IIHT
-
త్యాగమనే మాటే కేసీఆర్‌కు నప్పదు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధనలో అసలైన ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని.. అలాంటి వ్యక్తిని బీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగా అవమానించారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. త్యాగమనే పదం కొండా లక్ష్మణ్‌కే చెల్లుతుందని, కేసీఆర్ త్యాగాలు చేశానంటూ చెప్పుకోవడం ఏమా త్రం సరికాదని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని లలితకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌కు నీడనిచ్చిన వ్యక్తి కొండా లక్ష్మణ్. ఆయన సొంత ఇల్లు (జలదృశ్యం)ను కేసీఆర్‌కు ఇస్తే.. కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా కేసీఆర్ వ్యవహరించారు. ఉద్యమం పేరుతో రాజకీయ రాజీనామాలు చేశారు. ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ అనే మార్గంలో భారీగా లబ్ధి పొందాడు. ఉద్యమం కోసం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌కు ఎలాంటి ఆస్తులు లేవు. కానీ కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం టీవీ చానళ్లు, పత్రికలు, బిల్డింగులు, ఫాంహౌజ్‌లు, ఇతర ఆస్తులు సంపాదించుకున్నారు. రాష్ట్రంలోనే చేనేత టెక్నాలజీ చదువు కోసం.. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎనాడూ చేనేతల అభివృద్ధి కోసం ఆలోచించలేదు. రాష్ట్ర విద్యార్థులు హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో చేరాలంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వెంకటగిరికో, ఒడిశా రాష్ట్రానికో పోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ అంశం నా దృష్టికి వచ్చింది. వెంటనే ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లకు వినతిపత్రం ఇచ్చాం. వారు సానుకూలంగా స్పందించి ఐఐహెచ్‌టీని మంజూరు చేశారు. వెంటనే దీనిని అందుబాటులోకి వచ్చేలా అధికారులు చకచకా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తున్నా.. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేస్తాం. చేనేతల సంక్షేమం కోసం.. చేనేత ఉత్పత్తులంటే గత ప్రభుత్వంలో సినీతారల తళుకుబెళుకులే ఉండేవి. ఒక్క చేనేత కార్మికుడికి కూడా ప్రయోజనం కలగలేదు. గతంలో బతుకమ్మ చీరల పేరిట చేనేత కార్మికులకు పనికలి్పస్తామంటూ ఆర్భాటం చేశారే తప్ప నిధులు విడుదల చేయలేదు. మా ప్రభుత్వం తక్షణమే రూ.290కోట్ల బకాయిలు విడుదల చేసింది. బతుకమ్మ చీరల కంటే మెరుగైన నాణ్యతతో కూడిన చీరెలను 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించాం. ఏటా ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తాం. ఏడాదికి దాదాపు 1.30కోట్ల ఈ చీరల ఆర్డర్‌ను నేతన్నలకు ఇస్తాం. చేనేత రుణాల భారం రూ.30కోట్లను తప్పకుండా మాఫీ చేస్తాం. ప్రజా ప్రభుత్వానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. ఏ సమస్య వచ్చినా పెద్దన్నలా ముందుండి పరిష్కరిస్తా..’’అని రేవంత్ చెప్పారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాది మాటలతో మభ్య పెట్టే ప్రభుత్వం కాదు: మంత్రి తుమ్మల రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వం మాటలతో మభ్యపెట్టేది కాదని.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. చేనేత కార్మీకుల కోసం ప్రభుత్వం అమలు చేసే పథకాలు సమర్థవంతంగా అందేలా చూసేందుకు ముఖ్య కార్యదర్శి స్థాయిలో ఉన్న శైలజా రామయ్యర్‌కు ఆ శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించామని తెలిపారు. చేనేత కార్మీకులు ఎలాంటి సమస్యలున్నా ఆమెకు నేరుగా వివరించాలన్నారు. కాళోజీకి సీఎం రేవంత్ నివాళి ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు రేవంత్‌రెడ్డి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ పేరుతెలంగాణ ఉద్యమానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన కొండాలక్ష్మణ్ బాపూజీ పేరు ఐఐహెచ్‌టీకి పెడుతున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు.అనంతరం ఐఐహెచ్‌టీలో వివిధ కోర్సులు నేర్చుకుంటున్న విద్యార్థులకు నెలకు రూ.2,500 ప్రోత్సాహకాన్ని చెక్కుల రూపంలో అందించారు. -
చేనేత సంస్థ పోచంపల్లికి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభు త్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎం టీపీ)తో పాటు అనేక టెక్స్టైల్, అపారెల్ పార్కులు ఏర్పాటుచేస్తోంది. కేఎంటీపీలో యాంగ్వాన్, కైటెక్స్ వంటి దిగ్గజ టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమలు కార్య కలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసు కుంటున్నాయి. రాష్ట్రంలో 40 వేలకు పైగా చేనేత కార్మికులు ఉండగా.. సుమారు 35 వేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జౌళి రంగంలో సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇందుకోసం సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఉన్న అనుకూలతల దృష్ట్యా పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ టీ) ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి పలు మార్లు ప్రతి పాదనలు పంపింది. ఐఐటీహెచ్ ఏర్పా టుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేం దుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల సంకేతాలు అందడం లేదు. ఏపీ వెంకటగిరిలో ఐఐహెచ్‌టీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం పది ఐఐహెచ్‌టీలు ఉం డగా, ఆరు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, మరో ఆరు రాష్ట్రాల టెక్స్టైల్ కమిషనర్ల పరిధిలో పనిచేస్తు న్నాయి. వారణాసి (ఉత్తరప్రదేశ్), సాలెమ్ (తమిళ నాడు), గువాహటి (అస్సాం), జోధ్‌పూర్ (రాజ స్తాన్), బార్ఘార్ (ఒడిశా), శాంతిపూర్ (పశ్చిమబెం గాల్) లోనివి కేంద్రం పరిధిలో ఉన్నాయి. వెంకట గిరి (ఏపీ), గదగ్ (కర్ణాటక), కన్నూరు (కేరళ), చంపా (ఛత్తీ‹స్‌గఢ్) ఐఐటీహెచ్లు రాష్ట్రాల పరిధి లో ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రస్తు తం తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరి ఐఐటీ హెచ్లో మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తున్నా యి. టెన్త్ చదివిన వారికి మెరిట్ ప్రాతిపదికన ఐఐహెచ్‌టీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు దక్కితే స్టైపెండ్ కూడా లభిస్తుంది. 2024 నుంచి ప్రవేశాలు కష్టమే వెంకటగిరి ఐఐహెచ్‌టీలో 60 సీట్లు ఉండగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కోటాలో 13 సీట్లు పోగా ఏపీ, తెలంగాణ విద్యార్థు లకు 47 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విభజన చట్టం మేరకు 2023–24 విద్యా సంవత్సరం తర్వాత తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరీ ఐఐటీ హెచ్లో ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. విభజన సమయంలోనే ఒడిశాలోని బార్‌ఘర్ ఐఐటీహెచ్‌లో తెలంగాణ విద్యార్థులకు 8 సీట్లు ప్రత్యేకించారు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఐఐటీహెచ్‌లకు వెళ్లేందుకు రాష్ట్ర విద్యార్థులు విము ఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐఐటీహెచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగు తోంది. ఐఐటీహెచ్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర విద్యార్థులు స్పిన్నింగ్, వీవింగ్ (నేత), డిజైనింగ్, డైయింగ్ (అద్దకం), ప్రింటింగ్ (ముద్రణ), గార్మెంట్ మేకింగ్ (దుస్తుల తయారీ), మార్కెటింగ్, మేనేజ్మెంట్ తదితర అంశాల్లో శాస్త్రీయ పద్దతుల్లో శిక్షణ, నైపుణ్యం పొందేందుకు అవకాశం లభిస్తుంది. నైపుణ్యాలు పెంపొందుతాయి ప్రస్తుతం చాలామంది యువకులు చేనేత రంగం వైపు వైపు వస్తున్నారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మానేసి సొంతంగా 25 మగ్గాలు పెట్టి 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. నేనే స్వతహాగా డిజైన్లు తయారు చేసి చీరెలను తయారు చేయి స్తాను. ఐఐహెచ్‌టీ ఏర్పాటు ద్వారా సాంకేతిక పరి జ్ఞానం పెరిగి కొత్తకొత్త డిజైన్లు సృష్టించేందుకు అవకాశం ఏర్పడుతుంది. నాణ్యత పెరుగుతుంది. మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు చేనేత ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర గామిగా ఉంది. అంతర్జాతీయంగా పేరొందిన ఇక్క త్తో పాటు గద్వాల పట్టు, కొత్తకోట పైఠానీ, వరం గల్ డర్రీస్ ఇలా లెక్కలేనన్ని నేత ఉత్పత్తులకు తెలంగాణ ప్రసిద్ది. ఇలాంటి చోట ఐఐహెచ్‌టీ లాంటి పేరొందిన సంస్థ ఏర్పాటు చేస్తే సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు జోడించి వస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలకు బాటలు వేయొచ్చు. – యర్రమాద వెంకన్న నేత, చైర్మన్, అఖిల భారత పద్మశాలి సంఘం (చేనేత విభాగం) -
గద్వాలలో ఐఐహెచ్‌టీ కాలేజీ
♦ ముందస్తుగా చేనేత ఐటీఐకి అనుమతి ♦ కేంద్రానికి పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికులు అధికంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాను చేనేత పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దాలని పరిశ్రమల శాఖ పరిధిలోని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం యోచిస్తోంది. జిల్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) కాలేజీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 ఐఐహెచ్‌టీ కాలేజీలు ఉండగా, వీటిలో కేంద్రం పరిధిలో ఆరు, రాష్ట్రాల పరిధిలో నాలుగు కాలేజీలు నడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రగడ కోటయ్య ఐఐహెచ్‌టీని స్థాపించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానికంగా చేనేత రంగానికున్న ప్రాముఖ్యతను వివరిస్తూ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. తొలుత డిప్లొమా కోర్సులు ప్రారంభించేందుకు వీలుగా చేనేత ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా చేనేత ఐటీఐ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు కేంద్రానికి పంపారు. తొలి దశలో ఐఐటీలో డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టి.. పూర్తి స్థాయిలో కాలేజీ ఏర్పాటు చేసిన తర్వాత పోస్టు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తున్నారు. చేనేత ఐఐటీ, ఐఐహెచ్‌టీ ఏర్పాటుతో చేనేత, వస్త్ర పరిశ్రమ రంగంలో వస్తున్న ఆధునాతన సాంకేతిక అంశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి సాధ్యపడుతుందని అధికారులు చెబుతున్నారు. మెగా క్లస్టర్పైనా కసరత్తు జాతీయ చేనేత అభివృద్ధి పథకం (ఎన్‌హెచ్‌డీపీ) కింద మహబూబ్‌నగర్ జిల్లాలో మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి. గద్వాల లో 2006-07లో 50 ఎకరాల్లో రూ.8.21 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినా, ప్రాథమిక స్థాయిలోనే పనులు నిలిచిపోయాయి. దీంతో తాజాగా రూ.70 కోట్ల అంచనాతో ప్రాజెక్టు నివేదికను రూపొందిస్తున్నారు.