మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ ఒప్పందం రద్దుపై విక్రమ్ బక్షి చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) మంగళవారం కొట్టివేసింది.
మెక్‌డొనాల్డ్స్‌కు షోకాజ్ నోటీసు
Published Tue, Sep 5 2017 7:43 PM | Last Updated on Tue, Sep 12 2017 1:57 AM
సాక్షి, న్యూఢిల్లీ : మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ ఒప్పందం రద్దుపై విక్రమ్ బక్షి చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) మంగళవారం కొట్టివేసింది. ఈ సమయంలోనే బక్షి నమోదుచేసిన ధిక్కార ఫిర్యాదులపై స్పందించాలని ఆదేశిస్తూ మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్‌కు షోకాజు నోటీసు జారీచేసింది. మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా బక్షి, రెండు ధిక్కార ఫిర్యాదులను ఎన్‌సీఎల్‌టీ వద్ద నమోదుచేశారు.
ఉత్తర, తూర్పు భారతంలో విక్రమ్ బక్షీతో కలిసి మెక్‌డొనాల్డ్ 166 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నది తెలిసిందే. ఈ జాయంట్ వెంచర్ విషయంలోనే వివాదం తలెత్తింది. దీంతో మెక్‌డొనాల్డ్స్ ఇండియా, విక్రమ్ బక్షికి చెందిన కన్నాట్ ప్లాజాతో ఉన్న ఫ్రాంఛైజీ ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో బక్షి ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు. తమ 50:50 జాయింట్ వెంచర్ వ్యవహారాల్లో మెక్‌డొనాల్డ్స్ జోక్యం చేసుకుంటుందంటూ మరో ఫిర్యాదును కూడా బక్షి నమోదుచేశారు. ఈ వివాదం నేపథ్యంలో దేశ రాజధానిలో జూన్‌లో 43 మెక్‌డొనాల్డ్స్ మూతపడ్డాయి.
Advertisement
Advertisement