ఎగ్జిబిషన్‌లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క
ఐదేళ్లలో వడ్డీ లేని రుణాలిచ్చి కోటీశ్వరులను చేస్తాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి
సనత్‌నగర్: రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని.. వ్యాపారులుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళ లకు ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి సీతక్క తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభు త్వ ఆర్థిక సహాయాన్ని మహిళలందరూ అందిపుచ్చుకొని కోటీశ్వరులుగా ఎదగాలన్నారు.
17 రకాల వ్యాపారాలకు వడ్డీలేని రుణాలు: మంత్రి సీతక్క
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్య మని, అందుకో సం వడ్డీ లేని రుణాలను అందించి ప్రోత్సహి స్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళ లు ఆర్థికంగా నిలదొక్కుకొంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి.. ఆ వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్పొరేషన్ల చైర్మన్లు శోభారాణి, కాల్వ సుజాత, వెన్నెల, నిర్మల జగ్గారెడ్డి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్‌పర్సన్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment