చిరంజీవి నటుడిగా మారి సెప్టెంబర్ 22తో 42 ఏళ్లు పూర్తయింది. ఈ 42 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. మెగాస్టార్‌గా మారారు. 151 సినిమాలు పూర్తి చేశారు. ఈ నట ప్రస్థానం గురించి, సెప్టెంబర్ 22తో తనకున్న అనుబంధం గురించి ఈ విధంగా చెప్పారు. ‘‘నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజయితే సెప్టెంబర్ 22 (‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదల తేదీ) నటుడిగా ‘ప్రాణం ’ పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలయిన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అని అన్నారు చిరంజీవి.
Comments
Please login to add a commentAdd a comment