ముల్కల్లలో కొనుగోలు చేసిన పత్తిని వాహనంలో తరలిస్తున్న దళారులు
మంచిర్యాలఅగ్రికల్చర్: పత్తి కొనుగోలు వ్యాపారంలో దళారులు రంగప్రవేశం చేసి అక్రమ పద్ధతిలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నేరుగా గ్రా మాల్లో రైతుల వద్దకు వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నారు. తుకాల్లో మోసాలకు పాల్పడుతూ ఇష్టం వచ్చిన రేటుకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. జిల్లాలో అధికారులు సాధారణ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. అక్రమ కొనుగోళ్లపై పర్యావేక్షణ కొరవడడంతో దళారులకు మూడుపువ్వులు ఆరుకాయలుగా మారింది.
తూకాల్లో భారీ మోసం
అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి డిమాండ్ పెరుగుతోంది. ఇదే అదనుగా భావించిన కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు రైతుల వద ్దకు చేరుతున్నారు.క్వింటా పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.5450 ధర ఉండగా.. దళారులు అద నంగా రూ.100 నుంచి రూ. 200 చెల్లిస్తూ తూకా ల్లో మాయజలం ప్రదర్శించి రైతులను నష్టపరు స్తున్నారు. క్వింటా పత్తికి 6 నుంచి 10 కిలోల వర కు తూకాల్లో మోసానికి పల్పడుతున్నారు. దీంతో రైతులు క్వింటాళుకు రూ. 500 నుంచి రూ. 600 వరకు నష్టపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి మార్కెట్ కమిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సేస్ రూపకంగా మార్కెట్‌కు రావాల్సిన ఫీజు రాకుండా పోతుంది. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని రాత్రికి రాత్రే బొలేరో, టాటా మ్యాక్స్, డీసీఎం వాహనాల ద్వారా తరలిస్తున్నా రు. పత్తి పంటలు సాగు చేసిన సమయంలో పెట్టు బడులు కోసం ఇచ్చిన అప్పులను తిరిగి తీసుకునేందుకు కొందరు ఈ వ్యాపారం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో సీసీఐ మందమర్రి, హాజిపూర్, మంచిర్యాల, నస్పూర్ మండలాలకు మంచిర్యాల మార్కెట్‌కమిటీ ద్వారా ముల్కల్లలోని జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, భీమిని, తాండూర్, కన్నెపెల్లి మండలాలకు బెల్లంపల్లి మార్కెట్ పరిధిలోని రేపల్లివాడలోని జిన్నింగ్ మిల్లులో, లక్సెట్టిపేట, దండెపల్లి, జన్నారం మండలాల రైతుల సౌకర్యార్థంకోసం లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీముఖి ఇండస్ట్రీస్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, భీమారం, జైపూర్ మండలాల రైతుల కోసం చెన్నూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మూడు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయినా ఈ ఏడాది సీసీఐ ఇప్పటి వరకు ఒక్క క్వింటా పత్తి సైతం కొనుగోలు చేయలేదు. మద్దతు ధర కంటే ఎక్కువగానే ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తుండడంతో రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
పత్తి అక్రమ కొనుగోళ్లపై దృష్టి సారించి మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా రైతులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. పత్తి కొనుగోలు సీజన్‌లో మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. కానీ అధికారులంతా ఎన్నికల విధుల్లో ఉండడంతో దళారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జిల్లాలో కొనుగోలు చేస్తున్న పత్తిని భైంసా, ఆదిలాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈప్రాంతంలోని జిన్నింగ్ మిల్లుల్లో ప్రైవేటు వ్యాపారులు ఎక్కువగా ధర చెల్లిస్తుండడంతో కొనుగోలు చేసిన పత్తిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment