madhu mitha
-
చిన్న రూమ్ రెంట్‌కు..ఒక్క పూట మాత్రమే తినేవాడిని : శివ బాలాజీ
ఆర్య, చందమామ, శంభో శివ శంభో లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శివబాలాజీ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక 2009లో నటి మధుమితను ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో నటిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలతో పడ్డ కష్టాలను వెల్లడించాడు. ‘మా నాన్న చెన్నైలో ఓ కంపెనీ రన్ చేస్తుండేవాడు. చాలామంది మా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. ఆ సంస్థకి సంబంధించిన వ్యవహారాలు కొన్నాళ్ల పాటు నేను చూసుకున్నాను. (చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్) అయితే సినిమాలపై నాకున్న ఇష్టంతో హీరో అవుదామని హైదరాబాద్ రావాలనుకున్నాను. నేను ఇండస్ట్రీలోకి రావడం నాన్నకు ఇష్టంలేదు. చెన్నైలోనే ఉండి బిజినెస్ చూసుకోవాలని ఆయన కోరిక. కానీ నాకు మాత్రం బిజినెస్ నచ్చలేదు. హైదరాబాద్‌కి వచ్చాన కొన్నాళ్ల పాటు సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నించాను. ఓ సారి నాన్నకు ఫోన్ చేస్తే.. ‘అక్కడే ఉండు’అంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు. (చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ ) నా ప్రయత్నాలు ఫలించి 'ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి పారితోషికంగా నాకు 40 వేలు ఇచ్చారు. షూటింగ్ అయ్యాక చిన్న రూమ్‌ని రెంట్‌కి తీసుకున్నాడు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోతున్నాయి కానీ సినిమా అవకాశాలు రావట్లేదు. రోజుకు ఒక్క పూట మాత్రమే తినేవాడిని. మేల్కొని ఉంటే ఎక్కడ ఆకలి అవుతుందోనని త్వరగా పడుకొని లేటుగా నిద్ర లేచేవాడిని. మంచి నీళ్లు తాగుతూ గడిపిన రోజులు ఉన్నాయి. ఒక నెల రోజుల పాటు చాలా కష్టపడ్డాను. నా బాధలు చూసి అమ్మని నా దగ్గరికి పంపించాడు నాన్న. ఆ తర్వాత ఓ పెద్దింటికి షిఫ్ట్ అయ్యాం’ అంటూ శివ బాలాజీ ఎమోషనల్ అయ్యాడు. -
శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్
Mohan Babu Serious On Shiva Balaji Wife Madhumitha : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటుడు శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. స్పీచ్ మధ్యలో వెనుక నుంచి మాట్లాడవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. చదవండి: MAA Elections 2021: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్ 'నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరోగా చేశాను. మనమంతా ఒకే తల్లి బిడ్డలం. మనుషుల్లో టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగుతారు. ఇది రాజకీయ వేదిక కాదు. పాలిటిక్స్‌లో కంటే ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయాను' అని మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే స్పీచ్ మధ్యలో శివబాలాజీ భార్య మధుమితపై సీరియస్ అయ్యారు. పెద్దలు స్పీచ్ ఇస్తుంటే వెనుక నుంచి గుసగుసలు, సైగలు చేయడం తనకు నచ్చదని కోప్పడ్డారు. ఇలా చేస్తే మాట్లాడాలనుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలకు బ్రేకులు పడతాయంటూ సున్నితంగా హెచ్చరించారు. చదవండి: ఇలాంటివి కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను: మోహన్‌బాబు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలపై స్పందించిన మంచు విష్ణు -
చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్
MAA Elections 2021 : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద శివ బాలాజీ చేయిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది. పోలింగ్ కేంద్రం వద్ద తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ ఘటనపై శివబాలాజీ భార్య మధుమిత స్పందించింది. చదవండి: టీటీ ఇంజెక్షన్ వేయించుకున్న శివబాలాజీ ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి పనులు మనుషులు మాత్రం చేయరు. ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేను అని ఘాటుగా బదుల్చిచ్చింది. ఇక తన భర్త శివబాలాజీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది. నిస్వార్థంగా సేవ చేసినప్పుడు దానికి ప్రతిఫలం దక్కుతుందని తాను నమ్ముతానని బదులిచ్చింది. చదవండి: MAA Elections 2021 Results: 'మంచు'కే మా అధ్యక్ష పదవి -
స్కూల్ ఫీజులు.. మధుమిత కంటతడి
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కాలంలోనూ ఆన్లైన్ క్లాసుల పేరుతో ప్రైవేటు పాఠశాలలు దోచుకుంటున్నాయని ప్రముఖ నటుడు శివ బాలాజీ మరోసారి గళమెత్తారు. కార్పొరేట్ స్కూళ్ల దోపిడీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాఠశాల యాజమాన్యాలు ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివబాలాజీ మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోయారని, ఇలాంటి విపత్కరణమైన పరిస్థితుల్లో స్కూళ్ల ఫీజులు కట్టాలని ఒత్తిడి పెట్టడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని, వ్యక్తిగతంగా ఈ మెయిల్స్ పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాలాజీ వాపోయారు. నగరంలోని మౌంట్ లితేరా స్కూలు నుంచి తొలుత ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయని, ఆ తరువాత అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి మొదలైదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలన్నీ సిండికేట్ అయ్యాయని ఆరోపించారు. ప్రతి ఒక్క పేరెంట్ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, తన పోరాటానికి వారంతా సపోర్టు చేయాలని కోరారు. మధుమిత కన్నీంటి పర్యంతం.. ‘ముఖ్యమంత్రి మీద గౌరవంగా అడుగుతున్నాం. మౌంట్ లిటేరా స్కూళ్లు ఫీజులతో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని మీరు చెప్పిన స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో క్షోభకు గురిచేస్తున్నాయి. మేము ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం. ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి’ అని మధుమిత కోరారు. కాగా నగరంలోని మౌంట్ లిటేరా యాజమాన్యంపై శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సీ) ఇదివరకే స్పందించిన విషయం తెలిసిందే. మౌంట్ లిటేరా స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది. కాగా, మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం ఫీజుల పేరుతో తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తోందని శివ బాలాజీ హెచ్ఆర్సీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్కూల్ ఫీజులు తగ్గించుకోమన్నందుకు ఆన్లైన్ తరగతుల నుంచి తమ పిల్లలను తొలగించారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఏడాదంతా మధురం
షడ్రుచుల ఉగాది పచ్చడి రుచి చూడటం.. ఆపై పంచాంగంలో ఇంట్లో వాళ్ల రాశుల వారీగా ఆదాయ, వ్యయాలు చూసుకోవ డం.. రాజ్యపూజ్యం బాగుంటే సంబరపడిపోవడం.. అవమానం అంకె ఎక్కువుంటే జాగ్రత్తగా ఉండాలనుకోవడం.. ఉగాది రోజు ప్రతి తెలుగు ఇంటా కనిపించే దృశ్యమే. తమ ఇంట్లోనూ ఇదే సీన్ కనిపిస్తుందంటారు నటుడు శివబాలాజీ అర్ధాంగి, నటి మధుమిత. మన్మథ నామ సంవత్సరాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నానని చెబుతున్న మధుమిత పండుగ సంబురాలను ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాట ల్లోనే.. ..:: శిరీష చల్లపల్లి పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. మన తెలుగింటి పండుగల్లో బాగా నచ్చేది ఉగాది. ఈ కొత్త సంవత్సరాదిని సెంటిమెంట్‌గా భావిస్తాను. చిన్నప్పుడైతే ప్రతి పండక్కీ కొత్తబట్టలు ఉండాల్సిందే. లేదంటే ఇల్లు పీకి పందిరేసేదాన్ని. శివబాలాజీతో పెళ్లయ్యాక జీవితం కొత్తగా అనిపించింది. బాబు పుట్టాక ఆ సంతోషం రెట్టింపయ్యింది. ఇంకో బాబు పుట్టాక నా జీవితం పరిపూర్ణమైందనిపించింది. మా అమ్మకు మేం ముగ్గురం. అందుకే నాకూ ముగ్గురు సంతానం కావాలని ఉంది. ఇంకో పాప కావాలని ఉంది. ఆడపిల్లయితే పండుగలకు, పబ్బాలకు బంగారుబొమ్మలా ముస్తాబు చేసి చూసుకుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో..! ఏడాదంతా అలాగే.. చిన్నప్పుడు ఉగాది పండుగకు మా అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లే వాళ్లం. మా అమ్మమ్మ డజనుకుపైగా పిండి వంటలు చేసేది. వాళ్లింటికి కూతవేటు దూరంలోనే బోలెడన్ని మామిడి, వేప చెట్లు ఉండే వి. నిండుగా పూత పూసిన మానులు.. వాటిపై గొంతెత్తి కూసే కోయిలలు.. ఎంతో హాయిగా అనిపించేది. చిన్నప్పుడు చెట్లు బాగా ఎక్కేదాన్ని. కొమ్మలెక్కి ఊయలలు ఊగటం భలే సరదాగా అనిపించేది. ఇక షడ్రుచుల ఉగాది పచ్చడి తీసుకున్నప్పుడు మొదట ఏ రుచి ఫీలవుతామో.. ఆ ఏడాదంతా అలాగే ఉంటుందని నమ్మకం. అందుకే నేను బెల్లం ముక్క ఎక్కడ తేలుతుందో చూసుకుని.. తీసుకునేదాన్ని. ఇప్పటికీ అలాగే తీసుకుంటున్నాను. తినేవారుండాలే కానీ.. ఉగాది అంటే భక్షాలు ఫేమస్. చక్కెర పొంగలి, పులిహోర కామన్. వీటికి తోడు రకరకాల పిండివంటలు సిద్ధంగా ఉంటాయి. పిండివంటలు వండటమంటే నాకు చాలా సరదా. గూగుల్‌లో వెతికి మరీ రకరకాలు ట్రై చేస్తుంటా. నేను చేసే చక్కెర పొంగలి, పులిహోర, పేనీల పాయసం అంటే మా ఆయనకు భలే ఇష్టం. అందుకే ఏ పండుగొచ్చినా మా ఇంట్లో ఈ మూడు వంటకాలు ఉండాల్సిందే. పండుగ అనగానే బంధువులు కూడా వచ్చేస్తారు. అందరం కలసి హ్యాపీగా కబుర్లాడుకుంటూ భోజనం చేస్తాం. తినేవాళ్లుండాలే కానీ నేను ఎన్ని వె రైటీలైనా వండి పెడ్తాను. ఇరుగుపొరుగు వారికి పంచిపెడ్తుంటాను. అందులో నాకు తెలియని ఆనందం దొరుకుతుంది. మామూలు రోజుల్లోనూ.. తెలుగుదనం ఉట్టిపడేలా నిండుగా తయారవ్వడం అంటే చాలా ఇష్టం. అందుకే ఏ పండుగొచ్చినా చెవులకు జుంకాలు, చేతులకు ముత్యాల గాజులు, మెడలో హారం వేసుకుంటాను. పండుగలప్పుడే కాదు.. మామూలు రోజుల్లో కూడా నేను ఎక్కువగా చీరల్లో ఉండటానికే ఇష్టపడతాను. జనాలు కూడా నన్ను అలా చూడటానికే ఇష్టపడటం వల్లేమో.. నేను అలాంటి పాత్రలు ఒప్పుకుంటూ ఉంటాను. పుట్టింటికి రా చెల్లి, మన్మథుడు, ఊకొడతారా.. ఉలిక్కిపడతారా.. ఇలాంటి సినిమాల్లో నా పాత్రలు తెలుగుదనానికి కేరాఫ్‌గా ఉంటాయి. ప్రస్తుతం మారుతి డెరైక్షన్‌లో నాని హీరోగా చేస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నాను.