సాక్షి, హైదరాబాద్: వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభు త్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (కేఎం టీపీ)తో పాటు అనేక టెక్స్‌టైల్, అపారెల్ పార్కులు ఏర్పాటుచేస్తోంది. కేఎంటీపీలో యాంగ్వాన్, కైటెక్స్ వంటి దిగ్గజ టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమలు కార్య కలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసు కుంటున్నాయి. రాష్ట్రంలో 40 వేలకు పైగా చేనేత కార్మికులు ఉండగా.. సుమారు 35 వేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జౌళి రంగంలో సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇందుకోసం సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఉన్న అనుకూలతల దృష్ట్యా పోచంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ టీ) ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి పలు మార్లు ప్రతి పాదనలు పంపింది. ఐఐటీహెచ్ ఏర్పా టుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేం దుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల సంకేతాలు అందడం లేదు.
ఏపీ వెంకటగిరిలో ఐఐహెచ్‌టీ
దేశవ్యాప్తంగా ప్రస్తుతం పది ఐఐహెచ్‌టీలు ఉం డగా, ఆరు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, మరో ఆరు రాష్ట్రాల టెక్స్‌టైల్ కమిషనర్ల పరిధిలో పనిచేస్తు న్నాయి. వారణాసి (ఉత్తరప్రదేశ్), సాలెమ్ (తమిళ నాడు), గువాహటి (అస్సాం), జోధ్‌పూర్ (రాజ స్తాన్), బార్ఘార్ (ఒడిశా), శాంతిపూర్ (పశ్చిమబెం గాల్) లోనివి కేంద్రం పరిధిలో ఉన్నాయి. వెంకట గిరి (ఏపీ), గదగ్ (కర్ణాటక), కన్నూరు (కేరళ), చంపా (ఛత్తీ‹స్‌గఢ్) ఐఐటీహెచ్‌లు రాష్ట్రాల పరిధి లో ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రస్తు తం తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరి ఐఐటీ హెచ్‌లో మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తున్నా యి. టెన్త్ చదివిన వారికి మెరిట్ ప్రాతిపదికన ఐఐహెచ్‌టీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు దక్కితే స్టైపెండ్ కూడా లభిస్తుంది.
2024 నుంచి ప్రవేశాలు కష్టమే
వెంకటగిరి ఐఐహెచ్‌టీలో 60 సీట్లు ఉండగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కోటాలో 13 సీట్లు పోగా ఏపీ, తెలంగాణ విద్యార్థు లకు 47 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విభజన చట్టం మేరకు 2023–24 విద్యా సంవత్సరం తర్వాత తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరీ ఐఐటీ హెచ్‌లో ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. విభజన సమయంలోనే ఒడిశాలోని బార్ఘర్ ఐఐటీహెచ్‌లో తెలంగాణ విద్యార్థులకు 8 సీట్లు ప్రత్యేకించారు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఐఐటీహెచ్‌లకు వెళ్లేందుకు రాష్ట్ర విద్యార్థులు విము ఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐఐటీహెచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగు తోంది. ఐఐటీహెచ్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర విద్యార్థులు స్పిన్నింగ్, వీవింగ్ (నేత), డిజైనింగ్, డైయింగ్ (అద్దకం), ప్రింటింగ్ (ముద్రణ), గార్మెంట్ మేకింగ్ (దుస్తుల తయారీ), మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో శాస్త్రీయ పద్దతుల్లో శిక్షణ, నైపుణ్యం పొందేందుకు అవకాశం లభిస్తుంది.
నైపుణ్యాలు పెంపొందుతాయి
ప్రస్తుతం చాలామంది యువకులు చేనేత రంగం వైపు వైపు వస్తున్నారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మానేసి సొంతంగా 25 మగ్గాలు పెట్టి 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. నేనే స్వతహాగా డిజైన్లు తయారు చేసి చీరెలను తయారు చేయి స్తాను. ఐఐహెచ్‌టీ ఏర్పాటు ద్వారా సాంకేతిక పరి జ్ఞానం పెరిగి కొత్తకొత్త డిజైన్లు సృష్టించేందుకు అవకాశం ఏర్పడుతుంది. నాణ్యత పెరుగుతుంది. మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు
చేనేత ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర గామిగా ఉంది. అంతర్జాతీయంగా పేరొందిన ఇక్క త్‌తో పాటు గద్వాల పట్టు, కొత్తకోట పైఠానీ, వరం గల్ డర్రీస్ ఇలా లెక్కలేనన్ని నేత ఉత్పత్తులకు తెలంగాణ ప్రసిద్ది. ఇలాంటి చోట ఐఐహెచ్‌టీ లాంటి పేరొందిన సంస్థ ఏర్పాటు చేస్తే సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు జోడించి వస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలకు బాటలు వేయొచ్చు.
– యర్రమాద వెంకన్న నేత, చైర్మన్, అఖిల భారత పద్మశాలి సంఘం (చేనేత విభాగం)
Comments
Please login to add a commentAdd a comment