Rs 6
-
వేదాంతా మధ్యంతర డివిడెండ్
ముంబై: మెటల్స్ అండ్ మైన్స్ మేజర్, అనిల్ అగర్వాల్ గ్రూప్ దిగ్గజం వైదాంతా లిమిటెడ్ రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కెయిర్న్ ఇండియా సహా తమ వాటాదారులకు రూ. 6.580 కోట్ల మేర ఈ డివిడెండ్ చెల్లించనున్నట్టు తెలిపింది. ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకి రూ. 17.70 వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్ల ఆమోదం లభించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కెయిర్న్ ఇండియీ, వేదంతా విలీనానికి నాన్ రెసిడెన్షియల్ వాటాదారులకు ప్రాధాన్య వాటాల జారీపై ఆర్బీఐ ఆమోదం తప్ప, రెగ్యులేటరీ ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ విలీన ప్రక్రియ పూర్తయిన తరువాత రికార్డ్ డేట్ ను ఖరారు చేయనున్నట్టు తెలిపింది. వేదాంతా వాటాదారులకు ఏప్రిల్ 12 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 1.6 శాతం లాభపడింది. ఇటీవల హిందుస్తాన్ జింక్ భారీ డివిడెండ్ ప్రకటించడంతో లో వేదాంతాకు మెజారిటీ వాటా ఉండటంతో సుమారు రూ. 7000 కోట్లమేర డివిడెండ్‌ను అందుకోవడం తన వాటాదారులకు కూడా ఈ ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. -
గర్భవతులకు ఆకర్షణీయ పథకం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించినట్టుగానే దేశ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా పేదలు, చిన్న వ్యాపారులు, రైతులు, మహిళలకు, సీనియర్ సిటిజన్స్ కోసం ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు. శనివారం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ప్రభుత్వం రూపొందించిన కొత్త ప్రణాళికలు వెల్లడించారు. దేశంలో మహిళలు, ఉద్యోగినులు, పేదలు, బాగుపడినపుడే దేశం బాగుపడిందని ప్రకటించిన ప్రధాని గర్భవతులకు శుభవార్త అందించారు. ముఖ్యంగా గర్భవతి మహిళల కోసం దేశ వ్యాప్త పథకాన్ని ప్రకటించారు. గర్భవతులకు చికిత్స, ప్రసవం, టీకాలు, పౌష్టికాహారం తదితర వైద్య ఖర్చుల కోసం నెలకు రూ.6 వేల ఇవ్వనున్నట్టు తెలిపారు. డైరెక్ట్ గా ఆయా మహిళల ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయనున్నట్టు చెప్పారు. మాతా శిశు మరణాల నిరోధానికి ఈ పథకం బాగా ఉపయోగనుందన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా 650 జిల్లాలో ఈ ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ ప్రాంతాల్లో 33 శాతం గృహనిర్మాణాలను పెంచనున్నామని మోదీ చెప్పారు. గ్రామీణులకు ఇంటి నిర్మించుకునేవారికి ప్రోత్సాహకాలందించిన మోదీ కొత్త ఇంటి నిర్మాణం లేదా ఉన్న ఇంటిలో కొత్త నిర్మాణాలు కోసం రుణ సౌకర్యం కల్పించనున్నామన్నారు. ఇందుకు గాను రూ. 2 లక్షల రూపాయల రుణాన్ని అందించనున్నారు. అలాగే ప్రధాని ఆవాస యోజన పథకం కింద గ్రామీణులకు రూ.9 లక్షలపైన రుణాలపై 4శాతం వడ్డీ మాఫీ,రూ.12లక్షలపై రుణాలపై 3శాతం వడ్డీమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. -
వేల కోట్లను అప్పగించిన బడా వ్యాపారి?
సూరత్: నల్లధనం నిరోధం కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ మనీ లో మరో సంచలన ఘటన నమోదైంది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు అనేక ఇబ్బందులుపడుతుండగా.. గుజరాత్ కు చెందిన బడా వ్యాపారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ బడా వ్యాపారవేత్త మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. భారీ సంఖ్యలో వేలకోట్ల సొమ్మును ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బిల్డర్, వజ్రాల వ్యాపారి లాల్ జీ భాయ్ పటేల్ ఇపుడు వార్తల్లో నిలిచారు. రూ 500 నుంచి రూ 1000 నోట్లు రద్దు ప్రభావంతో దాదాపు రూ.6 వేల కోట్లను నగదును అధికారులకు అప్పగించారు. భూరి విరాళాలకు , స్వచ్ఛంద దాతృత్వానికి ప్రసిద్ధి చెందిన పటేల్ ఈనిర్ణయం ఎందుకు తీసుకున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు కార్లు, ఇల్లు లాంటి విలువైన బహుమతులను అందించిన చరిత్ర కూడా పటేల్ కు ఉంది. (సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న హరే కృష్ణ డైమండ్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ యజమాని వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలకియా కాదు) అలాగే దాదాపు రూ.200 కోట్ల రూపాయలను బాలికా విద్యా కోసం ఆయన విరాళమిచ్చారు. కాగా కరెన్సీ బ్యాన్ ఎఫెక్ట్ తో చాలామంది నల్లధనం కుబేరులు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తుండగా, మరికొంతమంది కోట్లాది రూపాయలను గంగపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
జెఎస్డబ్ల్యు ఎనర్జీ చేతికి జెఎస్పిఎల్ యూనిట్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సుమారు రూ 46,000 కోట్ల రుణభారంతో ఉన్న సోదరుడు నవీన్ జిందాల్ ను ఆదుకోవడానికి జెఎస్డబ్ల్యు ఎనర్జీ అధిపతి సజ్జన్ జిందాల్ ముందుకొచ్చారు. దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థ గా రూపొందే వ్యూహంలో బాగంగా భారత అగ్రశ్రేణి ఉక్కు సంస్థ జెఎస్డబ్ల్యు ఎనర్జీ ఈ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ నేతృత్వంలోని అగ్రగామి సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జెఎస్పిఎల్) ను ఆదుకోవడానికి రంగం సిద్దం చేశారు. చత్తీస్‌గఢ్ లోని పవర్ ప్లాంట్ ను జెఎస్డబ్ల్యు ఎనర్జీ యూనిట్ ను రూ .6,500 కోట్లకు జెఎస్డబ్ల్యు ఎనర్జీ సొంతం చేసుకోనుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోనున్నట్టు ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. రాయపూర్ లోని జెఎస్పిఎల్ చెందిన 1,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను కొనుగోలు చేయనున్నట్లు జెఎస్ డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ తెలిపారు. ఆస్తులను విక్రయించడానికి చూస్తున్న నేపథ్యంలో మోనేటిజేషన్ లో భాగంగా ద్రవ్య సరఫరా, ఉత్పత్తి ప్రణాళికలను రూపొందించే ప్రణాళికతో ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఒప్పందం విలువ రూ .4,000 కోట్లు, సంస్థ ప్రస్తుత నికర ఆస్తులు మొత్తం రూ .6,500 కోట్లకు చేరిందని జిందాల్ ప్రతినిధి తెలిపారు. ఈ ఒప్పందం 2018 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ పవర్ ప్లాంట్ కొనుగోలు ద్వారా బొగ్గు ఉత్పత్తిలో తూర్పు భారతదేశం లో పట్టు సాధించాలనేది ప్లాన్. అటు జెఎస్పిఎల్ దాని అప్పులను తీర్చేందుకు కూడా ఈ డీల్ సహాయం చేస్తుంది. మరోవైపు రెండు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న టాప్ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఎస్బిఐ ) కు కూడా ఇది ఒక వరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ తాజా ఒప్పందంతో జెఎస్ డబ్ల్యు ఎనర్జీ మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,531 మెగావాట్లకు పెరగనుంది.అటు ఈ ప్రకటన ఫలితంగా షేర్ మార్కెట్ లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ భారీగా లాభపడింది. 3.5 శాతం లాభాలతో షేర్ ధర రూ 71. 45 దగ్గర ట్రేడ్ అవుతోంది. గతంలో జిందాల్ సోదరులు విదేశీ ఆస్తులను కొనుగోలులో పోటీ పడ్డారు , కానీ సుప్రీంకోర్టు బొగ్గు గనుల లైసెన్సులు రద్దు చేయడం, కమోడిటీ మార్కెట్ల బలహీనత జేఎస్సీఎల్ లాభాలను ప్రభావితం చేశాయి. అటు రష్యా, చైనా నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ పై దిగుమతి సుంకం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కొన్ని సూచనలు కూడా చేశారు. దీంతో జిందాల్ సోదరులు తమ వ్యాపార ఎత్తుగడలను సమీక్షిస్తున్నట్టు కనిపిస్తోంది. -
దిగివస్తున్న మాల్యా?
బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి తప్పించుకు తిరుగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యవహరంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇటు సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో విదేశాల్లో చక్కర్లు కొడుతున్న మాల్యా బెంబేలెత్తినట్టు కనిపిస్తోంది. ఈడీ, కోర్టుముందు హాజరుకాకుండా, బేరసారాలకు దిగుతున్న విజయ్‌మాల్యా మరింత దిగివచ్చినట్టు తెలుస్తోంది. తమ హెచ్చరికలను ఖాతరుచేయని మాల్యా వ్యవహారంపై ఈడీ సీరియస్ గా స్పందించడంతో రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి మరో కొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చారు. బుదవారం నాటి ఈడీ షాక్‌తో మొదటికే మోసం వస్తుందని భావించిన మాల్యా.. మొత్తం సెటిల్మెంట్ను రూ.6 వేల కోట్లకు పెంచుతూ ప్రతిపాదించారు. గతంలో 4వేల కోట్లు మాత్రమే చెల్లిస్తానని చెప్పిన మాల్యా, ఇప్పుడు మరో 2వేల కోట్లను జోడించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త ప్రతిపాదనను ఆయన త్వరలోనే కోర్టుకు ముందుకు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పాస్ పోర్టు రద్దుచేయాలని ఈడీ ప్రభుత్వానికి లేఖ రాయడం వల్లే ఈ ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ముందుగా మీ ఆస్తుల విలువ ఎంతో చెప్పండన్న సుప్పీంకోర్టు మొట్టికాయలు కూడా గట్టి ప్రభావాన్నే చూపించాయి. కాగా, ఐడీబీఐ కేసులో తన ముందు విచారణకు హాజరుకాని మాల్యా పాస్ పోర్టు రద్దు చేయాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రభుత్వానికి బుధవారం లేఖ రాసింది. మరోవైపు బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్లు, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకుని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. -
6,000 వరకూ పెరగనున్న హోండా కార్ల ధరలు !
న్యూఢిల్లీ: హోండా కార్ ఇండియా కంపెనీ తన కార్ల ధరలను రూ.6,000 వరకూ పెంచాలని యోచిస్తోంది. ప్రతికూలమైన ఎక్స్ఛేంజ్ రేటు ప్రభావం కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ధరలను ఈ మేరకు పెంచాలని హోండా కార్ ఇండియా భావిస్తోంది. వచ్చే నెల నుంచి ధరలు పెరిగే అవకాశాలున్నాయి. ఏఏ మోడల్ ధరలను ఎంతెంత పెంచాలన్న విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కాగా వాహనాలపై మౌలిక సుంకం విధించిన నేపథ్యంలో ఈ నెల మొదట్లోనే ఈ కంపెనీ తన వాహనాల ధరలను రూ.79,000 వరకూ పెంచింది. ఈ కంపెనీ భారత్‌లో రూ.4.31 లక్షలున్న బ్రియో నుంచి రూ.26 లక్షలున్న ఎస్యూవీ సీఆర్వీ వరకూ మొత్తం ఆరు మోడళ్లను విక్రయిస్తోంది.