న్యూఢిల్లీ: దివంగత బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన 24 జనవరి, 1924 బిహార్‌లోని సమస్తీపూర్‌లో జన్మించారు. బడుగు, బలహీలన వర్గాల కోసం ఠాకూర్ చేసిన కృషికి గుర్తింపుగా.. ఆయన శత జయంతి సందర్భంగా భారతరత్న ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
జననేత ‘జననాయక్’గా కర్పూరి ఠాకూర్ ప్రసిద్ధి. ఆయన రెండు సార్లు బిహార్‌కు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మొదటి సారి 1970 డిసెంబర్ నుంచి 1971 వరకు బిహార్ సీఎంగా పనిచేశారు. రెండో సారి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ సీఎంగా సేవలు అందించారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు
చదవండి: Subhash Chandra Bose Jayanti Special: సుభాష్ చంద్రబోస్ ఏం చదువుకున్నారు?
Comments
Please login to add a commentAdd a comment