సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ ముగిసింది.. ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కొవిడ్ వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డ్ నెలకొల్పింది. 13 లక్షల మందికిపైగా వైద్య ఆరోగ్యశాఖ వ్యాక్సినేషన్ వేసింది. రాష్ట్రంలో లక్ష్యాన్ని మించి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్ నడిచింది. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్ వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.43 లక్షలు. కృష్ణా జిల్లాలో 1.31 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.10 లక్షల మందికి, గుంటూరు జిల్లాలో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం... ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. వ్యాక్సిన్ల లభ్యతను బట్టి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తోంది.
ఇదే క్రమంలో ఆదివారం ఒకేరోజు ఏకంగా 8 లక్షల మందికి టీకాలు వేయాలని సంకల్పించి... అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసింది. కాగా, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకే లక్ష్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది.
ఇక్కడ చదవండి: ఏపీ: నేడు ఒకేరోజు 8 లక్షల మందికి వ్యాక్సిన్
Comments
Please login to add a commentAdd a comment