Music Directors
-
సినీ సంగీతంపై ఏఐ పిడుగు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)... ఇప్పుడు ఎక్కడ చూసినా దీని పైనే చర్చ. ఇప్పటికే పలు రంగాల్లో దీని ప్రభావం మొదలైంది. ఇప్పుడు సినిమా రంగంపైనా ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విభాగం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని టాక్. మ్యూజిక్ డైరక్టర్లపై, ఆ విభాగానికి చెందినవారిపై ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందనే ఊహాగానాలు ఉన్నాయి.ఓ సినిమాకు సంగీతం అందించడమంటే సంగీతదర్శకుడు ఆ చిత్రకథ వినాలి... అతనిచ్చే ట్యూన్స్ డైరక్టర్‌తోపాటు నిర్మాత, హీరోలకూ నచ్చాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో డైరక్టర్ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సినిమా స్థాయిని బట్టిæనెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. పాటలు, ఆర్ఆర్, ట్రైలర్లు, గ్లింప్స్, బీజియమ్స్, ప్రమోషన్ వీడియోలు ఇలా చాలా రకాలు తయారు చేయాల్సి ఉంటుంది. దీనికోసం మ్యూజిక్ డైరక్టర్ వద్ద పదుల సంఖ్యలో ఆర్టిస్టులు పని చేయాల్సి ఉంటుంది. అలాగే చాలామంది టెక్నీషియన్లు కూడా పని చేస్తారు. స్టూడియో బాయ్ నుంచి సౌండ్ ఇంజినీర్స్ వరకు చాలా మంది అవసరం ఉంటుంది. దీనికోసం రెమ్యునరేషన్ రూపంలో నిర్మాత నుంచి మ్యూజిక్ డైరక్టర్‌కు భారీగానే డబ్బూ అందుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని ఆర్టిస్టులకు పారితోషికం రూపంలో, కొందరికి జీతాల రూపంలో ఇస్తుంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఈ మొత్తం వ్యవస్థే ప్రమాదంలో పడే చాన్స్ కనిపిస్తోంది. ఏఐ మ్యూజిక్ యాప్స్..నెట్టింట్లో కొన్ని రకాల ఏఐ మ్యూజిక్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఉంటే మ్యూజిక్ డైరక్టర్ అవసరమే ఉండదంటున్నారు. వీటి ప్రత్యేకత ఏంటంటే... మనం లిరిక్స్ ఇస్తే చాలు క్షణాల్లో పాట తయారై΄ోతుంది. ట్యూన్ కట్టి సింగర్ వాయిస్, మ్యూజిక్‌తో సహా ఇచ్చేస్తుంది. మనం చేయాల్సిందల్లా... మనకు ఎటువంటి ట్యూన్ కావాలి, ఎవరి వాయిస్ కావాలి వంటి రిఫరెన్స్ ఇస్తే చాలు. ఉదాహరణకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌తో పాట కావాలని ఇస్తే క్షణాల్లో ఆయన గాత్రంతో పాట ప్రత్యక్షమవుతుంది. రకరకాల ఇన్ స్ట్రుమెంట్స్తో మ్యూజిక్, సింగర్ వెర్షన్ తో సహా సాంగ్‌ను వినిపిస్తుంది... అది కూడా వందల రకాల ట్యూన్స్‌లో. మనకు ఏ ట్యూన్ నచ్చితే దాన్ని ఎంచుకోవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ అటువంటి మ్యూజిక్ యాప్‌ను ఉపయోగించి పాటల్ని వినిపించారు.సాహిత్యం కూడా.. సంగీతమే కాదు సాహిత్యాన్ని కూడా ఇచ్చే యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయట. మనకు ఏ అంశంపై పాట కావాలి... ఎటువంటి పదాలు అందులో ఉండాలి వంటి హింట్స్ ఇస్తే చాలు.. పాట సాహిత్యం కూడా క్షణాల్లో చేతికొస్తుంది. ఇదే కాదు... వీఎఫ్ఎక్స్ వంటి పనులు కూడా ఏఐతో చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే సినీ రంగంపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.– దాచేపల్లి సురేష్ కుమార్యంత్రం పాడితే యాంత్రికంగానే ఉంటుంది – రచయిత భాస్కరభట్ల రవికుమార్సాహిత్యం, మ్యూజిక్‌లపై ఏఐ టెక్నాలజీ ప్రభావం తక్కువగా ఉంటుందని నా ఫీలింగ్. యంత్రాల సహాయం తీసుకుంటారు కానీ పాటలు రాయడమనేది యాంత్రికం కాదు. మనిషి మెదడు గొప్పది. మనిషి యంత్రాన్ని తయారు చేశాడు. కానీ మనిషిలా యంత్రం రాయలేదు... పాటలు పాడలేదు. యంత్రం పాడే పాటలు యాంత్రికంగానే ఉంటాయి. తబలా ప్లేయర్స్, కీ బోర్డ్ ప్లేయర్స్ చేసే పనిని యంత్రం చేయలేదు. రోబోలు పనులు చేస్తున్నాయి కదా అని అందరూ రోబోలను పెట్టుకోలేదు కదా! సరదాకి ఏఐతో కొన్ని పాటలను క్రియేట్ చేసి చూసుకోవడమే తప్పితే ఏమీ ఉండదు. పాట అంటే సౌండింగ్ కోసం రాసేది కాదు. అందులో ఆత్మ ఉంటుంది. దర్శకులు సినిమాలోని సందర్భం, బ్యాక్‌డ్రాప్, హీరో–హీరోయిన్ల పాత్రల తీరు తెన్నెలు చెబుతారు. ఎన్నో అంశాలు సమ్మిళితమై ఓ పాట సిద్ధమవుతుంది. పాట ఎలా ఉంటే ఆడియన్స్‌కు నచ్చుతుంది. ఎలాంటి లిరిక్స్ ఈ పాటను వారికి చేరువ చేస్తాయి? ఇలా తర్జనభర్జనలు పడి, రాత్రీ పగలూ కూర్చొని రాసే పాటలు అవి. లవ్ సాంగ్ కావాలంటే... ఏఐ ఆ పాటను ఇచ్చేస్తుంది. కానీ సినిమాల్లో తీసుకుంటారా? ఏఐ వల్ల చరిత్ర మారి΄ోతుందని, ఉపాధి పడి΄ోతుందనే మాటల్లో వాస్తవం లేదు. ఎవర్ని విమర్శించాలి?– సంగీతదర్శకుడు భీమ్స్మనుషులు లేక΄ోతే భూమి ఏమవుతుంది? తల్లి లేక΄ోతే జన్మ ఉంటుందా? ‘మౌనంగానే ఎదగమనీ...’ అని కొన్ని వేల మంది రాస్తే టెక్నాలజీ పుట్టింది. అసలు మనిషి పుట్టాకే దేవుడు పుట్టాడు. దేవుడు పుట్టాకే కులాలు, మతాలు పుట్టాయి. అలాగే టెక్నాలజీని పుట్టించిందీ మనిషే. ఆ టెక్నాలజీయే మనిషి మనుగడను శాసిస్తోంది. మనిషికి మంచి... చెడు... రెండూ ఉంటాయి. దాన్నేం చేయలేం. మరి.. సృష్టించినవారిని విమర్శిద్దామా? పాటిస్తున్నవారిని విమర్శిద్దామా? ఎవర్ని విమర్శించాలి? నాకు ఏఐ మీద అవగాహన లేదు. టెక్నాలజీ తెలియదు. భవిష్యత్తులో నాకు పని లేక΄ోతే అప్పుడు నాకు వచ్చింది నేను చేసుకుంటాను. -
నేను పాడితే వంకలు పెట్టేవారు వాలు..!
-
తమన్, DSPకి షాక్ టాలీవుడ్ ని రూల్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్
-
పాటలతో పోటీ పడుతున్న తమన్, దేవి
-
టాలీవుడ్లో యువ సంగీత దర్శకుల హవా
శ్రీనగర్‌కాలనీ: ‘పిల్లా.. రా.. అందాల రాక్షసివే’ పాటతో ఇప్పుడు కుర్రకారు ఊగిపోతున్నారు. ఎవరిమొబైల్లో చూసినా ఇదే హోరెత్తుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలోని ఈ పాటకు యువత ఫిదాఅయిపోయింది. మొబైల్స్ నుంచి సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. అంతేకాకుండా‘మళ్ళీరావా’ చిత్రంలోని పాటలు, ఇటీవలే విడుదలైన ‘సమ్మోహనం’.. ‘చి..ల..సౌ’.. ‘సాక్ష్యం’.. చిత్రాల్లోని గీతాలు సంగీత ప్రియుల మనసును దోచుకున్నాయి. కానీ ఈ పాటల వెనుక ఉన్న తెలుగు యువ సంగీత దర్శకుల గురించి చాలా మందికి తెలిసుండదు. ఓ సినిమాలోని పాటలు బాగున్నాంటే ఆ చిత్రం హిట్టే. అలాంటి సంగీతం అందించాలంటే ఆ మ్యూజిక్ దర్శకుడికి ప్రేక్షకుల హృదయాలను రంజినచేసే సృజనాత్మకతతో పాటు వారి నాడి తెలుసుండాలి. కానీ అదంత సులువు కాదు. ప్రస్తుతంమన యువ తెలుగు సంగీత దర్శకులు ఉన్నత చదువులు చదివి సంగీతం మీద ప్రేమతో ఇటు వచ్చారు.తమ విశేష ప్రతిభతో ప్రేక్షకుల నాడి పట్టుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకొని కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నారు. ఇటీవలి కాలంలో మధురమైన పాటలతో యువతకు చేరువైన యువ సంగీత దర్శకులుతమ సినీ ప్రయాణ విశేషాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. యడవల్లి ప్రభాకర్ చైతన్య ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలోని పాటలు ఇంతగా యువతను ఆకట్టుకుంటాయని అనుకోలేదు. చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మాది వైజాగ్. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. నాకు కీబోర్డ్‌పై పట్టుంది. కానీ చదువుల వల్ల పూర్తి సమయం కేటాయించలేదు. గీతం యూనివర్సిటీలో బీటెక్ సీఎస్ఈ చేసి అనంతరం ఐఆర్‌డీఏలో ఉద్యోగంలో చేరాను. అక్కడి నుంచి ‘జావా డెవలపర్’గా జాబ్ చేశాను. మనసంతా సంగీతం వైపు లాగుతుంటే ఉద్యోగం మానేసి మ్యూజిక్‌పై దృష్టి పెట్టాను. మొదట షార్ట్‌ఫిల్మŠస్కు సంగీతం అందించాను. దర్శకుడు రమేష్‌వర్మ ‘7’ అనే చిత్రానికి సంగీతం చేయడానికి అవకాశం ఇచ్చారు. అక్కడే ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి పరిచయమయ్యారు. నా మీద నమ్మకంతో చిత్రానికి సంగీతం చేసే అవకాశం ఇచ్చారు. ‘పిల్లా రా’.. పాటకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహిచలేదు. ‘కొడవలి నిండా’ పాట కూడా యువతకు బాగా కనెక్ట్ అయింది. ఇండస్ట్రీలోని అందరితో పనిచేయాలని ఉంది. హైదరాబాద్‌లో చాలా ప్రీడం ఉంటుంది. బిర్యానీ, ట్యాంక్‌బండ్ ఇష్టం. మాల్స్‌కు ఎక్కువగా వెళుతుంటా. మంచి సంగీత దర్శకుడిగా ప్రేక్షకులకు చేరువకావాలన్నది నా ఆకాంక్ష. వివేక్ సాగర్.. నా పూర్తి పేరు వివేక్‌సాగర్ ముడుంబా.. పక్కా హైదరాబాదీని. సెయింట్ మేరిస్ కాలేజీలో బీటెక్ చేశాను. అమ్మకు సంగీతంపై పట్టుంది. ఆమే నా తొలి గురువు. స్కూల్లో రామాచారి మాస్టర్ దగ్గర మెళకువలు నేర్చుకున్నాను. కాలేజ్ డేస్‌లో ఓ మ్యూజిక్ బ్యాండ్‌ను స్టార్ చేశాం. గిటార్‌తో పాటు పలు వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నాను. షార్ట్ఫిలింస్, టీవీ యాడ్స్‌కు సంగీతం అందించాను. అనంతరం ‘అర్జున్‌రెడ్డి’ ఫేం రాహుల్ ద్వారా దర్శకుడు తరుణ్ భాస్కర్ పరిచయమయ్యారు. అతని ‘సైన్మా’ ఫార్ట్ఫిలింకు మంచి ఆదరణ లభించింది. తరుణ్ భాస్కర్ ‘పెళ్ళిచూపులు’ సినిమా నా కెరీర్‌ని మలుపు తిప్పింది. చిత్రంలోని పాటలు ప్రతి ఒక్కరికీ నచ్చాయి. ఆ హిట్‌తో మంచి అవకాశాలు వచ్చాయి. ‘యుద్ధం శరణం’, ‘షీష్మహల్’ చిత్రాలకు కూడా సంగీతం అందించాను. ‘సమ్మోహనం, ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. వాటిలోని పాటలు కూడా శ్రోతల మనసు దోచుకున్నాయి. ఇప్పడు విశ్వక్సేన్ దర్శకత్వంలో ‘ఫలక్నామా దాస్’ చిత్రంతో పాటు మరో రెండు తెలుగు చిత్రాలకు పనిచేస్తున్నాను. ప్రేక్షకులకు గుర్తుండిపోయే మధురమైన పాటలను అందించాలన్నదే నా ఆకాంక్ష. శ్రావణ్ భరద్వాజ మాది గుంటూరు. హైదరాబాద్‌లో డిగ్రీ చేశాను. ఓల్డ్ సిటీలో ఉండేవాళ్లం. సంగీతం వినడం, పాడడం ఇష్టం. మా బావ విజ్ఞాన్ నాకు సహకారం అందించారు. సన్నిహితులు కృష్ణకాంత్, క్రిష్‌తో కలిసి 2013లో ‘కలయో నిజయో’ అనే వీడియో ఆల్బమ్ చేశాం. మధుర శ్రీధర్ ఆల్బమ్‌ను విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. హైదరాబాద్‌లోని టాప్ కాలేజీల్లో మ్యూజిక్ షోలు సైతం ఇచ్చాం. మా అల్బమ్‌లోని పాటను తరుణ్ భాస్కర్ తీసిన ‘అనుకోకుండా’ షార్ట్‌ఫిలింలో వాడారు. ఆ షార్ట్‌ఫిలిం హిట్టై పాటకు మంచి ఆదరణ లభించింది. తర్వాత ‘పంజా’ చిత్రం నిర్మాత నీలిమ తిరుమలశెట్టి నిర్మించిన ‘అలియాస్ జానకి’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా పాటలు కూడా అందరికీ నచ్చాయి. అనంతరం ‘ప్రేమ ఇష్క్ కాదల్’.. ‘మీకుమీరే మాకు మేమే’.. నారా రోహిత్ ‘సావిత్రి’ సినిమాలకు పనిచేశాను. సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీరావా’ చిత్రం నన్ను మరో మెట్టు ఎక్కించింది. మెలోడీస్ అంటే ఇష్టం. అన్ని రకాల సంగీతాలను అందించి సంగీతప్రియుల మనుసు గెలవాలన్న తపనతో పనిచేస్తున్నాను. ప్రశాంత్ ఆర్ విహారి మాది కోదాడ. వరంగల్ కిట్స్‌లో ఇంజినీరింగ్ చేశాను. సంగీతం మీద అమితాశక్తితో చెన్నైలో ఏఆర్ రెహమాన్ కేఎం మ్యూజిక్ కన్సర్వేటరీలో పియానో నేర్చుకున్నాను. పలు తెలుగు, తమిళ షార్ట్ ఫిలింస్‌కి పనిచేశాను. నా మొదటి చిత్రం ‘వెళ్ళిపోమాకే’. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో లీడ్‌రోల్ చేసిన విశ్వక్సేన్ ఆ చిత్రంలో హీరో. ఈ మూవీని దిల్‌రాజు రిలీజ్ చేశారు. పాటలకు మంచి ఆదరణ వచ్చింది. అ తర్వాత రాజ్ కుందుకూరి నిర్మించిన ‘మెంటల్ మదిలో’ అవకాశం వచ్చింది. పాటలకు శ్రోతల నుంచి పేరొచ్చింది. సుశాంత్ నటించిన ‘చి..ల..సౌ’ చిత్రానికి సంగీతం అందించాను. పాత చిత్రాల్లోని మెలోడీస్ చాలా ఇష్టం. అన్ని విభిన్నమైన సంగీతాలను ప్రేక్షకులకు అందించాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం వరుణ్‌తేజ్ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి, మరో తమిళ, తెలుగు చిత్రాన్ని సంగీతాన్ని అందిస్తున్నాను. హర్షవర్ధన్ రామేశ్వర్ మా సొంతూరు రాజమండ్రి. కానీ పెరిగిందంతా చెన్నైలోనే. బీకాం చేశాను. మా నాన్న లక్ష్మీనారాయణ దక్షిణాది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేశారు. ఆయన మార్గదర్శకంతో సంగీతం నేర్చుకున్నాను. రిథమ్, కీబోర్ట్, గిటార్ నేర్చుకున్నాను. సంగీత దర్శకుల వద్ద చాలా సినిమాలకు పనిచేశాను. అనంతరం ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి పరిచయంతో ఆ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించాను. ఈ చిత్రంలోని పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు మంచి పేరొచ్చింది. తర్వాత ‘సాక్ష్యం’, ‘విజేత’ చిత్రాలకు సంగీతాన్ని అందించే అవకాశం వచ్చింది. ఇండిపెండెంట్‌గా ఆల్బమ్ మ్యూజిక్స్ చేయాలన్నది నా తపన. అర్జున్‌రెడ్డి హిందీ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు పలు చిత్రాలను సంగీత దర్శకుడిగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీలో విభిన్న సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలి. కబీర్ రఫీ ‘సిమా’ బెస్ట్‌మ్యూజిక్ డైరెక్టర్ ఒక ముస్లిం యువకుడిగా సంగీత దర్శకుడిగా రాణించడం కష్టమని చాలా మంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. ఇండస్ట్రీలో ప్రతిభ ఉంటే తప్పక అవకాశాలు వస్తాయి. నేను పుట్టింది గుంటూరు. కానీ పెరిగిందంతా ముంబై,హైదరాబాద్‌లోనే. సంగీతం మీద ఆసక్తితో ఇటువైపు వచ్చాను. హైదరాబాద్‌లోనే ఎంబీఏ చేశాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల ‘జస్ట్ డయిల్’లో ఉద్యోగం కూడా చేశాను. కానీ సంగీతమే ప్రాణం అవడం వల్ల ఈ రంగంలోనే ఉండాలని నిశ్చయించుకున్నాను. అప్పుడప్పుడే షార్ట్ఫిలింకు, ఇండిపెండెంట్ సినిమాలకు ఆదరణ లభిస్తుండడం చూసి షార్ట్ఫిలింస్కు సంగీతం అందించాను. ‘కిక్’ (కొంచెం ఇష్టం చాలా కష్టం) షార్ట్ఫిలింకు గతేడాది ప్రకటించిన ‘సిమా’ షార్ట్‌ఫిలిం అవార్ట్స్‌లో నాకు ‘బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్’ అవార్డు వచ్చింది. ఇది నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో పాటు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇప్పటి వరకూ 120కి పైగా ష్టార్ట్ఫిలింస్కు సంగీతం అందించాను. టాప్ వెబ్‌సీరిస్‌లకు సంగీతం అందించాను. పలు చిత్రాలకు సైతం సంగీతం చేసే అవకాశం వచ్చింది. ‘బాబు సాఫ్ట్వేర్’ సినిమాతో పాటు మరికొన్ని కన్నడ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తుండిపోయే పాటలను అందించి ప్రేక్షకుల మన్నన పొందాలన్నదే నా లక్ష్యం. -
నారాజు గాకుర మా అన్నయా...
సినీ గీత రచయితగా ‘జానీ’ చిత్రంతో ప్రవేశించే అవకాశం కలిగించారు పవన్‌కల్యాణ్. నేనప్పటికే చాలా సామాజిక ఉద్యమ గీతాలు రాశాను. హైదరాబాద్ స్లాంగ్‌తో మంచి పాటలు రాసే వారెవరైనా వుంటే చెప్పమని ప్రముఖ చిత్రకారులు ఏలే లక్ష్మణ్ గారిని అడిగారు పవన్‌కల్యాణ్. ఆయన నా పేరు సూచించారు. అలా మొట్టమొదటి సారిగా ‘జానీ’ సినిమాలో సన్నివేశానికి అనుగుణంగా రాసిన పాటే ‘నారాజుగాకుర మా అన్నయ్య’ పాట. హిందువుల దీపావళి పండుగకు వచ్చిన ముస్లిం యువకుల్ని అవమానపరచి వెళ్లగొట్టినప్పుడు హీరో ఆయనను ఓదార్చే పాట ఇది. ఈ పాటను నేను మూడు రోజులలో పూర్తి చేసి పవన్‌కల్యాణ్‌కు, సంగీత దర్శకులు రమణ గోగులకు వినిపించాను. పాటలోని ఒక్క అక్షరం కూడా మార్చకుండా, అలాగే అంగీకరించారు. అంతకుముందు అనుకున్న ముస్లిం యువకుడి పాత్ర పేరు వేరుగా ఉంది. ఆ పేరును నేను యతిప్రాసలకనుగుణంగా ‘నారాజు గాకురా మా అన్నయ్య – నజీరు అన్నయ్య’ అంటూ ‘నారాజు’ ‘నజీరు’ పద బంధాలతో పాట అల్లాను. మనిషి పుట్టినాక పుట్టింది మతము పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతము తల్లి కడుపులో నుండి ఎళ్లినట్టి మనిషీ తలచకురా ఈ చెడ్డ గతము ఈ చెడ్డ గతము / నారాజు గాకురా మా అన్నయ్యా/ నజీర్ అన్నయ్యా ముద్దుల కన్నయ్యా / అరేయ్ మన రోజు మనకుంది మా అన్నయా మనిషి పుట్టినప్పుడు లేని కులమతాలు మధ్యలో వచ్చి, మనుషుల్ని వేరు చేస్తున్నాయి. అంతమాత్రం చేత నువ్వు బాధపడవద్దు, చిన్నపుచ్చుకోవద్దు... అని వస్తుంది. అనువుగాని చోట నువ్వు అధికుడన్నమాట అనవద్దునంట అన్న వేమన్నగారి మాట వినలేదా నువ్వు బేటా బంగారు పలుకు మాట హోయ్ నారాజు గాకురా మా అన్నయ్యా నజీర్ అన్నయ్యా ముద్దుల కన్నయ్యా అరే మన రోజు మనకుంది మన్నయో అక్కన్నలను మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముడి గుడి కట్టెనుగా కులీ కుతుబ్‌షా ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనురా నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు మనకెందుకురన్నా ఇంకెందుకురన్నా నారాజు గాకురా మా అన్నయ్యా మనకు అనువు కాని చోట, అధికులమంటూ మాట్లాడద్దని వేమన చెప్పిన మాటలు బంగారు పలుకులు అని ఈ చరణంలో పొందుపరిచాను. అలాగే ముస్లిం పరిపాలకుడు అయిన తానీషా దగ్గర పనిచేసిన అక్కన్న మాదన్న అనే హిందూ మంత్రుల సమయంలో రామదాసు గుడి కట్టిన విషయాన్ని వివరించాను. ఓ హిందూ స్త్రీ పేరున ముస్లిం రాజు నిర్మించిన భాగ్యనగరంలో కులమతాల గొడవెందుకని కులమతాలకు అతీతంగా ఉండాలంటూ ఈ చరణంలో సమైక్యత గురించి చెప్పాను. విన్నావా సోదరుడా మొన్న నిమ్స్ దవాఖానలో జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చుతునక తన చావుతో ముస్లిం మన హిందు సోదరులకి ప్రాణదానం ఇచ్చిండు తన కిడ్నీలను తీసి మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్న మనుషుల్లో సైతానులకు పట్టదన్నా ఇది పట్టదన్నా/ నారాజు గాకురా మా అన్నయ్యా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి కిడ్నీలను ఇద్దరు హిందూ పేషెంట్లకు అమర్చగా వారు బతికిన ఉదంతాన్ని తీసుకుని, ముస్లిం యువకుడి కిడ్నీలతో హిందువులు బతికాక, ఇంకా కులం మతం అంటూ మూర్ఖంగా ప్రవర్తించడంలో ఔచిత్యం లేదు అని చెప్పాను. పీర్ల పండగొచ్చిందా ఊళ్లల్లో మనవాళ్లు డప్పుల దరువేసుకుంటూ కోలాటాలు ఆడతారు సదరు పండగొచ్చిందా పట్నంలో ప్రతివారు దున్నపోతునాడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటరు ఎవడేమి అనుకుంటే మనకేమిటన్నా జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా ఎప్పుడూ నువ్వేరన్నా / నారాజుగాకురా మా అన్నయ్యా నజీరు అన్నయ్యా ముద్దుల కన్నయ్యా మన రోజు మనకుంది మన్నయ్యా హైదరాబాద్ నగరంలో పీర్ల పండగొస్తే హిందువులు, దీపావళి అనంతర రోజు యాదవులు నిర్వహించే సదర్ పండుగలో ముస్లింలు పొల్గొనే సంస్కృతి మనది... అంటూ హైదరాబాద్ సాంస్కృతిక చారిత్రక సత్యాలను ఈ పాటలో చెప్పాను. నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుణ్ని గుమ్మానికి ఉరి తీస్తాడోయ్ నమ్మినోణ్ని తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు దేవుళ్లను దోచేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం అంటేస్తాడమ్మో నాయకుడు నాయకులు ఏ విధంగా ప్రజలను మోసగిస్తారో, నమ్మినవారిని సైతం ఏ విధంగా ఉరి తీస్తారో ఈ చరణంలో వివరించాను. లబ్ధప్రతిష్టులైన వేమన, జాషువా అనే ఇద్దరు ప్రజా కవుల పేర్లను సందర్భోచితంగా ఈ పాటలో చేర్చాను. ఇది నాకు బాగా నచ్చిన పాట. సమైక్యతను, సమసమాజాన్ని చాటే పాట. – సంభాషణ: వైజయంతి -
మాస్ సాంగ్స్‌కే ప్రాధాన్యం ఇస్తా..
సినిమాకు సంగీతం ప్రాణం. సంగీత బాణీలతో కూడిన పాటలు ఆహ్లాదకరం. వీటికి సృష్టికర్త సంగీత దర్శకుడు. మనకు ఇళయరాజా వంటి ఎందరో ప్రముఖ సంగీత దర్శకులు ఉన్నారు. వారి స్ఫూర్తితో మరెందరో సంగీతదర్శకులుగా ఎదుగుతున్నారు. అలాంటి వారి లో సి.సత్య ఒకరు. తక్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు పొందిన సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు. కర్ణాటక సంగీత కుటుంబం నుంచి వచ్చిన సత్య సంగీత దర్శకుడు మాత్రమే కా దు, హార్మోనిస్ట్, కీ బోర్డు ప్లేయర్, మంచి గాయకుడు కూడా. భరద్వాజా లాంటి పలువురు సంగీత దర్శకుల వద్ద శిష్యరికం చేసిన అనుభవంతో ఎంగేయుం ఎప్పోదుం చిత్రంతో సం గీత దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుని తన సంగీత ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన సత్య తీయవేలై సేయనుమ్ కుమారు, నెడుంశాలై,ఇవన్ వేరమాదిరి, కథై తిరైకథై వచనం ఇయక్కయ్ తదితర చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతే కాదు సంథింగ్ సంథింగ్ అనే చిత్రంతో తెలుగులోనూ పరిచయం అయ్యారు. తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. చిత్రంలోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లంభించడంతో ఆనందంలో మునిగి తేలుతున్న సత్యతో చిన్న భేటీ.. ప్ర: వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్ర విజయానికి సంగీతం పక్కా బలంగా నిలిచిందని భావిస్తున్నారా? జ: కచ్చితంగా. చిత్రం కంటే ముందే ఇందులోని పాటలు ప్రేక్షకాదరణ పొందాలి. అంటే చిత్ర విజయంలో ఆడియో భాగం అయినట్లేగా. ప్ర: చిత్ర దర్శకుడు ఎళిల్‌తో తొలిసారిగా కలిసి పనిచేసిన అనుభవం? జ: చాలా మంచి అనుభవం. అయితే ఆయన కంపోజింగ్ సమయంలో ఒకటి రెండు సార్లు మాత్రమే పాల్గొన్నారు. నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే మరింత బాధ్యతగా పని చేశాను. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. చిత్ర కథానాయకుడు, నిర్మాత విష్టువిశాల్ కూడా పాటలు బాగా వచ్చాయని ఆనందంగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ప్ర: వేలైన్ను వందుట్టా వెళ్లైక్కారన్ చిత్రంలో ఎక్కువగా ఫాస్ట్ బీట్తో కూడిన మాస్ పాటలకే ప్రాముఖ్యత నిచ్చినట్లున్నారు? జ: నిజం చెప్పాలంటే నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం. అయితే ఈ చిత్ర కథకు మాస్ పాటలు అవసరం అయ్యాయి. అవి విశేష ఆదరణను పొందడంతో ఇకపై కూడా మాస్ సాంగ్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నాను. ప్ర: ఏ ప్రముఖ సంగీతదర్శకుడి ప్రభావం అయినా మీపై ఉంటుందా? జ: ప్రభావం అంటూ ఏమీ ఉండదుగానీ ఇసైజ్ఞాని ఇళయరాజా స్ఫూర్తి మాత్రం ఉంటుంది. ఆయన సంగీతం వింటూ ఎదిగిన వాడిని ఆయనలా కొత్తగా బాణీలు కట్టాలని ప్రయత్నిస్తుంటాను. ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? జ: రెండు చిత్రాలు చేస్తున్నాను. త్వరలో పార్తీబన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాను. -
కీరవాణిని విలన్‌గా చేయమంటున్న రాజమౌళి!
సింగర్స్, మ్యూజిక్ డెరైక్టర్స్ వెండితెరపై యాక్ట్ చేయడమనేది అరుదైన విషయమే. కానీ కొన్ని కొన్ని సందర్భాలను బట్టి వాళ్లు కూడా తెరపై కనపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి కీరవాణి లైఫ్‌లో చాలా ఎక్కువున్నాయి. కీరవాణి పైకి సీరియస్‌గా కనిపిస్తారు కానీ, ఆయనలో చమత్కారం పాళ్లు చాలా ఎక్కువ. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో హుషారుగా కనిపిస్తారు. అందుకే కొంతమంది దర్శకులు కీరవాణిని నటించమని అడగడం, ఈయనేమో సున్నితంగా తిరస్కరించడం జరిగాయి. కానీ కొంతమంది మరీ మొహమాట పెట్టేయడంతో, కీరవాణి తన మొహానికి మేకప్ వేసుకోక తప్పలేదు. ఆయన మొదట తెరపై కనిపించింది ‘జీవితమే ఒక సినిమా’ అనే సినిమాలో. అందులో ఓ చిన్న వేషంలో కనిపిస్తారాయన. జగపతిబాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడుగారు వచ్చారు’లో ఓ సంగీత విద్వాంసునిగా నటించారు. ‘రక్షణ’లో ‘ఘల్లుమంది బాసూ... గలాసూ’ పాటలో నాగార్జున, రోజాతో పాటు నిర్మాత వెంకట్ అక్కినేని, కెమెరామేన్ తేజ, నృత్యదర్శకుడు ప్రభుదేవాతో పాటు కీరవాణి కూడా కనిపిస్తారు. ‘సమర్పణ’ సినిమాలో ముష్టివాడు పాత్రలో ఆయన నటించారు. హీరో అర్జున్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రతాప్’ అనే తమిళ సినిమాలో ఓ అరనిమిషం పాత్ర చేశారు. ‘మగధీర’లో ‘శుభం కార్డు’ తర్వాత వచ్చే పాటలో యూనిట్ సభ్యులతో పాటు కీరవాణి కూడా కనిపిస్తారు. సరిగ్గా ఆ పాట చిత్రీకరణ సమయానికి ఆయన అమెరికాలో ఉండడంతో, అక్కడ నుంచే వీడియో షూట్ చేసి పంపించారు. ఇక కీరవాణి వద్దనుకున్నవి, వదిలేసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. కీరవాణి సతీమణి వల్లీకి పోలీసు వృత్తి అంటే ఇష్టం. అందుకేనేమో ఓసారి కీరవాణితో పోలీస్ డ్రెస్ వేయించి తన ముచ్చట తీర్చుకున్నారు. అలా పోలీస్ డ్రెస్‌తోనే కె.రాఘవేంద్రరావు ఆఫీసుకి వెళ్లారు కీరవాణి. రాఘవేంద్రరావు ఆశ్చర్యపోయి ‘‘ఈ డ్రెస్ నీకు బాగుంది. ఇప్పుడు తీస్తున్న ‘ఘరానా బుల్లోడు’ సినిమాలో ఒక పోలీసు పాత్ర ఉంది. నువ్వే చెయ్యాలి’’ అన్నారు. కీరవాణి మొహమాటంగా చూద్దాం...లెండి’’ అన్నారు. ఆ విషయం కీరవాణి మరిచిపోయారు కానీ, రాఘవేంద్రరావు మరిచిపోలేదు. రాజమండ్రిలో షూటింగ్ ఉంది. రమ్మని కబురుపెట్టారు. కానీ కుదరక కీరవాణి వెళ్లలేకపోయారు. అలా ఆ పాత్ర మిస్సయ్యింది. ‘శ్రీరామదాసు’లో రాళ్లపల్లి వేసిన పడవవాడి వేషం కీరవాణినే వేయమన్నారు. కానీ తనకు నీళ్లంటే భయమని చేయననేశారు కీరవాణి. ‘సొంతవూరు’లో ఎల్బీ శ్రీరామ్ చేసిన పాత్రకు మొదట కీరవాణినే అడిగారు. ‘వేదం’లో కీరవాణి ఓ పాత్ర చేస్తారని మొదట్లో వార్తలొచ్చాయి.ఇవన్నీ ఒకెత్తు అయితే... రాజమౌళికి తన అన్నయ్య కీరవాణితో విలన్ పాత్ర చేయించాలని కోరిక. ‘‘నన్ను విలన్‌గా చేయమని రాజమౌళి ఎప్పుడూ అడుగుతుంటాడు. నాకే ఆసక్తి లేదు’’ అని కీరవాణి చెప్పారు.