బెంగాల్‌లో పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ | Centre grants citizenship certificates under CAA to people from west Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ

Published Thu, May 30 2024 9:32 AM | Last Updated on Thu, May 30 2024 9:54 AM

Centre grants citizenship certificates under CAA to people from west Bengal

కోల్‌కతా: నూతన పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న పలువురికి సిటిజన్‌షిప్‌ సర్టిఫికేట్లను కేంద్రం బుధవారం జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు, హర్యానా, ఉత్తరఖండ్‌ రాష్ట్రాల్లో మొదటి విడత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సిటిజన్‌షిప్‌ సర్టిఫికేట్లను అధికారులు అందజేశారు. 2019లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం నియమ, నిబంధనలను మార్చి 11న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విషయం తెలిసిందే. చట్టం నిబంధనలు నోటీఫై అయిన రెండు నెలల అనంతరం మే 15న తొలిసారి మొదటి విడతగా 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేస్తూ​ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో  పౌరసత్వ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని, అమలు చేయమని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్న విషయం  తెలిసిందే. సీఏఏ మానవత్వాన్ని అవమానించటమేనని, దేశ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని మండిపడ్డ సంగతి విధితమే.

సీఏఏలో ఏముంది...!
► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు.
► 2014 డిసెంబర్‌ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ నుంచి వలస  వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు.
► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు.
► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది.
► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement