dividend payout
-
లాభాలు ఓకే.. డివిడెండ్లు ప్చ్!
దేశీయంగా లిస్టెడ్ కంపెనీలు మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో సగటున రికార్డ్ స్థాయిలో లాభాలు ఆర్జించాయి. అయితే లాభాలను వాటాదారులకు పంచే(డివిడెండ్ పేఔట్) విషయంలో వెనుకంజ వేస్తున్నాయి. వార్షికంగా పేఔట్ దాదాపు 5 శాతం నీరసించింది. ఇందుకు పలు అంశాలు ప్రభావాన్ని చూపుతున్నాయి. డివిడెండ్ ప్రకటించిన 999 లిస్టెడ్ కంపెనీలను పరిగణించిన ఒక నివేదిక రూపొందించిన వివరాలు చూద్దాం.. ముంబై: దేశీ లిస్టెడ్ కార్పొరేట్లు గతేడాది(2023–24)కి డివిడెండ్లను ప్రకటించడంలో ఆచితూచి అడుగేస్తున్నాయి. దీంతో సగటున అంతక్రితం ఏడాది(2022–23)తో పోలిస్తే డివిడెండ్ చెల్లింపు 4.7 శాతం తగ్గింది. రూ. 4.03 లక్షల కోట్లను పంచిపెట్టాయి. అయితే 2022–23లో సరికొత్త రికార్డును లిఖిస్తూ చెల్లించిన రూ. 4.23 ట్రిలియన్లతో పోలిస్తే తక్కువే. ఇక నికర లాభాల విషయానికివస్తే(అనుకోని లాభాలు లేదా నష్టాల సర్దుబాటు తదుపరి) గతేడాది వార్షికంగా 30 శాతం వృద్ధితో రూ. 14.75 లక్షల కోట్లను ఆర్జించాయి. ఇవి చరిత్రాత్మక గరిష్టంకాగా.. 2022–23లో రూ. 11.36 ట్రిలియన్ నికర లాభాన్ని సాధించాయి. కరోనా మహమ్మారి తదుపరి గత మూడేళ్లుగా దేశీ కార్పొరేట్ లాభాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతూ వస్తున్నాయి. దీంతో డివిడెండ్ చెల్లింపులు సైతం 2020–23 కాలంలో వార్షిక పద్ధతిన 29.5 శాతం చొప్పున ఎగశాయి. వార్షిక చెల్లింపులు 2023కల్లా 4.23 లక్షల కోట్లకు జంప్‌చేసింది. 2020లో ఇవి రూ. 1.95 ట్రిలియన్లు మాత్రమే. ఇదే కాలంలో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం దాదాపు 34 శాతం దూసుకెళ్లాయి. అయినప్పటికీ గతేడాది లాభాల పంపకం డీలా పడటం గమనార్హం! కోవిడ్–19 ముందు.. గత మూడేళ్లతో పోలిస్తే ఈక్విటీ డివిడెండ్ల చెల్లింపులు కోవిడ్–19కు ముందు తక్కువగానే నమోదయ్యాయి. 2017–20 కాలంలో లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ డివిడెండ్ల పంపకం వార్షికంగా కేవలం 3 శా తం వృద్ధిని అందుకుంది. దీంతో 2017లో నమోదైన రూ. 1.78 ట్రిలియన్ డివిడెండ్లు 2020కల్లా రూ. 1.95 లక్షల కోట్లకు మాత్రమే బలపడ్డాయి. ఇందుకు నికర లాభాలు నీరసించడం కారణమైంది. 2017లో మొత్తం లిస్టెడ్ కంపెనీల నికర లాభం రూ. 4.81 లక్షల కోట్లుకాగా.. 2020కల్లా రూ. 4.75 ట్రిలియన్లకు పరిమితమైంది. కాగా.. ప్రస్తుతానికి వస్తే గత ఐదేళ్లలో తొలిసారి వార్షికంగా డివిడెండ్ పేఔట్ రేషియో గతేడాది తగ్గింది. ఇలా ఇంతక్రితం 2019 లోనూ పేఔట్లో క్షీణత నమోదైంది. 2018లో రూ. 1.87 లక్షల కోట్లుకాస్తా 2019లో రూ.1.85 ట్రిలియ న్లకు బలహీనపడింది. ఇక గతేడాది లాభాలు, డివిడెండ్లు వ్యతిరేక దిశలో నమోదయ్యాయి. గత 9 ఏళ్లలోనే కనిష్టంగా డివిడెండ్ పేఔట్ నిష్పత్తి 27 శాతానికి పరిమితమైంది. 2023లో ఇది 37 శాతంకాగా.. 2020లో ఆల్‌టైమ్ గరిష్టం 41 శాతాన్ని తాకింది. కారణాలు.. సగటున పేఔట్ రేషియో నీరసించడానికి మార్కెట్ విశ్లేషకులు కొన్ని కారణాలను ప్రస్తావిస్తున్నారు. గతేడాది కొన్ని కీలక రంగాలలో కార్పొరేట్ ఆర్జన మందగించింది. దీంతో కొన్ని కంపెనీలు నగదును అంతర్గత వనరుల కోసం పక్కన పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. పీఎస్‌యూ బ్యాంకులు, చమురు కంపెనీలు అధిక లాభాలను ఆర్జించగా.. అధిక డివిడెండ్లు పంచే ఐటీ, ఎఫ్ఎంసీజీ తదితర రంగాలలో డిమాండ్ మందగించడం, వినియోగ వ్యయాలు తగ్గడం ప్రభావం చూపినట్లు వివరించారు. -
లాభాల్లో ప్రభుత్వ కంపెనీ..షేర్ హోల్డర్లకి బంపరాఫర్!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ యుటిలిటీ దిగ్గజం గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22) రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5(50 శాతం) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు మహారత్న కంపెనీ గెయిల్ వెల్లడించింది. ఇందుకు ఈ నెల 22 రికార్డ్ డేట్‌కాగా.. మొత్తం చెల్లింపులకు రూ. 2,220 కోట్లకుపైగా వెచ్చించనుంది. కంపెనీ ఇప్పటికే 2021 డిసెంబర్లో షేరుకి రూ. 4 చొప్పున డివిడెండును చెల్లించింది. వెరసి ఈ ఏడాదిలో ఒక్కో షేరుకీ రూ. 9 చొప్పున మొత్తం రూ. 3,996 కోట్లకుపైగా డివిడెండు కింద వెచ్చిస్తున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ మనోజ్ జైన్ వెల్లడించారు. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేశారు! కాగా.. ప్రస్తుతం కంపెనీలో గల 51.45% వాటా ప్రకారం ప్రభుత్వం రెండో మధ్యంతర డివిడెండుకింద రూ. 1,142 కోట్లు అందుకోనుంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
Reserve Bank Of India: కేంద్రానికి 99,122 కోట్ల డివిడెండ్
ముంబై: కఠిన ద్రవ్య పరిస్థితులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెద్ద ఊరట నిచ్చింది. ఆర్థికవేత్తల అంచనాలకు మించి రూ.99,122 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్, రూ.99,122 కోట్ల మిగులు (డివిడెండ్ చెల్లింపుగా దీనిని పిలుస్తారు)ను కేంద్రానికి బదలాయించాలని నిర్ణయించింది. మార్చి 31వ తేదీతో ముగిసిన తొమ్మిది నెలల ‘అకౌంటింగ్ కాలంలో’ మార్కెట్ ఆపరేషన్లు, పెట్టుబడుల వంటి కార్యాకలాపాల ద్వారా తాను పొందిన మొత్తంలో వ్యయాలుపోను మిగులును కేంద్రానికి ఆర్బీఐ బదలాయిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ అత్యధికంగా జరిపిన రూ.1.76 లక్షల కోట్ల బదలాయింపుల తర్వాత జరుపుతున్న భారీ మొత్తం ఇది. చదవండి: Policybazaar: నిబంధనల ఉల్లంఘన.. 25 లక్షలు ఫైన్ -
వేదాంతా మధ్యంతర డివిడెండ్
ముంబై: మెటల్స్ అండ్ మైన్స్ మేజర్, అనిల్ అగర్వాల్ గ్రూప్ దిగ్గజం వైదాంతా లిమిటెడ్ రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కెయిర్న్ ఇండియా సహా తమ వాటాదారులకు రూ. 6.580 కోట్ల మేర ఈ డివిడెండ్ చెల్లించనున్నట్టు తెలిపింది. ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకి రూ. 17.70 వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్ల ఆమోదం లభించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కెయిర్న్ ఇండియీ, వేదంతా విలీనానికి నాన్ రెసిడెన్షియల్ వాటాదారులకు ప్రాధాన్య వాటాల జారీపై ఆర్బీఐ ఆమోదం తప్ప, రెగ్యులేటరీ ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ విలీన ప్రక్రియ పూర్తయిన తరువాత రికార్డ్ డేట్ ను ఖరారు చేయనున్నట్టు తెలిపింది. వేదాంతా వాటాదారులకు ఏప్రిల్ 12 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 1.6 శాతం లాభపడింది. ఇటీవల హిందుస్తాన్ జింక్ భారీ డివిడెండ్ ప్రకటించడంతో లో వేదాంతాకు మెజారిటీ వాటా ఉండటంతో సుమారు రూ. 7000 కోట్లమేర డివిడెండ్‌ను అందుకోవడం తన వాటాదారులకు కూడా ఈ ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది.