
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం ఒక మంచి విధానం తెస్తుంటే పవన్‌కల్యాణ్ తన స్వార్థం కోసం మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ తీరు సినిమా ఇండస్ట్రీ వాళ్లకే నచ్చడం లేదు. ఆయన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలోనే అతను పెద్ద గుదిబండగా మారాడారాని బాధపడుతున్నారు. దీనివల్ల అసలుకే మోసం వచ్చేలా ఉందని ఇండస్ట్రీ భయపడుతోంది.
బాహుబలి విషయంలో సగం డబ్బు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్‌కి రాలేదని విన్నాను. ఆన్‌లైన్ విధానం ద్వారా అప్పటికప్పుడే ఎవరికెళ్లాల్సిన డబ్బు వారికెళ్తుంది. రామారావు నుంచి కాంతారావు వరకు సినిమా ఎవరిదైనా టికెట్ ఒకేలా ఉంటుంది. ఆ టికెట్స్ వల్ల వచ్చే ఆదాయంతో ఎంత లోన్లు తెచ్చుకుంటారు?. మటన్ మార్కెట్లు లేదన్నా ప్రచారం చేస్తున్నారు. అందరితో చర్చింఏ ఆన్‌లైన్ టికెట్ విధానంపై ముందుకెళ్తాం. ప్రజలంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. చదవండి: (బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల)
థియేటర్లు ఎవరిచేతుల్లో నడుస్తున్నాయి?. ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఇండస్ట్రీ వాళ్లు చెప్పాలి. సీఎం ఇండస్ట్రీ వాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని ముందు నుంచి చెప్తున్నారు. కొద్దిమంది చేతిలో ఉన్న వ్యవస్థను సరళీకృతం చేస్తాం. సినిమా పెద్దలు ఎప్పుడైనా సీఎంను కలవొచ్చు. చంద్రబాబులా మేము పిలిచి ఫొటోలు దిగి పబ్లిసిటీ చేసుకునే వాళ్లం కాదు' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను: మంచు విష్ణు)
Comments
Please login to add a commentAdd a comment