వేదాంతా మధ్యంతర డివిడెండ్‌ | Vedanta announces Rs 6,580 cr dividend payout | Sakshi
Sakshi News home page

వేదాంతా మధ్యంతర డివిడెండ్‌

Published Thu, Mar 30 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

Vedanta announces Rs 6,580 cr dividend payout

ముంబై:  మెటల్స్‌ అండ్‌ మైన్స్ మేజర్‌, అనిల్‌ అగర్వాల్‌ గ్రూప్‌ దిగ్గజం వైదాంతా లిమిటెడ్‌ రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.    కెయిర్న్‌ ఇండియా సహా తమ వాటాదారులకు  రూ. 6.580 కోట్ల మేర ఈ  డివిడెండ్  చెల్లించనున్నట్టు తెలిపింది. ఒక రూపాయి ముఖ విలువ కలిగిన  ఒక్కో    షేరుకి రూ. 17.70  వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను  చెల్లించనుంది. ఈ కంపెనీ  బోర్డు డైరెక్టర్ల ఆమోదం లభించినట్టు బీఎస్‌ఈ ఫైలింగ్‌ లో  తెలిపింది.  

కెయిర్న్‌ ఇండియీ, వేదంతా విలీనానికి నాన్‌ రెసిడెన్షియల్‌ వాటాదారులకు  ప్రాధాన్య వాటాల జారీపై ఆర్‌బీఐ ఆమోదం తప్ప, రెగ్యులేటరీ ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ విలీన ప్రక్రియ  పూర్తయిన తరువాత రికార్డ్‌ డేట్‌ ను ఖరారు చేయనున్నట్టు తెలిపింది.  వేదాంతా వాటాదారులకు  ఏప్రిల్‌ 12 రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.6 శాతం  లాభపడింది. ఇటీవల  హిందుస్తాన్‌ జింక్‌ భారీ డివిడెండ్‌ ప్రకటించడంతో లో వేదాంతాకు మెజారిటీ వాటా ఉండటంతో  సుమారు రూ. 7000 కోట్లమేర డివిడెండ్‌ను అందుకోవడం  తన వాటాదారులకు కూడా ఈ ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement