సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిషీల్డ్ టీకా రెండో డోసు గడువును వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి పెంచింది. ప్రస్తుతం మొదటి డోసు పొందిన తర్వాత 12–16 వారాల మధ్యలో రెండో డోసు ఇస్తుండగా, ఈ గడువును 14–16 వారాలకు పెంచుతూ ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు బుధ వారం ఉత్తర్వులు జారీచేశారు. అంటే కోవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న 14 నుంచి 16 వారాల మధ్యలోనే రెండో డోసు టీకాను తీసు కోవాల్సి ఉంటుంది. కాగా గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందజేస్తున్నట్లు శ్రీనివాసరావు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment