ప్రపంచ నోబెల్‌ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి | Bhatti vikramarka to the World Nobel Peace Summit | Sakshi
Sakshi News home page

ప్రపంచ నోబెల్‌ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి

Published Mon, Sep 16 2024 4:19 AM | Last Updated on Mon, Sep 16 2024 4:19 AM

Bhatti vikramarka to the World Nobel Peace Summit

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం

సాక్షి, హైదరాబాద్‌: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికో దేశం న్యూవోలియోన్‌లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్‌ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావాల్సిందిగా భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. 

ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. నోబెల్‌ శాంతి, ప్రపంచ శాంతి పురస్కార గ్రహీతల విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఆహ్వానంలో పేర్కొన్నారు. ప్రపంచ సమస్యల పరిష్కారానికి వ్యూహాలు, కార్యాచరణను ఈ సమా వేశంలో రూపొందిస్తారని తెలిపారు. 

గుజరాత్‌కు భట్టి..
గుజరాత్‌ గాంధీనగర్‌లోని మహాత్మ మందిర్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈనెల 16 నుంచి 18 వరకు జరుగుతున్న నాలుగో గ్లోబల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌ అండ్‌ ఎక్స్‌పో (ఆర్‌ఈ ఇన్వెస్ట్‌ 2024)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. సదస్సులో పాల్గొనేందుకు భట్టి ఆదివారం సాయంత్రం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గుజరాత్‌కు బయలుదేరి వెళ్లారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement