కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ వేసుకొంటున్న డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ప్రికాషన్ డోసు పంపిణీకి శ్రీకారం చుట్టింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 1,24,609 మందికి వేశారు. వీరిలో 12,128 మంది వృద్ధులు, 36,037 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 76,444 మంది హెల్త్‌కేర్ వర్కర్లు ఉన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్లు వేశారు. రెండో డోసు వేసుకుని 9 నెలలు (39 వారాలు) పూర్తయిన వారికి వేశారు.
ప్రికాషన్ డోస్ వేసుకున్న డిప్యూటీ సీఎం
పుత్తూరు రూరల్: కరోనా మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ వేసుకోవాలని డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి కోరారు. ప్రభుత్వం సోమవారం నుంచి ప్రికాషన్ డోస్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో తొలిరోజే డిప్యూటీ సీఎం ప్రికాషన్ డోస్‌ను తన ఇంటి వద్ద వేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకొని 90 రోజులు పూర్తయిన వారు, 60 ఏళ్లు నిండిన వారు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment