
న్యూఢిల్లీ: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో తపుపడు వార్తల తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్‌ను కేంద్రం ప్రశ్నించింది. తాము ఫేక్ న్యూస్‌గా పేర్కొన్నవాటిని తొలగించడంలో ఈ కంపెనీలు విఫలమయ్యాయని కేంద్రం తీవ్రంగా స్పందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలు చర్యలు తీసుకోకపోవడంతో తాము అలాంటి వార్తలను తొలగించాల్సివస్తోందని, దీంతో తమపై విమర్శలు వస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అయితే కంపెనీలకు తప్పుడు వార్తల విషయంలో ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదని సదరు వర్గాలు తెలిపాయి. గతంలో పలు యూట్యూబ్ చానెళ్లు, ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్లను తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం నిషేధించింది. ఈ విషయంపై మరింతగా చర్చించేందుకు సమాచార శాఖ టెక్ కంపెనీలతో సమావేశమైనట్లు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment