ఎయిర్‌టెల్–టెలీనార్ విలీనానికి సీసీఐ ఓకే
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్, టెలీనార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబీ, స్టాక్ ఎక్సే్చం జ్‌లు ఇప్పటికే ఆమోదం తెలియజేయడంతో గతవారం ఎయిర్‌టెల్, టెలీనార్ విలీనానికి అనుమతి కోరుతూ సీసీఐ ముందు దరఖాస్తు చేసుకున్నాయి.
ఈ నెల 5న సీసీఐ నుంచి అనుమతి లభించినట్టు భారతీ ఎయిర్‌టెల్ బీఎస్‌ఈకి తెలియజేసింది. విలీనంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌టెల్, టెలీనార్ ఒప్పందానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెలీనార్ ఇండియాకు చెందిన ఏపీ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు,పశ్చిమ) సర్కిళ్లలోని కార్యకలాపాలు, ఆస్తులన్నీ ఎయిర్‌టెల్ సొంతం అవుతాయి. దీంతో వృద్ధికి అపార అవకాశాలున్నాయనేది ఎయిర్‌టెల్ అంచనా.