ఇంతవరకు మనం రకరకాల కిడ్నాప్‌లు గురించి విని ఉంటాం. అవన్నీ ఆస్తి కోసం లేక వ్వక్తిగత కక్ష్యల నేపథ్యంలోనో కిడ్నాప్‌లు చేయడం గురించి విని ఉంటాం. కానీ ఎక్కడైన వ్యాక్సిన్ కోసం కిడ్నాప్ చేయడం గురించి మాత్రం ఇప్పుడే వింటున్నాం. అది కూడా తల్లే కిడ్నాప్ చేయడం. చాలా ఆశ్యర్యంగానూ వింతగానూ ఉంది.
(చదవండి: అధ్యాపక వృత్తిలో ఉండి అదేం పని!)
అసలు విషయంలోకెళ్లితే...స్పెయిన్‌లోని సెవిల్లె సమీపంలో నివశిస్తున్న ఒక తండ్రి తన కొడుకులని తల్లే స్వయంగా కిడ్నాప్ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్‌లు వేయించడానికి వీల్లేదంటూ కిడ్నాప్ చేసిందని ఆమె మాజీ భర్త ఆరోపించాడు. ఇటీవలే తన పిల్లలకు కోవిడ్ వేయించాలా వద్ద అనే నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందని కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించాడు.
అయితే ఆమె కోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిరోజుల్లోనే పిల్లలను స్కూల్‌కి పంపిచడం మానిపించేయాలనుకుంటున్నట్లు అతని మాజీ భార్య నుంచి ఒక ఉత్తరం కూడా వచ్చిందని తెలిపాడు. పైగా తన అనుమతి లేకుండానే పిల్లలను తీసుకువెళ్లిపోయిందని, నవంబర్ 4 నుంచి తన పిల్లలను చూడలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో అతని మాజీ భార్య 12, 14 ఏళ్ల తన పిల్లలను తీసుకుని కోర్టుకు వెళ్లి అధికారులను ఆశ్రయించింది. అయితే కోర్టు పెండింగ్‌లో ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. అంతేకాదు ఆ పిల్లలిద్దర్నీ తండ్రికి అప్పగించినట్లు స్పెయిన్ గార్డియా సివిల్ పోలీస్ ఫోర్స్ ప్రతినిధి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment