Gail Director E S Ranganathan arrested by CBI in bribery case, Details Inside - Sakshi
Sakshi News home page

Gail Director Ranganathan: గెయిల్‌ డైరెక్టర్‌ రంగనాథన్‌ అరెస్ట్‌

Published Mon, Jan 17 2022 8:34 AM | Last Updated on Mon, Jan 17 2022 11:08 AM

CBI Arrested Gail Director Ranganathan - Sakshi

న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్‌ మార్కెటింగ్‌ వ్యవహారాల డైరెక్టర్‌ ఈఎస్‌ రంగనాథన్‌ను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్ట్‌గేషన్‌ (సీబీఐ) అరెస్ట్‌ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్‌ 2021లో గెయిల్‌ డైరెక్టర్‌ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ వివరించింది. పెట్రో కెమికల్‌ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్‌ఐఆర్‌ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్‌ సహాయకుడు ఎన్‌ రామకృష్ణన్‌ నాయర్‌ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో రంగనాథన్,  నాయర్‌లతోపాటు పవన్‌ గౌర్, రాజేష్‌ కుమార్, యునైటెడ్‌ పాలిమర్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరభ్‌ గుప్తా, బన్సల్‌ ఏజెన్సీస్‌కి చెందిన ఆదిత్య బన్సాల్‌ ఉన్నారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement