సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు పొలిటికల్ కౌంటరిచ్చారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కౌంటరిచ్చారు. భట్టి తన పాదయాత్రను రమ్యంగా వర్ణించారని అన్నారు. భట్టి మరోసారి పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేశారు. పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు. అది సహజమైన పరిణామం అని అన్నారు.
ఈ సందర్బంగా సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘చనిపోయేంతవరకు జయశంకర్ తెలంగాణపై రాజీపడలేదు. తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క లీడర్‌తోనే తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్రం 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. తలసారి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఉన్న తెలంగాణను తుడిచేసింది కాంగ్రెస్, జవహర్‌లాల్‌నెహ్రు అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది. 1969లో ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడితే ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ వ్యతిరేకించారు. టీడీపీ హయాంలో తెలంగాణలో పరిస్థితులు మరింత దిగజారాయి. చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారు.
తాగునీటి కోసం 2.5 లక్షల కిమీల పైప్‌లైన్ వేశాం. కాంగ్రెస్ హయాంలో 35వేల చెరువులు మాయమైపోయాయి. తెలంగాణ ఏర్పడక ముందే మిషన్ కాకతీయ పేరు పెట్టాం. కాళేశ్వరమే లేకపోతే తుంగతుర్తి, డోర్నకల్, కోదాడకు నీల్లు వచ్చేవా?. ఒకప్పుడు ఎండిపోయిన గోదావని నేడు సముద్రాన్ని తలపిస్తోంది. దక్షిణ తెలంగాణకు రేపటి వర ప్రదాయిని కాళేశ్వరం.
ఇండియాలోనే మొత్తంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఎంత క్రమశిక్షణ పాటిస్తే.. 24 గంటల విద్యుత్ సాధ్యమవుతుంది. 24 గంటల కరెంట్ ఇస్తుంటే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండాలు పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు. కాంగ్రెస్ నేతలా మాకు నీతులు చెప్పేది. మన్యం కష్టాలు కాంగ్రెస్ చరిత్ర అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వస్తా పోతా ఉంటారు.. నెల రోజుల్లో ప్రభుత్వాన్ని పడగొడతాం అంటారు. మోదీకి మన మీద ఏం పగనో మనకు తెలియదు. జీరో ఫ్లోరోసిస్ రాష్ట్రం ఇండియాలో ఒక్క తెలంగాణ మాత్రమే. బీజేపీ వైఖరేంటో ఎవరికీ అర్థం కాదు. వందేభారత్ రైళ్లకు వందసార్లు జెండా ఊపి ప్రారంభిస్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కూడా కేసీఆర్ విమర్శలు చేశారు. రైల్వేస్టేషన్ లిఫ్టుని కూడా బీజేపీ నేతలు జాతికి అంకితం చేస్తారు’ అంటూ సెటైర్లు వేశారు.
ఇది కూడా చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment