5,000కోట్లతో గురుకులాల అభివృద్ధి | 5000 crore for the development of Gurukuls | Sakshi
Sakshi News home page

5,000కోట్లతో గురుకులాల అభివృద్ధి

Published Wed, Aug 14 2024 4:48 AM | Last Updated on Wed, Aug 14 2024 4:48 AM

5000 crore for the development of Gurukuls

మృతుల కుటుంబాలకు ఉద్యోగం, ఆర్థిక సాయం

విద్యార్థుల మృతితో తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు

పెద్దాపూర్‌ గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

మెట్‌పల్లి/మెట్‌పల్లి రూరల్‌: అన్ని గురుకు­లాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటా­యిం­చిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి­విక్రమార్క స్పష్టం చేశారు. జగిత్యాలజిల్లా మెట్‌ç­³ల్లి మండలంలోని పెద్దాపూర్‌ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో ఇటీవల ఇద్దరు విద్యార్థులు గుణాదిత్య, అనిరుధ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆ గురుకులాన్ని సందర్శించారు. 

ముందుగా బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇద్దరు చిన్నారుల మృతి  సంఘటన ప్రభుత్వాన్ని ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  2015–16 ఆర్థిక సంవత్సరంలో గురుకులాల సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ.197కోట్లు కేటాయించిన బీఆర్‌ఎస్‌.. ఆ తర్వాత ఏటా తగ్గిస్తూ వస్తూ గతేడాది కేవలం రూ.3కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించిందని, వీటిని ఈ సంవత్సరంలోనే ఖర్చు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. 

నెలకొసారి సందర్శన..
గురుకులాల్లో పరిస్థితులను మెరుగుపర్చడా­నికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు నెలకోసారి సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించినట్టు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. నాణ్యమైన భోజనం అందించేందుకు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డైట్‌ చార్జీలు పెంచడానికి అధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. 

ప్రతి గురుకులంలో అత్యవసర మందులు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయంతోపాటు ఒకరికి గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తామని తెలిపా రు. ఇల్లు లేకుంటే ఇందిరమ్మ పథకం కింద రూ.5లక్షలు అందిస్తామన్నారు.

అనంతరం డిప్యూటీ సీఎం.. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పనులకు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో కోరుట్ల, చొప్పదండి, జగిత్యాల, మానకొండూర్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, సంజయ్, కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

విద్యార్థి తల్లికి పూనకం 
‘గురుకులంలో మల్లన్నగుడి  నిర్మించాలి. అలా అయితేనే శాంతిస్తానంటూ’ ఓ విద్యార్థి తల్లి  పూనకంతో ఊగిపోయింది. గురుకులంలో చదువుతున్న 9వ తర­గతి విద్యార్థి కౌశిక్‌ తల్లి కృష్ణవేణికి పూనకం వచ్చి పొర్లుదండాలు పెట్టింది. అక్కడున్న పలువురు ఆమెను ప్రశ్నించడంతో తాను శాంతించాలంటే తన మల్ల­న్న ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేయాలని సమాధానమిచ్చింది. ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి పక్కనుంచి వెళుతుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement