Music Department
-
సినీ సంగీతంపై ఏఐ పిడుగు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)... ఇప్పుడు ఎక్కడ చూసినా దీని పైనే చర్చ. ఇప్పటికే పలు రంగాల్లో దీని ప్రభావం మొదలైంది. ఇప్పుడు సినిమా రంగంపైనా ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విభాగం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని టాక్. మ్యూజిక్ డైరక్టర్లపై, ఆ విభాగానికి చెందినవారిపై ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందనే ఊహాగానాలు ఉన్నాయి.ఓ సినిమాకు సంగీతం అందించడమంటే సంగీతదర్శకుడు ఆ చిత్రకథ వినాలి... అతనిచ్చే ట్యూన్స్ డైరక్టర్‌తోపాటు నిర్మాత, హీరోలకూ నచ్చాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో డైరక్టర్ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సినిమా స్థాయిని బట్టిæనెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. పాటలు, ఆర్ఆర్, ట్రైలర్లు, గ్లింప్స్, బీజియమ్స్, ప్రమోషన్ వీడియోలు ఇలా చాలా రకాలు తయారు చేయాల్సి ఉంటుంది. దీనికోసం మ్యూజిక్ డైరక్టర్ వద్ద పదుల సంఖ్యలో ఆర్టిస్టులు పని చేయాల్సి ఉంటుంది. అలాగే చాలామంది టెక్నీషియన్లు కూడా పని చేస్తారు. స్టూడియో బాయ్ నుంచి సౌండ్ ఇంజినీర్స్ వరకు చాలా మంది అవసరం ఉంటుంది. దీనికోసం రెమ్యునరేషన్ రూపంలో నిర్మాత నుంచి మ్యూజిక్ డైరక్టర్‌కు భారీగానే డబ్బూ అందుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని ఆర్టిస్టులకు పారితోషికం రూపంలో, కొందరికి జీతాల రూపంలో ఇస్తుంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఈ మొత్తం వ్యవస్థే ప్రమాదంలో పడే చాన్స్ కనిపిస్తోంది. ఏఐ మ్యూజిక్ యాప్స్..నెట్టింట్లో కొన్ని రకాల ఏఐ మ్యూజిక్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఉంటే మ్యూజిక్ డైరక్టర్ అవసరమే ఉండదంటున్నారు. వీటి ప్రత్యేకత ఏంటంటే... మనం లిరిక్స్ ఇస్తే చాలు క్షణాల్లో పాట తయారై΄ోతుంది. ట్యూన్ కట్టి సింగర్ వాయిస్, మ్యూజిక్‌తో సహా ఇచ్చేస్తుంది. మనం చేయాల్సిందల్లా... మనకు ఎటువంటి ట్యూన్ కావాలి, ఎవరి వాయిస్ కావాలి వంటి రిఫరెన్స్ ఇస్తే చాలు. ఉదాహరణకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌తో పాట కావాలని ఇస్తే క్షణాల్లో ఆయన గాత్రంతో పాట ప్రత్యక్షమవుతుంది. రకరకాల ఇన్ స్ట్రుమెంట్స్తో మ్యూజిక్, సింగర్ వెర్షన్ తో సహా సాంగ్‌ను వినిపిస్తుంది... అది కూడా వందల రకాల ట్యూన్స్‌లో. మనకు ఏ ట్యూన్ నచ్చితే దాన్ని ఎంచుకోవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ అటువంటి మ్యూజిక్ యాప్‌ను ఉపయోగించి పాటల్ని వినిపించారు.సాహిత్యం కూడా.. సంగీతమే కాదు సాహిత్యాన్ని కూడా ఇచ్చే యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయట. మనకు ఏ అంశంపై పాట కావాలి... ఎటువంటి పదాలు అందులో ఉండాలి వంటి హింట్స్ ఇస్తే చాలు.. పాట సాహిత్యం కూడా క్షణాల్లో చేతికొస్తుంది. ఇదే కాదు... వీఎఫ్ఎక్స్ వంటి పనులు కూడా ఏఐతో చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే సినీ రంగంపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.– దాచేపల్లి సురేష్ కుమార్యంత్రం పాడితే యాంత్రికంగానే ఉంటుంది – రచయిత భాస్కరభట్ల రవికుమార్సాహిత్యం, మ్యూజిక్‌లపై ఏఐ టెక్నాలజీ ప్రభావం తక్కువగా ఉంటుందని నా ఫీలింగ్. యంత్రాల సహాయం తీసుకుంటారు కానీ పాటలు రాయడమనేది యాంత్రికం కాదు. మనిషి మెదడు గొప్పది. మనిషి యంత్రాన్ని తయారు చేశాడు. కానీ మనిషిలా యంత్రం రాయలేదు... పాటలు పాడలేదు. యంత్రం పాడే పాటలు యాంత్రికంగానే ఉంటాయి. తబలా ప్లేయర్స్, కీ బోర్డ్ ప్లేయర్స్ చేసే పనిని యంత్రం చేయలేదు. రోబోలు పనులు చేస్తున్నాయి కదా అని అందరూ రోబోలను పెట్టుకోలేదు కదా! సరదాకి ఏఐతో కొన్ని పాటలను క్రియేట్ చేసి చూసుకోవడమే తప్పితే ఏమీ ఉండదు. పాట అంటే సౌండింగ్ కోసం రాసేది కాదు. అందులో ఆత్మ ఉంటుంది. దర్శకులు సినిమాలోని సందర్భం, బ్యాక్‌డ్రాప్, హీరో–హీరోయిన్ల పాత్రల తీరు తెన్నెలు చెబుతారు. ఎన్నో అంశాలు సమ్మిళితమై ఓ పాట సిద్ధమవుతుంది. పాట ఎలా ఉంటే ఆడియన్స్‌కు నచ్చుతుంది. ఎలాంటి లిరిక్స్ ఈ పాటను వారికి చేరువ చేస్తాయి? ఇలా తర్జనభర్జనలు పడి, రాత్రీ పగలూ కూర్చొని రాసే పాటలు అవి. లవ్ సాంగ్ కావాలంటే... ఏఐ ఆ పాటను ఇచ్చేస్తుంది. కానీ సినిమాల్లో తీసుకుంటారా? ఏఐ వల్ల చరిత్ర మారి΄ోతుందని, ఉపాధి పడి΄ోతుందనే మాటల్లో వాస్తవం లేదు. ఎవర్ని విమర్శించాలి?– సంగీతదర్శకుడు భీమ్స్మనుషులు లేక΄ోతే భూమి ఏమవుతుంది? తల్లి లేక΄ోతే జన్మ ఉంటుందా? ‘మౌనంగానే ఎదగమనీ...’ అని కొన్ని వేల మంది రాస్తే టెక్నాలజీ పుట్టింది. అసలు మనిషి పుట్టాకే దేవుడు పుట్టాడు. దేవుడు పుట్టాకే కులాలు, మతాలు పుట్టాయి. అలాగే టెక్నాలజీని పుట్టించిందీ మనిషే. ఆ టెక్నాలజీయే మనిషి మనుగడను శాసిస్తోంది. మనిషికి మంచి... చెడు... రెండూ ఉంటాయి. దాన్నేం చేయలేం. మరి.. సృష్టించినవారిని విమర్శిద్దామా? పాటిస్తున్నవారిని విమర్శిద్దామా? ఎవర్ని విమర్శించాలి? నాకు ఏఐ మీద అవగాహన లేదు. టెక్నాలజీ తెలియదు. భవిష్యత్తులో నాకు పని లేక΄ోతే అప్పుడు నాకు వచ్చింది నేను చేసుకుంటాను. -
నా అభిమానుల కోసం నిర్వహిస్తున్నా: రాహుల్
సాక్షి, గచ్చిబౌలి : తనకు ఓట్లేసి గెలిపించిన వారి కోసం ప్రత్యేకంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు బిగ్ బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. సోమవారం కొండాపూర్‌లోని సౌండ్ గార్డెన్ కేఫ్‌లో ‘లైవ్ కన్సర్ట్’ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29న పీపుల్స్ ప్లాజాలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని, తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లేసిన వారు, అభిమానులు వచ్చే అవకాశం ఉందన్నారు. పునర్నవి, శివ జ్యోతి, శ్రీముఖితో పాటు బిగ్ బాస్–3లోని సభ్యులను ఆహ్వానించానని చెప్పారు. తాను ఓ సాధారణ కామన్ మ్యాన్‌ను అన్నారు. సినిమాలకు పాటలు పాడితే వచ్చే ఆదాయం సరిపోక...2013 నుంచి మ్యాజిక్ వీడియోస్ తీశానన్నారు. లక్షలు ఖర్చు చేస్తే ‘మాకీ కిరికిరి’ అనే పాటకు మొన్నమొన్న గుర్తింపు వచ్చిందన్నారు. సంగీత విభావరిలో పెద్ద స్టేజిపై టాలీవుడ్‌కు చెందిన ఓ సింగర్ సొంత పాటలు సోలోగా పాడబోతున్నాడని చెప్పారు. టాలెంట్ సింగింగ్‌తో థ్యాంక్స్ తెలియజేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు బాగా ఆదరించారని చెప్పారు. బిగ్‌బాస్–3లో తన వ్యక్తిత్వాన్ని పాజిటివ్‌గా ప్రజెంట్ చేసినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆయన పిలిచారు.. నేను వెళ్లాను
‘‘నేను, అన్నయ్య ఏసుదాస్, చిత్ర ముగ్గురం కలిపి అన్ని భాషల్లో దాదాపు లక్ష పాటల వరకు పాడితే అందులో తెలుగు పాటలే 35,000 వరకూ ఉంటాయి’’ అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అలేఖ్య హోమ్స్ సమర్పణలో ఎలెవన్ పాయింట్ టూ ప్రొడక్షన్స్ వారు ‘లెజెండ్స్’ సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 30న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఈ ప్రోగ్రామ్‌లో పాటలు ఎక్కువ, మాటలు తక్కువగా ఉంటాయి. గతంలో ఇలాంటి ప్రోగ్రామ్ జరగలేదు. మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్, లతా మంగేష్కర్లు ఎక్కడా కలిసి ప్రోగ్రామ్‌లు చేయలేదు. వాళ్లతో పోల్చుకునేంత పెద్దవాళ్లం కాకపోవచ్చు కానీ, స్కేల్ కోసం చెప్తున్నాను. మూడు గంటల్లో ముగ్గురం 30 లేదా 35 పాటలు పాడతాం. మన దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే టాలెంటెడ్ మ్యుజీషియన్స్‌తో పాటు రెహమాన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుంచి సన్‌షైన్ ఆర్కెస్ట్రా పిల్లలు కూడా మా బృందంలో ఉంటారు. రెహమాన్ దగ్గర ఉన్న శ్రీనివాసమూర్తి కూడా భాగమవుతున్నారు’’ అన్నారు. పాటలపై రాయల్టీ విషయంలో మీరు, ఇళయరాజా కొంత కాలం మాట్లాడుకోలేదు. ఇప్పుడు కలుసుకున్నారు. మీరు మళ్లీ ఎలా కలుసుకున్నారు? అని అడిగితే – ‘‘నేనెప్పుడూ ఆయన సంగీతంలో పాడనని చెప్పలేదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లటానికి తయారుగా ఉన్నాను. ఆయన పిలిచారు, నేను వెళ్లాను. రిహార్సల్స్‌కి వెళ్లినప్పుడు ఏరా.. ఎలా ఉన్నావు? అంటే బావున్నాను, అంటే బావున్నాను అని ఇద్దరం అనుకున్నాం. ‘ఒకసారి ఇలా రా. చాలా రోజులైంది కౌగిలించుకొని’ అన్నారు. ఇద్దరం కౌగిలించుకున్నాం. అంతటితో అయిపోయింది. గతంలో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. ఈ మధ్య రెండు ప్రోగ్రామ్‌లు కలిసి చేశాం. కోయంబత్తుర్‌లో ఓ ప్రోగ్రామ్, వచ్చే ఆదివారం తిరుచునాపల్లిలో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అలాగే వచ్చే ఏడాది మార్చిలో 6 వారాల పాటు అమెరికాలో ప్రోగ్రామ్‌లు ఇవ్వనున్నాం. ఆయన అయితే నాతో ప్రోగ్రామ్‌లు చేయటానికి ఫిబ్రవరి వరకు డేట్స్ అడుగుతున్నారు కానీ, ఖాళీగా లేవు. ఇంట్లో వాళ్ల మధ్య ఎప్పుడైనా పొరపొచ్ఛాలు రావచ్చు. ఇద్దరి మనస్తత్వాలను బట్టి ఆ సమస్యను పరిష్కరించుకోవటం చాలా ఈజీ. పట్టుదలలు, పంతాలు ఉంటే చాలా కష్టం. తెగేదాకా ఏదీ లాగకూడదు. ఇద్దరికీ కలిసి పని చేయాలని కోరిక ఉంది కాబట్టి మాకు ఈజీ అయింది. అయినా ఇది వేరే ఒక ఇష్యూ మీద వచ్చిన సమస్య తప్ప వ్యక్తిగతమైనది కాదు. ఎందుకంటే నా పాట అంటే ఆయనకి ఇష్టం, ఆయన సంగీతమంటే నాకు బహు ఇష్టం. ఆ కాంబినేషన్ కావాలని సంగీత ప్రియులంతా ఎదురు చూస్తుంటే అది జరిగింది. అంతకంటే ఏం కావాలి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాలు తనయుడు, గాయకుడు ఎస్.పి చరణ్ పాల్గొన్నారు. -
సామాన్యుల దరికి సంగీతం
స్ఫూర్తి ఈమధ్య చెన్నైలో అద్భుతమైన కర్ణాటక సంగీతకచేరి ఒకటి జరిగింది. చెన్నైలోని మున్సిపల్ స్కూళ్ళలో చదివే పేద పిల్లల సంగీత కచ్చేరి అది. ఆ పిల్లలను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతుంటే అనిల్ శ్రీవాస్తవన్ కళ్లు ఒకింత గర్వంగా మెరిసాయి. ఎవరీయన? పియానిస్ట్‌గా చేయి తిరిగిన చెన్నైవాసి అనిల్ శ్రీవాస్తవన్ అమెరికాలో చదువుకున్నారు. నిజానికి ఆయన మనసంతా సంగీతమే. మూడు సంవత్సరాల వయసులో పియానో ప్రేమలో పడిన శ్రీవాస్తవన్ దాన్ని వాయించడంలో మెలకువలు నేర్చుకున్నాడు. స్కూల్లో అతనికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది పియానో. సంగీతమే శ్వాస అనుకున్న శ్రీవాస్తవన్ పదిహేడు సంవత్సరాల వయసులో సంగీతానికి దూరం కావాల్సి వచ్చింది. నాన్న అనారోగ్యంతో ఇంటిని ఆర్థికసమస్యలు చుట్టుముట్టాయి. ‘‘కుటుంబ పరిస్థితి చూస్తున్నావు కదా...పియానో మీద కాదు చదువు మీద దృష్టి పెట్టు’’ అని చెప్పింది అమ్మ. దీంతో తన సంగీత స్వప్నాలను వెనకకుర్చీలో కూర్చో పెట్టక తప్పింది కాదు. ఎకనామిక్స్‌లో మంచి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ముంబయిలో పనిచేశాడు. కొంత కాలం తరువాత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యంబిఏ చేశాడు. జీవన ప్రయాణంలో పరుగులు పెడుతూనే ఉన్నాడు. అయితే తన జీవితంలో సంగీతం లేదని గుర్తుకొచ్చినప్పుడల్లా బాధగా ఉంది. టర్నింగ్ పాయింట్1 ఒకసారి సెలవులకు ఇండియాకు వచ్చినప్పుడు మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్‌లను కలుసుకున్నాడు. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తనలోని సంగీతాన్ని ఎవరో తట్టిలేపినట్లు అనిపించింది. అలా మళ్లీ సంగీతానికి దగ్గరయ్యాడు. రాజేష్‌తో కలిసి ‘ఇన్ టు ది లైట్’ ఆల్బమ్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది తన జీవితానికి టర్నింగ్ పాయింట్. కొలంబియాలో పీహెచ్‌డి చేస్తున్నప్పుడు ఎక్కువ సమయం మ్యూజిక్ డిపార్ట్మెంట్లోనే గడిపేవాడు. అక్కడ కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఒకానొక రోజు ‘‘సంగీతం కోసం పిహెచ్డి వదిలేస్తున్నాను’’ అని అమ్మకు మెసేజ్ పెట్టాడు. స్కూల్లో తన కంటే జూనియర్ గురుచరణ్‌ను ఒకానొక సందర్భంలో కలుసుకోవడం కూడా శ్రీవాస్తవన్ త్వరగా సంగీతం వైపు రావడానికి కారణమైంది. గురుచరణ్‌కు కూడా సంగీతం అంటే ప్రాణం. అతనితో కలిసి చేసిన ‘మదిరాక్షి’ అనే ఆల్బమ్‌కు మంచి స్పందన లభించింది. ‘‘ఆల్బమ్‌కు వచ్చిన స్పందన పద్నాలుగు సంవత్సరాల బాధను మాయం చేసింది’’ అంటాడు శ్రీవాస్తవన్. ఎందరో ప్రముఖులతో కలిసి ఆల్బమ్‌లు రూపొందించిన శ్రీవాస్తవ త్వరలో ‘కీ టు ఇండియా’ అనే ఆల్బమ్‌ను విడుదల చేయనున్నాడు. టర్నింగ్ పాయింట్2 పిల్లలంటే ఇష్టపడే శ్రీవాస్తవన్... వాళ్లతో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాడు. అలా ఒకసారి తిరువరూర్లో ప్రభుత్వపాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న క్రమంలో సంగీతానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు వారిని అడిగాడు. అప్పుడు ఆయనకు అర్థమయ్యిందేమిటంటే, పిల్లలకు సినిమా జ్ఞానం తప్ప సంగీతజ్ఞానం బొత్తిగా లేదని. ఇది శ్రీవాస్తవన్ను బాధకు గురి చేసింది. ‘పాఠశాలలో సంగీతానికి ప్రాధాన్యత లేదు’ ‘సంగీత పట్టభద్రులకు ఉద్యోగాలు లేవు’ బాధగా అనుకున్నాడు తనలో తాను. సంగీతాన్ని, సంస్కృతిని పిల్లలకు చేరువ చేయాలనే ఆలోచనతో ఇరవై రెండు లక్షల రూపాయలతో ‘రాప్సోడీ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ’ని స్థాపించాడు. గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్లి మ్యూజిక్‌ను ఒక సబ్జెక్ట్‌గా చేర్చి, దానికి సంబంధించిన విద్యావిధానానికి రూపకల్పన చేస్తుంది రాప్సోడీ. రాప్సోడీ నుంచి ఉపాధ్యాయులు ప్రభుత్వపాఠశాలలకు వెళ్లి సంగీత పాఠాలు బోధిస్తుంటారు. ‘మ్యూజిక్ అండ్ ది మైండ్’ పేరుతో డా.సుధా రాజాతో కలిసి పాఠ్యప్రణాళికను రూపొందించాడు శ్రీవాస్తవన్. ‘‘గణితం, భూగోళశాస్త్రం, చరిత్ర, సైన్స్‌లాగే సంగీతాన్ని కూడా ఒక సబ్జెక్ట్‌గా పరిగణించాలి’’ అనేది ఆయన కోరిక. విశేషం ఏమిటంటే సైన్స్ పాఠాలను పాటలుగా రూపొందించి పిల్లలతో పాడిస్తున్నారు. దీంతో సంగీతం వచ్చినట్లు ఉంటుంది, సబ్జెక్ట్ వచ్చినట్లూ ఉంటుంది. ఆర్థికసమస్యల వల్ల సంగీతం నేర్చుకోవడం అనేది ఒకప్పుడు పేదపిల్లలకు కష్టమైన పని కావచ్చు. కాని శ్రీవాస్తవన్ కృషి వల్ల ఇప్పుడు సంగీతం అనేది పేదపిల్లలను వెదుక్కుంటూ మరీ వస్తుంది. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులకు సంగీతాన్ని చేరవేయాలనేది శ్రీవాస్తవన్ కల. ఆ దిశగా ఆయన అభినందన పూర్వకమైన ప్రయత్నం చేస్తున్నారు.