
సాక్షి, అమరావతి: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల డోసుల మైలురాయిని అధిగమించింది. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,07,83,544 డోసుల టీకాలను వినియోగించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 43,77,68,492 టీకా డోసులను పంపిణీ చేయగా.. 4.53 కోట్ల డోసులను వినియోగించడం ద్వారా ఉత్తరప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 4.18 కోట్ల డోసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 3.19 కోట్ల డోసులతో గుజరాత్ మూడో స్థానంలో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment