
నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర మార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు.
జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం, రాష్ట్ర రాజకీయ పరిణా మాలపై ముగ్గురు కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల ఎంపికపై ఏకాభిప్రాయం రాగానే హై కమాండ్ ఆమోదం తీసుకుని త్వరలోనే అధికారికంగా జాబితా ప్రకటించాలని నిర్ణయించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment