ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)... ఇప్పుడు ఎక్కడ చూసినా దీని పైనే చర్చ. ఇప్పటికే పలు రంగాల్లో దీని ప్రభావం మొదలైంది. ఇప్పుడు సినిమా రంగంపైనా ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విభాగం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని టాక్. మ్యూజిక్ డైరక్టర్లపై, ఆ విభాగానికి చెందినవారిపై ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందనే ఊహాగానాలు ఉన్నాయి.
ఓ సినిమాకు సంగీతం అందించడమంటే సంగీతదర్శకుడు ఆ చిత్రకథ వినాలి... అతనిచ్చే ట్యూన్స్ డైరక్టర్‌తోపాటు నిర్మాత, హీరోలకూ నచ్చాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో డైరక్టర్ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సినిమా స్థాయిని బట్టిæనెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. పాటలు, ఆర్‌ఆర్, ట్రైలర్లు, గ్లింప్స్, బీజియమ్స్, ప్రమోషన్ వీడియోలు ఇలా చాలా రకాలు తయారు చేయాల్సి ఉంటుంది.
దీనికోసం మ్యూజిక్ డైరక్టర్ వద్ద పదుల సంఖ్యలో ఆర్టిస్టులు పని చేయాల్సి ఉంటుంది. అలాగే చాలామంది టెక్నీషియన్లు కూడా పని చేస్తారు. స్టూడియో బాయ్ నుంచి సౌండ్ ఇంజినీర్స్ వరకు చాలా మంది అవసరం ఉంటుంది. దీనికోసం రెమ్యునరేషన్ రూపంలో నిర్మాత నుంచి మ్యూజిక్ డైరక్టర్‌కు భారీగానే డబ్బూ అందుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని ఆర్టిస్టులకు పారితోషికం రూపంలో, కొందరికి జీతాల రూపంలో ఇస్తుంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఈ మొత్తం వ్యవస్థే ప్రమాదంలో పడే చాన్స్ కనిపిస్తోంది.
ఏఐ మ్యూజిక్ యాప్స్..
నెట్టింట్లో కొన్ని రకాల ఏఐ మ్యూజిక్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఉంటే మ్యూజిక్ డైరక్టర్ అవసరమే ఉండదంటున్నారు. వీటి ప్రత్యేకత ఏంటంటే... మనం లిరిక్స్ ఇస్తే చాలు క్షణాల్లో పాట తయారై΄ోతుంది. ట్యూన్ కట్టి సింగర్ వాయిస్, మ్యూజిక్‌తో సహా ఇచ్చేస్తుంది. మనం చేయాల్సిందల్లా... మనకు ఎటువంటి ట్యూన్ కావాలి, ఎవరి వాయిస్ కావాలి వంటి రిఫరెన్స్ ఇస్తే చాలు.
ఉదాహరణకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌తో పాట కావాలని ఇస్తే క్షణాల్లో ఆయన గాత్రంతో పాట ప్రత్యక్షమవుతుంది. రకరకాల ఇన్ స్ట్రుమెంట్స్‌తో మ్యూజిక్, సింగర్ వెర్షన్ తో సహా సాంగ్‌ను వినిపిస్తుంది... అది కూడా వందల రకాల ట్యూన్స్లో. మనకు ఏ ట్యూన్ నచ్చితే దాన్ని ఎంచుకోవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ అటువంటి మ్యూజిక్ యాప్‌ను ఉపయోగించి పాటల్ని వినిపించారు.
సాహిత్యం కూడా.. సంగీతమే కాదు సాహిత్యాన్ని కూడా ఇచ్చే యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయట. మనకు ఏ అంశంపై పాట కావాలి... ఎటువంటి పదాలు అందులో ఉండాలి వంటి హింట్స్ ఇస్తే చాలు.. పాట సాహిత్యం కూడా క్షణాల్లో చేతికొస్తుంది. ఇదే కాదు... వీఎఫ్‌ఎక్స్ వంటి పనులు కూడా ఏఐతో చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే సినీ రంగంపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
– దాచేపల్లి సురేష్ కుమార్
యంత్రం పాడితే యాంత్రికంగానే ఉంటుంది
– రచయిత భాస్కరభట్ల రవికుమార్
సాహిత్యం, మ్యూజిక్‌లపై ఏఐ టెక్నాలజీ ప్రభావం తక్కువగా ఉంటుందని నా ఫీలింగ్. యంత్రాల సహాయం తీసుకుంటారు కానీ పాటలు రాయడమనేది యాంత్రికం కాదు. మనిషి మెదడు గొప్పది. మనిషి యంత్రాన్ని తయారు చేశాడు. కానీ మనిషిలా యంత్రం రాయలేదు... పాటలు పాడలేదు. యంత్రం పాడే పాటలు యాంత్రికంగానే ఉంటాయి. తబలా ప్లేయర్స్, కీ బోర్డ్ ప్లేయర్స్ చేసే పనిని యంత్రం చేయలేదు. రోబోలు పనులు చేస్తున్నాయి కదా అని అందరూ రోబోలను పెట్టుకోలేదు కదా!
సరదాకి ఏఐతో కొన్ని పాటలను క్రియేట్ చేసి చూసుకోవడమే తప్పితే ఏమీ ఉండదు. పాట అంటే సౌండింగ్ కోసం రాసేది కాదు. అందులో ఆత్మ ఉంటుంది. దర్శకులు సినిమాలోని సందర్భం, బ్యాక్‌డ్రాప్, హీరో–హీరోయిన్ల పాత్రల తీరు తెన్నెలు చెబుతారు. ఎన్నో అంశాలు సమ్మిళితమై ఓ పాట సిద్ధమవుతుంది. పాట ఎలా ఉంటే ఆడియన్స్‌కు నచ్చుతుంది. ఎలాంటి లిరిక్స్ ఈ పాటను వారికి చేరువ చేస్తాయి? ఇలా తర్జనభర్జనలు పడి, రాత్రీ పగలూ కూర్చొని రాసే పాటలు అవి. లవ్ సాంగ్ కావాలంటే... ఏఐ ఆ పాటను ఇచ్చేస్తుంది. కానీ సినిమాల్లో తీసుకుంటారా? ఏఐ వల్ల చరిత్ర మారి΄ోతుందని, ఉపాధి పడి΄ోతుందనే మాటల్లో వాస్తవం లేదు.
ఎవర్ని విమర్శించాలి?
– సంగీతదర్శకుడు భీమ్స్
మనుషులు లేక΄ోతే భూమి ఏమవుతుంది? తల్లి లేక΄ోతే జన్మ ఉంటుందా? ‘మౌనంగానే ఎదగమనీ...’ అని కొన్ని వేల మంది రాస్తే టెక్నాలజీ పుట్టింది. అసలు మనిషి పుట్టాకే దేవుడు పుట్టాడు. దేవుడు పుట్టాకే కులాలు, మతాలు పుట్టాయి. అలాగే టెక్నాలజీని పుట్టించిందీ మనిషే. ఆ టెక్నాలజీయే మనిషి మనుగడను శాసిస్తోంది. మనిషికి మంచి... చెడు... రెండూ ఉంటాయి. దాన్నేం చేయలేం. మరి.. సృష్టించినవారిని విమర్శిద్దామా? పాటిస్తున్నవారిని విమర్శిద్దామా? ఎవర్ని విమర్శించాలి? నాకు ఏఐ మీద అవగాహన లేదు. టెక్నాలజీ తెలియదు. భవిష్యత్తులో నాకు పని లేక΄ోతే అప్పుడు నాకు వచ్చింది నేను చేసుకుంటాను.
Comments
Please login to add a commentAdd a comment