అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్యాస్ లీకేజీ వంటి దుర్ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలూ తెలుసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శనివారం లేఖ రాశారు.