
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కస్తూరిబా పాఠశాలలో విద్యార్థినులకు వ్యాక్సిన్ వేస్తున్న వైద్య సిబ్బంది
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 15–18 ఏళ్ల వారి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సోమవారం విశేష స్పందన లభించింది. ఉదయం పది గంటల నుంచి టీకా వేసే ప్రక్రియ ప్రారంభించగా అది రాత్రి వరకు కొనసాగింది. తొలిరోజు రాష్ట్రంలోని 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్లలో 4,92,613 మందికి కోవాగ్జిన్ టీకా వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,719 మందికి చేశారు.
కొన్నిచోట్ల ఆరోగ్య సిబ్బంది పాఠశాలలకు వెళ్లి వేశారు. కోవిన్ యాప్‌లో పేరు రిజిస్టర్ చేసుకున్న వారికి నేరుగా టీకా ఇవ్వగా.. మిగిలిన వారికి ఆధార్ కార్డు, పాఠశాల గుర్తింపు కార్డులోని వివరాలు నమోదు చేసి టీకా వేశారు. ఇక 7వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. 25 లక్షల మంది యువత లక్ష్యం కాగా 40 లక్షల కోవాగ్జిన్ డోసులను సిద్ధంగా ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment