ముంబై: కఠిన ద్రవ్య పరిస్థితులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పెద్ద ఊరట నిచ్చింది. ఆర్థికవేత్తల అంచనాలకు మించి రూ.99,122 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో సమావేశమైన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్, రూ.99,122 కోట్ల మిగులు (డివిడెండ్ చెల్లింపుగా దీనిని పిలుస్తారు)ను కేంద్రానికి బదలాయించాలని నిర్ణయించింది.
మార్చి 31వ తేదీతో ముగిసిన తొమ్మిది నెలల ‘అకౌంటింగ్ కాలంలో’ మార్కెట్ ఆపరేషన్లు, పెట్టుబడుల వంటి కార్యాకలాపాల ద్వారా తాను పొందిన మొత్తంలో వ్యయాలుపోను మిగులును కేంద్రానికి ఆర్‌బీఐ బదలాయిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ అత్యధికంగా జరిపిన రూ.1.76 లక్షల కోట్ల బదలాయింపుల తర్వాత జరుపుతున్న భారీ మొత్తం ఇది.
Comments
Please login to add a commentAdd a comment