
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో గ్రూపు ఏర్పాటు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల పథకానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కార్యదర్శుల బృందం రూపొందించనుంది.
పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేలా పూర్తి పారదర్శకంగా ఉండేలా పథకాన్ని రూపొందించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఈనెల 29న మరోసారి కేంద్ర, రాష్ట్రాల ఆహార కార్యదర్శులు సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment