నేడు వెళ్లనున్న భట్టి.. పార్టీ పెద్దలతో ఇరువురి భేటీకి చాన్స్
మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల నియామకంపై చర్చ?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ము ఖ్యమంత్రులు, డీజీపీలతో సోమ వారం జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు ఆదివారం సాయంత్రం ఆయన హస్తిన బయలుదేరారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా సోమవారం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. వారిద్దరూ పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసే అవకాశముందని, మంత్రివర్గ విస్తరణతోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై చర్చించొచ్చని ఉందని గాంధీ భవన్ వర్గాలు తెలి పాయి.
అయితే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోనే ఉంటారని తెలుస్తోంది. అలాగే పీసీసీ చీఫ్ మహే శ్‌కుమార్‌గౌడ్ తిరుపతి వెళ్తున్నారు. ఈ నేప థ్యంలో ఉత్తమ్, మహేశ్‌గౌడ్ లేకుండానే మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలపై హైకమాండ్‌తో చర్చలు జరుగుతాయా లేదా అన్నదా నిపై స్పష్టత రావాల్సి ఉంది. అవకాశాన్నిబట్టి సీఎం, డిప్యూటీ సీఎం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలవనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment