Covid Vaccination In India: Manish Kumar Santitation Worker, First Vaccinated Person In India - Sakshi
Sakshi News home page

కరోనా వ్యాక్సినేషన్‌ తొలి టీకా.. వీడియో

Published Sat, Jan 16 2021 12:12 PM | Last Updated on Sat, Jan 16 2021 8:55 PM

Manish Kumar sanitation worker first person receive Corona vaccine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. దేశంలో తొలి కరోనా టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శానిటైజర్‌ వర్కర్‌ మనీష్‌ కుమార్‌కు వైద్యులు వేశారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్‌ వైద్య బృందంతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. (ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్)

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోనూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. జీజీహెచ్‌లో హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకా ఇచ్చారు. అనంతరం హెల్త్ వర్కర్ నాగజ్యోతి, హెల్త్ వర్కర్ జయకుమార్‌కు టీకా వేశారు.  తెలంగాణలో టీకా కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్‌ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement