Fake News Media
-
రాజ్యాంగ హక్కులపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబు సర్కార్
-
ఎల్లో మీడియా పైత్యం.. అధికారుల బదిలీలపై చెత్త రాతలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఫలితం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆయన తాను కోరుకున్నట్లుగానే ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేయగలుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో తొమ్మిది మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం వెనుక ఏమి జరిగిందా అన్నదానిపై విశ్లేషణలు వస్తున్నాయి. కచ్చితంగా టీడీపీ కూటమి కేంద్రంలోని బీజేపీ ద్వారా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఇంతమందిని బదిలీ చేయించారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఎందుకంటే వీరిలో కొందరు అధికారులు కొద్ది కాలం క్రితమే బదిలీ అయినా, వారిని అక్కడ ఉండకుండా ఎన్నికల విధులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీములు బాగా అమలు చేసిన అధికారులపైన, ఆయా చోట్ల టీడీపీ చేసిన అరాచకాలను అడ్డుకున్న పోలీసు అధికారులపైన టీడీపీ, ఈనాడు తదితర ఎల్లో మీడియా కక్ష కట్టి వారు బదిలీ అయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం అన్న భావనకు వచ్చిన చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పలురకాలుగా ప్రేమ లేఖలు రాయడం, ఆ తర్వాత ప్రలోభాలకు గురి చేయడం ద్వారా ఆయనను తనదారిలోకి తెచ్చుకున్నారు. అయినా అది జగన్‌ను ఓడించడానికి సరిపోవడం లేదని అనుకుని బీజేపీవైపు చూశారు. బీజేపీ పొత్తులోకి వస్తే వారివల్ల కలిసి వచ్చే ఓట్ల గురించి కాకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ద్వారా కేసుల బెడద లేకుండా చూసుకోవడం, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరగకుండా జాగ్రత్తపడడం, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రయోజనాలను ఆశించి పొత్తులోకి వెళ్లాలని ఆయన కోరుకున్నారు. దాని కోసం ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్ల పడి, ఆత్మగౌరవాన్ని వదలుకుని ఎలాగైతేనేం బీజేపీ పెద్దల మనసును ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా ఏపీలో కూటమి సభలో పాల్గొనేలా చేయగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో తమ మనుషులు, ఇతర పార్టీలలో ఉన్న కోవర్టులతో ఆపరేషన్ ఆరంభించారు. తొలుత ఎన్నికలను నెల రోజుల పాటు ఆలస్యం చేయడంలో సఫలం అయ్యారన్న అభిప్రాయం కలిగింది. 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకుండో తేదీకి ఎన్నికలు పూర్తి అయిపోతే, ఈసారి ఎన్నికలు నాలుగోదశకు వెళ్లడం, మే పదమూడు వరకు అంటే నెల రోజులు ఆలస్యం కావడం చూస్తే ఇది కూటమి పనే అన్న సందేహం వస్తోంది. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసే విధంగా వారితో ఈ రెండు నెలలు ప్రజలకు సేవలందించకుండా టీడీపీ కూటమి అడ్డుకోగలిగింది. వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర టీడీపీ నేతలకు ఉన్న వ్యతిరేకత అందరికి తెలిసిందే. వారు గతంలో వలంటీర్ల పట్ల ఎంత నీచంగా మాట్లాడింది అందరికి గుర్తు ఉంది. కాకపోతే ఇప్పుడు రివర్స్ అయి తమ మెడకే చుట్టుకోవడంతో మాట మార్చి వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు చెబుతున్నప్పటికీ జనం ఎవరూ నమ్మడం లేదు. దానికి తోడు వలంటీర్ల వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ ఆఫీస్ నుంచి ఒకటికి పదిసార్లు ప్రజలకు మెస్సేజీలు వెళుతున్నాయి. దానిని బట్టే వారు ఎంత కంగారు పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ కూడా వలంటీర్ల వ్యవస్థపై వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం కూడా తప్పే అని చెప్పాలి. చంద్రబాబుకు వివిధ పార్టీలలో కోవర్టులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. 2019 ఓటమి పాలయ్యాక చంద్రబాబు వెంటనే ప్లేట్ ఫిరాయించి బీజేపీకి జై కొట్టే పని పెట్టుకున్నారు. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపిచారు. అయినా ఆ పార్టీ పెద్దలకు చంద్రబాబుపై నమ్మకం కుదరలేదు. ఆ తరుణంలో ఈడీ, ఐటీ దాడులు చేయడం, చంద్రబాబు పీఎస్ వద్ద రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని సిబిటిడి ప్రకటించడం జరిగింది. దాంతో మరింతగా బీజేపీకి లొంగిపోయి ప్రధాని మోదీని పొగడడం ఆరంభించారు. తత్ఫలితంగా తనపై కేసులు ముందుకు వెళ్లకుండా చేసుకోగలిగారు. 2019 ఎన్నికలకు ముందు మోదీని, సీబీఐ, ఐటి, ఈడి వంటి వాటిని చంద్రబాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. ఎన్నికల తర్వాత గప్ చుప్ అవడమే కాకుండా బీజేపీ వారి ప్రాపకం కోసం నానా పాట్లు పడ్డారు. అందుకోసం పవన్‌ను ప్రయోగించారు. ఆయనను బీజేపీ చివాట్లు పెట్టింది. అయినా వదలకుండా ఎలాగైతే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ యధా ప్రకారం తన కుట్రలకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని మూడు పార్టీల కూటమి ఓడించలేదన్న అభిప్రాయానికి వచ్చి, ఎన్నికల కమిషన్ ను కూడా తన ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించి ఉండవచ్చని అంటున్నారు. ఇందుకోసం బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారిని ప్రయోగించారు. వారితో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పావుగా మార్చుకుని కధ ఆరంభించారు. ఆయనతో హైకోర్టులో కేసులు వేయించడం, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు పంపించడం, మరోవైపు బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా ఎక్కడ ఎవరికి చెప్పించాలో చెప్పించి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నట్లు జనం నమ్ముతున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ పైన చంద్రబాబు 2019లో ఎలాంటి విమర్శలు చేసింది అందరూ చూశారు. అప్పటి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఆయన రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై పలు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎస్పిలను బదిలీ చేసింది. ఆ చర్యను తీవ్రంగా తప్పు పడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని దుయ్యబట్టారు. అంతేకాక ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. అయినా ఫలితం దక్కకపోవడంతో వెంకటేశ్వరరావును బదిలీ చేయక తప్పలేదు. అసలు తొలుత కమిషన్ చెప్పినవారిని బదిలీ చేయడానికే ఆయన ఇష్టపడలేదు. దాంతో కమిషన్ సీరియస్ అయింది. ఇన్ని చేసినప్పుడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఎన్నికల కమిషన్‌లో నియంత కనిపించారు. మోదీనే కమిషన్‌ను నడిపిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తే దానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్ బదిలీలు చేస్తే అది గొప్ప విషయంగా ప్రొజెక్టు చేస్తున్నారు. దీనిని బట్టే తెలుగుదేశంతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత నీచంగా మారాయన్నది తెలిసిపోతుంది. ఈనాడులో అయితే పేజీల కొద్ది కధనాలు ఇచ్చి తన శాడిజాన్ని ప్రదర్శించింది. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను వార్తగా ఇవ్వడం తప్పు కాదు. కానీ, బదిలీ అయినవారిపై విషం కక్కుతూ ఎన్నికలతో సంబంధం లేని అనేక విషయాలను వక్రీకరిస్తూ తన పైత్యాన్ని అంతటిని ఈనాడు మీడియా ప్రదర్శించి వికృతానందం పొందింది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ సభలో మైక్ పనిచేయకపోతే దానికి కొందరు పోలీసు అధికారులను బాధ్యుల్ని చేస్తూ, కేంద్రం వారిపై చర్య తీసుకోబోతోందని ఈనాడు ప్రచారం చేసింది. అది జరగలేదు. ఇప్పుడు తొమ్మిది మందిని బదిలీ చేస్తే శరభ శరభ అంటూ పూనకం వచ్చినట్లు రాస్తూ అధికారులను అవమానించింది. వారంతా ఇంగితం మర్చారని, అధికార వైఎస్సార్సీపీకి బంట్లుగా మారారని, తెలుగుదేశం బాకా పత్రికగా మారిన ఈనాడు ఆరోపించింది. విపక్షాలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే కమిషన్ తన అధికారాలను వినియోగించి ఈ చర్య తీసుకుందని ఆ పత్రిక పేర్కొంది. అంటే దీని అర్ధం ఏమిటి? ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసుకోకుండా, విపక్షాల ఆరోపణలను ఆధారంగా చేసుకుని చర్య తీసుకున్నట్లే కదా!. ఇలా చర్య తీసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎవరైనా అంటే కాదనే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. తిరుపతి కలెక్టర్ గా నియమితులైన లక్ష్మీ షా జనవరి 31 న జాయిన్ అయ్యారు. ఈనాడు దృష్టిలో ఆయన చేసిన తప్పు ఏమిటంటే టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకరరెడ్డిని కలవడమే. అంతకు మించి ఆయన చేసిన తప్పు ఏమీ లేదనే కదా!. విపక్షాలతో పాటు ఈనాడు వారు కోరుకున్నట్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై కేసు పెట్టలేదట. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే, రెండు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేశారంటే ఏదో ఒత్తిడి లేదని ఎలా అనుకోగలుగుతాం?. లక్ష్మీ షా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సఫలం చేయడంలో కీలక పాత్ర పోషించినవారిలో ఒకరు. ఆ ద్వేషంతో కూడా టీడీపీ కూటమి ఆరోపణలు చేసి ఉండవచ్చు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈనాడు ఎన్ని అసత్యాలు రాసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని మోదీ సభ విఫలం అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అయితే, దానినంతటిని ఎస్పీపై నెట్టివేసింది. వైఎస్సార్‌సీపీవారు అరాచకాలు సృష్టించారట. తెలుగుదేశం వారు అసలు ఏమీ చేయలేదట. ఎంత దారుణంగా రాసిందో చూడండి. ప్రధాని మోదీ సభలో మైక్ లు పనిచేయకపోవడం వల్లే ఎస్పీని బదిలీ చేశామని అదే కారణమని ఎన్నికల కమిషన్ చెప్పనే లేదు కదా!. పోనీ ఫలానా కారణమని కమిషన్ తెలిపిందా?. కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం తమ పైత్యం అంతటిని కలిపి విషం చిమ్మాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లు వింటున్నారట. ఇలా ఈనాడు పత్రిక తనకు తోచినవన్నీ రాసేసి అధికార యంత్రంగాన్ని భయపెట్టడానికి యత్నించింది. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవద్దని ఎవరూ చెప్పరు. కానీ, విపక్షాలు పాలించే రాష్ట్రాలలోనే ఇలా చేస్తుంటే కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే విమర్శలు వస్తాయి. పశ్చిమబెంగాల్లో డీజీపీని మార్చిన వైనం విమర్శలకు దారి తీసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొందరు హోం శాఖ కార్యదర్శులను మార్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించినా, వారంతా ముఖ్యమంత్రుల కార్యాలయంతో పాటు మరోచోట పనిచేస్తున్నారని వెల్లడించింది. అంటే వారిపై ఎలాంటి అభియోగాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలపలేదు. ఏపీలో కొందరు అధికారులను బదిలీ చేయగానే వారిపై తెలుగుదేశం మీడియా నానా చెత్త అంతా రాశాయంటే ఇదంతా బ్లాక్ మెయిలింగ్ టాక్టీస్ అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అధికారులు ఎవరైనా నిష్ఫక్షపాతంగా ఉంటే వారిని చెడగొట్టే లక్ష్యంతోనే టీడీపీ మీడియా ఇలా రాస్తోంది. అదే తాము కోరుకున్న అధికారి లేదా తమకు భయపడే అధికారి విశాఖలో ఉండి ఉంటే,తమకు సంబంధించిన మార్గదర్శి చిట్స్ సంస్థ అక్రమంగా రవాణా చేస్తున్న 51 లక్షల నగదును పట్టుకునే వారు కాదు కదా అన్నది ఈనాడు వారి ఉద్దేశం కావచ్చు. రామోజీరావు, రాధాకృష్ణల పిచ్చి కాకపోతే అధికారులే ఓట్లు వేయించే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎప్పటికి ఓడిపోయేవారు కాదు కదా! ముఖ్యమంత్రి జగన్ నమ్ముకుంది జనాన్ని కానీ.. అధికార యంత్రాంగాన్ని కాదన్న సంగతి ఆయన చేస్తున్న బస్ యాత్రలను బట్టే తెలుస్తుంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చావు చిల్లర
రావిశాస్త్రి ‘కార్నర్ సీట్’ కథ సుప్రసిద్ధం. అందులో ఒకతను రైలు ప్రయాణం చేయబోయి కంపార్ట్మెంట్లోని కార్నర్ సీట్ ఆశిస్తాడు. కూచునే లోపల ఒక ఆకుపచ్చకోటు వాడు ఆ సీటును ఆక్రమిస్తాడు. అప్పట్నించి ఇతను ఆ ఆకుపచ్చకోటు వాణ్ణి తిట్టుకుంటూనే ఉంటాడు. ఆ ఆకుపచ్చకోటు వాడు ఇదంతా పట్టకుండా ఎటో చూస్తుంటాడు. ఏదో ఆలోచిస్తుంటాడు. మధ్యలో ఒకచోట రైలు ఆగుతుంది. తిరిగి బయలుదేరబోతుంటుంది. ఒక్క క్షణం. ఆకుపచ్చకోటు వాడు ఒక్క ఉదుటున కంపార్ట్మెంట్ దిగేస్తాడు. ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ముక్కలైపోతాడు. రెప్పపాటు. అంతవరకూ అతణ్ణి తిట్టుకున్న ఇతను నిశ్చేష్టుడవుతాడు. అతనికీ ఇతనికీ ఏ సంబంధమూ లేదు– కార్నర్ సీటుతో తప్ప. కాని ఇతనికి ఏడుపు వస్తుంది. దుఃఖం కలుగుతుంది. ఈ లోకంలో ఎంతో ఎండా నీడా గాలి నీరూ వర్షం ఉన్నాయి. వాటిని అనుభవించకుండా ఏదో ఒక సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి ఊరట చెందకుండా ఏ కష్టానికి ఎందుకు చనిపోయాడో అని వెక్కివెక్కి ఏడుస్తాడు. ఎదుటివాడి చావు పట్ల మనకు ఉండాల్సిన వేదన, సహానుభూతి గురించి రావిశాస్త్రి రాసిన గొప్ప కథ అది. ఆర్.కె.నారాయణ్ ‘మిస్సింగ్ మెయిల్’ కథ కూడా సుప్రసిద్ధమే. వినాయక్ మొదలి వీధిలో ఇంటింటికీ ఉత్తరాలు అందించే పోస్ట్‌మేన్ తానప్పకు ఆ వీధిలోని అందరి కష్టసుఖాలు తెలుసు. రామానుజమ్ గారి కుమార్తె కామాక్షికి చాలా రోజులుగా సంబంధాలు కుదరడం లేదని తెలుసు. ఇప్పుడు కుదిరిన ఢిల్లీ సంబంధం ఈ ముహూర్తం దాటితే తిరిగి మూడేళ్ల వరకు అబ్బాయికి వీలు కాదనీ తెలుసు. రామానుజమ్ ఇంట్లో ఒకవైపు పెళ్లి పనులు జరుగుతుండగా మరోవైపు తానప్పకు టెలిగ్రామ్, ఉత్తరం అందుతాయి. వాటిలో రామానుజమ్ మేనమామ మరణవార్త ఉంటుంది. ఇప్పుడేం చేయాలి? ఈ కబురు రామానుజమ్కు తెలిస్తే వెంటనే బయల్దేరాలి. పెళ్లి ఆగిపోవాలి. మళ్లీ మూడేళ్ల వరకూ పోస్ట్‌పోన్ చేయాలి. అందుకే తానప్ప ఆ టెలిగ్రామ్, ఉత్తరం దాచి పెడతాడు. పెళ్లయ్యి అమ్మాయిని సాగనంపాక మెల్లగా ఆ సంగతి తెలియచేస్తాడు. మరణవార్త ఎప్పుడు, ఎలా చెప్పాలో తెలిసి సంస్కారం పాటించిన తానప్పను పాఠకుడు గుండెల్లో పెట్టుకుంటాడు. చావును గౌరవించడం ప్రతి నాగరికతలో ఉంది. చనిపోయిన వ్యక్తికి ‘అంతిమ సంస్కారం’ నిర్వహించడం సాటి మనిషి సంస్కారం. జననంతో మొదలయ్యే మనిషి జీవనవృత్తం మరణంతో ముగుస్తుందని అందరికీ తెలిసినా మరణం తెచ్చే శూన్యం, వెలితి ఆ కుటుంబానికి, సంబంధీకులకు, స్నేహితులకు చాలా తీవ్రమైనవిగా జనులు భావిస్తారు. అందుకే నిన్న మొన్నటి వరకూ పల్లెల్లో ఒక వ్యక్తి మరణిస్తే ఎత్తుబడి అయ్యేంత వరకూ ఊరు ఊరంతా పొయ్యి ముట్టించేది కాదు. చావుఇంటి దగ్గర చేరి ధైర్యం చెప్పడం, జరగవలసిన పనులు చూడటం చేసేవారు. మనిషి చనిపోవడం అంటే ‘కూకటి వేళ్లతో సహా చెట్టు కూలిపోవడం’గా గాథా సప్తశతి వ్యాఖ్యానిస్తుంది. చెట్టు ఆధారంగా ఎంత జీవం పెనవేసుకుని ఉంటుందో మనిషి ఆధారంగా కూడా అనేక జీవనాలు పెనవేసుకుని ఉంటాయి. ఇప్పటికీ కొన్ని గిరిజన సముదాయాలైతే తమ సమూహంలోని ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మరణిస్తే ఆ ఆవాసాన్ని, గూడేన్ని ఏకంగా ఖాళీ చేసి వెళ్లిపోతాయి జ్ఞాపకాలను తట్టుకోలేక. అందుకే మనిషి పోయినప్పుడు పోయిన వ్యక్తిని గౌరవించడంతో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వేదనను కూడా గౌరవించి మెలగాలి. ఈ దేశం విన్న అత్యంత విషాదకరమైన మరణవార్త గాంధీ గారి హత్య. రేడియోలో ఈ వార్త విన్న ఒక బాలిక పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి ‘అమ్మా... గాంధీ గారు చనిపోయారట’ అంటే ఆ తల్లి ఉలిక్కిపడి లేచి కూతురి చెంప మీద లాగి పెట్టి ఒక్కటి వేస్తుంది– ‘ఏమిటా పాడు మాటలు’ అని! ఆ తర్వాత ఆ వార్త నిజం అని తెలిసి కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది. ఇంద్రగంటి జానకీబాల ‘కనిపించే గతం’ నవల ఈ సంఘటనతోనే మొదలవుతుంది. గాంధీ గారి మరణవార్త విని ఎక్కడికక్కడ కూలబడి విలపించినవాళ్లు, సినిమా హాళ్లలో సగం నుంచి లేచి ఏడ్చుకుంటూ బయటపడినవాళ్ళు, మూడు రోజులు లంకణం చేసినవారు ఎందరో ఉన్నారు. మహనీయులు, కళాకారులు, నాయకులు, ఆపద్బాంధవులు... జనులతో మమేకమై ఉంటారు. అందువల్ల వారి మరణ వార్తల పట్ల ఇంకా గౌరవం పాటించాలి. నిర్థారణలు చేసుకోవాలి. అప్పుడే చెప్పాలి. కాని ఇవాళ ఒక వికృతమైన సంస్కృతి ఎల్లెడలా కనిపిస్తూ ఉంది. దానిని పైశాచిక సంస్కృతి అనవచ్చు. చిల్లర సంస్కృతి అనవచ్చు. సోషల్ మీడియా సంస్కృతి అని కూడా అనవచ్చు. వ్యక్తుల చావు వార్తలను సత్యాసత్యాలతో సంబంధం లేకుండా పుకార్ల స్థాయికి దిగజార్చడం. బతికున్నవారిని చంపడం. వైద్యం తీసుకుంటూ పోరాడుతున్నవారికి చావు ముహూర్తం లిఖించడం. దీనికి హతాశులైన ఆ సజీవులు తామే ముందుకొచ్చి ‘బతికున్నాం మొర్రో’ అని చెప్పడం. బంధువులు దిగ్భ్రాంతితో ‘అవన్నీ అబద్ధాలు’ అని చెప్పాల్సి రావడం. జవాబుదారీతనం లేని వ్యవస్థ డ్రైనేజీలాంటిది. ఆ డ్రైనేజీతో మనకెందుకు అని నలుగురూ ఊరుకోవడం వల్లే అందులో కంపుతోపాటు ఇంపు కూడా కొట్టుకొనిపోవాల్సి వస్తోంది. ఫేక్ఐడిలు, ఆనవాలు లేని వాట్సప్‌లతో తప్పుడు చావువార్తలు వ్యాప్తి చేసి సైకిక్ స్టిమ్యులేషన్ పొందుతున్న వారు ఎంతటి మానసిక రోగులో అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వాళ్లు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు. చావును గౌరవిద్దాం. చావుపై చిల్లర ఏరుకునే వ్యవస్థను చావగొడదాం. -
ఆ చానళ్లను మూసేయండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై తప్పుడు, సంచలనాత్మక వార్తలను వ్యాప్తి చేస్తున్న మూడు చానళ్లను మూసేయాల్సిందిగా యూట్యూబ్‌ను కేంద్రం ఆదేశించింది. ఆజ్‌తక్ లైవ్, న్యూస్ హెడ్‌లైన్స్, సర్కారీ అప్డేట్స్ చానళ్లు తప్పుడు వార్తలకు వాహకాలుగా మారాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం మంగళవారం ప్రకటించింది. కేంద్ర పథకాలతో పాటు సుప్రీంకోర్టు, సీజేఐ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కూడా ఇవి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం బుధవారం యూట్యూబ్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆజ్‌తక్ లైవ్ చానల్‌కు ఇండియాటుడే గ్రూప్‌తో సంబంధం లేదని వెల్లడించాయి. ఈ మూడు చానళ్లకు కలిపి 33 లక్షల మంది సబ్స్క్రైబర్లున్నాయి. వాటి వీడియోలకు 30 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. -
అమూల్‌పై టీడీపీ టిష్యూ పేపర్ తప్పుడు కథనాలు: మంత్రి అప్పలరాజు
సాక్షి, విశాఖపట్నం: అమూల్ డెయిరీ విషయంలో యెల్లో మీడియా రాస్తున్న తప్పుడు కథనాలపై మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. టీడీపీ టిష్యూ పేపర్ ఈనాడులో సర్వం అమూల్ పాలు అంటూ తప్పుడు కథనం రాశారని, సర్వం అమూల్ కాదు.. సర్వం హెరిటేజ్ పాపం అని రాయలన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తప్పుడు కథనాలపై నిప్పులు చెరిగారు మంత్రి అప్పలరాజు. ఉక్రోషంతో ప్రభుత్వంపై ఈనాడు వార్తలు రాస్తోందన్నారు. అమూల్ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని, రైతులకు గౌరవం పెరిగిందంటే అమూల్ వల్లనే కాదా అని ప్రశ్నించారు. జగనన్న పాల వెల్లువ ద్వారా రైతులకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. ‘2.5 లక్షల లీటర్లు రోజుకు ఉత్పత్తి చేసే చిత్తూరు డైరీని చంద్రబాబు నాయుడు హయాంలోనే మూసేసారు. ఆ తర్వాత హెరిటేజ్‌ను చంద్రబాబు స్థాపించారు. డెయిరీని మూయించడం కూడా చంద్రబాబు గొప్పగా చెప్పుకున్నారు. ఇటువంటి వాస్తవాలు ఎందుకు రామోజీరావు రాయడం లేదు. 33 ఏళ్ళ, 99 ఏళ్ళ లీజు పాలసీని తీసుకువచ్చింది చంద్రబాబే కదా? రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన అక్రమాలపై ఎందుకు ఈనాడులో రాయలేదు. మిగతా డెయిరీలకు అమూల్‌కు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్లాయో చెప్పాలి. అమూల్ రాకపోయి ఉంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఋషికొండలో ఏమి జరిగింది? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలే కదా..ప్రైవేట్ భవనాలు కాదు కదా? రామోజీ ఫిల్మ్ సిటీని కొండలు తవ్వకుండా కట్టారా? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర.. రామోజీ ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు చుస్తే చనిపోయేవారు. ఏపీకి మొత్తం అప్పు 3.8 లక్షల కోట్లని కేంద్ర మంత్రి చెబితే..దాన్ని వక్రీకరించి సుమారు 10లక్షల అని రాశారు’ అని మండిపడ్డారు మంత్రి అప్పలరాజు. ఇదీ చదవండి: సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు -
జీతాలపై వికృత రాతలు
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు ఇవ్వకుండా పోస్ట్ డేటెడ్ జీవోలతో మభ్యపుచ్చినా ఈనాడు రామోజీకి చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, చివరకు చిరుద్యోగులైన పారిశుధ్య సిబ్బందికి జీతాల పెంపు దేవుడెరుగు.. ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు కనీసం జీతాలు ఇవ్వకపోయినా ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా సకాలంలో చెల్లిస్తుంటే వక్రీకరణలతో పచ్చ పత్రికలో కట్టు కథలు ముద్రిస్తున్నారు. నాడు దళారీల దందా.. చంద్రబాబు హయాంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక్క నెల కూడా సమయానికి జీతాలివ్వలేదు. ఏజెన్సీల పేరిట టీడీపీ నేతలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దోచుకుతిన్నారు. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ మధ్య దళారీలు లేకుండా నెల నెలా సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నా రామోజీ తప్పుడు కథనాలు వండుతున్నారు. కోవిడ్ లాంటివి లేకున్నా.. ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులదీ నాడు అదే దుస్థితి. మొదటి వారంలో జీతాలు అందుకోవడం గగనమే. అంగన్వాడీలకు నెలల తరబడి బకాయిలే. మధ్యాహ్న భోజన కార్మికులకూ బాకీలే. ఇక 108, 104 ఉద్యోగులదీ అదే పరిస్థితి. కొందరికైతే సంవత్సరం దాటినా జీతాలు అందని దయనీయ పరిస్థితులు చంద్రబాబు పాలనలో నెలకొన్నాయి. గత సర్కారు హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభం లేదు. లాక్డౌన్లు, ఆర్థిక ప్రగతి మందగమనం లాంటి పరిస్థితులూ ఉత్పన్నం కాలేదు. అయినా సరే ఏనాడూ జీతాలు సకాలంలో ఇచ్చిన పాపాన పోలేదు. సంక్షోభాలను అధిగమిస్తూ సకాలంలో.. కోవిడ్ సంక్షోభంతో పాటు ఆర్థిక మందగమనం లాంటి ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం నిర్వర్తించని విధంగా సంక్షేమాన్ని, నెలకు సుమారు రూ.1,700 కోట్లకు పైగా సామాజిక పెన్షన్ల బాధ్యతనూ నెరవేరుస్తూనే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులను సక్రమంగా నిర్వర్తిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం అప్కాస్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది. దళారీలను నిర్మూలించి ఏజెన్సీ వ్యవస్థను రూపుమాపింది. నేరుగా వారి ఖాతాల్లోకే మొదటి తారీఖు కల్లా జీతాలు జమ చేస్తోంది. ఐఏఎస్‌ల కంటే ముందుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తోంది. తొలి ఏడు రోజుల్లోనే క్రమం తప్పకుండా జీతాలు ఇస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చినా, దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఏపీలో జీతాల చెల్లింపులు చాలా మెరుగ్గా ఉన్నాయన్నది సుస్పష్టం. డిసెంబర్ నెలలో 12వ తేదీ నాటికి సుమారు రూ.6 వేల కోట్లను జీతాల కోసం ప్రభుత్వం చెల్లించింది. అదే పొరుగున ఉన్న రాష్ట్రంలో జిల్లాల వారీగా జీతాల చెల్లింపులు చేస్తున్నారు. ఏ రోజు కూడా మొదటి తారీఖు అనే మాటే లేదు. ప్రతి నెలా తేదీ, ఆ తర్వాతే చెల్లింపులు చేస్తున్నారు. ఇదీ చదవండి: రామోజీ.. అస్మదీయ తకథిమి -
ఎల్లో మీడియా కు నరకయాతన..
-
ఏపీలో ప్రభుత్వ పాఠశాల ఎక్కడ మూతపడిందో చూపించాలి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలపై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లోమీడియా తప్పుడు కథనాలు రాసింది. రాష్ట్రంలో ఒక్కబడి కూడా మూతపడలేదు. ఏ పాఠశాల మూతపడిందో చూపించాలి. దేశ చరిత్రలోనే విద్యారంగంలో సంస్కరణలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఈ సంస్కరణలు నూతన విద్యా విధానానికి అనుగుణంగానే సాగుతున్నాయి. ప్రతీ ఒక్కరికీ విద్య అందాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. పాఠశాల స్థాయి నుంచి ఉత్తమమైన విద్య అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారు. బడి ఎక్కడ మాయమైందో రామోజీరావు చెప్పాలి. చదువుల్లో మీకు గందరగోళం వచ్చింది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీకు గందరగోళానికి గురవుతున్నారు. ఈ రాతలన్నీ పట్టుకుని చంద్రబాబు మాట్లాడతాడు. డ్రాప్ ఔట్స్ తగ్గించి పిల్లల్ని బడి బాట పట్టించడానికి అమ్మఒడి పెట్టాము. రాష్ట్రంలో 42,750 స్కూల్స్ ఉన్నాయి. 5,280 స్కూల్స్ మాత్రమే మ్యాపింగ్ చేసాము. సెంట్రల్ స్కూల్స్ విధానం తీసుకుని సబ్జెక్ట్ టీచర్స్‌ను పెట్టాము. ఈ విధానం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేరళ, గుజరాత్‌కు ధీటుగా ఇక్కడి విద్యార్థులు నిలబడాలని ఇవన్నీ చేస్తున్నాము. చంద్రబాబు విద్యాకానుక ఐటమ్స్ ఇచ్చాడా?. బైజూస్ వల్ల 40 లక్షల మందికి లబ్ది చేకూరుతోంది. ప్రభుత్వంపై అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్నారు. రాజకీయ లబ్దికోసం లేనిది ఉన్నట్టుగా చూపించే కుట్ర జరుగుతోంది. అమ్మఒడి పథకంపై ఎల్లో మీడియాకు కడుపుమంటగా ఉంది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే వారికి ఏంటి ఇబ్బంది?. పాఠశాల విద్యను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. కొంతమంది ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడే విధంగా శిక్షణ ఇస్తున్నాము’’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రకృతి వ్యవసాయమే మేలు.. రైతులకు అండగా ఉంటాం: సీఎం జగన్ -
తప్పుడు వార్తలపై చర్యలేవి?
న్యూఢిల్లీ: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో తపుపడు వార్తల తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్‌ను కేంద్రం ప్రశ్నించింది. తాము ఫేక్ న్యూస్‌గా పేర్కొన్నవాటిని తొలగించడంలో ఈ కంపెనీలు విఫలమయ్యాయని కేంద్రం తీవ్రంగా స్పందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలు చర్యలు తీసుకోకపోవడంతో తాము అలాంటి వార్తలను తొలగించాల్సివస్తోందని, దీంతో తమపై విమర్శలు వస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కంపెనీలకు తప్పుడు వార్తల విషయంలో ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదని సదరు వర్గాలు తెలిపాయి. గతంలో పలు యూట్యూబ్ చానెళ్లు, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లను తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం నిషేధించింది. ఈ విషయంపై మరింతగా చర్చించేందుకు సమాచార శాఖ టెక్ కంపెనీలతో సమావేశమైనట్లు తెలిపాయి. -
మీడియా స్వేచ్ఛ దుర్వినియోగానికి శిక్ష తప్పదు
తిరుపతి లీగల్: మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేసి పరువుకు భంగం కలిగిస్తే ఎవరికైనా సరే శిక్ష తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక యాజమాన్యం, ఇతరులపై దాఖలు చేసిన పరువు నష్టం దావాపై టీటీడీ తరఫున వాదించేందుకు బుధవారం ఆయన స్థానిక నాలుగో అదనపు జిల్లా జడ్డి కోర్టులో హాజరయ్యారు. సెక్షన్ 32 కింద ప్రత్యేకంగా కేసును వాదిస్తున్నట్లు న్యాయమూర్తికి నివేదించారు. ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రజ్యోతి యాజమాన్యం, తదితరులకు రిటన్ స్టేట్మెంట్ దాఖలుకు న్యాయస్థానం 90 రోజులు సమయం ఇచ్చినా స్పందించలేదని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఖర్చుల కింద రూ.200 చెల్లించాలని ఆదేశిస్తూ కేసును న్యాయమూర్తి డిసెంబర్ 29కి వాయిదా వేసినా ఇంతవరకూ రిటన్ స్టేట్మెంట్ దాఖలు చేయలేదన్నారు. సమాజ హితంతో ముడిపడిన కేసు.. ఈ కేసు సమాజ హితంతో ముడిపడి ఉందని వాదనల సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి నివేదించారు. ఈ సమయంలో ఆంధ్రజ్యోతి తరపున జూనియర్ న్యాయవాది హాజరై రిటన్ స్టేట్మెంట్ దాఖలు చేస్తామని కోరడంతో జడ్జి సత్యానంద్ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. అనంతరం ఆంధ్రజ్యోతి తరపు న్యాయవాది మధ్యాహ్నం న్యాయమూర్తి ఎదుట హాజరై రిటన్ స్టేట్మెంట్ దాఖలు చేశారు. ఖర్చుల కింద రూ.200 చెల్లించాలని టీటీడీ తరపు న్యాయవాది కోరగా, టీటీడీ తరపున సుబ్రహ్మణ్యస్వామి మాత్రమే వాదనలు వినిపిస్తామని కోర్టు అనుమతి తీసుకున్నందున ఆయనకు మాత్రమే ఇస్తామన్నారు. అయితే ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అప్పటికే కోర్టు నుంచి వెళ్లిపోవడంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు నగదును కోర్టులో డిపాజిట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును న్యాయమూర్తి ఫిబ్రవరి 4వతేదీకి వాయిదా వేశారు. టీటీడీ పరువుకు భంగం వాటిల్లేలా.. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, టీటీడీ పరువుకు భంగం వాటిల్లే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక 2019 డిసెంబర్ 1వ తేదీన ‘‘వెంకన్న వెబ్సైట్లోకి యేసయ్య‘‘, ‘‘టీటీడీ వెబ్సైట్లో అన్యమత ప్రచారం‘‘ శీర్షికలతో కథనాలను ప్రచురించిందని ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. వాదనలు వినిపించిన తరువాత కోర్టు ప్రధాన ద్వారం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అసత్య కథనాలతో టీæటీడీ పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని, దీనిపై క్షమాపణలు చెప్పాలని టీటీడీ మూడుసార్లు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపినా స్పందించలేదన్నారు. ఆంధ్రజ్యోతి పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఎడిటర్ కె.శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, అమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రజ్యోతి తెలుగు డైలీ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్లను ప్రతివాదులుగా పేర్కొంటూ రూ.వంద కోట్ల పరిహారం చెల్లించాలని దావా వేసినట్లు తెలిపారు. రెచ్చగొట్టేందుకే అసత్య కథనాలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హిందువుల్లో వ్యతిరేకత రేకెత్తించేందుకు మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రజ్యోతి అసత్య కథనాలను ప్రచురించిందని సుబ్రమణ్యస్వామి చెప్పారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పుకోసం ఇలాంటి కథనాలు ప్రచురించినట్లు తెలుస్తోందన్నారు. ఈ కథనాలపై పోలీస్ దర్యాప్తు అనంతరం శ్రీవారి ఆలయం వద్ద ఎలాంటి శిలువ ఆకారం లేదని ధృవీకరిస్తూ హైకోర్టుకు ఫోటోలను సమర్పించారని తెలిపారు. ఈ కేసును టీటీడీ తరపున చివరివరకు తానే వాదిస్తానని, మధ్యలో తప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. వంశపారపర్యం అర్చకత్వంపై రమణ దీక్షితులు గతంలో చేసిన ట్వీట్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తన ట్విట్టర్ ఖాతాలో కోటి మందికిపైగా ఉన్నారని, అన్నీ తాను చూడలేనని చెప్పారు. తనతో నేరుగా సంప్రదిస్తే సలహా ఇస్తానన్నారు. బ్రాహ్మణులే అర్చకత్వం చేయాలని లేదన్నారు. ఇతర కులాలకు చెందిన ఎంతో మంది రుషులు, మహర్షులుగా పేరు ప్రఖ్యాతలు గడించారన్నారు. టీటీడీలో కాగ్‌తో ఆడిట్ తనిఖీ జరగాలని కోరుతున్నట్లు చెప్పారు. -
కోహ్లిపై ఫిర్యాదు.. విరుచుకుపడిన టీమిండియా ఆటగాడు
Ashwin Slams Fake Media Reports In Virat Kohli Issue: మరో ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల(రహానే, పుజారా)తో కలిసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని, కోహ్లి టీ20 సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి పరోక్ష కారకుడని గత కొద్ది రోజులుగా మీడియాలో వివిధ కథనాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ తొలిసారి స్పందించాడు. కోహ్లి ఎపిసోడ్లో తన ప్రమేయం ఏమాత్రం లేదని వివరణ ఇచ్చాడు. ఈ విషయమై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇదివరకే స్పష్టతనిచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అసత్య కథనాలు ప్రసారం చేసి టీమిండియా అభిమానులను తప్పుదోవ పట్టించరాదని ఓ ప్రముఖ వార్తా సంస్థపై విరుచుకుపడ్డాడు. ఫేక్ న్యూస్ అనే హ్యాండిల్ కోసం వెతుకుతున్నానని, అది పేరు మార్చుకుని ఓ ప్రముఖ న్యూస్ ఏజన్సీగా మారిందని, అలాంటి వార్తా సంస్థల్లో ప్రసారమయ్యే నిరాధారమైన కథనాలను బేస్ చేసుకుని మరిన్ని వార్త సంస్థలు కట్టుకథలు అల్లుతున్నాయని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. కాగా, ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లి అసమర్ధత వల్లే టీమిండియా ఓడిపోయిందని.. ఈ విషయాన్ని అశ్విన్ సహా రహానే, పుజారాలు బీసీసీఐ కార్యదర్శి జై షాకు ఫోన్ చేసి మరీ ఫిర్యాదు చేశారని ఓ టాప్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అశ్విన్ తనదైన స్టైల్ల్లో విరుచుకుపడ్డాడు. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశాడు. సదరు న్యూస్ ఏజెన్సీని ట్రోల్ చేశాడు. చదవండి: తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్, కోహ్లి -
మరో దేశాధ్యక్షుడి ఫేస్బుక్ ఖాతా నిలిపివేత..!
కారకస్: తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఫేస్బుక్ తగు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై ఫేస్బుక్ ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా తప్పుడు సమాచారాన్ని ఫేస్బుక్లో షేర్ చేసినందుకు గాను వెనుజులా అధ్యక్షుడి ఖాతాను ఫేస్బుక్ నిలిపివేసింది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మడురో , ఏలాంటి ఆధారం లేకుండా కోవిడ్-19ను నివారించే రెమిడీ గురించి షేర్ చేసినందుకు గాను ఫేస్బుక్ ఆయన ఖాతాను నిలిపివేసింది. నికోలస్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి కోవిడ్-19కు సదరు మెడిసిన్ నయం చేస్తోందని పోస్ట్ చేశారు. కాగా జనవరి నెలలో ‘కార్వాటివిర్’ అనే మెడిసిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కరోనా వైరస్‌ను తగ్గించవచ్చునని మడురో పేర్కొన్నారు. ఈ మెడిసిన్ పనిచేస్తోందని వైద్యులు, శాస్త్రవేత్తలు ఎక్కడా నిర్ధారించలేదు.ఫేస్బుక్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్నందున నికోలస్ మడురో షేర్ చేసిన వీడియోను తొలగించింది. వీడియోలో ఉన్న సమాచారానికి ఎలాంటి నిర్ధారణ లేకపోవడంతో పోస్ట్ ను తీసివేశామని ఫేస్బుక్ తెలిపింది. మరోవైపు ఫేస్బుక్ తన ఖాతాను నిలిపివేయడాన్ని నికోలస్ మడురో ఖండించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోవిడ్-19పై తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. ప్రైవసీ పాలసీలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వారికి ముందుగా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. తర్వాత వారిపై తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం వెనుజులాలో శుక్రవారం నాటికి మొత్తం 1,54,905 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 1,543గా ఉంది. తక్కువ సంఖ్యలో కోవిడ్ టెస్ట్‌లను చేస్తోన్నందున కేసుల సంఖ్య తక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చదవండి: ఫేస్బుక్లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...! -
అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం
సాక్షి, హైదరాబాద్: నాన్నా... పులి కథ గుర్తుందా? చిన్నప్పుడు చదువుకున్న ఈ కథ చెప్పే సారాంశం ఏమిటంటే.. కావాలనో, సరదాగానో తనకు ప్రమాదం ఉందంటూ అనవసరంగా అబద్ధం చెబితే నిజంగా ప్రమాదం కలిగినప్పుడు నిజం చెప్పినా అది అబ ద్ధమే అనుకుంటారు. ఇప్పుడీ కథ స్ఫూర్తి ప్రధానం కాదు కానీ.. అబద్ధమే ఇక్కడ ప్రధానం. అసత్యమే ప్రస్తుత వివాదం. ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రపం చ దేశాలను ఉత్పాతంలోకి నెట్టిన ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిపై ప్ర పంచ వ్యాప్తంగా పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియా పుణ్యమాని ప్రజల్లోకి వెళ్లి పోయి గందరగోళానికి గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే ఏదో జరిగిపోతుందని, మళ్లీ ఏడాది తర్వాత వీరవిహారం చేస్తుందనీ, వ్యాక్సిన్ తయారీకి ఐదు– పదేళ్లు పడుతుందని.. ఇలా అనేక అవాస్తవాలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే మానవాళిని గం దరగోళానికి గురిచేస్తోన్న ఈ అసత్యాలపై యుద్ధం ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో). ప్రఖ్యాత టెలివిజన్ బీబీసీ, బ్రిటన్ ప్రభుత్వంతో కలసి ‘స్టాప్ ద స్ప్రెడ్’పేరుతో వాస్తవాలతో కూడిన విస్తృత ప్రచారాన్ని చేయాలని నిర్ణయించింది. ఏం చేస్తున్నారంటే..!: కోవిడ్–19పై ఈ అసత్య ప్రచారాలను కౌంటర్ చేసేందుకు గాను బీబీసీ టెలివిజన్‌తో పాటు పలు డిజిటల్ ప్లాట్‌ఫారాల ద్వారా భారత్‌తో సహా 20 దేశాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన టూల్కిట్లను బ్రిటన్ ప్రభుత్వం ఆ దేశాలకు అందజేయనుంది. ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చనుంది. కరోనా వ్యాప్తి, దాని ప్రభావం, నియంత్రణ తదితర అంశాలతో కూడిన వాస్తవిక సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వో రూపొందించనుంది. ఈ 3 ప్రయత్నాల ద్వారా పెద్ద ఎత్తున వాస్తవాలను ఆయా దేశాల్లోని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుంద ని భావిస్తున్న మే, జూన్‌లో ఈ ప్రయత్నం చేయనున్నారు. దేశాలివే..: ఇథియోపియా, కెన్యా, నైజీరియా, సియెర్రాలియోన్, టాంజానియా, జాంబియా, బంగ్లాదేశ్, భారత్, ఇండోనేషియా, నేపాల్, థాయ్‌లాండ్, అజర్బైజాన్, మొలొదోవ, అల్జీరియా, లిబియా, ట్యునీషియా, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, పరాగ్వే. -
రిటైర్మెంట్ వయస్సు తగ్గించే ఆలోచన లేదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రతిపాదనేమీ లేదని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 50 ఏళ్లకు తగ్గించనున్నారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం వారి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను ఒక వర్గం మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కరోనా కారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక ప్రకటనలో సింగ్ ఆరోపించారు. 80 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ నిలిపివేత, మిగతావారి పెన్షన్‌లో 30% కోత అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారన్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఉద్యోగుల ప్రయోజనం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. కనీస సిబ్బందితో విధులు నిర్వహించాలని, దివ్యాంగులకు అత్యవసర విధులు వేయవద్దని ఆదేశించామన్నారు. -
రేటింగ్స్ కోసం అలా రాయొద్దు
‘‘రేటింగ్స్ కోసం, లైక్స్ కోసం అవాస్తవ వార్తలను ప్రచారం చేయటం తప్పు’’ అని మండిపడ్డారు హీరో శ్రీకాంత్. ఇటీవల బెంగళూర్ షూటింగ్లో శ్రీకాంత్ గాయపడ్డారంటూ కొన్ని యూట్యూబ్ చ్యానల్స్ ప్రచారం చేశాయి. దానికి ఆయన ఘాటుగా స్పందిస్తూ – ‘‘నేను షూటింగ్ చేసుకుంటూ ఉండగా సడెన్‌గా ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. నా కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారుపడి ఫోన్ చేశారు. కల్పిత వార్తలకు వాయిస్ ఓవర్ యాడ్ చేసి లైక్స్ తెచ్చుకోవటం, సబ్స్క్రైబర్స్ పెంచుకోవటం కోసం యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం చాలా పెద్ద తప్పు. దీన్ని తీసుకొని మరికొన్ని వెబ్‌సైట్స్ కూడా వార్తలు రాస్తున్నాయి. ఇలాంటి అసత్యపు వార్తలను రాయొద్దు. ఈ విషయాన్ని ‘మా’ అసోసియేషన్ కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. ఇలాంటి అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్ క్రైమ్ ఎస్.పి రామ్మోహన్ గారికి ‘మా’ ద్వారా కంప్లైట్ చేయనున్నాం’’ అని అన్నారు. -
ఆధార్‌పై వార్తలు రాస్తే జైలుకే...
సాక్షి, న్యూఢిల్లీ : ఆధార్ కార్డు సమాచారం లీకులంటూ ఈ మధ్య కొన్ని కథనాలు ప్రచురితం కావటం యూఐడీఏఐ చికాకు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలను ప్రచురిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మధ్య కేవలం రూ.500కే కోట్ల మంది ఆధార్ వివరాలు.. అంటూ ది ట్రిబ్యున్ పత్రిక స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఓ కథనం ప్రచురించింది. వాట్సాప్‌లో ఓ గ్రూప్ ద్వారా లీకులు జరుగుతున్నాయని.. లాగిన్ వివరాలు ఉంటే ఆధార్ డేటా బేస్‌లోకి చొరబడి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సులభంగా పొందవచ్చని ట్రిబ్యూన్ తన కథనంలో పేర్కొంది. అయితే అందులో ఏ మాత్రం వాస్తవం లేదంటూ కాసేపటికే యూఐడీఏఐ ప్రకటన చేసింది. అటుపై కథనంపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ట్రిబ్యూన్ రిపోర్టర్ రచన ఖైరాపై కేసు నమోదు అయ్యింది. క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమీషనర్‌కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. రచనతోపాటు ఈ వార్త విస్తృత ప్రచారం కావటానికి కారణమైన అనిల్ కుమార్, సునీల్, రాజ్‌ల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. మరో జాతీయ మీడియా ఛానెల్‌పై కూడా ఫిర్యాదు చేసేందుకు యూఐడీఏఐ సిద్ధమౌతోందని సమాచారం. కాగా, ఆధార్ కార్డు గోప్యతపై అసత్య ప్రచారాలు మానుకోవాలని మీడియాకు చెబుతున్న యూఐడీఏఐ.. ఆ వార్తలను వాట్సాప్‌లో వైరల్ చేయకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక కార్డుల్లో తప్పుల సవరణ విధానాన్ని దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటామని ఏజెంట్లను హెచ్చరిస్తోంది. -
మీడియానే అమెరికన్ల శత్రువు
• న్యూయార్క్‌టైమ్స్, ఎన్బీసీ, సీఎన్‌ఎన్‌లు ఫేక్ న్యూస్ మీడియా • నా పాలనపై చాలామంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: ట్రంప్ • ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రకటన వాషింగ్టన్: మీడియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. మీడియా అమెరికా ప్రజల శత్రువని వ్యాఖ్యానించారు. ‘ఫేక్ న్యూస్ మీడియా (న్యూయార్క్‌టైమ్స్, ఎన్‌బీసీన్యూస్, ఏబీసీ, సీబీఎస్, సీఎన్ఎన్) నా శత్రువు కాదు. అమెరికా ప్రజల శత్రువు’అని ట్రంప్ ట్వీట్ చేశారు. తన పాలన సజావుగా సాగుతోందని, నిజాయితీ లేని మీడియా చెపుతున్నట్టుగా వైట్‌హౌస్‌లో ఎటువంటి ఘర్షణ వాతావరణం లేదన్నారు. వైట్‌హౌస్‌లో గందరగోళం చెలరేగుతోందని మీడియాలో వస్తున్న కథనాలతో టీవీ చానల్స్ పెట్టాలన్నా.. వార్తా పత్రికలు చదవాలన్నా ఇబ్బందిగా ఉందని చెప్పారు. మీడియాపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ తన భావాలను వ్యక్తపరిచేందుకు ట్వీటర్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక వెబ్సైట్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. తన పాలన, పనితీరుపై చాలా మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అయితే తన రాజకీయ ప్రత్యర్థులు, మీడియా మాత్రం అసంతృప్తిగా ఉందని ఆరోపించారు. గత అమెరికా అధ్యక్షులు చాలా మంది మీడియాను విమర్శించినా.. ఇలా బహిరంగంగా ఆరోపణలు చేసింది మాత్రం ట్రంపే కావడం గమనార్హం. ఇదేసమయంలో ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో మీడియాకంటే వైట్ హౌస్ నిజాయితీ కలిగినదని భావిస్తున్న వారి సంఖ్య 45 శాతం నుంచి 42 శాతానికి తగ్గడం గమనార్హం. ఇజ్రాయెల్ ప్రధానికి ఆహ్వానం ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొని తుదముట్టిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రేడియో, వెబ్ ద్వారా ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతాన్యాహును అమెరికాకు ఆహ్వానించినట్టు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో కలసి పనిచేస్తామని, వారి భద్రత, స్థిరత్వానికి కృషి చేస్తామని చెప్పారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, ప్రజలకు ఇబ్బందిగా మారిన రెండు వృథా నిబంధనలను తొలగించామని వెల్లడించారు. నిక్కీ హేలి సమర్థంగా పనిచేస్తున్నారు.. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్న భారతీయ–అమెరికన్ నిక్కీహేలీ సమర్థంగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. అమెరికాలో ఒక భారతీయ–అమెరికన్ కేబినెట్ స్థాయి పదవిని దక్కించుకున్న మొదటి వ్యక్తి నిక్కీహేలీనే కావడం తెలిసిందే. ఆమె కొద్ది వారాలుగా కొత్త పదవిలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా హేలీ గురించి ట్రంప్ మాట్లాడుతూ.. మన కోసం సమర్థంగా పనిచేస్తున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీహేలీకి ధన్యవాదాలు అని చెప్పారు. అమెరికా రాయబారిగా ఆమె ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతంగా పనిచేస్తు న్నారని కితాబిచ్చారు.