US Declares Monkeypox Public Health Emergency - Sakshi
Sakshi News home page

మంకీపాక్స్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.. హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్‌ సర్కార్‌

Published Fri, Aug 5 2022 9:37 AM | Last Updated on Fri, Aug 5 2022 11:02 AM

US Declares Monkeypox Public Health Emergency - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకుని ప్రజలు తమకు సహకరించాలని అమెరికా ఆరోగ్య శాఖ కోరింది.

మంకీపాక్స్ నియంత్రణకు తాను కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. టీకా పంపిణీ వేగవంతం చేసి  పరీక్షల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ఈ వైరస్‌ వల్ల ముప్పును ప్రజలకు తెలియజేస్తామన్నారు. అందుకే మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు తెలిపారు.  వైరస్‌పై పోరాటంలో ఇది చాలా కీలకమన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 83 దేశాలకుపైగా వ్యాపించింది మంకీపాక్స్. 23,350 మందికిపైగా సోకింది. ఈ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: కరోనా, మంకీపాక్స్‌ రెండూ ఒకే రకమైన వైరస్‌లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement