ఆర్య, చందమామ, శంభో శివ శంభో లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శివబాలాజీ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక 2009లో నటి మధుమితను ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లోకి ఎక్కాడు.
ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో నటిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలతో పడ్డ కష్టాలను వెల్లడించాడు. ‘మా నాన్న చెన్నైలో ఓ కంపెనీ రన్ చేస్తుండేవాడు. చాలామంది మా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. ఆ సంస్థకి సంబంధించిన వ్యవహారాలు కొన్నాళ్ల పాటు నేను చూసుకున్నాను.
(చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్)
అయితే సినిమాలపై నాకున్న ఇష్టంతో హీరో అవుదామని హైదరాబాద్ రావాలనుకున్నాను. నేను ఇండస్ట్రీలోకి రావడం నాన్నకు ఇష్టంలేదు. చెన్నైలోనే ఉండి బిజినెస్ చూసుకోవాలని ఆయన కోరిక. కానీ నాకు మాత్రం బిజినెస్ నచ్చలేదు. హైదరాబాద్‌కి వచ్చాన కొన్నాళ్ల పాటు సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నించాను. ఓ సారి నాన్నకు ఫోన్ చేస్తే.. ‘అక్కడే ఉండు’అంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు.
(చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ )
నా ప్రయత్నాలు ఫలించి 'ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి పారితోషికంగా నాకు 40 వేలు ఇచ్చారు. షూటింగ్ అయ్యాక చిన్న రూమ్‌ని రెంట్‌కి తీసుకున్నాడు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోతున్నాయి కానీ సినిమా అవకాశాలు రావట్లేదు. రోజుకు ఒక్క పూట మాత్రమే తినేవాడిని. మేల్కొని ఉంటే ఎక్కడ ఆకలి అవుతుందోనని త్వరగా పడుకొని లేటుగా నిద్ర లేచేవాడిని. మంచి నీళ్లు తాగుతూ గడిపిన రోజులు ఉన్నాయి. ఒక నెల రోజుల పాటు చాలా కష్టపడ్డాను. నా బాధలు చూసి అమ్మని నా దగ్గరికి పంపించాడు నాన్న. ఆ తర్వాత ఓ పెద్దింటికి షిఫ్ట్ అయ్యాం’ అంటూ శివ బాలాజీ ఎమోషనల్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment