నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ న్యాయవాదుల సంఘం ఆవిర్భావ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. చిత్రంలో హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్ సభ్యులు విత్తనాల రాజేశ్వర్‌రావు, ఎన్‌సీఎల్‌టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్.రవి
సాక్షి, హైదరాబాద్: ‘‘దక్షిణ రాష్ట్రాలతో హైదరాబాద్‌కు మంచి అనుసంధానముంది. కాబట్టి ఇక్కడ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) బెంచ్ అవసరం ఎంతైనా ఉంది’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్రానికి వినతిపత్రం సమర్పించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) న్యాయవా దుల సంఘానికి ఆయన సూచించారు. ఎన్‌సీఎల్‌టీ సీనియర్ న్యాయవాది ఎస్.రవి అధ్యక్షుడిగా ఇటీవల న్యాయవాదుల సంఘం ఆవిర్భవించింది. ఈ సంద ర్భంగా ఎన్‌సీఎల్‌టీలో గురు వారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
కార్యక్రమం లో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, ఎస్‌సీ ఎల్‌టీ జ్యుడీషియల్ సభ్యులు వి.రాజేశ్వర రావు, సాంకేతిక సభ్యులు రవికుమార్ దురై స్వామి, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ధనంజయ, కార్యదర్శి బాచిన హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్‌సీఎల్‌ఏటీ ఏర్పాటుతో హైకోర్టు, ఇతర కోర్టులపై కేసుల భారం కాస్త తగ్గిందని ఈ సందర్భంగా జస్టిస్ రమణ అన్నారు. ‘‘ఎన్‌సీ ఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీ సభ్యుల నియామకాల్లో సుప్రీంకోర్టు ఆషామాషీగా వ్యవహరిం చలేదు. పలు అంశాల్లో వారి నైపుణ్యాలను నిశి తంగా పరిశీలించాకే నియమించాం’’ అని వివరించారు.
అధ్యయనమే శ్రీరామరక్ష
ఉభయ రాష్ట్రాల్లో దాదాపు లక్ష కంపెనీలు న్నాయని, న్యాయవాది లేకుండా ఏ కంపెనీ ప్రారంభమయ్యే అవకాశమే లేదని జస్టిస్ రమణ అన్నారు. ఈ అవకాశాన్ని యువ న్యాయవాదులు అందిపుచ్చుకోవాలని సూచిం చారు. కొత్త చట్టాలను నిరంతరం అధ్యయనం చేస్తేనే న్యాయవాదికి మనుగడ ఉంటుందని హితవు పలికారు. ‘‘కొత్త తరహా వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పుడే లాయర్లకు పేరు, డబ్బు వస్తాయి. దేశంలో 14 చోట్ల ఎన్‌సీఎల్‌టీ లున్నాయి గానీ హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీలోని మౌలిక సదుపాయాలు మరెక్కడా లేవు. ఇందు కు సంబంధిత అధికారులకు అభినందనలు. ఇటీవల నేను, మరికొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులం జపాన్, కొరియా సందర్శిం చాం. మన రాజ్యాంగం ఎంత గొప్పదో, మన న్యాయవ్యవస్థ ఎంత స్వతంత్రంగా పని చేస్తుందో వారికి వివరిం చాం.
విని అక్కడి అధికారు లు ఆశ్చర్యపోయారు. అయితే మన దేశంలో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై వారు అసంతృప్తే వెలి బుచ్చారు’’ అని వివరిం చారు. ‘‘యువ న్యాయవా దులు, కొత్తగా వృత్తిలోకి వస్తున్న వారు సీనియర్ లాయర్ల కు గౌరవమివ్వడం లేదని నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతమాత్రమూ మంచి పద్ధతి కాదు’’ అని జస్టిస్ రమణ అన్నారు. పెద్దలను గౌరవించడం మన సంస్కారమని మరవొద్దని హితవు పలికారు. న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి నూనేపల్లి హరినాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం కొత్త కార్యవ ర్గాన్ని సీనియర్ న్యా యవాది ఎస్.రవి సభకు పరిచయం చేశారు. చివర్లో సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వందన సమర్పణ చేశారు.
కాసేపు తెలుగులో ప్రసంగం
కార్యక్రమంలో కాసేపు తెలుగులో ప్రసంగించడం ద్వారా తన భాషాభిమానాన్ని జస్టిస్ రమణ మరో సారి చాటుకున్నారు. న్యాయవాదులకు సంబం ధించి రావిశాస్త్రి చెప్పిన కథను వినిపించి నవ్వులు పూయిం చారు.
Comments
Please login to add a commentAdd a comment