా’ గండికొడుతోంది. ఉత్పత్తి అవుతున్నవ్యాక్సిన్లలో పావు వంతు గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు రంగానికి తరలిపోతున్నాయి. వ్యాక్సిన్ల కొరతతో రాష్ట్రాలు సతమతమవుతుంటే.. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులు రోగుల నుంచి ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు దండుకుంటున్నాయి. ఈ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ల సరఫరా నిలిపేయాలని ప్రధాని నరేంద్రమోదీకి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం సూచనకు నిపుణుల నుంచి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. రోజుకు 27 లక్షల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీ కలిపి రోజుకు 27 లక్షల డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. సీరం ఇన్‌స్టిటూŠయ్‌ట్ నెలకు 6.50 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు, భారత్ బయోటెక్ నెలకు దాదాపు 2 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దీని ప్రకారం.. మేలో దేశంలో 8.50 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. రాష్ట్రాలను విస్మరించి ప్రైవేటుకు తరలింపు మేలో దేశంలో 8.50 కోట్ల డోసులు ఉత్పత్తి అయితే.. అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కలిపి 5 కోట్ల డోసులే వేయనున్నాయి. మిగిలిన 3.50 కోట్ల డోసులను ప్రైవేటు సెక్టార్‌కు తరలిస్తున్నట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ముందుగానే ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెబుతుండటం గమనార్హం. ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు వేసే రాష్ట్రాల అవసరాలను విస్మరించి మరీ ప్రైవేటు రంగానికి ఇవ్వడం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు కరోనా విజృంభణతో ప్రైవేటు ఆస్పత్రులు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒక్కో డోసుకు రూ.2 వేల నుంచి ఏకంగా రూ.25 వేల వరకు వసూలు చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఇంత అత్యధిక ధరకు దేశంలో బడా కార్పొరేట్ సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులకు వ్యాక్సిన్లు వేస్తున్నాయి. ఇలా ఒక్కమేలోనే 3.50 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డాయన్నది ఊహకే అంతు చిక్కడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే టీకా.. దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టీకాలు వేసే ప్రక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే సాగాలని.. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్లు సరఫరా చేయొద్దని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఒక్కో డోసుకు ప్రైవేటు ఆస్పత్రులు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి భారీగా పెరిగే వరకు టీకాను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే వేయాలని.. అంతవరకు ప్రైవేటు రంగానికి సరఫరా నిలిపివేయాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి తగినంత సరఫరా లేక.. మేలో దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి, రాష్ట్రాలు వేస్తున్న వ్యాక్సిన్ల గణాంకాలను పరిశీలిస్తే.. వాస్తవ పరిస్థితి బోధపడుతుంది. కేంద్ర ప్రభుత్వ కోవిన్ పోర్టల్ ప్రకారం.. అన్ని రాష్ట్రాలు మే మొదటి మూడు వారాల్లో రోజుకు సగటున 16.2 లక్షల డోసుల చొప్పున వ్యాక్సిన్లు వేశాయి. వ్యాక్సిన్ల కొరతతో ముందు 45 ఏళ్లు దాటినవారికే వ్యాక్సిన్లు వేస్తున్నాయి. కేంద్రం నుంచి తగినంతగా వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడంతో మే 22 నుంచి సగటున రోజుకు 13 లక్షల వ్యాక్సిన్లే వేస్తున్నారు. పోనీ రోజుకు సగటున 16.2 లక్షల డోసుల లెక్కన తీసుకున్నా.. మే 31 నాటికి దేశంలో గరిష్టంగా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్లు మాత్రమే వేయగలరని తేలింది. -
31.71 లక్షల వ్యాక్సిన్ డోసుల కొనుగోలు
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్‌ను అందరికీ ఉచితంగా వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోయినప్పటికీ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం కేవలం 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు గల వారి నుంచి అందరికీ ఉచితంగా కోవిడ్ టీకా వేస్తామని, ఇందుకోసం రూ.1,600 కోట్లు వ్యయం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి అవసరమైన కోవిడ్ టీకాలను వెంటనే కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం కేటాయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్రం మే, జూన్లకు కలిపి 31.71 లక్షల వ్యాక్సిన్ డోసులను కేటాయించగా ఆ మొత్తం డోసులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మే నెలకు కేంద్రం కేటాయించిన 16.85 లక్షల డోసులను కొనుగోలు చేసినప్పటికీ ఇంకా 5.21 లక్షల డోసులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. జూన్‌కు కేటాయించిన 14.86 లక్షల డోసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ డోసులు కూడా ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉంది. 4.44 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల రాక గన్నవరం: రాష్ట్రానికి 4.44 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నాయి. పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో రాత్రి 8.15 గంటలకు చేరుకున్నాయి. అనంతరం వ్యాక్సిన్ డోసులను కంటైనర్‌లో రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించి భద్రపరిచారు. -
రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా ప్రక్రియ వేగవంతం..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కోవిషిల్డ్, కోవాక్సిన్ డోసుల కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడిసి ద్వారా ఆయా ఇన్స్టిట్యూట్లకు రూ. 50 కోట్లకు పైగా నిధులు చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో త్వరలో 11 లక్షలకు పైగా కోవిషిల్డ్ డోసులు, 3 లక్షలకు పైగా కోవాక్సిన్ డోసులు రాష్ట్రానికి సరఫరా కానున్నాయి. 45 సంవత్సరాల పైబడిన వారికి జూన్ నెల వరకు రెండు డోసులు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. -
‘టీకాలను భారత్‌లో కన్నా విదేశాలకే అధికంగా పంపిణీ చేశాం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరిపడా సరఫరా చేయడంలో కేంద్రం విఫలమయ్యింది. ఇందుకు మోదీ సర్కార్ అనుసరించిన వ్యాక్సిన్ విధానం కారణంగానే ప్రస్తుతం దేశంలో టీకాల కొరత ఏర్పడిందని జాతీయ స్థాయిలో పలువురు నేతలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ బీజేపీ, ప్రస్తుత తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా కేంద్ర విధానాలపై ధ్వజమెత్తారు. ఆయన తన ట్విటర్లో.. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి టీకాలకు సంబంధించి తెలుపుతున్న 10 సెకండ్ల వీడియోను ట్వీట్ చేశారు. “ఈ పది సెకన్ల వీడియో మోదీ భండారాన్ని బయటపెట్టింది. భారత్ తన ప్రజలకు ఇచ్చిన దానికన్నా అధిక వ్యాక్సిన్లను విదేశాలకు పంపిందని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి చెప్పారు. మోదీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ నేత. భారతీయులు ఎలా పోతేనేం” అని కామెంట్ పెట్టి తీవ్రస్థాయిలో ప్రధానిపై విమర్శలు గుప్పించారు. ఈ కామెంట్‌తో పాటుగా ఆయన ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత రాయబారి ప్రసంగించిన వీడియో క్లిపింగ్‌ను జతచేశారు. ఆ వీడియోలో.. భారత్‌లో సరఫరా చేసిన టీకాల కన్నా అధికంగా 70 దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసినట్లు రాయబారి తెలిపారు. ఇటీవల పరిమిత టీకాల కారణంగా ఢిల్లీలో నాలుగు రోజుల క్రితమే 18-44 ఏళ్ల పిల్లలకు టీకాలు ఆపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ( చదవండి: వ్యాక్సిన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది: చిదంబరం ఫైర్ ) A 10 sec video that EXPOSES MODI. India’s representative at the @UN informed the United Nations that India sent more vaccines abroad than has vaccinated its own people. Modi is now truly a world leader. Indians can go to hell. pic.twitter.com/tTF8q60HT5 — Yashwant Sinha (@YashwantSinha) May 16, 2021 -
బ్రిటన్ 20 శాతం టీకాలను పేద దేశాలకు ఇవ్వాలి: యూనిసెఫ్
లండన్: గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ అడ్డుకట్టకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని భావించి ఆయా దేశాల శాస్త్రవేత్తలు వాళ్ల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సంపన్న దేశాలు పరిస్థితి బాగానే ఉంది కానీ పేద దేశాలు టీకాలను తయారు చేసుకోలేక, ఇతర దేశాలనుంచి కొనుగోలు చేసుకోలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ సంస్థ ( యూనిసెఫ్ల) దీని పై స్పందించింది. బ్రిటన్ వద్ద ఉన్న కరోనా వ్యాక్సిన్లలో 20 శాతం టీకాలను పేదదేశాలకు విరాళంగా ఇవ్వాలని యూనిసెఫ్ సూచించింది. పేద దేశాలను పట్టించుకోండి జూన్ మొదటివారం నాటికి టీకాలను పంపించే విధంగా బ్రిటన్ చర్యలు చేపట్టాలని సూచించింది. ఇలా చేసినప్పటికీ బ్రిటన్ దగ్గర జూలై చివరినాటికి ఆ దేశపౌరులైన వయోజనులకు ఇచ్చేందుకు సరిపడా టీకాలు ఉంటాయని ఆ సంస్థ వివరించింది. కాగా ఇప్పటికే బ్రిటన్‌లో దాదాపు 18 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆ దేశం పూర్తి చేసింది. ఇక అధిక శాతం వయోజనులకు కనీసం ఒక డోసు టీకాను కూడా పూర్తి చేసింది. ప్రపంచంలోని 5 కోట్ల మంది ప్రజలకు టీకాలు అందించే సామర్థ్యం బ్రిటన్‌కు ఉందని ఈ సందర్భంగా తెలిపింది. బ్రిటన్ను చూసి మిగతా జీ-7 దేశాలు సైతం సాయం కోసం అలమటిస్తున్న ఇతర దేశాలకు టీకాలు పంపించే అవకాశం ఉంటుందని యూనిసెఫ్ అభిప్రాయపడింది. ఇతర దేశాల ప్రజలకు టీకాలు అందుబాటులో ఉన్నప్పడే మరో కొత్త రకం వైరస్లు పుట్టుకురాకుండా ఉంటాయని యూనిసెఫ్ తెలిపింది. ( చదవండి: ‘ఈ వేరియంట్ వల్లే భారత్‌లో కరోనా కల్లోలం’ ) -
సరఫరా పెరిగితే 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అనుకున్న రీతిలో ఉత్పత్తి లేనందున జాప్యం జరుగుతోందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. కేంద్రం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిర్ణయించిందన్నారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఆస్పత్రులన్నింటిలో ఆరోగ్యశ్రీ పడకలపై కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఎన్ని పడకలు వస్తాయి.. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం ఎంత మందికి చేయొచ్చు అన్నది తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా గణనీయంగా పెంచామని తెలిపారు. 330 మెట్రిక్ టన్నుల నుంచి 561 టన్నుల వరకు పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించిందన్నారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఎక్కడా కొరత లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 24,861 ఇంజక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకూ 104 కాల్ సెంటర్‌కు 2 లక్షలకు పైగా కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ కేవలం రెండో డోసు వారికి మాత్రమే వేయాలని కలెక్టర్లను ఆదేశించామని, ఆ తర్వాత డోసుల రాకను బట్టి అందరికీ వేస్తామన్నారు. మనకు రానున్న డోసులను 45 ఏళ్లు పైబడిన వారికి ఇస్తామని, రెండ్రోజుల్లో కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి అందిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కోవిడ్ డ్యూటీ చేసిన వారికి వెయిటేజీ రాష్ట్రంలో కోవిడ్ డ్యూటీలు చేసిన వారికి శాశ్వత నియామకాల్లో వెయిటేజీ ఇచ్చినట్టు తెలిపారు. 6 మాసాలు డ్యూటీ చేసిన వారికి 5 మార్కులు, ఏడాది చేస్తే 10 మార్కులు, ఏడాదిన్నర చేస్తే 15 మార్కులు ఇచ్చామన్నారు. కష్టకాలంలో పని చేసిన వీళ్లందరికీ నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. -
గడువులోగా టీకా రెండో డోసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సకాలంలోనే రెండో డోసు వేస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఈనెల 15వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం 9 లక్షల డోసులు ఇవ్వనుండగా, రాష్ట్ర ప్రభుత్వం 13 లక్షల డోసులు కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఇందులో 19 లక్షల డోసులను సెకండ్ డోసు వారికే వేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు. మొదటి డోసు వేయించుకున్న వారు రెండో డోసు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయన బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ జీవనానికి ఆటంకం లేకుండా కోవిడ్ మార్గదర్శకాలు (144 సెక్షన్), ఆ తర్వాత కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో బ్యాంకులు పనిచేస్తాయన్నారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా అధికారులతో మాట్లాడి సీఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు. గడిచిన 24 గంటల్లో 387 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు సరఫరా చేశామన్నారు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ కొరత రాబోతోందన్న సమాచారం రాగానే అక్కడి కలెక్టర్.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి 12 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను తెప్పించి ఆస్పత్రులకు సకాలంలో అందజేసినట్లు తెలిపారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదన్నారు. 104 కాల్ సెంటర్లో ప్రస్తుతం 3,220 మంది డాక్టర్లు కరోనా బాధితులకు ఫోన్ ద్వారా సేవలందిస్తున్నారని చెప్పారు. రైల్వేస్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు, పెళ్లి తదితర కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైన మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే సహాయాన్ని.. కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు పంపిస్తోందని, దీని పర్యవేక్షణకు ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘ సమావేశం అంతకుముందు కరోనా నియంత్రణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కరోనా నియంత్రణకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై తాము చర్చించిన అంశాలను నివేదించనుంది. -
డ్రోన్ల ద్వారా పంపిణీకి కేంద్రం అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాత్మకంగా ఆకాశ మార్గంలో మానవ రహిత విమానాలు(డ్రోన్ల) ద్వారా కోవిడ్–19 వ్యాక్సిన్ల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం డ్రోన్లు వినియోగించడానికి వీలుగా.. మానవ రహిత విమాన వ్యవస్థ(యూఏఎస్) నిబంధనలు–2021కు సడలింపులు ఇవ్వాలని మార్చి 9న రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పట్ల తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ సానుకూలంగా స్పందించింది. కంటి చూపు మేర(విజువల్ లైన్ ఆఫ్ సైట్/వీఎల్ఓఎస్)లో ఎగిరే డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ల పంపిణీకి షరతులతో కూడిన సడలింపులు ఇస్తూ ఆ శాఖ జాయింట్ సెక్రటరీ అంబర్ దూబె గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది కాలం లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ సడలింపులు అమల్లో ఉంటాయని తెలిపారు. వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగంలో పాటించాల్సిన ప్రామాణిక పద్ధతి(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్/ఎస్ఓపీ)ను సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఏప్రిల్ 26న ఆమోదించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కంటి చూపు పరిధి రేఖకు దాటి(బియాండ్ ది విజువల్ లైన్ ఆఫ్ సైట్/బీవీఎల్ఓఎస్) డ్రోన్లను ఎగురవేయడానికి సడలింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. మారుమూల గ్రామాలకు వ్యాక్సిన్లను చేర్చడానికి డ్రోన్లను వినియోగంలోకి తెస్తే సమయంతో పాటు రవాణా ఖర్చులు సైతం ఆదా కానున్నాయి. తొలుత వికారాబాద్‌లో ట్రయల్స్... ఔషధాలు, ఇతర వైద్యారోగ్య సంబంధిత వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సురక్షితంగా చేర్చడంలో డ్రోన్ సర్వీస్ ప్రొవైడర్ల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐటీ శాఖ ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించగా, 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ఇందులో 8 మందిని ఐటీ శాఖ షార్ట్‌లిస్ట్ చేసింది. తొలుత వికారాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను మారుమూల గ్రామాల పీహెచ్‌సీలకు తరలించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరుపుతోంది. వ్యాక్సిన్లతో డ్రోన్లు వికారాబాద్ ఏరియా ఆస్పత్రిలో టేకాఫ్ చేసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఉపకేంద్రాల్లో ల్యాండింగ్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. జిల్లా యంత్రాంగం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలను చేపట్టింది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని సైతం నియమించింది. తొలుత ప్రతి డ్రోన్ ద్వారా డమ్మీ వైల్స్‌తో పాటు అసలు టీకాలను కలిపి పంపించి వీటి పనితీరును పరీక్షించి చూడనున్నారు. ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాల ఆధారంగా పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీ కోసం విధివిధానాలను రూపొందించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 8 సంస్థలను 4 బ్యాచ్‌లుగా విభజించి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో రెండు సంస్థలు ఉండనున్నాయి. ఒక్కో బ్యాచ్ 6 రోజుల పాటు డ్రోన్లను ఎగిరించి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోనున్నాయి. 24 రోజుల పాటు డ్రోన్లతో వ్యాక్సిన్ పంపిణీకి ట్రయల్స్ నిర్వహించడానికి ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వికారాబాద్ గగన తలంలో డ్రోన్ల వినియోగంపై ఏయిర్ ఫోర్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సైతం అనుమతి ఇచ్చింది. డ్రోన్లపై ముందు చూపు... రాష్ట్ర ఐటీ శాఖలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ 2019లో రాష్ట్ర డ్రోన్ల విధానాన్ని ప్రకటించింది. దీని అమలులో భాగంగా ‘వింగ్స్ 2020’ పేరుతో హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఆకాశ మార్గంలో మందుల సరఫరా (మెడిసిన్ ఫ్రమ్ ది స్కై/ఎంఎఫ్టీఎస్) వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్ల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కోవిడ్ –19 వ్యాక్సినేషన్‌కు ఉపయోగపడబోతున్నాయి. వ్యాక్సిన్ల పంపిణీకి డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. ( చదవండి: DCGI Approval: కోవిడ్‌కు సరికొత్త చికిత్స! ) -
వ్యాక్సిన్‌కు రెట్టింపు వసూలు
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సామాజిక బాధ్యతగా చేయాల్సిన పనిలోనూ కాసుల వేటకు దిగాయి. కరోనా వ్యాక్సిన్‌కు నిర్ధారించిన ధరకు రెట్టింపు వసూలు చేస్తున్నాయి. దీనిపై జనం మండిపడుతున్నారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆయా యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. మరికొన్ని ఆసుపత్రులపై ఫిర్యాదులు రాగా, వాటిపై కూడా జిల్లా వైద్యాధికారులతో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అవి పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బీపీ చెక్ చేస్తున్నామంటూ అదనపు వసూళ్లు ఇప్పుడు 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల వయస్సులో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ టీకా కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తున్నారు. అయితే ప్రైవేట్‌లో మాత్రం టీకాకు రూ. 150, సర్వీస్ చార్జి కింద రూ. 100 వసూలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ జరగాలని... టీకా ధరే వసూలు చేయాలని, సర్వీస్ చార్జి వసూలు చేయొద్దని డాక్టర్ శ్రీనివాసరావు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆ విన్నపాన్ని కొన్ని ఆసుపత్రులు అంగీకరించాయి. కానీ కొన్ని ఆసుపత్రులు ఆ మాట వినకపోగా, రెట్టింపు వసూలు చేస్తున్నాయి. విచిత్రమేంటంటే బంజారాహిల్స్‌లో ఉన్న ఒక ప్రముఖ ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా రెట్టింపు అంటే రూ. 500 వసూలు చేస్తోంది. దీనిపై ఆ యాజమాన్యాన్ని పిలిపించి వివరణ కోరారు. తాము బీపీ చెక్ చేస్తున్నామని, వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ తెలుసుకుంటున్నారని, అందుకే రెట్టింపు వసూలు చేస్తున్నామని వింత సమాధానం చెప్పారు. బీపీ చెక్ చేస్తే అంత వసూలు చేయాలా? వ్యాక్సిన్ వేసే ముందు డాక్టర్ ఒకసారి లబ్ధిదారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం సర్వసాధారణం. దానికి అంత వసూలు చేయాలా? అని వైద్య వర్గాలు యాజమాన్యాన్ని ప్రశ్నించాయి. సర్వీస్ చార్జీ రూ. 100 వసూలు అనేది ఇటువంటి సేవలకేనని, అలాంటిది రెట్టింపు వసూలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వైద్యాధికారులు ప్రశ్నించగా, సమాధానం రాలేదు. దీంతో ఆ ఆసుపత్రికి ఇచ్చిన వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. అలాగే మరో రెండు ఆసుపత్రుల వ్యాక్సినేషన్ అనుమతిని రద్దు చేశారు. ప్రభుత్వంలోనే అధికంగా వ్యాక్సినేషన్ రాష్ట్రంలో ప్రస్తుతం 354 ప్రభుత్వ, 218 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టీకా వేస్తున్నారు. ఇప్పటివరకు 9,68,050 వ్యాక్సిన్లు వేయగా, అందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7,22,952 టీకాలు వేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2,45,098 మందికి వేశారు. ప్రైవేట్‌లో కంటే ప్రభుత్వంలోనే ఎక్కువగా టీకాలు వేశారు. ఎక్కువ మంది మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకా వేయించుకుంటున్నారు. కాగా, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), 20 పడకలకు మించి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకా కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 100కు పైగా ప్రైవేట్ ఆసుపత్రులు టీకా వేసేందుకు అనుమతి కోరాయి. అయితే నిర్ణీత ధరకు మించి వసూలు చేయొద్దని, అలా చేసిన ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. -
థియేటర్లు మళ్లీ బంద్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి మూసివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఒకవేళ అది సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు (50%) మాత్రమే నింపుకొనేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని కోరింది. తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త సినిమా విడుదలైతే థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, పైగా ప్రేక్షకులు మాస్కులు పెట్టుకోకుండా పక్కపక్క సీట్లలో కూర్చుంటున్నారని పేర్కొంది. తలుపులు మూసేసి ఏసీలు వేస్తుండటంతో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపింది. కాబట్టి సినిమా హాళ్లు, జిమ్‌లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సముదాయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసింది. విద్యాసంస్థలను మూసివేయాలని పది రోజుల క్రితమే తాము ప్రతిపాదించామని, ఇప్పటికే ఆలస్యమైందని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. అందువల్ల సినిమా హాళ్ల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. మూడు నెలలపాటు వ్యాక్సిన్ల స్టాక్... రాష్ట్రంలో ఇప్పటివరకు మొదటి, రెండో డోసులతో కలుపుకొని 9.68 లక్షల వ్యాక్సి న్లు వేశారు. ప్రస్తుతం ఇంకా 12 లక్షల డోసులు రాష్ట్రంలో నిల్వ ఉన్నాయి. అయి తే వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల వారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా లు వేయాలంటే ఇప్పుడున్న డోస్‌లు సరి పోవు. కరోనా కేసులు పెరిగితే వ్యాక్సిన్లు వేసుకొనే వారి సంఖ్య కూడా అదేస్థాయి లో అధికమవుతుంది. ప్రస్తుతం నెలకు సరిపడా వ్యాక్సిన్లనే నిల్వ పెట్టుకుంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండటం తో 3 నెలల వరకు సరిపడే వ్యాక్సిన్లను తెప్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు కరోనా బాధితులకు అవసరమైన మందులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కంపెనీలకు ఇండెంట్లు పెట్టారు. అన్ని ముఖ్యమైన ఆ సుపత్రుల్లోనూ కరోనా వార్డులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా సెకండ్ వేవ్! దేశవ్యాప్తంగా ఐదారు నెలల క్రితం తగ్గినట్లే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని, వైరస్ వ్యాప్తి రెండో దశలోకి చేరుకుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ పరిస్థితులు నెలకొన్నాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మున్ముందు రోజురోజుకూ కేసులు మరింతగా పెరుగుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా జాగ్రత్తలు పాటించడమే అందుకు పరిష్కారమని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, అర్హులైన వారంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని సూచించారు. మరోవైపు మాస్కులు పెట్టుకోకుంటే జరిమానా విధించాలని, పోలీసులు రోడ్లపైనా, మాల్స్ వద్ద, గుమిగూడే అన్ని ప్రాంతాల్లో దాడులు చేసి జరిమానాలు విధిస్తే నిర్లక్ష్యం వహించే వారిలో కదలిక వస్తుందని, భయంతోనైనా మాస్కులు పెట్టుకుంటారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఈ మేరకు పోలీసు శాఖకు ప్రతిపాదన చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో 90 శాతం వరకు మాస్కులు ధరించకపోవడం వల్లేనని, మిగిలిన 10 శాతం కేసులు భౌతికదూరం పాటించకపోవడం, చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్లేనని ఒక అధికారి వ్యాఖ్యానించారు. అందువల్ల ఉన్నతస్థాయి వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ మాస్కులు పెట్టుకోవాలని, ఆ మేరకు ప్రభుత్వం అవగాహనతోపాటు ధరించని వారికి జరిమానా విధించాలని కోరుతున్నారు. -
కరోనా వ్యాక్సిన్ వృథాలో తెలంగాణ నంబర్ వన్
న్యూఢిల్లీ: మహమ్మారి వైరస్ నిరోధానికి తీసుకువచ్చిన వ్యాక్సిన్ వృథా అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ వృథా చేయడంలో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆ తర్వాతి స్థానంలో ఉందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ నిల్వ చేయడంలో.. భద్రపర్చడంలో.. టీకా వేసే సమయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వ్యాక్సిన్ వృథా అవుతోందని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా వ్యాక్సిన్ వృథా వివరాలను పట్టిక రూపంలో ప్రదర్శించింది. వాస్తవంగా వ్యాక్సిన్ వృథాను పది శాతంలోపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే పది శాతానికి కన్నా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. అత్యధికంగా తెలంగాణ 17.6 శాతం వ్యాక్సిన్ వృథా చేసింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ 11.6 శాతం వృథా చేసి రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 9.4 శాతం వృథా చేసి మూడో స్థానంలో ఉంది. కర్నాటక మాత్రం జాతీయ రేటు 6.5 శాతం సమీపంలో 6.9 శాతంగా ఉంది. ఇదే నేపథ్యంలో కరోనా తీవ్రరూపంలో వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాలకు కొన్ని సలహాలు ఇచ్చింది. రాష్ట్రాలకు మొత్తం 7.54 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్ పంపిణీ చేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 16వ తేదీన భారతదేశంలో మొదలైన వ్యాక్సినేషన్ ఇప్పటివరకు 3.58 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు వెల్లడించింది. మార్చి 15 వరకు 8 మిలియన్ల డోస్‌లు పంపిణీ చేయాలని లక్ష్యం విధించుకున్నట్లు పేర్కొంది. -
75 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించాం
తిరుమల: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో ఘనంగా సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ.. 130 కోట్ల భారతీయుల సామర్థ్యం ఏమిటో నేడు ప్రపంచం చూస్తున్నదని తెలిపారు. కరోనా సమయంలో 450 దేశాలకు మందులు సరఫరా చేశామన్నారు. అదేవిధంగా 75 దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించామని తెలిపారు. 80 శాతం రైల్వే సేవలు ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో పూర్తిస్థాయిలో రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. తిరుపతి ఇతర ప్రాంతాల మధ్య అధికంగా రైళ్లు నడిచేలా అదనపు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర ఆరి్థక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వామివారిని దర్శించుకున్నారు. -
ఇకపై ఎప్పుడైనా కరోనా టీకా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ వేళలపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. ఇకపై రోజులో ఏ సమయంలోనైనా టీకా పొందవచ్చు. టీకా పంపిణీని మరింత వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధ్దన్ చెప్పారు. ప్రజలు వారి వెసులుబాటును బట్టి అనువైన వేళల్లో టీకా తీసుకోవచ్చని సూచించారు. ప్రజల ఆరోగ్యం, సమయం విలువను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఏ వేళలోనైనా టీకా పంపిణీ చేయవచ్చని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సామర్థ్యాన్ని బట్టి టీకా పంపిణీ వేళలను నిర్దేశించుకోవాలని సూచించారు. ఈ వేళల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పారు. పెరుగుతున్న కొత్త కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో వచ్చిన కొత్త కేసుల్లో 85.95 శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు పేర్కొంది. గత వారంతో పోలిస్తే ఢిల్లీ, హరియాణాల్లోనూ కేసుల పెరుగుదల కనిపించినట్లు తెలిపింది. మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్లో కరోనా నియంత్రణ చర్యల్లో ఆయా రాష్ట్రాల అధికారులకు సహకరించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపినట్లు పేర్కొంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా సంబంధిత మరణాలేవీ సంభవించలేదని స్పష్టం చేసింది. 14,989 కొత్త కేసులు దేశంలో గత 24 గంటల్లో 14,989 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 98 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,57,346 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,08,12,044 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 97.06 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,70,126 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 1.53% ఉన్నాయి. మరణాల శాతం 1.41 గా ఉంది. ఇప్పటివరకూ 21,84,03,277 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం 7,85,220 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70% మందిదీర్ఘకాలిక రోగాలు ఉన్నవారే. -
జనంలోకి వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాన్య ప్రజలకు కరోనా టీకా కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాధాన్యంగా 60 ఏళ్లు పైబడిన వారందరికీ, 45–59 ఏళ్ల మధ్య వయసులోని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా అందజేస్తామని ఆయన ప్రకటించారు. వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డితో కలసి డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సోమవారం లాంచనంగా సాధారణ జనానికి టీకా కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఎంపిక చేసిన 48 ప్రభుత్వ, 45 ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ ఉంటుందని తెలిపారు. ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,200 మందికి టీకా వేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లోనే ప్రారంభం అవుతుందని, రెండో తేదీ నుంచి పూర్తిస్థాయిలో టీకా కార్యక్రమం ఉంటుందని వివరించారు. మున్ముందు వెయ్యి కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. రెండు ప్రాధాన్య వర్గాలకు నాలుగైదు నెలలపాటు టీకా కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. రెండో డోస్ కూడా అదే కేంద్రంలో వేస్తామన్నారు. ఆ మేరకు షెడ్యూల్ ఖరారు చేస్తామని వెల్లడించారు. వెంటనే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీచేస్తామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. సాధారణ ప్రజల్లో 50 లక్షల మంది రెండు ప్రాధాన్య వర్గాలకు టీకాలు వేస్తామన్నారు. ‘ధ్రువీకరణ’ సమర్పించాలి... దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎంబీబీఎస్ డాక్టర్ లేదా ఆపై స్థాయి వైద్యుడి నుంచి తాము జారీ చేసే నమూనా ఆధారంగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. దాన్ని కోవిన్ యాప్‌లో అప్లోడ్ చేశాకే టీకా వేస్తామని తెలిపారు. 20 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా వేస్తామన్నారు. లబ్ధిదారులు వారంలోగా యాప్‌లో రిజిస్ట్రేషన్‌తోపాటు దగ్గరలో ఉన్న బూత్‌కు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకొని టీకా పొందవచ్చన్నారు. అన్ని టీకాలు సురక్షితమేనని, ఎవరికి ఏ కంపెనీ టీకా ఇస్తామనేది బయటకు వెల్లడించబోమని ఆయన చెప్పారు. 45–59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సర్టిఫికెట్లు ఇచ్చేలా అనెక్జర్–1బీ కాపీ ఇంటర్నెట్లోనూ, కోవిన్ యాప్‌లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆ ఫార్మాట్‌ను ఆధారం చేసుకొని వైద్యులు సర్టిఫికేట్ ఇస్తారని శ్రీనివాసరావు వివరించారు. కోవిన్ 2.0 వెర్షన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం నుంచే అందుబాటులోకి వచ్చిందని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సోమవారం టీకా ఇస్తామన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి కూడా అదే రోజు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ప్రతి సెంటర్లోనూ సాధారణ ప్రజలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులకు కూడా టీకా వేస్తామన్నారు. నిర్దేశించిన రోజున టీకా వేయించుకోలేనివారు తదుపరి రీ షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు. జ్వరం లేదా ఒళ్లు నొప్పులు సాధారణమే... టీకా వేసుకున్నాక జ్వరం లేదా ఒళ్లు నొప్పులు ఉండటం చాలా మందిలో సహజమేనని డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఎవరికైనా టీకా వేసిన అరగంటలోనే తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తాయని, కాబట్టి వారు అరగంటపాటు తమ పరిశీలనలోనే ఉండాలన్నారు. ఇంటికి వెళ్లాక ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సమీప ఆసుపత్రికి వెళ్లాలని, లేకుంటే 104 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. అన్ని వసతులున్న ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనే టీకా వేస్తామన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బుధ, ఆదివారాల్లో టీకాలు వేయరని, ప్రైవేటులో మాత్రం వారమంతా వేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. దశలవారీగా కేంద్రాల పెంపు... వ్యాక్సినేషన్ ప్రక్రియ కొద్ది సెంటర్లతో ప్రారంభించి దశలవారీగా విస్తరిస్తామని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. మున్ముందు 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), 19 ఏరియా ఆసుపత్రులు, 29 జిల్లా ఆసుపత్రుల్లో, 9 బోధనాసుపత్రుల్లో కరోనా టీకా వేస్తామన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న 215 ప్రైవేటు ఆసుపత్రులను టీకా వేసేందుకు గుర్తించామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీకా ఉచితమని, ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధర రూ. 150, సర్వీస్ చార్జీ రూ. 100 వరకు వసూలు చేసుకోవడానికి కేంద్రం అనుమతించిందన్నారు. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి వీల్లేదన్నారు. అందుబాటులో డాక్టర్: డీఎంఈ టీకా కేంద్రాల్లో లబ్దిదారులు వేచి ఉండే గది వద్ద ఒక డాక్టర్, టీకా వేశాక అరగంట సేపు పరిశీలనలో ఉండే చోట మరో డాక్టర్ అందుబాటులో ఉంటారని డీఎంఈ రమేష్‌రెడ్డి తెలిపారు. రెండో ఫేజ్ కరోనా వ్యాక్సిన్ రెండు ప్రాధాన్య వర్గాలతో ప్రారంభం అవుతుందన్నారు. తొలుత కొన్నిచోట్ల మాత్రమే టీకా ప్రారంభిస్తామన్నారు. ఒకేసారి జనం పోటెత్తకుండా ఉండేందుకు కొన్ని సెంటర్లలోనే ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకరించాయన్నారు. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ప్రభుత్వమే టీకాలను సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్ర టీకా కేంద్రం నుంచి జిల్లా కోల్డ్‌చైన్ పాయింట్లకు వ్యాక్సిన్లను సరఫరా చేసి వారికి ఇస్తామన్నారు. అంతకుముందే వారు టీకాలకు డబ్బులు చెల్లించి రసీదు తీసుకుంటారని, ఆ మేరకు వాటికి పంపిణీ జరుగుతుందన్నారు. 29–42 రోజుల మధ్య రెండో డోసు కరోనా రెండో డోసును తొలి డోసు తీసుకున్న 28వ రోజున లబ్ధిదారులు తీసుకోవాలన్న నిబంధన ఇప్పటివరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం దాన్ని తాజాగా మార్చింది. తొలి డోసు వేసుకున్న 29వ రోజు నుంచి 42వ రోజు మధ్య ఎప్పుడైనా లబ్ధిదారులు రెండో డోసు తీసుకోవచ్చని తెలిపింది. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది ఇళ్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆసుపత్రికి రావల్సిందేనని తేల్చిచెప్పింది. ఎవరైనా ఆసుపత్రికి వచ్చే పరిస్థితి లేకపోతే వారిని అంబులెన్స్‌లో తీసుకురావాలని సూచించింది. 50 లక్షలు: టీకాలు పొందబోయే సాధారణ ప్రజానీకంలోని రెండు ప్రాధాన్య వర్గాల వారి సంఖ్య. 4.43 లక్షలు: జనవరి 16 ఇప్పటివరకు టీకా వేసుకున్న వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల సంఖ్య. (మొదటి డోస్ 2.95 లక్షల మంది, రెండో డోస్ 1.47 లక్షల మంది) 215: టీకా వేసేందుకు గుర్తించిన ఆరోగ్యశ్రీ జాబితాలోని ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య. టీకాలు ఇచ్చే కేంద్రాలు... 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) 19 ఏరియా ఆసుపత్రులు 29 జిల్లా ఆసుపత్రులు 9 బోధనాసుపత్రులు 215 ప్రైవేటు ఆసుపత్రులు నేటి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇలా... ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 45 ప్రైవేటు ఆసుపత్రులు 48 ప్రభుత్వ ఆసుపత్రులు ఒక్కో కేంద్రంలో 200 మంది చొప్పున 18,600 మందికి టీకాలు -
ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45–59 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే వ్యాధులు ఆ కేటగిరీలోకి వస్తాయో వెల్లడించింది. వాటిని వైద్యులు ధ్రువీకరించి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. ఆ వ్యాధులు ఏమిటంటే... 1. గుండె వైఫల్యం సమస్యకు గత ఏడాది కాలంలో ఆస్పత్రిలో చేరినవారు. 2. గుండె మార్పిడి లేదా ఒక కవాటం సమస్యకు పరికరాన్ని అమర్చుకున్నవారు. 3. గుండె ఎడమ కవాటం పనిచేయకుండా ఇబ్బంది పడుతున్నవారు. 4. గుండె పని సామర్థ్యం 40 శాతం కంటే తక్కువ ఉన్నవారు లేదా కవాటం సమస్యతో బాధపడుతున్నారు 5. పుట్టుకతో వచ్చిన వివిధ రకాల గుండె సమస్యలతో బాధపడుతున్నవారు. 6. హైపర్ టెన్షన్ (బీపీ), డయాబెటిస్ (షుగర్)తో బాధపడుతూ చికిత్స పొందుతున్నవారు. 7. సీటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ పరీక్షలో పక్షవాతం నిర్ధారణ అయి హైబీపీ లేదా డయాబెటీస్‌కు చికిత్స పొందుతున్నవారు. 8. గుండెపోటుకు గురై ఇప్పటికే బైపాస్ సర్జరీ లేదా స్టంట్ వేయించుకున్నవారు. 9. ఊపిరితిత్తుల్లో రక్తపోటు సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు. 10. పదేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు లేదా దాంతోపాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు. 11. కిడ్నీ, లివర్ మార్పిడి లాంటి శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు లేదా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు, స్టెమ్ సెల్ థెరఫీ తీసుకున్నవారు. 12. తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, ఇప్పటికే డయాలసిస్‌లో ఉన్నవారు. 13. రోగనిరోధక శక్తి తక్కువ కావడం వల్ల వచ్చే జబ్బులతో బాధపడుతున్నవారు. 14. దీర్ఘకాలిక కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్నవారు. 15. గత రెండేళ్లలో శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు. 16. లింఫోమా, లుకేమియా, మైలోమా లాంటి కేన్సర్లతో బాధపడుతున్నవారు. 17. గతేడాది జూలై తర్వాత కేన్సర్ బారినపడినవారు లేదా ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నవారు. 18. దీర్ఘకాలిక రక్తకణాల సమస్యలతో బాధపడుతున్నవారు, స్టెరాయిడ్స్ మాత్రలు దీర్ఘకాలికంగా వాడేవారు. 19. హెచ్ఐవీతో బాధపడుతున్నవారు. 20. కండరాల బలహీనతతో బాధపడుతున్నవారు, యాసిడ్ దాడికి గురై శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మూగ–చెవిటి–అంధత్వ సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులు. రాష్ట్రంలో 2,222 ఆస్పత్రుల్లో సీనియర్ సిటిజన్లకు నేటి నుంచి టీకా సాక్షి, అమరావతి: నేటి నుంచి రాష్ట్రంలో అతిపెద్ద కోవిడ్ టీకా ప్రక్రియ జరగనుంది. రెండు మాసాల పాటు 48 రోజులు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. రమారమి 60 లక్షల మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 60 ఏళ్లు దాటిన వారితో పాటు 45–59 ఏళ్లలోపు వయసుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ టీకా వేస్తారు. 28 రోజుల వ్యవధిలో తొలిడోసు, రెండో డోసు వేయడానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,222 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతుంది. దీనికోసం వ్యాక్సినేటర్లను నియమించారు. వ్యాక్సిన్ జిల్లాల వారీగా అవసరాన్ని బట్టి అక్కడకు చేర్చారు. కోవిన్ సాఫ్ట్వేర్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేరు నమోదు చేసుకుని టీకా వేయించుకోవచ్చు. లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లి ఆయా కేంద్రాలకు వెళ్లి టీకా వేయించుకునే అవకాశమూ ఉంది. ఒకే దశలో ఇంత మందికి టీకా వేయడం అతిపెద్ద ప్రక్రియ అని వైద్యులు చెబుతున్నారు. -
రేపటి నుంచి పెద్దలకూ కోవిడ్ టీకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమం భారీ ఎత్తున జరగనుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 2,222 ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. 60 ఏళ్ల వయసు దాటిన వారు, 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే ఫ్రంట్‌లైన్ వర్కర్లయిన ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీ తదితర విభాగాల ఉద్యోగులకు కోవిడ్ టీకాలు వేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్ ప్రక్రియపై రాష్ట్ర టాస్‌్కఫోర్స్ కమిటీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. వ్యాక్సిన్ ప్రక్రియపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 59.96 లక్షల మందికి.. ఈ విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారు రాష్ట్రంలో 52,98,063 మంది ఉన్నట్టు తేల్చారు. వీరితోపాటు 45–59 ఏళ్ల మధ్య వయస్కులై ఉండి రకరకాల దీర్ఘకాలిక జబ్బులు అంటే క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, బీపీ వంటి సమస్యలున్న వారు 6,97,990 మందిగా (ఎన్సీడీ–సీడీ డేటా ఆధారంగా) గుర్తించారు. అంటే మొత్తం ఈ విడతలో 59,96,053 మందికి టీకాలు వేస్తారు. వీరంతా కోవిన్ సాఫ్ట్వేర్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా పేరు, వివరాలు నమోదు చేసుకుని సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళితే టీకా వేస్తారు. సోమవారం నుంచి 2 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వారానికి 6 రోజుల చొప్పున 48 రోజుల పాటు కోవిడ్ టీకా వేస్తారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకా వేస్తారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకపోయినా.. లబ్ధిదారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా ఆన్సైట్ సిస్టం ద్వారా కోవిడ్ టీకా వేయించుకోవచ్చు. నేరుగా కోవిడ్ టీకా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ, డ్రైవింగ్ లైసెన్సు కార్డు, దీర్ఘకాలిక జబ్బులున్నట్టు వైద్యుడి సర్టిఫికెట్, మరేదైనా అధికారిక గుర్తింపు కార్డు ఉన్నట్టు అక్కడ చూపిస్తే టీకా వేస్తారు. అయితే ఆ రోజు రద్దీని బట్టి, కోవిడ్ నిబంధనల మేరకు ఆన్సైట్ వారికి టీకా వేస్తారు. స్లాట్ బుక్ చేసుకుని వెళ్లండి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిన్ సాఫ్ట్వేర్ లేదా ఆరోగ్యసేతు యాప్‌ద్వారా స్లాట్ నమోదు చేసుకుని టీకాకు వెళ్లడం మంచిది. అలాంటి వారికి కచ్చితంగా అదే రోజు విధిగా టీకా వేయగలరు. అలా కాకుండా గుర్తింపు కార్డుతో వెళ్లే వారికి అదే రోజున టీకా వేసే విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ స్లాట్ బుక్ చేసుకుని తమకు నిర్ణయించిన తేదీన వెళ్లడం మంచిది. టీకాకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ -
రూ.2,937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్
తిరుమల: 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,937.82 కోట్ల అంచనాలతో టీటీడీ బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించిందని బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ముందస్తు రిజర్వేషన్‌తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. వీరు సేవకు వచ్చే మూడ్రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలి. అలాగే, టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలివీ.. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ► 2021–22 టీటీడీ బడ్జెట్ రూ.2,937.82 కోట్లుగా ధర్మకర్తల మండలి ఆమోదించింది. ► గుడికో గోమాత కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వస్తున్న స్పందనతో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని తీర్మానం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ తులాభారం ప్రవేశపెట్టేందుకు ఆమోదం. ► టీటీడీ పరిధిలోకి ఇతర ఆలయాలను తీసుకోవడానికి విధివిధానాలను నిర్ణయించారు. ► టీటీడీ కల్యాణ మండపాల నిర్మాణం, లీజుకు ఇవ్వడం, నిర్వహణకు సంబంధించి ఏకరూప మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయం. ► టీటీడీ ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలల పేరును ఇకపై శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంగా మారుస్తారు. బర్డ్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ విభాగం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు రూ.9 కోట్ల మంజూరుకు ఆమోదం. ► తిరుమలలోని అన్ని వసతి, విశ్రాంతి గృహాలు, సత్రాల వద్ద విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ఆమోదం. అలాగే, తిరుమలలో క్రమంగా 50 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి నిర్ణయం. ► శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అన్నప్రసాదం ఇవ్వాలని నిర్ణయం. అయోధ్యలో రామ మందిరం వద్ద భూమి కేటాయిస్తే శ్రీవారి ఆలయం లేదా భజన మందిరం, యాత్రికుల వసతి సముదాయం.. వీటిలో వారు ఏది కోరితే అది నిర్మించాలని నిర్ణయించారు. సమావేశంలో ఈవో జవహర్‌రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు. -
ఏపీలో 1.87 లక్షల మందికి వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోంది. జనవరి 31 నాటికి 1,87,252 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ లబ్ధిదారుల సంఖ్యలో 9వ స్థానంలో ఏపీ ఉంది. అయితే జనాభా ప్రాతిపదికన రాష్ట్రాల పరంగా చూస్తే మన రాష్ట్రం పెద్ద రాష్ట్రాల కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ వేసింది. జనాభా ప్రాతిపదికన ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసిన రాష్ట్రాల్లో రాష్ట్రం 5వ స్థానంలో నిలిచింది. దేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 4,63,793 మందికి వ్యాక్సిన్ వేయగా అత్యల్పంగా డామన్ అండ్ డయ్యూలో 391 మందికి వేశారు. పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు అత్యల్పంగా 1.05 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేసింది. జనవరి 31 రాత్రి 9 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 37,58,843 మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీలో 64 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 21,922 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 64 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఒకేరోజు 99 మంది కోలుకున్నారు. ఇప్పటికి 1,31,59,794 టెస్టులు చేయగా, 8,87,900 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,79,504 మంది కోలుకోగా, 1,242 మంది చికిత్స పొందుతున్నారు. 7,154 మంది చనిపోయారు. -
వ్యాక్సిన్‌లో భారత్ రికార్డ్: ప్రపంచంలోనే తొలిస్థానం
న్యూఢిల్లీ: మహమ్మారి వైరస్ వ్యాప్తి నిరోధానికి వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది. ప్రపంచదేశాల్లో ప్రస్తుతం వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయితే ప్రపంచ దేశాల్లో కన్నా భారత్‌లోనే అత్యధికంగా వ్యాక్సిన్లు వేసినట్లు తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలే చెబుతున్నాయి. భారత్ కన్నా ముందే అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాలు టీకాలు పంపిణీ మొదలుపెట్టాయి. కానీ వాటన్నిటి కన్నా వేగంగా టీకాలు వేయడంలో భారతదేశం ముందుంది. 13 రోజుల్లో 30 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ డేటా చెబుతోంది. అయితే ఇదే 30 లక్షల మార్క్ చేరుకోవడానికి అమెరికాకు 18 రోజులు పట్టగా... ఇజ్రాయెల్‌కు 33 రోజులు పట్టింది. బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్, సీరమ్ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16వ తేదీన మొదలుపెట్టారు. ఆ ప్రక్రియ నిర్విరామంగా.. సజావుగా సాగుతోంది. ఈ వ్యాక్సిన్లతో దుష్ప్రభావం జరిగిన సంఘటనలు చాలా తక్కువగా ఉండడం హర్షించదగ్గ విషయం. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వ్యాక్సినేషన్ పంపిణీ వేగంగా సాగుతోంది. వ్యాక్సినేషన్లో కర్ణాటక (2,86,089) మొదటి స్థానంలో ఉంది. అనంతరం మహారాష్ట్ర (2,20,587), రాజస్థాన్ (2,57,833), ఉత్తరప్రదేశ్ (2,94,959) ఉన్నాయి. రోజుకు సగటున 5 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య 1,07,20,048, మృతుల సంఖ్య 1,54,010. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోకి వచ్ -
వ్యాక్సిన్: ‘అలాంటివారిపై ఓ కన్నేసి ఉంచండి’
న్యూఢిల్లీ: కోవిడ్ సామర్థ్యంపై ప్రజల్లో అపోహలు రేకెత్తిస్తూ, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ పుకార్లు పుట్టించేవారిపై ఓ కన్నేసి ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్లపై తప్పుడు వార్తలు ప్రచారం చేసేవారిని గుర్తించి, అటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు. అందులో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోన్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేస్తోన్న కోవాగ్జిన్ సురక్షితమైనవి అజయ్ భల్లా అన్నారు. ఈ రెండు వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని దేశంలోని నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ గుర్తించిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో తయారు చేస్తోన్న ఈ రెండు వ్యాక్సిన్ల వ్యాక్సినేషన్ ప్రక్రియకు జనవరి 16 కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. అయితే ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు పొందిన ఈ రెండు వ్యాక్సిన్ల సమర్థతపై అనేక అనుమానాలకు తావిస్తూ, అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిపట్టించే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అలా చేస్తే చర్యలు తప్పవన్నారు. -
ఆల్‌టైం గరిష్టానికి పెట్రో ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌పై 25 పైసల చొప్పున ఎగబాకాయి. చమురు సంస్థల నోటిఫికేషన్ ప్రకారం..లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.85.70 కాగా, ముంబైలో 92.28కి చేరింది. అదేవిధంగా, లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.75.88, ముంబైలో రూ.82.66గా ఉంది. ధరలు ఇలా పైకి ఎగబాకటం వరుసగా నాలుగో వారంలో రెండో రోజు. ఈ వారంలో పెట్రో ధరలు లీటర్‌కు రూ.1 చొప్పున పెరిగాయి. విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ జనవరి 6 నుంచి పెట్రో ధరలను ఏరోజుకారోజు సవరిస్తున్నాయి. అప్పటి నుంచి లీటర్‌కు పెట్రోల్ ధర రూ.1.99, డీజిల్ ధర రూ.2.01 మేర పెరిగాయి. సేల్స్ ట్యాక్స్, వ్యాట్ల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రానికో విధంగా ఉంటున్నాయి. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో విధించడమే ధరల్లో పెరుగుదలకు కారణమని ఆరోపిస్తున్న చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్..పన్నుల్లో కోత విషయమై ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమయ్యాక డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో భారత్‌తోపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకుతున్నాయి. -
వ్యాక్సిన్‌పై పుకార్లను నమ్మకండి: కేంద్రం
ఢిల్లీ : మొన్నటివరకు కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే ఆందోళన ఉంటే, ప్రస్తుతం టీకా ఎంతమేర సురక్షితం అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. టీకా అందుబాటులోకి రాగానే మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్‌కే ఇస్తామని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు కొందరు వైద్యసిబ్బంది వెనకడుగు వేస్తుండటంపై కేంద్రం జోక్యం చేసుకుంది. టీకా గురించి భయపడాల్సిన అవసరం లేదని, పుకార్లను నమ్మవద్దని కోరింది. కరోనా వంటి మహమ్మారికి వ్యాక్సిన్‌తోనే అడ్డుకట్ట వేయగలమని, వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి సంశయం అవసరం లేదని పేర్కొంది. టీకా తీసుకున్న అనంతరం చాలా కొద్దిమందిలోనే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని, అయితే ఇది సాధారణ విషయమని నీతి అయోగ్ డైరెక్టర్లలో ఒకరైన వీకె పాల్ పేర్కొన్నారు. ఒకవేళ తీవ్ర స్థాయిలో ప్రతికూలతలు ఎదురైతే వెంటనే చికిత్స అందించడానికి ప్రతీ సెంటర్లలోనూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలిపారు. (కోవాగ్జిన్ టీకా వేసుకున్న వారిలో దుష్ప్రభావాలు ) కరోనా మమహ్మారిపై పోరాటంలో ముందుండి నడిపించిన ఫ్రంట్ లైన్ వారియర్స్.. వ్యాక్సిన్ తీసుకునే విషయంలోనే రోల్ మోడల్‌గా నిలవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతీ ఒక్కరూ టీకా వేయించుకోవాలని విఙ్ఞప్తి చేశారు. భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 3.8 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వారిలో 580 మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించగా, ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారు. ఇద్దరు మరణించారు. అయితే ఇది వ్యాక్సిన్‌కి సంబంధించి మరణాలు కాదని వైద్యులు నిర్ధారించారు. ఏడుగురు ఆసుపత్రి పాలవగా, ఇద్దరు మరణించారు. అయితే ఇది వ్యాక్సిన్‌కి సంబంధించినది కాదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 10,064 కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలలుగా నమోదవుతున్న వాటిలో ఇదే అత్యల్పం. ఇప్పటివరకు దేశంలో 1.05 కోట్ల మందికి కరోనా సోకగా, 1,52,556 మరణాలు నమోదయ్యాయి. (వ్యాక్సినేషన్ తర్వాత ఇద్దరు మృతి! ) -
మూడో రోజు 14,606 మందికి వ్యాక్సిన్
సాక్షి, అమరావతి/ భీమడోలు: హెల్త్‌కేర్ వర్కర్లకు నిరంతరాయంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో భాగంగా మూడో రోజు రాష్ట్రంలో 14,606 మందికి వేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మూడో రోజు ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,847 మందికి వ్యాక్సిన్ వేశారు. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 459 మందికి వ్యాక్సిన్ వేశారు. 3.87 లక్షల మందికి ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. తొలిరోజు 19,108 మందికి రెండో రోజు 13,036 మందికి వ్యాక్సిన్ వేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 16వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 29 మంది ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది.. వైద్యుల పర్యవేక్షణలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత రోజు ఆగడాలలంక గ్రామానికి చెందిన కురమా షారోన్‌రాణి, చిగురుపాటి సుశీలకు తల, ఒళ్లు నొప్పులు ప్రారంభమయ్యాయి. సోమవారం వాంతులు కూడా కావడంతో ఏలూరు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచించారు. జిల్లాల వారీగా సోమవారం వ్యాక్సిన్ వేయించుకున్న వారి వివరాలు ఇలా.. -
ఏపీ వ్యాప్తంగా రెండో రోజు వ్యాక్సినేషన్..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండో రోజు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 332 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం గంటల వరకు వ్యాక్సినేషన్ సాగనుంది. రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం కాగా, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. శనివారం 19,108 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 14,300 మాత్రమే. ఈ లక్ష్యానికి మించి టీకా కార్యక్రమం కొనసాగింది. చదవండి: తొలిరోజు 19,108 మందికి దేశంలో కరోనా నియంత్రణ, నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ముందంజ వేసిందో వ్యాక్సిన్ వేసే ప్రక్రియలోనూ దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,291 మందికి వ్యాక్సిన్ వేశారు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్య (19,108 మంది) చూస్తే ఏపీలో అత్యధికం. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 21 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ జనాభా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 13,594 మందికి, మహారాష్ట్రలో 18,328 మందికి వ్యాక్సిన్ వేశారు. ఎక్కువ మందికి టీకా ఇచ్చిన జాబితాలో యూపీ ప్రథమస్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. చదవండి: కరోనాపై గెలుపు తథ్యం -
తొలిరోజు 19,108 మందికి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి రోజు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. శనివారం 19,108 మంది హెల్త్‌కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ వేశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం 14,300 మాత్రమే. ఈ లక్ష్యానికి మించి టీకా కార్యక్రమం కొనసాగింది. విజయవాడ సర్వజనాసుపత్రిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగతా అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, మంత్రులు, కలెక్టర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం రాత్రి వరకూ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 2,274 మందికి, అతి తక్కువగా ప్రకాశం జిల్లాలో 436 మందికి వ్యాక్సిన్ వేశారు. రాష్ట్రంలో 3.87 లక్షల మంది హెల్త్‌కేర్ వర్కర్లకు టీకా ఇవ్వడం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజారోగ్య సంచాలకులు డా.గీతాప్రసాదిని, నోడల్ అధికారి డా.శ్రీహరి, డా.హైమావతి తదితరుల బృందం వ్యాక్సిన్ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. వ్యాక్సిన్ ప్రక్రియలో దేశంలో అగ్రగామిగా.. ► దేశంలో కరోనా నియంత్రణ, నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ముందంజ వేసిందో వ్యాక్సిన్ వేసే ప్రక్రియలోనూ దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. ► దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,291 మందికి వ్యాక్సిన్ వేశారు. జనాభా ప్రాతిపదికన వ్యాక్సిన్ వేసిన వారి సంఖ్య (19,108 మంది) చూస్తే ఏపీలో అత్యధికం. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 21 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. ► ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ జనాభా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో 13,594 మందికి, మహారాష్ట్రలో 18,328 మందికి వ్యాక్సిన్ వేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఏ ఒక్కరికీ కూడా దుష్ప్రభావాలు కలగలేదు. -
కరోనా వ్యాక్సినేషన్ తొలి టీకా.. వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. దేశంలో తొలి కరోనా టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శానిటైజర్ వర్కర్ మనీష్ కుమార్‌కు వైద్యులు వేశారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్య బృందంతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్) మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. జీజీహెచ్‌లో హెల్త్ వర్కర్ పుష్పకుమారికి తొలి టీకా ఇచ్చారు. అనంతరం హెల్త్ వర్కర్ నాగజ్యోతి, హెల్త్ వర్కర్ జయకుమార్‌కు టీకా వేశారు. తెలంగాణలో టీకా కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో టీకా ప్రారంభం నేడే
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు)/ఏలూరు టౌన్: దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నేడు రాష్ట్రంలోనూ ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్ వేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్ స్టోర్ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్‌లైన్ వర్కర్లు) అందరికీ వ్యాక్సిన్ వేస్తారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, జిల్లాస్థాయిలో కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో కుటుంబ సంక్షేమశాఖ అధికారులు టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో ఏర్పాట్లను సమీక్షిస్తున్న అధికారులు మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్ వద్ద డాక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సెంటర్లో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డులో 20 పడకలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. విజయవాడ జీజీహెచ్‌లో సీఎం ప్రారంభం విజయవాడలోని సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 11.25 గంటలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో నిర్ణయించిన మేరకు టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. ఆస్పత్రిలోని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తదితరులు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఆస్పత్రి అధికారులు వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష జరిపారు. -
56.5 లక్షల టీకా డోసుల తరలింపు
న్యూఢిల్లీ/పుణే: ఈనెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కోవిడ్–19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం కోవిషీల్డ్ , కోవాగ్జిన్ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు ఆర్డర్లు జారీ చేయగా మంగళవారం ఉదయం నుంచి మొదటి విడత టీకా తరలింపు ప్రారంభమైంది. వ్యాక్సిన్ డ్రైవ్‌కు నాలుగు రోజులు ముందుగానే సీరం ఇన్స్టిట్యూట్ ప్రధాన కేంద్రం పుణే నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా 13 నగరాలకు 56.5 లక్షల డోసులకు పైగా కోవిషీల్డ్ టీకాను తరలించారు. మొదటి రోజున నాలుగు విమాన సంస్థలకు చెందిన 9 విమానాలు 11 టన్నుల బరువున్న టీకాను తరలించాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్లో ప్రకటించారు. పుణే నుంచి స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థల విమానాలు ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, కోల్‌కతా, భువనేశ్వర్, పట్నా, లక్నో, కర్నాల్, ముంబై నగరాల్లో సిద్ధం చేసిన రాష్ట్ర స్థాయి డిపోలకు కోవిషీల్డ్ డోసులను తీసుకెళ్లాయన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి కోవిషీల్డ్ 1.1 కోట్ల డోసులు, కోవాగ్జిన్ 55 లక్షల డోసులు నిర్దేశించిన కేంద్రాలకు చేరుతాయని ప్రభుత్వం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు 54.72 లక్షల డోసుల కోవిషీల్డ్ టీకా బాక్సులు చేరుకున్నట్లు ప్రకటించింది. 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు పూర్తయిన 14 రోజుల తర్వాతే టీకా ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. పుణేలో పూజలు పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పూజల అనంతరం కోవిషీల్డ్ టీకా ఉన్న ట్రక్కులు అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని పుణే విమానాశ్రయానికి చేరుకున్నాయి. టీకా బాక్సులతో ఉదయం 8 గంటలకు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం ఢిల్లీకి 10 గంటలకు చేరుకుందని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. అలాగే, ఇండిగో విమానాలు చండీగఢ్, లక్నోలకు, స్పైస్ జెట్ గువాహటి, కోల్‌కతా, హైదరాబాద్, భువనేశ్వర్, బెంగళూరు, పట్నా, విజయవాడకు, గో ఎయిర్ విమానం చెన్నైకు వెళ్లాయి. రేసులో మరో నాలుగు టీకాలు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలంటూ మరో నాలుగు టీకా తయారీ సంస్థలు త్వరలోనే డీసీజీఐకి దరఖాస్తు చేసుకునే అవకాశా లున్నాయని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చెప్పారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ ముందుంజలో ఉన్న జైడస్ క్యాడిలా, స్పుత్నిక్–వీ, బయోలాజికల్ ఈ, జెన్నోవా వీటిల్లో ఉన్నాయన్నారు. ప్రస్తుత రెండు వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్టుల ప్రమాదం లేదనీ, సురక్షితమైనవని మంగళవారం నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. కోవాగ్జిన్ ధర ఎంతంటే.. కోవాగ్జిన్ టీకా మొత్తం డోసులు 55 లక్షలు. కాగా, ఇందులో రూ.295 చొప్పున 38.5 లక్షల డోసులు, మిగతా 16.5 లక్షల డోసులు ఉచితం కాగా అంతా కలిపి డోసు ధర సరాసరిన రూ.206 అవుతుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. వివిధ టీకాల ధరలు.. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న టీకా ధరలను భూషణ్ వివరించారు. ఫైజర్ డోసు రూ.1,431, మోడెర్నా రూ.2,348 నుంచి రూ.2,715 వరకు, సినోవాక్ రూ.1,027, నోవావ్యాక్స్ రూ.1,114, స్పుత్నిక్ వీ రూ.734, జాన్సన్ అండ్ జాన్సన్ ధర రూ.734కు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వీటిల్లో ఫైజర్ టీకా మైనస్ 70 డిగ్రీల వద్ద మినహా మిగతా వాటన్నిటినీ 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచవచ్చన్నారు. కోవాగ్జిన్ ప్రయోగాల్లో ఉల్లంఘనలు? సాక్షి, హైదరాబాద్: భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కోవాగ్జిన్ ప్రయోగ టీకా తీసుకున్న 9 రోజుల వ్యవధిలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ వలంటీర్ మరణించడం వ్యాక్సిన్ సమర్థతపై కలకలం రేపుతోంది. తమ వ్యాక్సిన్ కారణంగా ఆ వలంటీర్ మరణించలేదని కంపెనీ చెప్పుకున్నప్పటికీ భోపాల్‌లో భారత్ బయోటెక్ నిర్వహించిన ప్రయోగాల తీరు సందేహాలకు తావిస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత్ బయోటెక్ మూడో దశ ప్రయోగాల నిబంధనలను ఉల్లంఘించిందని, యూనియన్ కార్బైడ్ గ్యాస్ ప్రమాద బాధితుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే ప్రయోగ టీకాలు ఇచ్చిందని భోపాల్ దుర్ఘటన బాధితుల కోసం పనిచేస్తున్న కొందరు సామాజిక కార్యకర్తలు ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ప్రస్తుతం ఈ ఉదంతం అందరి దృష్టిలోకి వచ్చింది. మా సమ్మతి తీసుకోలేదు: బాధితులు భోపాల్‌లో కోవాగ్జిన్ ప్రయోగాలను నిర్వహించిన పీపుల్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ తమ నుంచి ఎలాంటి సమ్మతి తీసుకోలేదని ప్రయోగాల్లో పాల్గొన్న బాధితులు స్వయంగా మీడియా ముందు ఆరోపించారు. చదవడం, రాయడం తెలియని తమతో టీకా ప్రయోగానికి సమ్మతి తీసుకుంటున్నట్లు వీడియో రికార్డింగ్ కూడా నిర్వహించలేదని అన్నారు. అన్ని అనుమతులూ తీసుకున్నాం.. భోపాల్ ఘటనపై స్పందించిన భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ప్రయోగాల్లో మరణించిన వ్యక్తి నుంచి ముందుగానే అన్ని రకాల అనుమతులూ తీసుకున్నామని ప్రకటించింది. అంతేకాకుండా పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఆ వ్యక్తి విష ప్రయోగం వల్ల గుండె, ఊపిరితిత్తులు పనిచేయకుండా మరణించాడని ఉందని చెప్పింది. -
రాష్ట్రానికి 4.77 లక్షల టీకాలు
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి కోవిడ్ టీకా వచ్చేసింది. గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్ టీకా బాక్సులు చేరుకున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్కు సంబంధించిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ పుణె నుంచి 4.77 లక్షల వ్యాక్సిన్ డోస్‌లున్న 40 బాక్సులు ప్రత్యేక విమానంలో వచ్చాయి. వీటిని కంటైనర్‌లో బందోబస్తు మధ్య గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనానికి తరలించి వాక్ ఇన్ కూలర్స్లో భద్రపరిచారు. ఇక్కడి నుంచి ఈ వ్యాక్సిన్‌ను జిల్లాలకు పంపిస్తారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా నిర్ణయించిన 3.87 లక్షలమంది హెల్త్‌కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఈ నెల 16న ఉదయం తొమ్మిది గంటలకు అన్ని జిల్లాల్లో ప్రారంభమవుతుంది. మరో 20 వేల డోసుల వ్యాక్సిన్ భారత్ బయోటెక్ కంపెనీ నుంచి బుధవారం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కేంద్రం మార్గదర్శకాల మేరకే జిల్లాలకు రాష్ట్రానికి చేరుకున్న వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే జిల్లాలకు రవాణా చేస్తారు. మంగళవారం రాత్రికి కేంద్రం నుంచి మార్గదర్శకాలు రావచ్చని అధికారులు అంచనా వేశారు. వ్యాక్సిన్ ఎలా తరలించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటివాటిపై కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చాకే వ్యాక్సిన్ సరఫరా అవుతుంది. ఒక్కొక్కరికి 0.5 మిల్లీలీటర్ల డోసును ఐఎం (ఇంట్రా మస్క్యులర్.. అంటే కండరాలకు వేసేది) ఇంజక్షన్ ద్వారా వేస్తారు. ప్రస్తుతం రాష్ట్రానికి వచ్చింది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సంబంధించి రెండుడోసుల వ్యాక్సిన్ అని కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. అవసరం మేరకు మరికొన్ని డోసులు వస్తాయి. గన్నవరం వ్యాక్సిన్ నిల్వ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ రవాణాకు 19 ప్రత్యేక వాహనాలను సిద్ధంగా ఉంచారు. గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్లను కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యు.శ్రీహరి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జి.మధుసూదనరావు పర్యవేక్షించారు. 3.80 లక్షలమందికిపైగా ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్ ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్ అదిత్యనాథ్‌దాస్ రాష్ట్రంలో ఈ నెల 16న ప్రారంభించనున్న మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై మంగళవారం ఆయన విజయవాడలో తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి 4.77 లక్షల డోసుల వ్యాక్సిన్లు వచ్చిందన్నారు. ముందు 3.80 లక్షలమందికిపైగా ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 332 సెషన్ సైట్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కోవిషీల్డ్ టీకా బాక్స్‌ను అందుకుంటున్న కలెక్టర్, జేడీ, జేసీ వీరికి వ్యాక్సిన్ వేయకూడదు.. 16న జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణులు, 50 ఏళ్లు నిండిన, 18 ఏళ్ల లోపు, కోమార్భిడిటీ లక్షణాలతో ఇబ్బందిపడేవారికి వ్యాక్సిన్ వేయరాదని సీఎస్ స్పష్టం చేశారు. రెండోవిడతలో పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్ డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ ఎస్పీలు.. కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రెండోవిడతలో పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయనున్నందున బందోబస్తు ఏర్పాట్లకు ఆటంకం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్సింఘాల్ మాట్లాడుతూ ఈ నెల 16న ప్రారంభం కానున్న తొలివిడత వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రాష్ట్రంలో 332 సెషన్ సైట్లు ఏర్పాటు చేయగా.. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 33 సైట్లు, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 15 సైట్లు ఉన్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కె.భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర, ప్రాంతీయ, జిల్లా వ్యాక్సిన్ స్టోరేజి కేంద్రాలను సీసీటీవీల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ప్రతి గ్రామ/వార్డు సచివాలయం వద్ద ఒక సెషన్ సైట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో చేయవలసిన, చేయకూడనిఅంశాలపై ఐఈసీ మెటీరియల్‌ను జిల్లాలకు పంపినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ రవిశంకర్, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవీలత, సమాచారశాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
49000 పైకి సెన్సెక్స్
ముంబై: కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు రాణించవచ్చనే ఆశలతో స్టాక్ మార్కెట్లో బుల్ జోష్ కొనసాగుతోంది. ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం మరోసారి జీవితకాల గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 487 పాయింట్ల లాభంతో తొలిసారి 49వేల స్థాయిపై 49,269 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 14,485 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా ఈ జనవరి 16వ తేదీ నుంచి కోవిడ్–19 టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుండటం, కొత్త అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో అమెరికా నుంచి భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన వెలువడవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పుంజుకుంటుందనే సంకేతాలు, దేశీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచే కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభపడి 49,304 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 14,498 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. మరోవైపు లాభాల మార్కెట్లోనూ మెటల్, బ్యాంకింగ్, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కరోనా కేసుల రికవరీ రేటు పెరగడంతో పాటు కోవిడ్ –19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ వారాంతంలో మొదలు కానుండటం మార్కెట్‌కు అనుకూలించిందని రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు బినోద్ మోదీ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో వేగవంతమైన రికవరీ సంకేతాల నేపథ్యంలో కంపెనీల క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉండొచ్చని అన్నారు. త్రైమాసిక విడుదల సందర్భంగా కంపెనీలు వృద్ధి సహాయక చర్యల నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. ఈ సానుకూలాంశాలతో సూచీల రికార్డుల ర్యాలీ స్వల్పకాలం పాటు కొనసాగవచ్చని మోదీ వివరించారు. టీసీఎస్ షేరుకు క్యూ3 ఫలితాల జోష్... ఐటీ సేవల సంస్థ టీసీఎస్ షేరు సోమవారం బీఎస్ఈలో 2% లాభంతో రూ.3,175 వద్ధ ముగిసింది. క్యూ3లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో షేరు 3.32 శాతం ఎగసి రూ.3,224 వద్ద కొత్త ఆల్‌టైం హైని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.09 లక్షల కోట్లను తాకింది. -
ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోదీ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వారితో విస్తృతంగా చర్చించనున్నారు. కరోనా టీకా సరఫరా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ అనే టీకాల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో భేటీ అవుతుండడం ఇదే తొలిసారి. వ్యాక్సినేషన్ సన్నద్ధతలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడు దఫాలు డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. మొదట కోటి మంది ఆరోగ్య సిబ్బందికి, 2 కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు తొలి డోసు ఇస్తామని ప్రకటించింది. అంటే కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్న 27 కోట్ల మందికి ముందుగా టీకా అందనుంది. -
టీకా పంపిణీలో ‘కోవిన్’ కీలకం
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో ‘కోవిన్’ యాప్ కీలక పాత్ర పోషించనుందని కేంద్రం ఆదివారం ప్రకటించింది. వ్యాక్సిన్ అందరికీ, అన్ని వేళలా అందుబాటులో ఉండేందుకు ఈ ఆన్లైన్ వేదిక వీలు కల్పిస్తుందని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ భారత్‌లో 16న ప్రారంభం కానుంది. తొలుత సుమారు 3 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులకు టీకా ఇవ్వనున్నారు. ఆ తరువాత 50 ఏళ్లు దాటినవారికి, 50 లోపు వయస్సున్న దీర్ఘకాల ప్రాణాంతక వ్యాధులున్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. టీకా పంపిణీ సంసిద్ధతలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ‘ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్మెంట్ టు కంబాట్ కోవిడ్–19’ చైర్మన్ రామ్ సేవక్ శర్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం కూడా ఇందులో పాల్గొంది. టీకా పంపిణీకి ప్రాతిపదికగానే కాకుండా, బ్యాక్అప్గా కూడా ‘కోవిన్’ సాఫ్ట్వేర్ సమర్ధవంతంగా పనిచేస్తుందని శర్మ తెలిపారు. సులువుగా వినియోగించేలా దీన్ని రూపొందించామన్నారు. ఇది ఆధార్ డేటాను కూడా వినియోగించుకుంటుందని, పౌరులంతా తమ ప్రస్తుత మొబైల్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానించుకునేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. తద్వారా వారికి వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం అందించడం సులువవుతుందన్నారు. -
టీకాపై ఎటూ తేల్చుకోలేక..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంపై ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నవారు 69 శాతం మంది ఉన్నారని లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో తేలింది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీరు టీకా తీసుకుంటారా? అని 8,723 మందిని ప్రశ్నించగా 26 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగానే తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంస్థ ప్రజల్లో టీకా ఆమోదంపై సర్వే చేçస్తూ ఫలితాల్ని ఆన్లైన్లో ఉంచుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ టీకాపై ఎటూ తేల్చుకోలేని వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్టోబర్‌లో 61 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడం గురించి ఇంకా ఆలోచిస్తున్నామని చెబితే నవంబర్ నాటికి వారి సంఖ్య 59 శాతానికి తగ్గింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) టీకాలకి పచ్చజెండా ఊపాక టీకాపై సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆ సర్వే వెల్లడించింది. ఇక పిల్లలకి టీకా ఇవ్వడానికి 26% తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సిన్ సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలు, హడావుడిగా అనుమతులివ్వడం, దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఆందోళన నెలకొని 69 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారని లోకల్‌సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాల రేటు చాలా తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న వారు కూడా ఉన్నారు. -
మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్ వద్దు
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో మహమ్మారి అనే పదానికి అర్థం చెప్పిన భయంకరమైన జబ్బు మశూచి.. కోట్లాది మందిని పొట్టనపెట్టుకున్న ఈ జబ్బుకు విరుగుడుగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలే జరిగాయి.. తట్టు, గవదబిళ్లల నిరోధానికి టీకా ఇస్తామని వస్తే ఊళ్లకు ఊళ్లే తలుపులకు తాళాలు వేసుకుని ఖాళీ చేశాయి. కోరింత దగ్గు, మీజిల్స్ టీకాలు బలవంతంగా వేయబోతే ఆత్మహత్య చేసుకుంటామని జనం బెదిరించారు. ఊళ్లకు ఊళ్లను శ్మశానవాటికలుగా మార్చిన మహమ్మారులకు విరుగుడుగా శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయాసలకోర్చి కష్టపడి తయారు చేసిన ప్రతి వ్యాక్సిన్‌పై తొలుత జనం నుంచి వ్యతిరేకతే ఎదురైంది. ఇప్పుడు కోవిడ్ టీకా విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్ టీకా వేసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, శరీర డీఎన్ఏనే మారిపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర వినియోగానికి టీకాలకు దేశాలు పచ్చజెండా ఊపుతున్నా.. జనంలో మాత్రం భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 6 నెలల క్రితం.. కోవిడ్ అంటే ప్రాణాంతకంగా భావించి జనం బయటకు వచ్చేందుకే జంకిన సమయం. వెంటనే టీకా రావాలంటూ దేవుళ్లకు మొక్కుకున్నారు.. టీకాకు సంబంధించిన వార్తలు పత్రికల్లో వస్తే అక్షరం వదలకుండా చదివారు. కానీ.. సరిగ్గా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వేళ.. అబ్బే మాకొద్దు అంటూ వెనకడుగు వేస్తున్నారు. అప్పట్లో మూఢ నమ్మకాలు.. మహమ్మారులుగా పేర్కొనే భయంకర అంటువ్యాధులకు శతాబ్దాల చరిత్రే ఉంది. తొలుత వాటి నివారణకు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. 17వ శతాబ్దం చివరి నుంచే శాస్త్రవేత్తలు టీకాలను అందుబాటులోకి తేవడం ప్రారంభించారు. కానీ, టీకాలు అందుబాటులోకి వచ్చిన కొత్తలో మూఢనమ్మకాలు రాజ్యమేలాయి. వాటిని తీసుకునేందుకు జనం ముందుకు రాలేదు. మశూచికి ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షలకు పైగా ప్రపంచవ్యాప్తంగా బలయ్యే వారు. ఎట్టకేలకు 1796లో బ్రిటన్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ దానికి టీకా రూపొందించారు. ప్రపంచానికి పరిచయమైన తొలి వ్యాక్సిన్ అదే.. కానీ ప్రజలు దాన్ని వ్యతిరేకించారు. ‘ప్రపంచం పాపాలతో నిండిపోయింది. పాపులను శిక్షించేందుకు దేవుడు మశూచి వ్యాధిని వారి మీదకు వదిలాడు. దాన్ని అడ్డుకోవటం పాపం. పాపులు ఆ శిక్ష అనుభవించాల్సిందే.. టీకా తీసుకుని రోగం రాకుండా చేయడమంటే దేవుడి ఆజ్ఞను ధిక్కరించటమే..’అన్న మూఢనమ్మకం ప్రపంచవ్యాప్తంగా ప్రబలింది. అమెరికా నుంచి మన దేశం వరకు.. ఈ తీరు టీకాను వ్యతిరేకించేందుకు కారణమైంది. ఇతరుల కణాలను ప్రవేశపెట్టడానికి వ్యతిరేకం తొలినాళ్లలో మశూచి టీకా వేరే రకంగా ఉండేది. దాన్ని రూపొందించిన జెన్నర్ పరిశోధనలో.. కౌపాక్స్ వ్యాధి కారక వైరస్ సోకితే మశూచి వైరస్ దరిచేరదన్న విషయం తేలింది. అందుకే కౌపాక్స్ వ్యాధి కారక వైరస్‌తో రూపొందించిన టీకాను ఇవ్వటం ద్వారా మశూచి ప్రబలకుండా నిరోధించారు. కానీ, కౌపాక్స్ కారకాన్ని మరొకరి శరీరం నుంచి గ్రహించినందున దాన్ని తమ శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని ఎక్కువ మంది వ్యతిరేకించారు. అలా ఆ టీకా ప్రయోగం తొలినాళ్లలో విఫలమైంది. పోలియో టీకాకూ.. మనిషిని జీవచ్ఛవంలా మార్చే పోలియో వ్యాధి ప్రబలకుండా వ్యాక్సిన్ వచ్చిన తొలినాళ్లలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆరోగ్యంగా ఉన్న వారి శరీరంలోకి వ్యాధికారక వైరస్‌ను ప్రవేశపెట్టడం ఏంటంటూ జనం తిరస్కరించారు. తమ శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తున్నారంటూ ప్రదర్శనలు నిర్వహించారు. ఆరోగ్య కేంద్రాలపై దాడులు చేశారు. బ్రిటన్, అమెరికాలోనూ నిర సన ప్రదర్శనలు జరిగాయి. తప్పనిసరి చేసినా.. మశూచి మరణాలు తీవ్రం కావటంతో, తమ దేశం రూపొందించిన టీకాను అందరూ వేసుకోవాలంటూ బ్రిటిష్ పాలకులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. 1840లో ఈ చట్టం రూపొందించినప్పుడు చాలా దేశాలు బ్రిటిష్ రూల్‌లో ఉండేవి. అయినా చాలా దేశాల్లో జనం పట్టించుకోలేదు. ప్రతి ఒక్కరూ ఆ టీకా వేయించుకోవాల్సిందేనంటూ 1853లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఒక్క బ్రిటన్‌లో మాత్రం ప్రతి సంవత్సరం 66 శాతం మంది టీకా వేయించుకోవటం ప్రారంభించారు. ఇటు పేద దేశాల్లో చలనం రాలేదు. విద్యావంతులు తక్కువ సంఖ్యలో ఉండటమే దీనికి కారణం. ఇక మన దేశంలో అప్పటికి అక్షరాస్యత శాతం 40 శాతం లోపే.. దీంతో ఇక్కడ మూఢనమ్మకాల కారణంగా మశూచి మరణాలు తీవ్రంగా ఉండేవి. సగటున ప్రతియేటా దాదాపు 2 లక్షల మంది చనిపోయేవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జోక్యం.. ప్రతి టీకా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మశూచి టీకా విషయంలో 1967లో తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల స్థాయి నుంచే టీకాను వేయాలంటూ దేశాలను ఆదేశించింది. ఇది సత్ఫలితాలనిచ్చింది. ఎంఎంఆర్ వ్యాధుల విషయంలో కూడా అలాగే చేయాల్సి వచ్చింది. పిల్లల్లో మరణాలకు కారణమవుతున్న తట్టు, కోరింత దగ్గు, గవదబిళ్లలను నిరోధించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చింది. పోలియోను నిర్మూలించాలంటే ప్రతీ దేశం తోడ్పాటు అందించేలా సమావేశాలు నిర్వహించిన ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో వ్యాక్సినేషన్ చేయాల్సిందేనని ఒత్తిడి తెచ్చింది. దీంతోనే అన్ని దేశాలు పోలియో చుక్కలు వేయటాన్ని ఉద్యమంగా నిర్వహించి చివరకు 1982 నాటికి పోలియో రహిత ప్రపంచంగా మార్చగలిగాయి. -
వ్యాక్సిన్, క్యూ3 ఫలితాలే కీలకం
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నాహక చర్యలు, కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక(ఆక్టోబర్–డిసెంబర్) ఫలితాల ప్రకటన, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి వంటి కీలక అంశాలు ఈ వారంలో మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నా యని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో గతవారంలో సెన్సెక్స్ 895 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 296 పాయింట్లను ఆర్జించడమే కాకుండా సాంకేతికంగా కీలకమైన 14,000 స్థాయిపైన ముగిసింది. ఈ సూచీలకిది వరుసగా పదోవారమూ లాభాల ముగింపు. మార్కెట్లో బుల్ రన్‌కు అనువైన పరిస్థితులు నెలకొనడంతో కొంతకాలం పాటు సూచీల అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. అనుకున్నట్లే అప్‌ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ 14,300 స్థాయిని, తదుపరి 14,400 స్థాయిని అధిగమించే అవకాశం ఉందన్నారు. డౌన్‌సైడ్‌లో 13,800 స్థాయి వద్ద, 13,700 స్థాయిల వద్ద మద్దతున్నట్లు నాయర్ వివరించారు. ఆర్థిక ఫలితాల ప్రభావం... ఐటీ సేవల సంస్థ టీసీఎస్ జనవరి 8 న క్యూ3 ఆర్థిక గణాంకాలను ప్రకటించి ‘‘కార్పొరేట్ ఆర్థిక ఫలితాల సీజన్’’కు తెరతీయనుంది. టీసీఎస్‌తో పాటు కొన్ని చిన్న ఐటీ, బ్యాంకింగ్ కంపెనీలు తమ మూడో క్వార్టర్ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో సంబంధిత రంగాల షేర్లు ఈ వారంలో అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడయ్యే అవకాశం ఉంది. ఆర్ధిక గణాంకాలు మెప్పించగలిగితే మార్కెట్లో కొనుగోళ్లు కొనసాగవచ్చు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై దృష్టి... భారత్‌లో కరోనా కట్టడికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల వినియోగానికి గతవారంలో డీసీజీఐ నుంచి అనుమతులు వచ్చేశాయి. వ్యాక్సినేషన్ సన్నద్ధతపై పరిశీలనకు కేంద్రం దేశవ్యాప్తంగా డ్రైరన్ విజయవంతంగా నిర్వహించింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం జనవరి 6 నుంచి దేశంలో వ్యాక్సి నేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆర్థిక గణాంకాలు కీలకమే... గతేడాది డిసెంబర్ ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండియా (పీఎంఐ) గణాంకాలు జనవరి 4న, అలాగే జనవరి 6న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ గణాంకాలు విడుదలకానున్నాయి. బుల్లిష్ ట్రెండే.. జీఎస్టీ అమలు నాటి నుంచి ఈ డిసెంబర్లో అత్యధికంగా రూ.1.15 లక్షల కోట్ల వసూళ్లు జరగడం ఇదే తొలిసారని ఆర్థిక శాఖ తెలిపింది. డిసెంబర్లో వాహన విక్రయాలు పెరిగినట్లు ఆటో కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ నుంచి మార్కెట్‌కు సానుకూల సంకేతాలు అందినట్లైంది. అమెరికా మార్కెట్లు కూడా గతవారం చివరి రోజున గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. ఈ పరిణామాల దృష్ట్యా ఈ వారమూ మార్కెట్లో పాజిటివ్ వాతావరణం నెలకొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఎలా?
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో టీకా పంపిణీ ఎలా జరుగుతుందోనన్న ఆసక్తితో అందరూ చూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు టీకా డ్రైరన్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కి పూర్తి సన్నద్ధంగా ఉంది. – న్యూఢిల్లీ వ్యాక్సిన్ తొలుత ఎవరికి ? ► కోవిడ్–19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ (ఎన్ఈజీవీఏసీ) సిఫారసులకనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బంది కోటి మందికి తొలుత టీకా ఇస్తారు. ఈ ఆరోగ్య సిబ్బందిని మళ్లీ సబ్ కేటగిరీలుగా విభజించారు. ఫ్రంట్‌లైన్ హెల్త్ అండ్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ (ఐసీడీఎస్) వర్కర్లు, నర్సులు, సూపర్వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ స్టాఫ్, సహాయక సిబ్బంది, వైద్య విద్యార్థులకి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన డేటాను సేకరించి కరోనా వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కోవిన్ (ఇౌగిఐN)లో ఇప్పటికే పొందుపరిచారు. ► కరోనా మహమ్మారిపై పోరాటం సాగిస్తున్న కేంద్ర, రాష్ట్రాలకు చెందిన సాయుధ బలగాలు, హోమ్ గార్డులు, విపత్తు నిర్వహణ, సివిల్ డిఫెన్స్ సంస్థలు, జైళ్లలో పని చేసే సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ అధికారులు 2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తారు. ఈ జాబితాలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన హోం, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖల్లో పనిచేసేవారు కూడా ఉన్నారు. ► 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలిగిన వారికి తొలి దశలో వ్యాక్సిన్ లభిస్తుంది. వీరిని రెండు కేటగిరీలుగా విభజించారు. 60 ఏళ్ల వయసుపైబడిన వారు, 50–60 మధ్య వయసు ఉన్నవారు. ముందు 60 ఏళ్ల పైబడిన వారికి ఇస్తారు. తాజాగా జరిగిన లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తారు ► కోవిడ్–19 కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా తొలి విడతలోనే వ్యాక్సిన్ ఇస్తారు. ► ఈ ఏడాది ఆగస్టు కల్లా తొలి విడత పంపిణీ పూర్తయితే, ఆ తర్వాత మిగిలిన జనాభాకి వారికి ఉన్న అవసరాలు, టీకా లభ్యత అనుగుణంగా క్రమక్రమంగా ఇస్తూ వస్తారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఎలా? ► సాధారణ ప్రజలు వ్యాక్సిన్ పొందాలంటే ఆన్లైన్లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసు కోవాలి. అప్పటికప్పుడు టీకా కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదు. ► కోవిడ్–19 వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కోవిన్ వెబ్సైట్ లేదంటే యాప్‌ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కోవిన్ వెబ్సైట్లోకి ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డు లేదంటే ఆధార్‌ని అప్లోడ్ చేసి పేరు, చిరునామా వంటి వివరాలు ఇవ్వాలి. అప్పుడు రిజిస్టర్ చేసిన మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చెయ్యగానే టీకా కోసం ఏ తేదీన, ఎన్ని గంటలకి, ఎక్కడికి రావాలి అన్న వివరాలు అందిస్తారు. ► కోవిన్ డిజిటల్ వ్యవస్థని జిల్లా స్థాయిలో అధికారులు పర్యవేక్షిస్తారు. కోవిన్ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ఇప్పటికే అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ ప్రక్రియ ఎలా ? వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మూడు గదులున్న కేంద్రం ఉండాలి. ఒక గది వెయిటింగ్ రూమ్ కాగా రెండో గది డాక్టర్ టీకా ఇవ్వడానికి వినియోగిస్తారు. ఇంక మూడో గదిలో టీకా తీసుకున్న వ్యక్తిని అరగంట సేపు వైద్యుల పరిశీలనలో ఉంచుతారు. అయిదుగురు ఆరోగ్య సిబ్బంది ఇందులో పనిచేస్తారు. ఒక అధికారి లబ్ధిదారుడి వివరాలన్నీ తనిఖీ చేస్తారు. రెండో అధికారి ఆ వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వడానికి అనుమతినిస్తారు. మూడో అధికారి టీకా డోసు ఇస్తారు. మరో ఇద్దరు అధికారులు టీకా ఇచ్చిన వ్యక్తి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 96 వేల మంది వ్యాక్సినేటర్లకి శిక్షణ ఇచ్చారు. వీరిలో 2,360 మందికి జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తే 715 జిల్లాల్లో మరో 57 వేల మందికి శిక్షణ ఇచ్చారు. కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ కోసం ఇప్పటికే 75 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వ్యాక్సిన్ ఎక్కడ వేస్తారు ? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు వైద్య అధికారి లేదంటే డాక్టర్ అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన నిర్ణీత ప్రాంతాల్లో టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్‌లో కూడా వ్యాక్సిన్ కేంద్రాలుగా మారుస్తారు. ఇక మారుమూల గ్రామాల్లో ప్రజలకి టీకా ఇవ్వడానికి ప్రత్యేకంగా మొబైల్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కొండలు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి ఆరోగ్య సిబ్బందే స్వయంగా వెళ్లి టీకాలు వేస్తారు. (చదవండి: కోవిషీల్డ్, కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్‌సిగ్నల్) -
8 నెలలు వ్యాక్సిన్ నిర్వహణ
స్పెషల్ వార్డులు ఇలా.. వ్యాక్సిన్ వేసే సమయంలో ఏవైనా దుష్ప్రభావాలు వచ్చిన వారికి అన్ని బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి వారిని తక్షణమే ఇక్కడకు తీసుకొస్తే వైద్యం చేసేలా 20 పడకలను అందుబాటులో ఉంచింది. ఈ వార్డులో జనరల్ ఫిజీషియన్, హృద్రోగ నిపుణులు, నరాల వైద్య నిపుణులు, అనస్థీషియా వైద్యనిపుణులను అందుబాటులో ఉంచింది. సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం కోవిడ్–19 టీకాను అనుమతించిన నేపథ్యంలో కొద్దిరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌కు ఆ టీకా రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో తొలిడోసుగా 1.70 లక్షల వయెల్స్ ఏపీకి రానుంది. ఈ నేపథ్యంలో టీకాను నిల్వ చేయడం, అక్కడి నుంచి పంపిణీ చేయడం వంటి వాటిపై అధికారులు దృష్టి సారించారు. టీకా పంపిణీలో కోల్డ్‌చైన్ మేనేజ్మెంట్ (శీతలీకరణ నిర్వహణ)అత్యంత కీలకం కానుంది. 8 మాసాల పాటు కోల్డ్‌చైన్ మేనేజ్మెంట్ చేయాల్సి రావడం ఒకరకంగా సవాలే. ప్రాధాన్యతల వారీగా ఎవరికి ఎప్పుడు వేయాలో నిర్ణయించడం వల్ల వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు శీతలీకరణ చేయాల్సిన అవసరం ఉంది. శీతలీకరణ కేంద్రాల వద్ద ఇప్పటికే పూర్తిస్థాయి పహరాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండ్రోజుల్లో తిరిగి వ్యాక్సిన్ నిర్వహణపై రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. వ్యాక్సిన్ నిర్వహణ ఇలా... – ప్రతి శీతలీకరణ కేంద్రంలో వ్యాక్సిన్‌ను 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో భద్రపరుస్తారు. – దీనికోసం అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు. – విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే జనరేటర్లు ఏర్పాటు. – మండలస్థాయిలో తహశీల్దార్ మొదలుకొని రాష్ట్రస్థాయిలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి వరకు వ్యాక్సిన్ నిల్వ, పంపిణీపై టాస్క్‌ఫోర్స్ కమిటీలతో పర్యవేక్షణ. – ఒక్కో కేంద్రంలో 40 వేల లీటర్ల వ్యాక్సిన్ నిల్వ ఉంచేందుకుగాను గన్నవరం, విశాఖ, తిరుపతిల్లో వాక్ ఇన్ కూలర్స్ ఏర్పాటు. – కర్నూలు, గుంటూరు, కడపల్లోని ఒక్కో కేంద్రంలో 16,500 లీటర్ల నిల్వ సామర్థ్యం ఉన్న వాక్ ఇన్ కూలర్స్ ఏర్పాటు. – ఒక్కో కేంద్రంలో 20 వేల లీటర్ల నిల్వ సామర్థ్యంతో గన్నవరం, గుంటూరుల్లో వాక్ ఇన్ ఫ్రీజర్స్ ఏర్పాటు. – శీతలీకరణ కేంద్రాల నుంచి వ్యాక్సినేషన్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకుగాను ఐస్‌ప్యాక్స్, బాక్స్‌లను ప్రభుత్వం సిద్ధం చేసింది. -
కరోనా కన్ఫ్యూజన్
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా పంపిణీలో అనేక చిక్కుముడులున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక వేయాల్సిన నిర్దేశిత లబ్ధిదారుల గుర్తింపు ఇప్పుడు సర్కారుకు సవాల్‌గా మారింది. రాష్ట్రంలో దాదాపు 75 లక్షల మంది వరకు మొదటి విడత టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది 2.88 లక్షల మందిని గుర్తించారు. వారి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులు దాదాపు 2 లక్షల మంది ఉంటారు. వారిని గుర్తించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. వారి జాబితా ఇంకా తయారు ప్రక్రియలోనే ఉంది. మరి 50 ఏళ్లు పైబడిన వారు, ఆ లోపు వయసున్న ఇతర అనారోగ్యమున్న వారి జాబితా తయారీపై ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించలేదు. దానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా కేంద్రం పంపించలేదు. వాస్తవంగా ఈ రెండు వర్గాలకు చెందిన లబ్ధిదారులే ఎక్కువగా ఉంటారు. దీంతో వీరి జాబితా తయారీ గందరగోళంగా మారింది. ఈ నెలలోనే వ్యాక్సిన్.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. అందుకు సంబంధించి ఓ వ్యాక్సిన్‌కు ఆమోద ప్రక్రియ శుక్రవారం మొదలైంది. ఆమోదం పొందిన మరుసటి రోజే వ్యాక్సిన్‌ను దేశవ్యాప్తంగా సరఫరా చేసేలా కంపెనీలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నెల ఎప్పుడైనా వ్యాక్సిన్ రాష్ట్రాలకు సరఫరా కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సిన్ వేయించుకునే లబ్ధిదారుల జాబితా తయారు, ఇంకా సిద్ధం చేయాల్సిన జాబితా తదితర అంశాలపై తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా సమావేశమైంది. బ్రిటన్ వేరియంట్ కొత్త కరోనా వైరస్ దూసుకొస్తుండటంతో వ్యాక్సిన్‌ను వేగంగా వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పైగా వ్యాక్సిన్ రెండు డోసుల కాలం, శరీరంలో యాంటీబాడీస్ తయారీ కాలం మొత్తం కలిపి కరోనా నుంచి రక్షణ పొందేందుకు 42 రోజుల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో వేగంగా వ్యాక్సిన్‌ను ప్రమాదకర స్థితిలో ఉన్నవారికి వేయాల్సి ఉంది. అయితే వైద్య సిబ్బంది జాబితా పూర్తికాగా, ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితా తయారు ప్రక్రియ నడుస్తుంది. అయితే 50 ఏళ్లు పైబడినవారు, ఆలోపు వయసున్న అనారోగ్యమున్న వ్యక్తులను గుర్తించడమే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. రాష్ట్రంలో 50 ఏళ్ల పైబడిన వయసున్న వ్యక్తులు దాదాపు 64 లక్షల మంది ఉంటారని అంచనా వేశారు. వారిని ఓటర్ ఐడీ కార్డులతో గుర్తించాలని అనుకున్నారు. లబ్ధిదారులు తమ వివరాలను కోవిన్ యాప్‌లో అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, పెద్దగా అవగాహనలేని వారు తమ వివరాలను కోవిన్ యాప్‌లో ఎలా అప్లోడ్ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని లక్షల మంది ఇంత తక్కువ కాలంలో అప్లోడ్ చేసుకోగలరా? పోనీ దానికి సంబంధించిన ప్రక్రియ అయినా మొదలైందా అంటే అదీ లేదు.. ఒక రకంగా ఇది లబి్ధదారుల ఇష్టానికే వదిలేశారన్న విమర్శలూ లేకపోలేదు. అనారోగ్య వ్యక్తులను గుర్తించడం కష్టమే.. ఇక 50 ఏళ్లలోపు వ్యక్తుల్లో బీపీ, షుగర్, ఇతరత్రా అనారోగ్య బాధితులకు కరోనా టీకా ఇవ్వాల్సి ఉంది. వీరిని గుర్తించడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారమని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో చాలా మందికి తమకు కనీసం బీపీ, షుగర్ ఉందన్న విషయం కూడా తెలియదు. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యమున్నా అందులో చాలామందికి కోవిన్ యాప్‌లో ఎలా అప్లోడ్ చేసుకోవాలో తెలియదు. ఈ సమస్యలను అధిగమించి జాబితా ఎలా తయారు చేయాలో కూడా అధికారులకు స్పష్టత లేదు. 50 ఏళ్ల లోపున్న అనారోగ్య బాధితులు 6 లక్షల మంది వరకు ఉండొచ్చని ఓ అంచనా. అయితే 50 ఏళ్లు పైబడినవారు, ఆలోపులో ఆరోగ్య సమస్యలున్న వారి జాబితా తయారీపై స్పష్టత లేదు. దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు అంటున్నారు. ఒకవేళ గ్రామాల్లో, పట్టణాల్లో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బందితో ఇంటింటికీ తిరిగి వారి వివరాలు సేకరించాలన్న ఇంత తక్కువ సమయంలో చేయగలరా అన్నది అనుమానమేనని చెబుతున్నారు. సక్సెస్ అయ్యేనా..? యాప్‌లో రిజిస్ట్రేషన్.. క్యూలో నిలబడి వ్యాక్సిన్ వేయించుకోవడం.. సుదూర ప్రాంతాలకు వెళ్లి టీకా పొందడం.. ఇలాంటి సంక్లిష్టతలుంటే వ్యాక్సిన్ లబ్ధిదారులు ముందుకురారన్నది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ. పైగా కరోనా వ్యాక్సిన్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. దేశంలో 53 శాతం మంది వ్యాక్సిన్‌ను వేసుకోబోమని ఇటీవల ఒక ఆన్లైన్ హెల్త్ పోర్టల్ నిర్వహించిన సర్వేలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రజల్లో ఎలాంటి అనుమానాలుంటాయో, వాటిని ఎలా నివృత్తి చేయాలో కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను లబ్ధిదారుల ఇష్టానికే వదిలేస్తే అది సక్సెస్ కాదని నిపుణులు అంటున్నారు. వ్యాక్సిన్‌కు ఒప్పించడమే సమస్యగా మారుతున్న నేపథ్యంలో ఇలాంటి సంక్లిష్టతలు వ్యాక్సినేషన్ ప్రక్రియకు అడ్డుగా మారుతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ మేధోమథనం చేస్తోంది. -
ఢిల్లీలో 51 లక్షల మందికి టీకా
న్యూఢిల్లీ: ఢిల్లీలో తొలి దశలో ప్రాధాన్యతల వారీగా 51 లక్షల మందికి కరోనా టీకా అందజేస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆయన గురువారం వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీకా స్వీకరణ, నిల్వ, పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం టీకా అందగానే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. మూడు కేటగిరీల ప్రజలకు తొలుత వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 6 లక్షల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50 ఏళ్లకుపైగా వయసున్న, 50 ఏళ్లలోపు వయసుండి వ్యాధులతో బాధపడుతున్న 42 లక్షల మందికి తొలి దశలో వ్యాక్సిన్ అందజేస్తామని వివరించారు. ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున మొత్తం 1.02 కోట్ల డోసులు ఇస్తామని పేర్కొన్నారు. . యూకే ప్రయాణికులపై నిషేధం: యూకే నుంచి తమ రాష్ట్రంలోకి ప్రయాణిలకు రాకపై మేçఘాలయ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యూకే నుంచి ఇటీవలి కాలంలో తమ రాష్ట్రానికి వచ్చిన వారి జాడ తెలియక ఉత్తరప్రదేశ్ అధికారులు హైరానా పడుతున్నారు. సదరు ప్రయాణికులు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడమే ఇందుకు కారణం. కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ లేదు.. సాక్షి, బెంగళూరు: రాత్రిపూట కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే మనసు మార్చుకుంది. ప్రకటించిన 24 గంటల్లోనే కర్ఫ్యూను ఎత్తివేసింది. కరోనా వైరస్ కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో 9 రోజులపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకుంది. కరోనా రికవరీ రేటు 95.75% దేశంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 96.93 లక్షలకు చేరుకోవడంతో రికవరీ రేటు 95.75%కి పెరిగిందని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే కొత్తగా 24,712 కరోనా కేసులు బయటపడటంతో ఇప్పటి వరకు వెల్లడైన మొత్తం కేసులు 1,01,23,778కు పెరిగినట్లు వెల్లడించింది. అదేవిధంగా, కోవిడ్‌తో మరో 312 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,46,756గా ఉంది. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 96,93,173కు చేరుకోవడంతో రికవరీ రేటు 95.75%, మరణాల రేటు 1.45%గా ఉంది. కరోనా యాక్టివ్ కేసులు 2,83,849 కాగా మొత్తం కేసుల్లో ఇవి 2.80%మాత్రమే. -
కోవాక్స్ వ్యాక్సిన్ తయారీకి అరబిందో ఓకే
బెంగళూరు, సాక్షి: యూఎస్‌కు చెందిన కోవాక్స్ రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ, సరఫరాలకు హైదరాబాద్ దిగ్గజం అరబిందో ఫార్మా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా యూబీ-612 పేరుతో అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్ తయారీ, పంపణీలను చేపట్టనున్నట్లు అరబిందో పేర్కొంది. దీనిలో భాగంగా యునిసెఫ్‌కు భారీ సంఖ్యలో వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. దేశీయంగానూ కరోనా కట్టడికి వీలుగా వ్యాక్సిన్ల తయారీ, పంపిణీకి వీలుగా ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. అయితే ఇతర వర్ధమాన దేశాలకు సంబంధించి నాన్ఎక్స్క్లూజివ్ హక్కులు లభించినట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా యూబీ-612 వ్యాక్సిన్ క్లినికల్ అభివృద్ధి, తయారీ, మార్కెటింగ్‌లను దేశీయంగా అరబిందో చేపట్టనుంది. ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం తొలి దశల క్లినికల్ పరీక్షలలో ఉన్నట్లు తెలుస్తోంది. (10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు) 2021లో.. యునైటెడ్ బయోమెడికల్ ఇంక్‌కు చెందిన కోవాక్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో చివరి దశ క్లినికల్ పరీక్షలను చేపట్టే యోచనలో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. తొట్టతొలి మల్టీటోప్ పెప్టైడ్ ఆధారిత ఈ వ్యాక్సిన్‌ను సాధారణ రిఫ్రిజిరేషన్లలో భద్రపరిచేందుకు వీలుంటుందని అరబిందో పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ 22 కోట్ల డోసేజీల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలియజేసింది. 2021 జూన్‌కల్లా 48 కోట్ల డోసేజీల తయారీకి విస్తరించనున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్ల కొనుగోలు ఆర్డర్లు లభించినట్లు కోవాక్స్ వెల్లడించింది. తద్వారా బ్రెజిల్, పెరూ, ఈక్వడార్ తదితర వర్ధమాన మార్కెట్లకు 14 కోట్ల డోసేజీలకుపైగా సరఫరా చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. -
అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే: సుచిత్ర
హైదరాబాద్, సాక్షి: దేశ ప్రజలలో సగం మందికి వ్యాక్సిన్లను అందించాలంటే కష్టమేనంటున్నారు ఒక ఇంటర్వ్యూలో భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా. 140 కోట్ల జనాభాగల దేశంలో సగం మందికి డోసేజీలను సరఫరా చేయాలంటే అత్యంత కష్టసాధ్యమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ కట్టడికి భారత్ బయోటెక్ దేశీయంగా కోవాగ్జిన్ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. క్లినికల్ పరీక్షలలో ఉన్న కోవాగ్జిన్ వ్యాక్సిన్లను కంపెనీ ఇప్పటికే 10 మిలియన్లు తయారు చేసినట్లు తెలియజేశారు. వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లో విడుదల చేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. కంపెనీ వార్షిక సామర్థ్యం 30 కోట్ల డోసేజీలుకాగా.. తొలి 10 కోట్ల డోసేజీలను ప్రభుత్వానికి అందించనుంది. వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రభుత్వం పాక్షికంగా నిధులు అందించినట్లు సుచిత్ర పేర్కొన్నారు. తొలి దశలో మరో రెండు దేశాలకు సైతం వ్యాక్సిన్లను అందించవలసి ఉన్నట్లు చెప్పారు. అయితే దేశాల పేర్లను వెల్లడించలేదు. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) వ్యాక్సిన్ల వినియోగంతో రెండోదశలో భాగంగా ప్రపంచ దేశాలలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందిస్తున్న రెండు డోసేజీల వ్యాక్సిన్ల వినియోగం ద్వారా ప్రయత్నించవచ్చని ఫార్మా వర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి. బ్రిటిష్, స్వీడిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ దేశీయంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విషయం విదితమే. ఇక మరోపక్క వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్ 6-7 కోట్ల డాలర్లను(సుమారు రూ. 500 కోట్లు) వెచ్చిస్తోంది. ఈ వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షలకు 26,000 మంది వొలంటీర్లను ఎంపిక చేసుకుంది. 2021 మే లేదా జూన్‌లో వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతులు లభించగలవని భావిస్తున్నట్లు సుచిత్ర చెప్పారు. ఏడాది.. రెండేళ్లలోగా కనీసం మూడో వంతు ప్రజలకు వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసే వీలున్నట్లు అంచనా వేశారు. -
వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం రావొచ్చు
దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ స్వచ్ఛందమేనని.. టీకా వేసుకోవాలంటూ ఎవరినీ ఒత్తిడి చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ టీకా వేసుకోవడం మంచిదని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఇతరులకు వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించింది. టీకా వేసుకోదలచిన వారు మాత్రం తప్పనిసరిగా సంబంధిత షెడ్యూల్ పాటించాలని పేర్కొంది. సాక్షి, హైదరాబాద్ : దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ స్వచ్ఛందమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీకా వేసుకోవాలంటూ ఎవరినీ ఒత్తిడి చేయబోమని తేల్చి చెప్పింది. అయితే వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ టీకా వేసుకోవడం మంచిదని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఇతరులకు వైరస్ సోకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించింది. టీకా వేసుకోదలచిన వారు మాత్రం తప్పనిసరిగా సంబంధిత షెడ్యూల్ పాటించాలని పేర్కొంది. అతితక్కువ సమయంలోనే పలు సంస్థలు ప్రయోగాలు చేపట్టి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలో టీకా సమర్థత, భద్రతపై నెటిజన్లు వెలిబుచ్చిన సందేహాలు, వ్యక్తం చేసిన అనుమానాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఈ మేరకు నివృత్తి చేసింది. ప్రజల అనుమానాలను ప్రశ్న–జవాబుల రూపంలో వెబ్సైట్లో పొందుపరిచింది. దేశంలో ప్రవేశపెట్టబోయే వ్యాక్సిన్ ఇతర దేశాలు అభివృద్ధి చేసిన టీకాల్లాగానే ప్రభావవంతంగా పనిచేస్తుందని భరోసా ఇచ్చింది. భద్రమని తేలాకే పంపిణీ... కరోనా వ్యాక్సిన్ వాడకం భద్రమని తేలాకే దాని పంపిణీ చేపడతామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. టీకా సమర్థత, భద్రతపై నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు లభించాకే దాన్ని ప్రజలకు అందిస్తామని వెల్లడించింది. టీకాల విషయంలో భారత్ ఎంతో అనుభవం కలిగి ఉందని, 2.60 కోట్ల మందికిపైగా నవజాత శిశువులు, 2.90 కోట్ల మంది గర్భిణులకు టీకాలు వేయడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశమని కేంద్రం పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే... ‘‘టీకాలు వేయించుకోదలచిన వారు తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకుంటే వ్యాక్సిన్ పొందడానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకొనేటప్పుడు ఫొటో గుర్తింపు కార్డు అవసరం. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన పాస్‌బుక్‌లు, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, పెన్షన్ డాక్యుమెంట్ తదితర వాటిలో ఏదో ఒక దాని వివరాలు రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లబ్ధిదారుడి మొబైల్ నంబర్‌కు నిర్ణీత తేదీ, వ్యాక్సిన్ కేంద్రం ఉన్న ప్రదేశం, టీకా సమయం వివరాలతో ఎస్ఎంఎస్ అందుతుంది. టీకా కేంద్రం వద్ద కూడా ఈ ఎస్ఎంఎస్ చూపించాలి. వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా లబ్ధిదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. వ్యాక్సిన్ అన్ని డోసులను పొందిన తరువాత వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు క్యూఆర్ కోడ్ ఆధారిత సర్టిఫికెట్ కూడా పంపుతాం’’ అని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం రావొచ్చు... ‘‘కరోనా టీకా వేసుకుంటే కొందరిలో తేలికపాటి జ్వరం, ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి మొదలైనవి రావచ్చు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను ఆదేశించాం. టీకా వేసుకున్నాక అరగంటపాటు టీకా కేంద్రంలోనే విశ్రాంతి తీసుకోవాలి. అసౌకర్యంగా అనిపిస్తే అధికారులు, ఆశ/ఏఎన్ఎంలకు తెలియజేయాలి. షెడ్యూల్ పూర్తి చేయడానికి ఒక వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాలి. రెండు డోస్‌లు వేసుకున్న రెండు వారాల తర్వాత శరీరంలో సాధారణంగా యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. కరోనా ఉన్న వారికి వ్యాక్సిన్ కుదరదు.. కరోనా ఉన్న వ్యక్తులకు ఆ సమయంలో టీకా వేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఎందుకంటే సంబంధిత వ్యక్తి టీకా కేంద్రానికి వస్తే ఇతరులకు వ్యాపింపజేసే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. అలాంటి వారు కోలుకున్న తర్వాత అంటే 14 రోజుల తర్వాత టీకా తీసుకోవచ్చని సూచించింది. మరోవైపు కరోనా టీకా వేసుకున్న తరువాత కూడా ప్రజలు మాస్క్‌లు ధరించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. చేతులు శుభ్రపరుచుకోవాలని, భౌతికదూరం నిబంధనను పాటించాలని సూచించింది. తొలుత కరోనా వారియర్లకే... టీకా పంపిణీ ప్రారంభ దశలో పరిమితమైన సరఫరా కారణంగా మొదట కరోనాపై ముందుండి పోరాడుతున్న వారికి అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ముందుగా టీకా ఇస్తామని పేర్కొంది. అలాగే ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఇస్తామని వివరించింది. తరువాతి దశల్లో అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యంగల వ్యక్తులను అధిక ప్రమాదవర్గంగా పరిగణించి టీకా అందించనుంది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 50 ఏళ్లలోపు అనారోగ్యాలతో ఉన్న వారికి కూడా ఇస్తామని కేంద్రం వివరించింది. 50 ఏళ్లకుపైగా వయసుగల వారిని రెండు ఉప గ్రూపులుగా విభజించారు. ఉప గ్రూప్‌లో 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్న వారిని, రెండో ఉప గ్రూప్‌లో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసుగల వారిని చేర్చారు. -
వారందరికీ మొదటి విడతలో వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో 50 ఏళ్లు దాటినవారు 60 లక్షల మంది ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. వారందరికీ మొదటి విడతలో వ్యాక్సిన్ వేయనుంది. ప్రాధాన్యక్రమంలో తొలుత ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య, ఆరోగ్య సిబ్బంది, కోవిడ్‌పై ముందు వరుసలో ఉండి పోరాడే పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులకు వేస్తారు. తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడే 50 ఏళ్లలోపు వారికి కూడా మొదటి విడతలోనే టీకా వేస్తారు. ఇప్పటికే 2.67 లక్షల మంది వైద్య సిబ్బంది జాబితా తయారు చేశారు. మిగిలినవారిలో 50 ఏళ్లు పైబడినవారిని ఓటర్ జాబితా ప్రకారం గుర్తించి వ్యాక్సిన్ వేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఓటర్ కార్డులపై పుట్టిన తేదీ ఉంటుంది. ఆ వివరాలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా 50 ఏళ్లు దాటిన వారి జాబితాను తయారు చేయొచ్చని అధికారులు తెలిపారు. ఇక అనారోగ్యాలతో బాధపడే 50 ఏళ్లలోపు వారంతా కోవిన్ యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు చెప్పారు. జిల్లాకో వ్యాక్సిన్ కేంద్రం కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తే అప్పుడు వేసేం దుకు ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రెండ్రోజులపాటు ఎంపిక చేసిన జిల్లా వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేకంగా వ్యాక్సిన్ కేంద్రం(స్టాక్ పాయిం ట్) ఏర్పాటు చేయనున్నారు. అక్కడినుంచే అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. అలాగే జిల్లాకో వ్యాక్సిన్ వ్యాన్‌ను అన్ని రకాల సదుపాయాలతో ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. కోవిడ్ టీకా తీసుకునే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కేంద్రాలకు రావాల్సిందేనని వైద్య,ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అలా రాలేని వృద్ధులు, మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులను టీకా కేంద్రాలకు తీసుకువచ్చే బాధ్యతను ఇతర శాఖలకు అప్పగించారు. వైద్య, ఆరోగ్యశాఖకు 20 ఇతర శాఖలు దీంట్లో సహకరిస్తాయి. ఒక్క రోజులోనే వైద్య సిబ్బంది అందరికీ... వ్యాక్సినేషన్ ప్రారంభమైన మొదటి రోజే 8 గంటల్లో 2.67 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకా వేస్తారు. అందుకోసం మూడు వేల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి కూడా వారి వద్దకే వెళ్లి ప్రభుత్వ సిబ్బందే టీకాలు వేయనున్నారు. తామే టీకా వేసుకుంటామని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కోరినా ఒప్పుకోబోమని వైద్యాధికారులు స్పష్టం చేశారు. వారి భాగస్వామ్యాన్ని టీకా కార్యక్రమంలో తీసుకునే ప్రసక్తే లేదన్నారు. దానివల్ల దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందన్నారు. కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు కోవిడ్ టీకా వేసేందుకు 50 వేల మందికి శిక్షణ ఇస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కేంద్రాల్లో టీకాలిస్తాం. ఆ కేంద్రాలెక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పుడు కసరత్తు చేస్తున్నాం. వైద్య సిబ్బందికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే టీకాలు వేస్తారు. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సివుంది. ఇందుకు పాఠశాలలు, కమ్యూనిటీ కేం ద్రాలు, పంచాయతీ ఆఫీస్‌లను ఎంపిక చేస్తాం. టీకా ఎప్పుడు వచ్చినా వేసేందుకు జనవరి ఒకటి నాటికి సన్నద్ధంగా ఉంటాం. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకులు -
మొదటి విడత టీకా వేసేది వీరికే..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టీకా అందజేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి టీకా వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి జాబితాను తయారు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది జాబితాను తయారు చేయగా.. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఫ్రంట్లైన్లో పనిచేసే వారు, 50 ఏళ్లు దాటిన వారు, అనారోగ్య సమస్యలున్న వారి జాబితా తయారు చేయాల్సి ఉంది. జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది జాబితా వైద్య, ఆరోగ్య శాఖకు చేరింది. ఆ జాబితాను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేట్ ఆసుపత్రులే ఎక్కువగా ఉండగా, అదేస్థాయిలో సిబ్బంది ప్రైవేట్‌లోనే ఎక్కువున్నారు. మొత్తం రాష్ట్రంలో 7,225 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2,67,246 వైద్య సిబ్బందికి టీకా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ధారించారు. అందులో 1,119 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1,25,007 మంది.. 6,106 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,42,239 మంది ఉన్నారు. వీరందరి సమాచారాన్ని కోవిడ్ యాప్‌లో పొందుపరిచినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఇటు పోలీసులు, పారిశుద్ధ్య, రవాణా తదితర ఫ్రంట్ లైన్ సిబ్బంది జాబితాను కూడా సేకరిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు స్వచ్ఛందంగా కొవిన్ యాప్‌లో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవడానికి త్వరలో అవకాశం కల్పిస్తారు. హైదరాబాద్‌లోనే అత్యధికంగా.. అన్ని జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వైద్య సిబ్బంది ఉన్నారు. ఇక్కడ 166 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16,516 మంది ఉండగా, 970 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 60,288 మంది ఉన్నారు. మొత్తంగా నగరంలోని 76,804 ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బందికి వ్యా క్సిన్ వేస్తారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 59 ప్రభుత్వ ఆసుప త్రుల్లో 5,899, 803 ప్రైవేటు ఆసుపత్రుల్లో 19,312 మందితో జాబితా తయారైంది. ఇటు అతి తక్కువగా వైద్య సిబ్బంది ఆది లాబాద్, ఆసిఫాబాద్, గద్వాల, మంచిర్యాల జిల్లాల్లో ఉన్నారు. ఈ జాబితాను మరోసారి సరిచూసుకొని తుది జాబితాను తయారు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
వ్యాక్సిన్ వేసేందుకు 10 వేల బృందాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ రాష్ట్రానికి చేరుకున్న వెంటనే బాధితులకు వేసేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం 30 వేల మంది వైద్య సిబ్బందికి జిల్లాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు కోవిడ్ వ్యాక్సిన్ ఇన్చార్జి, ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే రెండ్రోజులు రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వారు ప్రతి జిల్లాలో ఏడుగురికి శిక్షణ ఇస్తారు. అనంతరం వారు ఎంపిక చేసిన 30 వేల మంది ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు, నర్సులకు శిక్షణ ఇస్తారు. ఈ నెల 14 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, 20 లోపు అందరికీ శిక్షణ పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేం దుకు 10 వేల బృందాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో బృందంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్త, నర్సు ఉంటారు. అలా 10 వేల బృందాలు.. అందులో మొత్తం 30 వేల మంది ఉంటారు. వీరికి శిక్షణ ఇస్తూనే.. ఎంపిక చేసిన డాక్టర్లకు కూడా శిక్షణనిస్తారు. వ్యాక్సిన్ ఎక్కడైనా వికటించి సమస్య తలెత్తితే ఆ మేరకు చికిత్స అందించేలా డాక్టర్లు ఉంటారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఉన్న వైద్యులకూ శిక్షణ ఉంటుంది. పోలీసు, రవాణా సిబ్బందికి కూడా..: వైద్య సిబ్బందితో పాటు వ్యాక్సిన్‌లో పాలుపంచుకునే వారికి కూడా శిక్షణ ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటిం చింది. ఈ మేరకు ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఏదేమైనా ఈ నెల 20 లోపు శిక్షణ పూర్తి చేస్తారు. ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే నెల రెండో వారంలో రాష్ట్రానికి వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయి. ఫ్రంట్‌లైన్ కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి జాబితా తయారు చేసే పనిలో వైద్య, ఆరోగ్య శాఖ నిమగ్నమైంది. వీరి పేర్ల నమోదుకు వైద్య, ఆరోగ్య శాఖ ఒక యాప్‌ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని దాదాపు 3 లక్షల మంది జాబితా దాదాపు ఖరారైంది. -
ఏ వ్యాక్సిన్ అయినా 5 రోజుల్లో డెలివరీ
న్యూయార్క్: కొరియర్ సర్వీసుల దిగ్గజం డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలో ఏ దేశానికైనా 1 నుంచి 5 రోజుల్లోగా వ్యాక్సిన్లను అందించగలమంటూ తాజాగా పేర్కొంది. తమ సర్వీసులు విస్తరించిన 220 దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్లను డెలివరీ చేయగలమని తెలియజేసింది. మైనస్ 75 డిగ్రీలలోనూ వ్యాక్సిన్ల రవాణాకు సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు విదేశీ మీడియా పేర్కొంది. కొద్ది నెలలుగా ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో ఇటీవల భారీగా విస్తరిస్తున్న విషయం విదితమే. దీంతో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఎమర్జెన్సీ ప్రాతిపదికన యూకే ప్రభుత్వం తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను -75 సెల్షియస్‌లో నిల్వ చేయవలసి ఉండటంతో డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ సన్నాహాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: (దేశీ రోడ్లపై కేటీఎం ప్రీమియం సైకిళ్లు!) ఎక్కడి నుంచైనా తమ సర్వీసులు విస్తరించిన 220 దేశాలలో రోజువారీ ప్రాతిపదికన వ్యాక్సిన్లను సరఫరా చేయగలమని డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ సీఈవో జాన్ పియర్సన్ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో అయితే ప్రపంచవ్యాప్తంగా ఏదేశం నుంచి ఏదేశానికైనా 1-5 రోజుల వ్యవధిలో డెలివరీలు పూర్తిచేస్తుంటామని తెలియజేశారు. ఈ బాటలో కోవిడ్-19 వ్యాక్సిన్లను సైతం రవాణా చేయగలమని తెలియజేశారు. ఉదాహరణకు జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామయ్ంలో ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను -75 సెల్షియస్‌లో రవాణా చేయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. ఇందుకు కంపెనీకి చెందిన వేర్‌హౌస్‌లు తదితర సప్లై చైన్ నెట్వర్క్ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రవాణాలో భాగంగా రీఐసింగ్ స్టేషన్ల ద్వారా రీఐస్ ప్యాకేజ్ చేసేందుకు వసతులున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్లను ఎక్కడినుంచైనా అంటే ప్రభుత్వ గిడ్డంగులు, ఆసుపత్రులు, వ్యక్తులు.. ఇలా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా ఐదు రోజుల్లో సరఫరా చేయగలమని వివరించారు. గత రెండు దశాబ్దాలుగా మెడికల్ ఎక్స్‌ప్రెస్ పేరుతో క్రిటికల్ ప్రొడక్టులు, మెడికల్ యాక్సెసరీలను రవాణా చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
ఉచిత వ్యాక్సిన్‌పై ప్రధాని వైఖరి ఏంటి?: రాహుల్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందించటం గురించి కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 95.3 లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసిన కోవిడ్-19 మహమ్మారి వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ‘ప్రధాని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఎన్డీఏ అదికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు, వ్యాక్సిన్ అందరికీ ఇస్తామని ఎన్నడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఇంతకీ ప్రధాని వైఖరి ఏంటి’? అని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. కాగా వైరస్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేస్తే దేశంలోని మొత్తం జనాభాకు వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం లేదని మంగళవారం కేంద్రం వెల్లడించింది. అలాగే దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ఎన్నడూ చెప్పలేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్న మూడు ముఖ్యమైన ఫార్మా సంస్థలను ప్రధాని మోదీ సందర్శించిన మూడు రోజుల తరువాత భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. " భారత పౌరులందరికి వ్యాక్సిన్ అందించే ప్రయత్నంలో భాగంగా సన్నాహాలు, సవాళ్లు, రోడ్‌మ్యాప్ రూపొందించడం" ఈ పర్యటన ముఖ్య ఉద్ధేశ్యమని ప్రధాని కార్యాలయం తెలిపింది. కానీ ఉచిత వ్యాక్సిన్ హామీని ఎన్నికల్లో బీజేపీ ఉపయోగించుకొని ఇప్పుడు విరమించుకుందని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ భారత్‌లో కొనసాగుతోంది. ఇప్పటికీ గణనీయ సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 35,551 మంది కోవిడ్ బారిన పడగా, 526 మరణాలు సంభవించినట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 95,34,965 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1,38,648కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 4,22,943గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం బాధితులు 89,73,373 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నట్లు సమాచారం. -
కోట్లాదిమందికి వ్యాక్సినేషన్ ఎలా?
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది వేసవికి ముందే వస్తుందనే అంచనాలున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వాటి పంపిణీ ఎలా ? 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో అందరికీ వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది ? కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వచ్చే ఏడాది వేసవినాటికి 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనాలున్నాయి. ఈ రేసులో ఫైజర్, మోడెర్నా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ముందున్నాయి. ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని, సామర్థ్యంగా పని చేస్తాయని తేలితే భారత్‌లో 130 కోట్లకు పైగా ప్రజలకి వ్యాక్సినేషన్ చేయడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్. ఈ సవాళ్లను అధిగమించడానికి చాలా రోజులుగా కేంద్రం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. బ్లాక్ మార్కెట్లు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూస్తూ ఉండడంతో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో బ్లాక్ మార్కెట్లు విజృంభిస్తున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇచ్చే టీకా చుట్టూ వ్యాపారం జరక్కుండా కేంద్రం చర్యలు తీసుకోవడం అతి పెద్ద సమస్య. వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీలో అవినీతికి తావు లేకుండా చూడడం అతి పెద్ద సవాలని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలు ప్రపంచదేశాల్లో టీకా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించే దేశం మనదే. టీకా పంపిణీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. భారత్‌లో 27 వేల కోల్డ్ స్టోరేజీ చైన్లు ఉన్నాయి. కానీ కోట్లాది మందికి వ్యాక్సినేషన్ కోసం ఈ కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు సరిపోవు. అందులోనూ మోడెర్నా వ్యాక్సిన్ మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ చేయాలి. మన దేశంలో వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద నిల్వ చేస్తూ ఉంటాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, దేశీయంగా తయారయ్యే భారత్ బయోటెక్ వ్యాక్సిన్లను సాధారణ రిఫ్రిజిరేటర్లలోనూ నిల్వ చేస్తే సరిపోతుంది. అందుకే ప్రభుత్వం ఈ రెండు వ్యాక్సిన్లపైనే దృష్టి సారించింది. టీకా ప్రాధాన్యాలు టీకా అందుబాటులోకి వస్తే తొలుత ఎవరికివ్వాలి అన్న సవాల్ ఎదుర్కోవడం అత్యంత సంక్లిష్టమైనది. ప్రాణాలను పణంగా పెట్టి అహరహం శ్రమిస్తున్న ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యమని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఆ తర్వాత 50–65 ఏళ్ల మధ్య వయసున్నవారికి, ఆ తర్వాత 50 ఏళ్లలోపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కానీ వీరి జాబితా తయారు చేయడం శక్తికి మించిన పని. అందుకే ఎవరికి ముందు టీకా ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించడానికి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. టీకా ఇవ్వడంలో వివక్ష చూపించారన్న విమర్శలు రాకుండా ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కరోనా వ్యాక్సినేషన్‌కి అవసరమయ్యే ఆర్థిక వనరులు మన ముందున్న అతి పెద్ద సవాల్. కరోనా వ్యాక్సిన్ ఏ సంస్థదైనా నెల రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు డోసులకి కలిపి భారత్‌లో వెయ్యి రూపాయలుగా ధర నిర్ణయించినట్టుగా ఇప్పటికే ఆక్స్ఫర్డ్ –ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి ప్రభుత్వమే ఈ టీకాలను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందా ? లేదంటే రాయితీపై అందిస్తుందా అన్నది అది పెద్ద ప్రశ్న. టీకాపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయడం ప్రభుత్వానికి శక్తికి మించిన భారమే. అందుకే భారత్‌లో రూ.50 లోపు టీకా ధర నిర్ణయించి, ఒక్క డోసు ఇచ్చేలా వ్యాక్సిన్‌ను రూపొందిస్తే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఆరోగ్యరంగ నిపుణుడు గగన్‌దీప్ అభిప్రాయపడుతున్నారు. ఆశలు రేపుతున్న వ్యాక్సిన్లు ఇవే..! ► అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ 95% సురక్షితంగా పనిచేస్తోంది ► ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ 95% సురక్షితమని తేలింది. దీనికి బ్రిటన్ ప్రభుత్వం ఓకే చెప్పింది. ► యూకేకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వృద్ధుల్లో కూడా బాగా పని చేస్తోంది. ► రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది. ► భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ కొవాగ్జిన్ పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ ప్రయోగాల్లో ఉంది ► యూకేకి చెందిన నోవావాక్స్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా కూడా ఈ వ్యాక్సిన్ కోసం నిధులు అందిస్తోంది. ► అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్ వ్యాక్సిన్ కూడా ఆశాజనక ఫలితాలు ఇస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఈ వ్యాక్సిన్ కోసం నిధులు సమకూరుస్తోంది. -
నేడు మూడు నగరాలకు మోదీ
అహ్మదాబాద్/పుణె/సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను భయపెడుతున్న వేళ అందరూ వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వివిధ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకోవడంతో తాజా పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించనున్నారు. ప్రధాని స్వయంగా శనివారం ఈ మూడు నగరాలకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ పురోగతిని సమీక్షిస్తారని పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియను సమీక్షిస్తారు. శనివారం ఆయన అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌ని, హైదరాబాద్‌లో భారత్ బయోటెక్, పుణెలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు’’ అని ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్లో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు దాదాపుగా పూర్తి కావస్తూ ఉండడంతో శాస్త్రవేత్తలతో స్వయంగా ప్రధాని మోదీ మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకోనున్నారు. దీని వల్ల భారత్‌లో వంద కోట్లకు పైగా జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమయ్యే మార్గదర్శకాల రూపకల్పన చేసుకోవచ్చునని పీఎంఓ తెలిపింది. మొదట అహ్మదాబాద్‌కు.. శనివారం ఉదయం తొలుత గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ప్లాంట్‌ను మోదీ సందర్శించనున్నారు. అహ్మదాబాద్‌కి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌కి మోదీ 9.30కి చేరుకుంటారని గుజరాత్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జైడస్ తయారు చేస్తున్న జికోవ్–డి వ్యాక్సిన్ ప్రస్తుతం రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో హకింపేటలోని సైనిక విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారత్ బయో టెక్ కు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తారు. భారత్ స్వదేశీయంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉంది. దీని గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రధాని అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరానికి వస్తుండడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ పర్యటన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి వెళతారు. ఆస్ట్రాజెనికా–ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ఇక్కడ తయారవుతోంది. సాయంత్రం ప్రధాని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. కలిసి పనిచేద్దాం.. సవాళ్లను ఎదుర్కొందాం కరోనా మహమ్మారిపై పోరాటంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, రక్షణ వంటి కీలక అంశాల్లో పరస్పరం సహకరించుకుందామని భారత్, బ్రిటన్ ప్రధానులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ నిర్ణయించుకున్నారు. కలిసి పని చేస్తూ ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొందామని తీర్మానించుకున్నారు. మోదీ శుక్రవారం జాన్సన్‌తో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య సహకారం పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్ విసురుతున్న సవాళ్లతోపాటు వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో సహకారంపై సమీక్షించారు. భాగస్వామ్యంపై రోడ్‌మ్యాప్ రూపకల్పన వేగవంతం చేయాలని నిర్ణయించారు. -
భారత్‌కు మోడర్నా వ్యాక్సిన్!
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి యూఎస్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ పేద, మధ్యాదాయ దేశాలకు అందే వీలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాలతో చర్చలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. అయితే ఇండియాపేరు ప్రస్తావించనప్పటికీ.. కోవాక్స్తోనూ డీల్ కుదుర్చుకునే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవాక్స్ ద్వారా పేద, మధ్యాదాయ దేశాలకూ వ్యాక్సిన్‌ను సరఫరా చేసేందుకు వీలు చిక్కనున్నట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. ఇటీవల తమ వ్యాక్సిన్ 94.5 శాతం విజయవంతమైనట్లు మోడర్నా ఇంక్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తుది దశ పరీక్షల ప్రాథమిక డేటా ప్రకారం ఈ వివరాలు ప్రకటించింది. ఫలితంగా ఎమర్జెన్సీ ప్రాతిపదికన వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించవలసిందిగా యూఎస్ఎఫ్డీఏకు దరఖాస్తు చేయనున్నట్లు తెలియజేసింది. ఇప్పటికైతే కోవాక్స్‌తో ఎలాంటి ఒప్పందాన్నీ కుదుర్చుకోదని మోడర్నా వెల్లడించింది. అయితే వీటి ద్వారా ప్రపంచంలో అత్యధిక జనాభాకు వ్యాక్సిన్ అందే వీలుంటుందని అభిప్రాయపడింది. ఇండియాలో పంపిణీకి సంబంధించి కొన్ని కంపెనీలతో చర్చలు చేపట్టినప్పటికీ ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రూమ్ టెంపరేచర్‌లోనూ మెసెంజర్ ఆర్ఎన్ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన తమ వ్యాక్సిన్ 2-8 డిగ్రీల సెల్షియస్లోనూ 30 రోజులపాటు నిల్వ చేయవచ్చని మోడర్నా పేర్కొంది. అంతేకాకుండా సాధారణ రూమ్ టెంపరేచర్‌లోనూ 12 గంటలపాటు వ్యాక్సిన్ నిలకడను చూపగలదని చెబుతోంది. అయితే దీర్ఘకాలిక నిల్వ, రవాణాలు చేపట్టాలంటే మైనస్ 20 డిగ్రీల సెల్షియస్‌లో ఉంచవలసిన అవసరముందని వివరించింది. ఈ ఏడాది చివరికల్లా 2 కోట్ల డోసేజీల వ్యాక్సిన్లను యూఎస్‌కు అందించనున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాదిలో 50-100 కోట్ల డోసేజీలు సిద్ధం చేయగలమని భావిస్తున్నట్లు వెల్లడించింది. మోడర్నా వ్యాక్సిన్ ఒక్కో డోసేజీ విలువ 25-37 డాలర్ల మధ్య ఉండవచ్చని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ రెండు డోసేజీలలో వినియోగించవలసి ఉంటుంది. దీంతో దేశీయంగా అత్యంత ఖరీదైన వ్యాక్సిన్‌గా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ నిల్వ, రవాణా తదితర అన్ని ఖర్చులూ కలిపి రూ. 4,000-6,000 మధ్య ధర ఉండవచ్చని అంచనా వేశారు. -
వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రజలకు ప్రాధాన్యతా క్రమంలో అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోది మంగళవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వచ్చాక దాన్ని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలను చెప్పారు. ‘వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శాస్త్రీయంగా ఆమోదించిన వ్యాక్సిన్‌ను ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు అందించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి అనుగుణమైన కార్యాచరణను రూపొందించాం. వ్యాక్సిన్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా అనేదీ పరిగణనలోకి తీసుకోవాలి. దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులున్నాయి. కరోనా వైరస్ కూడా దేశమంతటిపై ఒకే రకమైన ప్రభావం చూపలేదు. వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన సైడ్ఎఫెక్ట్స్ ఇచ్చే అవకాశముంది. అందువల్ల మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమందికి ఇవ్వాలి. 10 – 15 రోజులు పరిస్థితిని పరిశీలించాక మిగతా వారికి ఇవ్వాలి’అని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రజ్వీ, మెడికల్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి, హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యుడు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత వీరికే వ్యాక్సిన్ ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్‌పై పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్లు దాటిన వారికి, తీవ్ర జబ్బులతో బాధపడుతున్న వారికి మొదట వ్యాక్సిన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. దీని కోసం జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. వ్యాక్సిన్ సరఫరాకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. -
వ్యాక్సిన్ పంపిణీకి నిర్దిష్ట ప్రణాళిక
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై సరైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలనే దానిపై దృష్టి పెట్టాలని, వ్యాక్సిన్ సంబంధిత అంశాలపై కూడా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. మంగళవారం తిరుమల, తిరుపతి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులకు స్వాగతం పలికిన అనంతరం నేరుగా గన్నవరం విమానాశ్రయం, అక్కడి నుంచి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సీఎం జగన్.. కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీ నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు, వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. నిర్దిష్ట ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌ను నిల్వ చేయడంతో పాటు అదే ఉష్ణోగ్రతలో మారుమూల ప్రాంతాలకు దాన్ని తరలించడం కీలకమని చెప్పారు. దీనిపై కూడా నిర్దిష్ట ప్రణాళిక ఉండాలని సూచించారు. ఆయా అంశాలపై సాంకేతిక సమాచారం సేకరించాలని, వివిధ కంపెనీల నుంచి కూడా సంబంధిత సమాచారం తీసుకుని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా వ్యాక్సిన్ తయారీ, పంపిణీ ప్రాధాన్యతలు, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై ప్రధాని మోదీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులతో చర్చించారు. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ముందుగా మనకే!
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడికి బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ను తొలుత దేశీయంగా పంపిణీ చేసేందుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ అదార్ పూనావాలా తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు వీలుగా వ్యాక్సిన్ల కొనుగోలుకి దేశీ ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తద్వారా 2021 ఏప్రిల్‌కల్లా తొలి బ్యాచ్‌ను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 70 శాతం సత్ఫలితాలను సాధించిన తమ వ్యాక్సిన్ 90 శాతాన్ని సైతం అధిగమించనున్నట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి లభించవచ్చని భావిస్తున్నట్లు పూనావాలా చెప్పారు. ఫలితంగా ఫిబ్రవరి, మార్చిలలో పూర్తిస్థాయి అనుమతులకు వీలుండవచ్చని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌కు త్వరితగతిన అనుమతి పొందేందుకు ప్రయత్నించనున్నట్లు ఆస్ట్రాజెనెకా ఇటీవల తెలియజేసింది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేయడం ద్వారా తక్కువ ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు వివరించింది. పంపిణీ సులభం దేశీ మార్కెట్లలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రూ. 1,000 స్థాయిలో్ ఉండవచ్చని, అయితే ప్రభుత్వం భారీ పరిమాణంలో కొనుగోలు చేయడం ద్వారా మరింత చౌకగా అందించేందుకు వీలుంటుందని పూనావాలా ఇటీవల పేర్కొన్నారు. 2021 జులైకల్లా సీరమ్ ఇన్స్టిట్యూట్కు 40 కోట్ల డోసేజీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యమున్నట్లు తెలియజేశారు. కాగా.. ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ యూకేలో అనుమతి పొందితే.. అత్యవసర వినియోగానికి దేశీయంగానూ ఔషధ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్‌లో నిల్వ చేసేందుకు వీలుండటంతో దేశీ మార్కెట్లో సులభంగా పంపిణీ చేయవచ్చని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి. చౌకలో యూఎస్ కంపెనీల వ్యాక్సిన్లతో పోలిస్తే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ చౌకలో లభించగలదని రష్యా పేర్కొంటోంది. అంతేకాకుండా తమ వ్యాక్సిన్ సులభంగా నిల్వ చేయడంతోపాటు.. పంపిణీకీ వీలుంటుందని చెబుతోంది. యూఎస్ దిగ్గజాలలో ఫైజర్, మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్లు రెండు డోసేజీలలో వినియోగించవలసి ఉంటుందని పేర్కొంది. కాగా.. ఫైజర్ ఇంక్ వ్యాక్సిన్ ధరను 19.5 డాలర్లుగా తొలుత తెలియజేసింది. అంటే రెండు డోసేజీలకు కలిపి 39 డాలర్లు వ్యయంకాగలదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదేవిధంగా మోడర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ ధర మరింత అధికంగా 50-74 డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
15 ఏళ్ల కాలం మనకు అత్యంత కీలకం
న్యూఢిల్లీ: భారత్‌లాంటి యవ్వన ప్రజాస్వామ్య దేశానికి 2014 నుంచి 2029 వరకు.. 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభ వరకు.. 15 ఏళ్ల కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధిలో ఆరేళ్ల కాలం చరిత్రాత్మకమని తెలిపారు. మిగిలిన 9 ఏళ్లలో చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు 16, 17, 18 ఏళ్ల ప్రాయం చాలా ముఖ్యమని, అలాగే 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభల వరకు కాలం మనదేశానికి అత్యంత కీలకమని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధానిలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 16వ లోక్‌సభ(2014–19) కాలం దేశ ప్రగతిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 17వ లోక్‌సభ కాలంలో ఇప్పటిదాకా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఇవన్నీ చరిత్రలో ఒక భాగమేనని తెలిపారు. అనుకున్నవన్నీ గడువులోగా పూర్తి చేయాలి ప్రస్తుత దశాబ్దంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వచ్చే లోక్‌సభ(2024–29) కాలం ప్రధానమైన పాత్ర పోషించబోతోందని విశ్వసిస్తున్నట్లు ప్రధాని అన్నారు. దేశాభివృద్ధిలో భాగంగా మనం సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ప్రజల మైండ్‌సెట్ మారింది 130 కోట్ల మంది ప్రజల కలలను నిజం చేసే వనరులు, గట్టి సంకల్పం మనకు ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వయం సమృద్ధి అనే లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉందని వివరించారు. దేశ ప్రజల మైండ్‌సెట్ మారిందనడానికి 16వ లోక్‌సభ ఒక ఉదాహరణ అని అన్నారు. 16వ లోక్‌సభలో 300 మందికిపైగా ఎంపీలు తొలిసారిగా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రస్తుత లోక్‌సభలో ఉన్న ఎంపీల్లో 260 మంది ఎంపీలు మొదటిసారిగా ఎన్నికైన వారేనని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. నేడు సీఎంలతో భేటీ ప్రధాని మోదీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో నేడు రెండు వేర్వేరు వర్చువల్ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటగా ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాలతో సమావేశం జరుపనున్నారు. వీటిలో కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇందులో ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ పంపిణీ గురించి చర్చించనున్నారు. కరోనాపై ప్రధాని మోదీ రాష్ట్రాలతో ఇప్పటికే వర్చువల్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
90 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 45,882 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,04,365కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 584 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,162కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శుక్రవారానికి 84.28 లక్షలకు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.6 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,43,794గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.92 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. రాష్ట్రాలకు అత్యున్నత స్థాయి బృందాలు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పలు రాష్ట్రాలకు కేంద్రం నుంచి అత్యున్నత స్థాయి బృందాలు వెళ్లి సమీక్షించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం చెప్పింది. ఇప్పటికే హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మణిపూర్‌లలోని కొన్ని జిల్లాలకు ఈ బృందాలు వెళ్లాయని చెప్పింది. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లోని జిల్లాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బృందాలు వెళ్లనున్నాయని పేర్కొంది. ఈ బృందాలు కంటెయిన్మెంట్ జోన్లను బలోపేతం చేయడం, సమీక్షించడం, పరీక్షలు, క్లినికల్ మేనేజ్మెంట్ వంటివాటిపై సలహాలు, సూచనలు ఇస్తాయని తెలిపింది. అహ్మదాబాద్‌లో కర్ఫ్యూ.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల (నవంబర్ 20–23) వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్పష్టం చేశారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించే పరిస్థితి ఉండబోదన్నారు. నిబంధనలు పాటించకుండా తిరిగే వారిపై కఠిన చర్యలుంటాయన్నారు. ‘టీకా’పై ప్రధాని సమీక్ష భారత్‌లో కరోనా టీకా పంపిణీ ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్షించారు. టీకా పంపిణీ ప్రక్రియలో భాగస్వామ్యులను చేయాల్సిన సంస్థలు, టీకాలను మొదట ఇవ్వాల్సిన వారి ప్రాధాన్యతాక్రమం మొదలైన అంశాలపై సమీక్ష జరిపారు. వ్యాక్సీన్ అభివృద్ధితో పాటు సేకరణ, నియంత్రణ, నిల్వ మొదలైన ముఖ్యమైన అంశాలను సమావేశంలో చర్చించినట్లు ప్రధాని మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. -
కరోనా టీకా: మొదట వారికే ఇస్తాం
న్యూఢిల్లీ: మరో మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు కరోనా టీకా అందజేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ‘ఫిక్కి’ గురువారం నిర్వహించిన నేషనల్ వెబినార్‌లో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు. వచ్చే ఏడాది జూలై–ఆగస్టు నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి అందించవచ్చని చెప్పారు. మరో మూడు నాలుగు నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రాధాన్యతల వారీగానే వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దీని ప్రకారం.. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనంతరం 50–65 ఏళ్ల వయసున్న వారికి ఇస్తామని ఉద్ఘాటించారు. ఆ తర్వాత 50 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సిన్ అందుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అనేది పూర్తిగా శాస్త్రీయ కోణంలో నిపుణుల సూచనల మేరకే జరుగుతుందని మంత్రి హర్షవర్దన్ వివరించారు. ప్రస్తుతం 20 వ్యాక్సిన్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ముఖ్యమైన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ఆక్స్ఫర్డ్–సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. భారత్ బయోటెక్–ఐసీఎంఆర్ దేశీయంగానే అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ఫేజ్–2/ఫేజ్–3 ప్రయోగాలను రెడ్డీస్ ల్యాబ్ సంస్థ ఇండియాలో త్వరలోనే ప్రారంభించనుంది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం, మరొకరిని చైతన్యపర్చడం ద్వారా కోవిడ్–19ను 90–99 శాతం అరికట్టవచ్చని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. (చదవండి: పడవ మీద తిరిగే ప్రాణదాత) క్రిస్మస్కు ముందే వ్యాక్సిన్! ఫైజర్, బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్ క్రిస్మస్లోపే మార్కెట్లోకి విడుదల కావచ్చునని బయో ఎన్‌టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగుర్ సాహిన్ వెల్లడించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేలిన తరువాత వచ్చే నెలలో అమెరికా, యూరప్‌లో వ్యాక్సిన్‌కి అనుమతులు పొందనున్నట్లు ఫైజర్, బయో ఎన్‌టెక్ తెలిపాయి. వ్యాక్సిన్ పనితీరు వివిధ వయస్సులు, గ్రూపులపై ఒకేరకమైన పనీతీరు కనపర్చినట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ మధ్యనాటికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతి రావచ్చని, ఈయూ నుంచి అనుమతులు లభించవచ్చునని ఉగుర్ తెలిపారు. క్రిస్మస్కి ముందే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. తమ వద్ద రెండు అధిక సామర్థ్యం కలిగిన సురక్షితమైన వ్యాక్సిన్లు ఉన్నాయని కొద్ది వారాల్లోనే పంపిణీకి సిద్ధం అవుతాయని యుఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ హజార్ తెలిపారు. వృద్ధుల్లో ఆక్స్ఫర్డ్ టీకా సత్ఫలితాలు లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వయసు పైబడినవాళ్లలో మంచి వ్యాధినిరోధకత అభివృద్ధి చెందేలా దోహదం చేస్తోంది. ఈ మేరకు లాన్సెట్‌లో ప్రచురించిన వివరాలు టీకాపై ఆశలను పెంచుతున్నాయి. సుమారు 560 మంది వయసు పైబడిన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడగా మంచి ఫలితాలు వచ్చాయని, 70 ఏళ్లు పైబడిన వాళ్లలో కూడా వ్యాధినిరోధకత పెరిగిందని రిసెర్చ్ నివేదిక తెలిపింది. కరోనా ఎక్కువగా పెద్దవారిపై నెగెటివ్ ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని తెలిపింది. పెద్దల్లో టీకా నెగెటివ్ ప్రభావాలు చూపకపోవడమే కాకుండా, వారిలో ఇమ్యూనిటీని పెంచడం ముదావహమని ఆక్స్ఫర్డ్ వాక్సిన్ గ్రూప్‌నకు చెందిన డాక్టర్ మహేషి రామసామి చెప్పారు. -
ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్
ముంబై: కరోనా వైరస్ కట్టడిలో 94.5 శాతం విజయవంతమైనట్లు తాజాగా పేర్కొన్న యూఎస్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ దేశీయంగా అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కోవాక్స్ సౌకర్యాల ద్వారా ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశాయి. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎపిడిమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సహకార సమితి(సీఈపీఐ) నుంచి గతంలోనే మోడర్నా ఇంక్‌కు నిధుల సహాయం అందినట్లు వివరించాయి. సీఈపీఐ కోవాక్స్‌లో భాగంకావడంతో ఇండియా సైతం వ్యాక్సిన్‌ను పొందనున్నట్లు తెలియజేశాయి. చదవండి: (పసిడి- వెండి అక్కడక్కడే..) 2 బిలియన్లు వచ్చే ఏడాది(2021) చివరికల్లా కోవాక్స్ సౌకర్యాల ద్వారా పేద, మధ్యాదాయ దేశాలకు 2 బిలియన్ వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోవాక్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెల్త్‌కేర్ రంగ నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది జనవరిలో మోడర్నా ఇంక్‌కు సీఈపీఐ 1 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. తద్వారా మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో వ్యాక్సిన్ అభివృద్ధికి పాక్షికంగా నిధులు అందజేసింది. ఈ నిధుల సమీకరణ కారణంగా మోడర్నా ఇంక్ పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 2016లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఈపీఐ రూపొందింది. వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీ, నిల్వలకు ఉద్ధేశించి సీఈపీఐను ఏర్పాటు చేశారు. చదవండి: (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?) ఒప్పందం లేదు దేశీ ఫార్మా కంపెనీలతో మోడర్నా ఇంక్‌కు ఒప్పందాలేవీ లేవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దీంతో మోడర్నా తొలుత వ్యాక్సిన్‌ను యూఎస్ ప్రభుత్వానికి సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేశాయి. మోడర్నా ఇంక్ ఆచరించిన ఎంఎన్ఆర్ఏ పద్ధతిలోనే ఫైజర్ ఇంక్ సైతం వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఈ వ్యాక్సిన్ సైతం 90 శాతంపైగా ఫలితాలు సాధించినట్లు ఇప్పటికే యూఎస్ హెల్త్‌కేర్ దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. అయితే మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్లలో నిల్వ చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు -70 సెల్షియస్ అవసరమంటూ వార్తలు వెలువడిన విషయం విదితమే. దీంతో మోడర్నా ఇంక్ వ్యాక్సిన్‌పట్ల పరిశ్రమవర్గాలలో అంచనాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. -
మా టీకా 94.5% ప్రభావవంతం
న్యూయార్క్: తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ టీకా 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ మోడెర్నా సోమవారం ప్రకటించింది. కరోనాను అంతం చేసే విషయంలో తాము ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్న టీకా 90 శాతానికి పైగానే ప్రభావం చూపుతున్నట్లు ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మోడెర్నా సంస్థ ఎంఆర్ఎన్ఏ–1273 పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది 94.5 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలోని డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు మూడోదశ పరీక్షల్లో వెల్లడైందని మోడెర్నా తాజాగా పేర్కొంది. వ్యాక్సిన్‌ను తీసుకొచ్చే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అని వెల్లడించింది. తమ టీకా వినియోగానికి వీలుగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఎమర్జెన్సీ హెల్త్ ఆథరైజేషన్(ఈయూఏ) దరఖాస్తు చేసుకోవాలని మోడెర్నా భావిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ వినియోగం కోసం అనుమతులు తీసుకోవాలని నిర్ణయించింది. మూడో దశ ప్రయోగాల్లో ‘కోవాగ్జిన్’.. హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్’ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా సోమవారం తెలియజేశారు. ఆయన సోమవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో అందించే మరో కరోనా వ్యాక్సిన్‌ను సైతం తాము అభివృద్ధి చేస్తున్నామని, ఇది వచ్చే ఏడాది కల్లా సిద్ధమవుతుందని తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోసేఫ్టీ లెవల్3 (బీఎస్ఎల్3) ఉత్పత్తి సదుపాయం ఉన్న ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని గుర్తుచేశారు. కోవాగ్జిన్ ఫేజ్–1, ఫేజ్–2 ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత్ బయోటెక్ గత నెలలో వెల్లడించింది. ఫేజ్ 1/2 దశల్లో బీఈ సంస్థ వ్యాక్సిన్ బయోలాజికల్ ఈ.లిమిటెడ్(బీఈ) సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్ 1/2 క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌కు చెందిన ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో చురుగ్గా పనిచేస్తోంది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి లభించింది. టీకా పంపిణీ సవాలే న్యూఢిల్లీ: కోవిడ్–19 నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాలు అందుబాటులోకి వచ్చినా దేశంలోని 135 కోట్ల మందికి వాటిని పంపిణీ చేయడం పెను సవాలేనని శీతలీకరణ వ్యవస్థల నిపుణుడు, నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చెయిన్ డెవలప్మెంట్ సీఈవో పవనేశ్ కోహ్లీ తెలిపారు. దేశం మొత్తమ్మీద 28 వేల టీకా కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల నెట్వర్క్ అందుబాటులో ఉండగా వీటన్నింటిలోనూ –25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టీకాలను నిల్వ చేసుకునే సౌకర్యం లేదన్నారు. ఈ సమస్యను ఎదో ఒకలా పరిష్కరించగలిగినా వాటిని స్థానిక మెడికల్ షాపులు, ఇతర దుకాణాల్లోనూ అందుబాటులో ఉంచడం మరో సవాలని పవనేశ్ తెలిపారు. -
నాలుగు కోట్ల డోసులు సిద్ధం
బెంగళూరు: కోవిడ్ టీకా తయారీలో ఇంకో ముందడుగు పడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకా డోసులు సుమారు నాలుగు కోట్లు సిద్ధంగా ఉన్నాయని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురువారం ప్రకటించింది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభిస్తే నోవావాక్స్ టీకా తయారీ కూడా చేపడతామని సీరమ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాల టీకా కోవిషీల్డ్ ప్రయోగాలు చివరిదశలో ఉన్నాయి. టీకా పనితీరుపై ముందస్తు ఫలితాలు ప్రకటించాలని ఆస్ట్రాజెనెకా సిద్ధమవుతున్న తరుణంలో యూకేలో వేసవి కారణంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం మొదలైంది. దీంతో టీకాల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ గత వారమే తెలిపింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా టీకాలను భారత్‌లో తయారు చేస్తున్న సీరమ్ నాలుగు కోట్ల డోసులు సిద్ధమైనట్లు ప్రకటించడం గమనార్హం.∙తయారైన డోసులు అంతర్జాతీయ వినియోగానికా? భారత్‌లో పంపిణీ చేసేందుకా తెలిపేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ నిరాకరించింది. -
కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు వజ్ర?
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ తరలింపునకు ఆర్టీసీ మినీబస్సులు ‘వజ్ర’ను వినియోగించేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వ్యాక్సిన్ ప్రయోగాలు మూడోదశలో ఉన్నందున, మరో రెండుమూడు నెలల్లో అది అందుబాటులోకి వస్తుందన్న మాట వినిపిస్తోంది. ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సి ఉన్నందున పెద్దమొత్తంలో వ్యాక్సిన్ రాష్ట్రం నలుమూలలకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా వేగంగా జరగాలి. ఇందుకోసం ఆర్టీసీ వజ్ర బస్సులు ఏమేరకు ఉపయోగపడతాయన్న విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. నిపుణులకు బస్సులను చూపి నివేదిక తీసుకోనుంది. విమానాశ్రయంతో అనుసంధానం రెండురోజుల క్రితం ఆర్టీసీ జీఎంఆర్ ఎయిర్‌కార్గోతో ఒప్పందం చేసుకుంది. విమానాల ద్వారా వచ్చే సరుకును సంబంధిత గమ్యానికి చేర్చేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలోని కార్గో బస్సులను వినియోగించటం దీని ఉద్దేశం. ఎయిర్‌కార్గోలో మందులు, వ్యాక్సిన్ తరలింపునకు ఏసీ బస్సుల అవసరం ఉంది. వజ్ర బస్సులన్నీ ఎయిర్ కండీషన్ సదుపాయంతో ఉన్నవే. దీంతో వాటిని వాడాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మందుల సరఫరా సాధారణంగానే ఉన్నా, కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత భారీగా వాహనాల అవసరం ఉంటుంది. అంత డిమాండును తట్టుకునేలా బస్సులు సిద్ధం చేయగల సామర్థ్యం ఉందా అని ఎయిర్‌కార్గో ప్రశ్నించింది. సాధారణ మందులకు 15– 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే సరిపోతుంది. కానీ వ్యాక్సిన్‌కు 4 డిగ్రీలలోపే ఉండాలి. దీంతో నిపుణుల ఆధ్వర్యంలో వజ్ర బస్సుల ఫిట్నెస్, ఏసీ పనితీరును పరిశీలింపచేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. వ్యాక్సిన్ విషయంలో ఈ బస్సుల ఏసీ సామర్ధ్యం సరిపోదని తేలితే.. ఇతర మందులు, పండ్ల సరఫరాకు వాడతారు. ప్రయాణికుల సేవల నుంచి ఔట్ హైదరాబాద్‌లోని కాలనీల నుంచి వరంగల్, నిజామాబాద్, రామగుండం లాంటి పట్టణాలకు మినీ ఏసీ బస్సులను నడిపితే బాగుంటుందనే సీఎం కేసీఆర్ సూచన మేరకు ఆర్టీసీ దశలవారీగా వంద వజ్ర బస్సులను సమకూర్చుకుంది. కానీ జనాదరణ లేకపోవడంతో ఈ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. (చదవండి: మౌత్‌వాష్‌తో కరోనా కంట్రోల్) -
వ్యాక్సిన్ పంపిణీకి కమిటీలు
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా పంపిణీలో సమన్వయం, పర్యవేక్షణకు వెంటనే కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇతర సాధారణ ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూసుకోవడంతోపాటు, సామాజిక మా«ధ్యమాల్లో టీకా సామాజిక ఆమోదంపై ప్రతికూల ప్రభావం చూపే పుకార్లను ముందుగానే కనిపెట్టి, అడ్డుకునేందుకు ఈ కమిటీలు సాయపడతాయని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలతో ప్రారంభమై, పలు గ్రూపుల వారికి దశలవారీగా సాగే టీకా పంపిణీ ఏడాది పొడవునా సాగే అవకాశం ఉందని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీలు, స్థానిక అవసరాలు, వివిధ భౌగోళిక పరిస్థితులకు తగినట్లుగా నిల్వ సదుపాయాలు, కార్యాచరణ వ్యూహాలను సమీక్షిం చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. కొత్త కేసులు 50 వేల లోపే.. గత 24 గంటల్లో 48,648 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 563 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,21,090కు చేరుకుంది. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 73,73,375కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,94,386 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 7.35 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 91 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. -
అది చాలా ప్రమాదకరం: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
బెర్లిన్: కరోనా నిరోధక వ్యాక్సిన్ తమ ప్రజలకే ముందుగా అందించాలన్న దేశాల ఆలోచనా విధానం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రియేసస్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాక్సిన్ను ప్రభావంతంగా ఉపయోగించుకుంటేనే, మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయవచ్చని పేర్కొన్నారు. కొన్ని దేశాల్లోని ప్రజలందరికీ టీకా అందించడం కంటే కూడా, అన్ని దేశాల్లోని కొంతమంది ప్రజలకు వాక్సినేషన్ చేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. రష్యాలో స్పూత్నిక్- వీ పేరిట టీకాను విడుదల చేయగా, క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్న క్రమంలో మరికొన్ని కంపెనీలు, త్వరలోనే వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి.(చదవండి: నన్ను గెలిపిస్తే అందరికీ ఫ్రీగా వాక్సిన్) ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసి, ప్రజలకు అందించే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే పేద దేశాల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఈ విషయం గురించి టెడ్రోస్ ఆదివారం నాటి సదస్సులో మాట్లాడుతూ.. ‘‘ తమ ప్రజలను కాపాడుకునేందుకు వ్యాక్సిన్‌ను దక్కించుకునేందుకు దేశాలు పోటీపడటం సహజం. అయితే ఇప్పుడు వ్యాక్సిన్‌ను ఎంత ప్రభావంతంగా ఉపయోగించుకోగలమన్న అంశం మీదే కోవిడ్-19 వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్ నేషనలిజం వల్ల మహమ్మారి మరింత విజృంభించే అవకాశాలే తప్ప, దానిని నియంత్రించే అవకాశం ఉండదు. యూరప్ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇలాంటి తరుణంలో, వ్యాక్సిన్‌ను కొన్ని దేశాలకే పరిమితం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ప్రభావంతమైన వ్యాక్సిన్ విడుదలైతే, అన్ని దేశాల్లోనూ అది వినియోగంలోకి వచ్చినపుడే ఆశించిన ఫలితాలు లభిస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. (వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!) అత్యంత తీవ్రమైన సంక్షోభం ఇది: ఐరాస చీఫ్ ఇక ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. ‘‘సమకాలీన పరిస్థితుల్లో ఇదే అత్యంత తీవ్రమైన సంక్షోభం. ఇప్పుడు ప్రపంచమంతా అడుగడుగునా కలిసి నుడుస్తూ, సుహృద్భావంతో మెలగాల్సిన ఆవశ్యకత ఉంది. వ్యాక్సిన్లు, కరోనా టెస్టులు, చికిత్సా విధానాలే ఇప్పుడు మన జీవితాన్ని కాపాడే మార్గాలు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి’’అని పేర్కొన్నారు. కాగా శనివారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 4,65,319 కరోనా కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లండించింది. వీటిలో సగం కంటే ఎక్కువ కేసులు యూరప్ దేశాల్లో వెలుగుచూసినట్లు వెల్లడించింది. -
5 వ్యాక్సిన్లు : 100 కోట్ల డోసులు
సాక్షి, ముంబై: కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశీయ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) భారీ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు కరోనా వైరస్ ఒక వాక్సిన్లకు సంబంధించి ఒక్కోదానికి ఒక బిలియన్ మోతాదులను తయారు చేస్తున్నట్టు సీరం సీఈఓ అదార్ పూనావల్లా తెలిపారు. అలాగే 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్ లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. (కరోనా వాక్సిన్ : సీరం సీఈఓ కీలక వ్యాఖ్యలు) 2021-22 ముగిసేలోపు ప్రపంచవ్యాప్తంగా కోవిషీల్డ్, కోవోవాక్స్, కోవివాక్స్, కోవి-వాక్, ఎస్ఐఐ కోవాక్స్ అనే ఐదు వేర్వేరు కరోనావైరస్ వ్యాక్సిన్లకు సంబంధించి వందకోట్ల మోతాదులను సిద్ధం చేయనున్నామని పూనావల్లా చెప్పారు. 'కోవిషీల్డ్' కరోనావైరస్ వ్యాక్సిన్‌తో ప్రారంభించి, సీరం 2021 నాటికి ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. 20-30 మిలియన్ మోతాదులను ఇప్పటికే తయారు చేస్తున్నామనీ దీన్ని నెలకు 70-80 మిలియన్లకు పెంచనున్నామని పూనావల్లా తెలిపారు. టీకా షెల్ఫ్ జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని తక్కువ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పూణేలోని ఎస్ఐఐ ప్రక్కనే కొత్త ఉత్పాదక కేంద్రం సిల్స్ రాబోతోందని, ఇది పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని అదార్ పూనావాలా తెలిపారు. అప్పటి వరకు సిల్స్ అవుట్ సోర్స్ చేస్తుందన్నారు. ఈ రెండూ పూర్తయిన తరువాత డిమాండ్, అవసరాన్ని బట్టి 2 నుంచి 3 బిలియన్ మోతాదుల వరుకు తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటామని కూడా పూనావల్లా వెల్లడించారు. బ్రిటిష్-స్వీడిష్ ఫార్మా కంపెనీ అస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సంయక్తంగారూపొందించిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 1,600 మందిలో క్లినికల్ ట్రయల్ 3వ దశలో ఉంది. దీని తయారీకి సంబంధించి ఇప్పటికే సీరం ఒప్పంద భాగస్వామ్యం చేసుకుంది. రెండవ వ్యాక్సిన్ బయోటెక్ సంస్థ నోవోవాక్స్ కు చెందిన 'కోవోవాక్స్'. దీని ఫేజ్-1 క్లినికల్ ట్రయల్ మే 2020 లో ఆస్ట్రేలియాలో ప్రారంభం కాగా ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ 2020 చివరి నాటికి ప్రారంభం కానున్నాయి. నోవోవాక్స్ 2021 లో ఒక బిలియన్ మోతాదులను ఉత్పత్తికి సీరం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. -
వ్యాక్సిన్ మొదట వారియర్స్‌కే!
సాక్షి, కామారెడ్డి: కోవిడ్–19 వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. మొదటి విడతలో ఈ వ్యాక్సిన్‌ను కరోనా వారియర్స్‌కు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్ నియంత్రణకు ప్రాణాలొడ్డి కృషి చేస్తోన్న హెల్త్ కేర్ వర్కర్స్ (హెచ్సీడబ్ల్యూ)కు వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఎవరెవరికి ఇవ్వాలో పేర్లతో జాబితా రూపొందించాలని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం ఆయా వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బందితో పాటు ఆశలు, ఏఎన్ఎంల వివరాలతో జాబితా రూపొందిస్తోంది. ఆయా వివరాలను కేంద్ర అధికారిక పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా, సీహెచ్‌సీ, పీహెచ్సీ, యూపీహెచ్‌సీలతో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆరోగ్య సంరక్షణ కార్మికులు, రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్కింగ్ సిబ్బంది, అధికారులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బంది వివరాలను సేకరించారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న వైద్యాధికారుల వివరాలను ఇప్పటికే ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రైవేట్‌కు సంబంధించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ద్వారా ప్రభుత్వ అనుమతి పొందిన ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. ఆయా వివరాలను గురువారం సేకరించి, వైద్యారోగ్య శాఖకు పంపించనున్నారు. ఆన్లైన్ డేటా ప్రకారమే వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు ఆన్లైన్ ట్రాకింగ్ పద్ధతిన ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్(ఈవీఐఎన్) ద్వారా టీకాలను ఇవ్వనున్నారు. ఇందుకోసం సీవీబీఎంఎస్ ద్వారా డేటాను ట్రాకింగ్ చేయనున్నారు. మొదటి దశలో జిల్లాలో హెల్త్ కేర్ వర్కర్స్ డేటాను సేకరిస్తున్నారు. ఆ డేటా ప్రకారమే జిల్లాకు వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నారు. జిల్లాలో వైద్యారోగ్యశాఖ, వైద్యవిధాన పరిషత్‌లో మూడు వేలకు పైగా ఉద్యోగులు ఉండగా, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మరో రెండు వేల వరకు సిబ్బంది పని చేస్తున్నారు. వీరందరికీ మొదటి దశలోనే కోవిడ్–19 నివారణ టీకాలు ఇవ్వనున్నారు. వివరాలను సేకరిస్తున్నాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్త్ కేర్ వర్కర్స్ వివరాలను సేకరిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ పరిధిలోని వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలు నమోదు చేస్తున్నాం. గురువారం పూర్తి వివరాలను పంపాల్సి ఉంది. అధికారులు పంపిన ఫార్మెట్ ప్రకారం వివరాలను సేకరిస్తున్నాం. – డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో -
ప్రతి పౌరుడికీ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడికీ కోవిడ్–19 వ్యాక్సిన్ తప్పనిసరిగా అందేలా పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తుల సమయాల్లో మాదిరిగానే టీకా పంపిణీలో కూడా అన్ని స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజాలు పాలుపంచుకోవాలన్నారు. దేశంలో కోవిడ్–19 పరిస్థితి, టీకా సరఫరా, పంపిణీకి చేపట్టిన ఏర్పాట్లపై ప్రధాని మోదీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ విస్తీర్ణం, జనాభా, భౌగోళిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపౌరుడికీ టీకా వేగంగా అందేలా చూడాలన్నారు. ‘టీకా రవాణా, పంపిణీ, నిర్వహణ యంత్రాంగాలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ నిల్వకు అవసరమైన పర్యవేక్షణ యంత్రాంగం, కోల్డ్‌స్టోరేజీ ఏర్పాట్లు, పంపిణీ, వయల్స్, సిరంజీల వంటివి అందుబాటులో ఉంచడం, అవసరాలను ముందుగానే గుర్తించి స్పందించే వ్యవస్థలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి’అని ప్రధాని తెలిపారు. దేశంలో రోజువారీ కేసులు, కేసుల్లో పెరుగుదల రేటు తగ్గుతోందన్న ప్రధాని.. ఈ సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలను కొనసాగించాలన్నారు. ఈ రానున్న పండగ సీజన్లో మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం వంటివి తప్పనిసరిగా కొనసాగించాలని కోరారు. దేశంలో అభివృద్ధి చేస్తున్న మూడు టీకాల్లో రెండో దశ ట్రయల్స్‌లో రెండు, మూడో దశలో ఒక టీకా ఉన్నాయని చెప్పారు. ‘పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల శాస్త్రవేత్తలతో మన శాస్త్రవేత్తలు సమన్వయం చేసుకుంటూ పరిశోధన సామర్థ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్, ఖతార్, భూటాన్ తమ దేశాల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలని కోరుతున్నాయి. ఇరుగుపొరుగు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు కూడా కోవిడ్ టీకా, ఔషధాల విషయంలో సాయపడాలి’అని అన్నారు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి ‘దేశంలో ఎన్నికలు, విపత్తు సమయాల్లో విజయవంతంగా పనిచేసిన అనుభవాన్ని టీకా పంపిణీ, సరఫరాలో కూడా ఉపయోగించుకోవాలి. టీకా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లా స్థాయి యంత్రాంగాలు, పౌర సమాజాలు, వలంటీర్లు, సంబంధిత రంగాల నిపుణుల భాగస్వామ్యం అవసరం ఉంది. ఐటీ సాంకేతికత వెన్నుదన్నుతో రూపుదిద్దుకునే ఈ పంపిణీ వ్యవస్థ మన ఆరోగ్య రంగానికే తలమానికంగా నిలవాలి’అని పేర్కొన్నారు. 19న ‘గ్రాండ్ చాలెంజెస్’ ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. ఆరోగ్యం, అభివృద్ధి విషయాల్లో ప్రపంచ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనడం ఈ భేటీ లక్ష్యం. ‘ప్రపంచం కోసం భారత్’అంశంపై ఈ సమావేశం ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రజాప్రతినిధులు, శాస్త్రీయ రంగాల ప్రతినిధులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలు కొనసాగుతాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో దాదాపు 40 దేశాలకు చెందిన 1,600 మంది పాల్గొంటారు. ఈ సమావేశాలు గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ మ్యుటేషన్ లేదు దేశంలో కరోనా వైరస్ జన్యుపరంగా స్థిరంగా ఉందనీ, ఎటువంటి మ్యుటేషన్‌కు గురికాలేదని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అధికారులు ప్రధానికి తెలిపారు. వైరస్‌లో మ్యుటేషన్ సంభవిస్తే టీకా అభివృద్ధిపై అది ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌లో చోటుచేసుకున్న మ్యుటేషన్లు వివిధ దేశాల్లో కొనసాగుతున్న టీకాల రూపకల్పనపై ఎటువంటి ప్రభావం చూపబోదని అంతర్జాతీయ సంస్థల అధ్యయనాల్లోనూ రుజువయింది. వైరస్‌లో సంభవించే కొన్ని మార్పులతో వైరస్ వ్యాప్తి వేగవంతం అవుతుందనే అంచనాలున్నాయి. దాదాపు 72 దేశాల్లో సంభవించిన కరోనా వైరస్ జెనోమ్ మ్యుటేషన్లతో భారత్‌లోని 5.39 శాతం మ్యుటేషన్లకు పోలికలున్నట్లు కూడా గత నెలలో ఓ శాస్త్రవేత్తల బృందం తెలిపిందని వారు చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. -
వ్యాక్సిన్ పంపిణీకి ప్రధాని కీలక సూచనలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికలు నిర్వహించే తరహాలోనే వ్యాక్సిన్ పంపిణీకి సిద్దం కావాలంటూ ప్రధాని అధికారులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తు నిర్వహణ మాదిరిగానే కరోనా వ్యాక్సీన్ డెలివరీ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో అన్ని స్థాయిల ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థలు పాల్గొనేలా చూడాల్సి ఉందన్నారు. దేశంలోని కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిని, టీకా పంపిణీ, ఆయా వ్యవస్థల సంసిద్ధతను ప్రధాని శనివారం సమీక్షించారు. (రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్) దేశ భౌగోళిక పరిధిని, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వ్యాక్సిన్‌ను వేగంగా ప్రజలకు అందేలా చూడాలని ప్రధాని కోరారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సీన్ అందుబాటులో ఉండాలని సూచించారు. లాజిస్టిక్స్, డెలివరీ, పద్ధతులు అడుగడుగునా కఠినంగా ఉండాలని, కోల్డ్ స్టోరేజ్ చెయిన్ అధునాతన ప్రణాళిక, పంపిణీ నెట్వర్క్, వ్యాక్సినేషన్ క్లినిక్ పర్యవేక్షణ తదితర ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ప్రధాని కోరారు. ఇందుకు దేశంలో ఎన్నికలు, విపత్తు నిర్వహణను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇందులో రాష్ట్రాల భాగస్వామ్యంతోపాటు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా స్థాయి కార్య నిర్వాహకులు, పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అవసరమైన అన్ని డొమైన్ల నిపుణులు కీలక భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ప్రధాని ప్రధాన కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్), ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర ముఖ్య అధికారులు, ప్రభుత్వ ఇతర విభాగాలు పాల్గొన్నాయి. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం నాటి గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య 74 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 1,12,998కు చేరుకుంది. అయితే వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 65 లక్షలు దాటి రికవరీ రేటు 87.78 శాతానికి చేరిందని మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
స్విగ్గీ, జొమాటోతో టీకా డెలివరీ!
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ మరో కొద్ది నెలల్లో భారత్‌లో అందుబాటులోకి రావచ్చనే అంచనాల నేపథ్యంలో టీకా పంపిణీకి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీకా డోసుల్ని ఉంచడానికి దేశవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే పనిలో పడింది. దీనికి సంబంధించి జాతీయ నిపుణుల కమిటీ ఫార్మాసూటికల్, ఆహార రంగాలలో ఉన్న కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లతో ఒప్పందాలు కుదర్చుకొని తాలూకా స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. టీకా డోసుల పంపిణీకి సంబంధించి ఒక ముసాయిదా ప్రణాళికను వచ్చేవారంలో విడుదల చేయనున్నట్టుగా ఆ వర్గాలు తెలిపాయి. భారత్ తాను సొంతంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌తో పాటు 3 విదేశీ వ్యాక్సిన్లు మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి రావచ్చు. వ్యాక్సిన్ డోసుల్ని ఉంచడానికి మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు అవసరం. కేంద్ర ఆరోగ్య శాఖ భారీ కోల్డ్ స్టోరేజ్‌లను రెండు నెలల పాటు వాడుకోవడానికి వీలుగా వివిధ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. -
వచ్చే నెల్లో కోవిడ్ వ్యాక్సిన్!
లండన్: వచ్చే నెల నుంచి దేశంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు బ్రిటన్ సమాయత్తమవుతున్నట్లు తాజాగా లీకైన ఎన్హెచ్ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్) డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఐదు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆరంభించి క్రిస్మస్కల్లా పూర్తిస్థాయిలో వీటి ద్వారా రోజూ వేలమందికి టీకాలు అందించాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. లండన్, లీడ్స్ తదితర ఐదు చోట్ల ఈ మాస్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి, ముందుగా కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉన్నవారికి టీకాలను అందిస్తారు. ఐదు ప్రధాన కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచార యూనిట్లను ఏర్పాటు చేసి దేశంలో పత్రి ఒక్కరూ వ్యాక్సినేషన్ పొందేలా చూస్తారని సదరు పత్రాలు వెల్లడించాయి. అవసరమైతే వ్యాక్సిన్ పంపిణీలో మిలటరీ సైతం పాలుపంచుకుంటుందని తెలిసింది. ముందుగా కేర్హోమ్ వర్కర్లు, కేర్‌హోమ్స్‌లో ఉండే వృద్ధులు, ఆరోగ్యశాఖ వర్కర్లు, 80ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సిన్ ఇచ్చి అనంతరం వయసు ఆధారంగా వ్యాక్సినేషన్ చేపడతారని జాయింట్ కమిటీ ఆన్ వ్యాక్సినేషన్ గైడ్‌లైన్స్ వెల్లడిస్తున్నాయి. ఏడాది చివరకు ప్రయోగదశల్లో ఉన్నవాటిలో కనీసం రెండు వ్యాక్సిన్లైనా అందుబాటులోకి వస్తాయని ఎన్ హెచ్ఎస్ అంచనా వేస్తోంది. వీటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్‌పై ఆశలు అధికంగా ఉన్నాయి. క్రిస్మస్ నాటికి ఈ వ్యాక్సిన్‌కు అన్ని రెగ్యులేటరీ అనుమతులు రావచ్చని అంచనా. ఇప్పటికే ప్రభుత్వం 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఆర్డరు చేసిఉంచింది. -
టీకా పంపిణీకి 80 వేల కోట్లు ఉన్నాయా?
పుణే: దేశ ప్రజలందరికీ అవసరమైన కరోనా వ్యాక్సిన్లు కొని, సరఫరా చేయడానికి అక్షరాలా రూ.80 వేల కోట్లు అవసరమని, ఈ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా? అని పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదార్ పూనావాలా ప్రశ్నించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేయడానికి ఎస్ఐఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ల కోసం సంవత్సరంలోగా రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అదార్ పూనావాలా చెప్పారు. ఇప్పడు మన ముందున్న అతి పెద్ద సవాలు ఇదేనని వివరించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు పంపిణీ చేయడానికి 3 డాలర్లకు ఒక వ్యాక్సిన్ డోసు చొప్పున ఉత్పత్తి చేస్తామని ఎస్ఐఐ ఇటీవలే ప్రకటించింది. -
రష్యా వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్
మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడానినికి అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా వుండగా రష్యా టీకాను విజయవంతంగా తయారుచేశామని దాని క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని ప్రకటించి వాటిని ప్రజలకు కూడా ఇవ్వడం ప్రారంభించింది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ వ్యాక్సిన్ వేసుకున్న కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఏడుగురిలో ఒకరు తమకు జ్వరం, ఒంటినొప్పులు ఉన్నాయని రష్యా ఆరోగ్య శాఖ తెలిపింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. అయితే, ఈ సైడ్ ఎఫెక్స్ తాము ఊహించినవేనని రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అవి ఒకటి, ఒకటిన్నర రోజుల్లో తగ్గిపోతాయని చెప్పారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి టీకా ఇస్తామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు వేయగా వారిలో 14 శాతంమంది స్వల్ప దుష్ఫలితాలు ఉన్నాయని తెలిపారు. ఇక భారతదేశంలో ఈ వ్యాక్సిన్ మూడవ దశ ఔషధ పరీక్షలతోపాటు పంపిణీకై హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతి లభించిన తర్వాత రెడ్డీస్‌కు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఆర్డీఐఎఫ్ సరఫరా చేయనుంది. రష్యా సరైన పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్‌ను తీసుకొస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: రష్యా వ్యాక్సిన్ వయా డాక్టర్ రెడ్డీస్ -
డాక్టర్ రెడ్డీస్- జేఎంసీ ప్రాజెక్ట్స్ జోరు
కోవిడ్-19 కట్టడికి రష్యా రూపొందించిన వ్యాక్సిన్‌పై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్‌కు రెండో రోజూ డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క తాజాగా కాంట్రాక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోవిడ్-19 కట్టడికి రిజిస్టరైన రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-విను దేశీయంగా అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో వరుసగా రెండో రోజు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 4,773ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 4,767 వద్ద ట్రేడవుతోంది. స్పుత్నిక్-విపై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరీక్షలు విజయవంతమైతే 10 కోట్ల డోసేజీలను డాక్టర్ రెడ్డీస్‌కు ఆర్డీఐఎఫ్ అందించనుంది. గమేలియా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్-విపై రష్యాలో రెండు దశల పరీక్షలను నిర్వహించారు. వీటిలో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని, సమర్థవంతంగా పనిచేస్తున్నదని ఆర్డీఐఎఫ్ ఇప్పటికే తెలియజేసింది. జేఎంసీ ప్రాజెక్ట్స్ దేశ, విదేశాల నుంచి రూ. 1,342 కోట్ల విలువైన కాంట్రాక్టులు తాజాగా లభించినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ తెలియజేసింది. వీటిలో తూర్పు ఆసియా నుంచి దక్కించుకున్న రూ. 725 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఉన్నట్లు పేర్కొంది. ఈ బాటలో ఒడిషాలో నీటిపారుదల సౌకర్యాల కల్పనకు రూ. 471 కోట్ల ప్రాజెక్ట్ లభించగా.. బిల్డింగ్ నిర్మాణం కోసం రూ. 146 కోట్ల కాంట్రాక్టును ఉత్తరాది నుంచి పొందినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో జేఎంసీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతంపైగా జంప్‌చేసి రూ. 57.40ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం ఎగసి రూ. 55.40 వద్ద ట్రేడవుతోంది. -
కరోనా: ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారానికి ఎక్కడికి వెళ్లిన కరోనా ప్రశ్నలతోనే విపక్షాలు ట్రంప్‌ను నిలదీస్తున్నాయి. ట్రంప్ నిర్లక్ష్యం వల్లే అనేకమంది అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో ట్రంప్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలోని పౌరులందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా హెల్త్ అండ్ హూమన్ సర్వీసెస్, యూఎస్ డిఫెన్స్ శాఖలు సంయుక్తంగా రెండు డాక్యుమెంట్లను విడుదల చేశాయి. ఇందులో ట్రంప్ సర్కారు వ్యాక్సిన్ అందించడానికి చేస్తున్న ప్రణాళికలు, కరోనాను ఎదుర్కోవడానికి ఎలా సంసిద్ధమవుతుంది అనే విషయాలను వివరించారు. ఇప్పటి వరకు అమెరికాలో 68,25,448 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,01,266 మంది కరోనాతో మరణించారు. చదవండి: ఏనుగు లేదా గాడిద.. ఎవరిది పైచేయి?! -
వ్యాక్సిన్ పంపిణీపై ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్ : కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం ఇప్పట్లో సమసిపోదని, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది అందరికీ అందేలా బహుముఖ సహకారం అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల చొరవతో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా కోవిడ్-19 నుంచి కోలుకునే పరిస్థితి కనిపిస్తోందని, దీనికి మరిన్ని చర్యలు అవసరమని ఫారెన్ పాలసీ మ్యాగజీన్లో ప్రచురితమైన ఓ వ్యాసంలో ఐఎంఎఫ్ పేర్కొంది. కరోనా వైరస్ నుంచి చోటుచేసుకుంటున్న రికవరీ పరిమితంగానే ఉందని, అన్ని రంగాలు, ప్రాంతాల్లో అసమానతలతో నిండిఉందని ఈ వ్యాసంలో ఐఎంఎఫ్ మేనజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌లు పేర్కొన్నారు. చదవండి : ఊహించినదానికంటే లోతైన మాంద్యం : గీతా గోపీనాథ్ కరోనా వైరస్ కల్లోలంతో ఈ సంక్షోభ ఫలితంగా 2021 సంవత్సరాంతానికి 12 లక్షల కోట్ల డాలర్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఫలితంగా అల్పాదాయ దేశాలకు నిరంతర సాయం కీలకమని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 75 దేశాలకు ఐఎంఎఫ్ అత్యవసర నిధులను సమకూర్చగా, మధ్యాదాయ దేశాలకు విస్తృతస్ధాయిలో ఊతమిచ్చే చర్యలను కొనసాగించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇక పేద దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో 76 సంపన్న దేశాలు కోవ్యాక్స్ కూటమికి వెన్నుదన్నుగా నిలవడం పట్ల ఐఎంఎఫ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఈ కూటమిలో చేరబోమని అమెరికా ప్రకటించడం గమనార్హం. -
పేద దేశాలకూ టీకా అందాలి
జెనీవా: ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేలా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ అంశంలో జాతీయవాదాన్ని ప్రదర్శించకూడదని సంపన్న దేశాలకు హితవు పలికింది. వివిధ దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్ పరిశోధనలు ముందడుగు వేస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీకా ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచదేశాలందరి ప్రయోజనాలు పరిరక్షించేలా సంపన్న దేశాలు ముందుకు రావాలని అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని టెడ్రోస్ సూచించారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుగా టీకా అందించాలన్నారు. డిసెంబర్ నాటికి చైనా వ్యాక్సిన్ వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశాలున్నాయి. అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయని ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరిస్తున్న చైనా ప్రభుత్వ కంపెనీ సినోఫార్మ్ చైర్మన్ లియూ జింగ్‌హెన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ఖరీదు ఇండియన్ కరెన్సీలో 10 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే వందశాతం సత్ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పారు. -
మనకు తొలి వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా నుంచే!
ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కోవిడ్-19కు చెక్ పెట్టేందుకు దేశీయంగా తొలి వ్యాక్సిన్ 2020 డిసెంబర్‌కల్లా అందుబాటులోకి రావచ్చని ఫార్మా వర్గాలు ఊహిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఇప్పటికే రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షలలో ఉంది. ఈ వ్యాక్సిన్ తయారీకి దేశీయంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ లైసెన్సింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశీ కంపెనీలలో భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సైతం సొంత వ్యాక్సిన్ తయారీ సన్నాహాల్లో ఉన్నాయి. ఐసీఎంఆర్‌తో చేతులు కలపడం ద్వారా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ ప్రస్తుతం తొలి దశ క్లినికల్ పరీక్షలను పూర్తిచేసుకోనుంది. ఇదే విధంగా జైడస్ క్యాడిలా రూపొందిస్తున్న జైకోవ్-డి సైతం తొలి దశ పరీక్షలలో ఉన్నట్లు సంబంధివర్గాలు పేర్కొన్నాయి. (నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్ 2వ ఫేజ్‌కు..) 1600 మందిపై దేశీయంగా ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలకు అనుమతి పొందిన సీరమ్ ఇన్స్టిట్యూట్.. 1600 మందిపై వీటిని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన 17 ప్రాంతాలలో 18ఏళ్లకుపైబడిన వారిపై 2-3 దశల ప్రయోగాలు చేపట్టినట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఈ వ్యాక్సిన్ తయారీకి భాగస్వామిగా ఒప్పందాన్ని కుదుర్చుకున్న సీరమ్.. నెలకు 10 కోట్ల డోసేజీలను అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దేశీయంగా రూపొందిస్తున్న కంపెనీలు సైతం వ్యాక్సిన్లను ఐదు ప్రాంతాలలో 1,000-1100 మందిపై ప్రయోగిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. కాగా.. ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీలకు వీలుగా ఇటీవలే బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ 15 కోట్ల డాలర్లు(రూ. 1125 కోట్లు) అందించడం గమనార్హం! -
కోవిడ్-19కు వ్యాక్సిన్- వొకార్డ్.. హైజంప్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి వీలుగా ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ తయారీకి ఒప్పందం కుదుర్చుకోవడంతో దేశీ ఫార్మా రంగ కంపెనీ వొకార్డ్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో వరుసగా మూడో రోజు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 30 ఎగసి రూ. 334 వద్ద ఫ్రీజయ్యింది. సోమవారం సైతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 304 సమీపంలో ముగిసింది. వెరసి గత మూడు రోజుల్లోనే ఈ కౌంటర్ 26 శాతం దూసుకెళ్లింది. కాగా.. గత ఆరు సెషన్లుగా ఈ కౌంటర్ లాభపడుతూ రావడం గమనార్హం! వ్యాక్సిన్ తయారీ కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న విషయం విదితమే. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం బ్రిటిష్ ప్రభుత్వం తాజాగా వొకార్డ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా యూకే అనుబంధ సంస్థ సీపీ ఫార్మాస్యూటికల్స్ ద్వారా కోవిడ్-19కు చెక్ పెట్టే AZD122 వ్యాక్సిన్‌ను వొకార్డ్ తయారు చేయనుంది. తద్వారా యూకే ప్రభుత్వానికి 3 కోట్ల డోసేజీలను సరఫరా చేయనుంది. తదుపరి దశలో 40 కోట్ల డోసేజీలవరకూ కాంట్రాక్టును పెంచుకునేందుకు వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
‘కరోనా వ్యాక్సిన్ ముందుగా వారికే’
వాషింగ్టన్: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మైక్రోసాఫ్ట్’ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ వ్యాక్సిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ సరఫరాలో ఎక్కువ డబ్బులు బిడ్ చేసే వారికి కాకుండా.. అత్యంత అవసరమున్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి మహమ్మారి సమయంలో డబ్బు గురించి కాకుండా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచం అత్యంత తీవ్రమైన మహమ్మారితో బాధపడుతుంది. ఇలాంటి సమయంలో డ్రగ్స్, వ్యాక్సిన్ సరఫరాలో ఎక్కువ అవసరమున్న ప్రాంతాలకు, దేశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బు గురించి ఆలోచిస్తే.. మహమ్మారి మరింత కాలం కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు మార్కెట్ శక్తులకు అడ్డుకట్ట వేసి అందరికి సమన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి’ అన్నారు. (కరోనా: ఐదేళ్ల ముందే చెప్పిన బిల్ గేట్స్!) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా వైరస్ కట్టడి కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. అమెరికా, యూరోప్ దేశాలు ఈ పరిశోధనలు, ట్రయల్స్‌పై వేల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశాయి. ధనిక దేశాలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేస్తే.. అభివృద్ధి చెందిన దేశాలకు అన్యాయం జరుగుతుంది అన్నారు బిల్‌గేట్స్. ‘రెండు దశాభ్దాల క్రితం వెలుగులోకి వచ్చిన ఎయిడ్స్ / హెచ్ఐవీకు మందులను అందుబాటులోకి తేవడం కోసం ప్రపంచదేశాలు అన్ని కలసికట్టుగా పని చేశాయి. ఫలితంగా ప్రస్తుతం ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా హెచ్ఐవీకి మందులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్ గురించి కూడా ఇలానే ప్రయత్నించాలి’ అని బిల్‌గేట్స్ సూచించారు. (కలిపి కొడితే కరోనా ఫట్?) -
నిండా నిర్లక్ష్యం
♦ లక్ష్యసాధనలో విఫలమవుతున్న ప్రభుత్వ ఆస్పత్రులు ♦ 21 పీహెచ్‌సీల్లో టీకామందు పంపిణీ 80 శాతంలోపే.. ♦ గ్రామీణ ప్రాంతాల్లో రోగాల బారిన పడుతున్న చిన్నారులు ♦ పీహెచ్‌సీల్లో అధ్వానంగా వ్యాక్సినేషన్ పుట్టిన పిల్లలకు ఏడాదిలోపు ఇవ్వాల్సిన టీకామందు పంపిణీ ప్రక్రియ నిర్లక్ష్యానికి గురవుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ నిర్లిప్త వైఖరితో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతోంది. జన్మించిన శిశువుకు ఏడాదిలోపు దాదాపు ఏడు రకాల వ్యాక్సిన్లు ఇస్తారు. వారాలు, నెలలను పరిగణనలోకి తీసుకుని ఏడాదిలోపు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలి. ప్రతి పీహెచ్సీ పరిధిలో తప్పనిసరిగా వందశాతం లక్ష్యాన్ని సాధించాల్సి ఉండ గా.. గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ గాడితప్పింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో 48 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవికాకుండా 8 క్లస్టర్ ఆస్పత్రులు, ఒక జిల్లా ఆస్పత్రి, మరో రెండు ప్రాంతీయ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. క్లస్టర్ ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రులు ఇన్, ఔట్‌పేషంట్ విభాగాల్లో సేవలు అందిస్తుండగా.. పీహెచ్‌సీల్లోని సిబ్బంది మాత్రం క్షేత్రస్థాయిలో క్యాంపులు నిర్వహిస్తూ సేవలందించాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియంతా పీహెచ్‌సీల ఆధ్వర్యంలోనే సాగుతుంది. ముఖ్యంగా చిన్నారులకు పంపిణీ చేసే మీజిల్స్, డీపీటీ, బీసీజీ, హెపటైటిస్ బీ తదితర వ్యాక్సిన్ల పంపిణీ బాధ్యత పీహెసీ వైద్యులదే. అయితే జిల్లాలో చాలాచోట్ల వ్యాక్సినేషన్ లక్ష్యాలు నిర్లక్ష్యం బారినపడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. 21 ఆరోగ్య కేంద్రాల్లో.. జిల్లాలో 21 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వెనుకబడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గవదబిల్లలు, పొంగువ్యాధి రాకుండా వేసే మీజిల్స్ వ్యాక్సిన్ పంపిణీలో మంచాల, దండుమైలారం, నవాబ్‌పేట , పూడూరు, కీసర, సిద్దలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బాగా వెనకబడి ఉన్నాయి. అదేవిధంగా డిప్తీరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం రాకుండా వేసే డీపీటీ వ్యాక్సిన్ పంపిణీలో టంగుటూరు, మేడ్చల్, నాగసముద్రం, బంట్వారం పీహెసీలు అధ్వానంగా ఉన్నాయి. క్షయవ్యాధి బారిన పడకుండా వేసే బీసీజీ వ్యాక్సిన్ పంపిణీలో షాబాద్, సిద్దలూరు, కీసర, పూడూరు, చేన్గొముల్, బంట్వారం పీహెచ్‌సీలు వెనుకబడి ఉన్నాయి. కాలేయ సంబంధ రోగాలు రాకుండా ఉండేందుకు వేసే హెపటైటిస్ బీ వ్యాక్సిన్ పంపిణీలో టంగుటూరు, మేడ్చల్, నాగసముద్రం, బంట్వారం పీహెచ్‌సీలు అంతంతమాత్రం గానే పనిచేస్తున్నాయి. దీంతో ఆయా పీహెచ్‌సీల వైద్యులకు జిల్లా యం త్రాంగం నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకేసారి ఏడు రకాల వ్యాక్సిన్లు చిన్నారికి అందిస్తారు. జిల్లా సగటు పురోగతి బాగున్నప్పటికీ.. గ్రామీణ మండలాల్లో మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉంది.