‘‘ఓ సినిమాను నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తాను’’ అన్నారు ఐశ్వర్యా రాయ్. ‘ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల పాపులారిటీ ఎక్కువగా ఉందనీ, ఉత్తరాదిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం చలాయిస్తుందనీ కొందరు అనుకుంటున్నారు. వీటిని మీరు అంగీకరిస్తారా?’ అనే ప్రశ్నలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్యకి ఎదురయ్యాయి.
దీనిపై ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ– ‘‘ఏ రంగంలో అయినా పోటీ ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి మధ్య పోటీ ఉంటుంది. అయితే కళాకారుల మధ్య అలాంటి భేదాలుండవు. నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు. ఏ సినిమా అయినా భారతీయ చిత్రంగానే భావిస్తాను.
ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చలాయిస్తుందనే అభిప్రాయాన్ని అంగీకరించను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా రాకపోతే వేరే ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. దక్షిణాదిలో మణిరత్నంగారు, శంకర్‌గారు.. వంటి పెద్ద దర్శకులతో మంచి సినిమాలు చేసే అవకాశం నాకు వచ్చింది’’ అన్నారు ఐశ్వర్య.
Comments
Please login to add a commentAdd a comment