సాక్షి ప్రతినిధి, అనంతపురం: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఏపీ దూసుకుపోతోంది. ఈ విషయం కేంద్రం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వేలో కూడా వెల్లడైంది. గతేడాది డిసెంబర్ 31 నాటికి ఏపీలో 75.7 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపింది. అలాగే తొలి డోసు వ్యాక్సినేషన్ ఏపీలో లక్ష్యానికి మించి(100.4 శాతం మంది) పూర్తయ్యిందని వెల్లడించింది. తద్వారా దేశంలోనే టాప్‌లో నిలిచిందని పేర్కొంది. ఇక తెలంగాణలో 68.7 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని ఆర్థిక సర్వేలో కేంద్రం తెలిపింది.
దేశ జనాభాలో48.3 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని పేర్కొంది. మరోవైపు ప్రజలను కోవిడ్ బారి నుంచి కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన మౌలిక వసతులు, ఆక్సిజన్ ప్లాంట్లు, బెడ్లు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తోంది. 2019 నాటికి రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేదు. కానీ ప్రస్తుతం 13 జిల్లాల్లో రూ.45 కోట్ల వ్యయంతో 14 వైరాలజీ ల్యాబ్‌లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా ఏపీలో 90 శాతం మందికి ఆర్టీపీసీఆర్ విధానంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి రికార్డు సృష్టించారు. అలాగే 143 ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలను సంరక్షించేందుకు కృషి చేస్తోంది.
వ్యాక్సినేషన్‌లో ఏపీ దూకుడు
Published Fri, Feb 4 2022 4:59 AM | Last Updated on Fri, Feb 4 2022 8:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment