
సాక్షి, అమరావతి: ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులకు వ్యాక్సిన్ వేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వీరు ఎంతమంది ఉన్నారో గుర్తించాలని జిల్లా ఆరోగ్యశాఖ అధికారులకు ప్రజారోగ్య సంచాలకులు డా.గీతాప్రసాదిని ఆదేశించారు. భవిష్యత్‌లో చిన్నారులకు కరోనా సోకినా తల్లులకు సోకకుండా ఉండేందుకు వీలుగా వారికీ వ్యాక్సిన్ వేయాలని ఈనెల 7న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ తల్లులను గుర్తించేందుకు ఆదేశాలిచ్చారు. ఒకరోజు ముందే టోకెన్‌లు ఇచ్చిన అనంతరం వీరిని వ్యాక్సిన్ సెంటర్‌కు తీసుకువచ్చే బాధ్యతను ఆశా కార్యకర్తలకు, ఏఎన్‌ఎంలకు అప్పజెప్పారు. కాగా, వ్యాక్సిన్ అవసరమైన తల్లులు 15 లక్షల మందికి పైగానే ఉంటారని అంచనా. వయస్సుతో నిమిత్తం లేకుండా వీరికీ వ్యాక్సిన్ వేస్తారు. ఈ విధానం తలపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment