న్యూఢిల్లీ: ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టీకాల బూస్టర్ డోసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బూస్టర్ డోసు సామర్ధ్యాన్ని పరిశీలించేందుకు ఇప్పటికే అన్ని డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న 3వేల మందిపై వైద్య అధ్యయనం నిర్వహించనుంది. హరియాణాకు చెందిన ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలో ఒమిక్రాన్ కారణంగా బూస్టర్ డోసులకు అనుమతినిచ్చారు. ఒమిక్రాన్ కారణంగా యూరప్ సహా పలు దేశాల్లో మరో వేవ్ వచ్చే అవకాశాలు పెరిగాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. టీకాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు బూస్టర్ డోసుతో మరింత రక్షణ లభిస్తుందని చెబుతున్నాయి. వీటన్నింటిపై తాజా అధ్యయనంలో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment