సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కోవిషిల్డ్, కోవాక్సిన్ డోసుల కొనుగోలుకు ఏపీఎంఎస్ఐడిసి ద్వారా ఆయా ఇన్‌స్టిట్యూట్లకు రూ. 50 కోట్లకు పైగా నిధులు చెల్లించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
దీంతో త్వరలో 11 లక్షలకు పైగా కోవిషిల్డ్ డోసులు, 3 లక్షలకు పైగా కోవాక్సిన్ డోసులు రాష్ట్రానికి సరఫరా కానున్నాయి. 45 సంవత్సరాల పైబడిన వారికి జూన్ నెల వరకు రెండు డోసులు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment