తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా | Telangana Assembly Sessions Dec 20th Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

భూ భారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

భూభారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 

ఫార్ములా ఈ రేసుల కేసుపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు 

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా 

2024-12-20 16:21:04

ఫార్ములా ఈ కేసుపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

  • ఇన్ని రోజులు కేటీఆర్‌ ఫార్ములా ఈ రేసుల కేసు గురించి ఎందుకు మాట్లాడలేదు
  • ఏసీబీ కేసు తర్వాత ఈ రోజే అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు 
  • బీఆర్‌ఎస్‌ బీఏసీలో ఇచ్చిన 9 అంశాల్లోనూ ఈ రేసుల కేసు లేదు 
  • ఓ పక్క కేసు దర్యాప్తు, మరోపక్క కోర్టులో వాదనలు జరుగుతున్నాయి
  • అందుకే నేను ఆ కేసు వివరాల జోలికి వెళ్లడం లేదు 
  • నేనే ఈ రేసుల కంపెనీ ప్రతినిధులను కలిశాను 
  • కేటీఆర్‌తో చీకటి ఒప్పందం ఉందని వాళ్లే మాకు చెప్పారు
  • మీరు కూడా సహకరించాలని కోరారు 
  • ఈ కార్‌ రేసు కేసు ఒప్పందం రూ.55 కోట్లు కాదు రూ.600 కోట్లు 
2024-12-20 15:54:10

బీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌పై పేపర్లు విసిరారు: సీఎం రేవంత్‌

  • ప్రధాన ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోంది
  • స్పీకర్‌పై దాడి చేసి అడ్డుకునే పరిస్థితి తెచ్చింది
  • సహనం కోల్పోని స్పీకర్‌ హుందాగా వ్యవహరించారు
  • బీఆర్‌ఎస్‌ సభ్యులు చర్చను పక్కదారి పట్టించారు
  • సభాపతిపైనే పేపర్లు చింపి విసిరారు
  • బీఆర్‌ఎస్‌ రూల్స్‌ ఉల్లంఘించింది
  • భూభారతి కింద ప్రతి భూ యజమాని హక్కులు కాపాడతాం
  • ధరణి స్థానంలో చట్టం తీసుకువస్తాం
  • తెలంగాణ ప్రజలకు భూమి ఆత్మగౌరవం
  • భూమి కోసం, భుక్తి కోసం ఎంతో మంది యోధులు పోరాటం చేశారు
  • పీవీ నరసింహారావు ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ తీసుకువచ్చారు
  • యూపీఏ హయాంలో దేశవ్యాప్త భూ సంస్కరణలు తీసుకువచ్చారు
2024-12-20 15:05:05

అసెంబ్లీ నుంచి వాకౌట్‌​ చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

  • అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌
  • ఫార్ములా-ఈ రేసుపై చర్చ చేపట్టపవడంతో నిరసనగా వాకౌట్
  • భూ భారతిపైనే  చర్చిస్తున్న అసెంబ్లీ 

 

 

2024-12-20 14:42:30

బీఆర్‌ఎస్‌పై అక్బరుద్దీన్‌ ఆగ్రహం

  • పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన కచరా గవర్నెన్స్‌
  • అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు
  • బీఆర్‌ఎస్‌ సంస్కృతి ఇదే..కేసీఆర్‌ నేర్పింది ఇదే
  • ఒక కుటుంబం కోసమే బీఆర్‌ఎస్‌ ఆందోళన చేస్తోంది
  • భూ భారతి బిల్లుపై చర్చను అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

 

2024-12-20 14:31:42

సభలో గందరగోళం..

  • అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. 
  • ఈ-ఫార్ములా రేసుపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్‌ నేతలు నినాదాలు
  • సీట్ల నుంచి లేచి ఒక్కసారిగా స్పీకర్‌ పోడియం వైపు దూసుకెళ్లిన బీఆర్‌ఎస్‌ సభ్యులు
  • స్పీకర్‌ పోడియం మెట్ల వద్దకు వెళ్లిన హరీష్‌ రావు. 
  • భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకున్న గులాబీ పార్టీ సభ్యులు. 
  • ప్లకార్డులతో వస్తు‍న్న నేతలను అడ్డుకున్న మార్షల్స్‌
2024-12-20 13:58:02

బీఆర్‌ఎస్ సభ్యులపై పొంగలేటి ఆరోపణలు..

  • మంత్రి పొంగులేటి కామెంట్స్‌..
  • కొందరు పెద్దల స్వార్థం కోసం ధరణి తెచ్చారు.
  • ధరణి పేరుతో ఆర్థిక అవకతవకలు జరిగాయి.
  • లోపాలున్న ధరణి స్థానంలో భూభారతి తీసుకువచ్చాం.
  • ఇచ్చిన మాట ప్రకారం ధరణిని రద్దు చేశాం.
  • బీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో రౌడీల్లా, గూండాల్లో ప్రవర్తిస్తున్నారు.
  • రోజుకో డ్రామా పేరుతో బీఆర్‌ఎస్‌ నాటకం చేస్తోంది.
  • అబద్ధాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తు​న్నారు.
  • నన్ను కొట్టడానికి నా సీటు దగ్గరకు వచ్చి బెదిరించారు.
  • బీఆర్‌ఎస్‌ అడిగినందుకే ఓఆర్‌ఆర్‌ ఒప్పందంపై విచారణకు ఆదేశించాం.
  •  
2024-12-20 13:48:47

అసెంబ్లీలో భూభారతిపై కొనసాగుతున్న చర్చ

  • అసెంబ్లీలో భూభారతిపై కొనసాగుతున్న చర్చ
  • మరోవైపు, ఫార్ములా ఈ-రేసు కారుపై చర్చించాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు నినాదాలు.
  • బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై మంత్రులు సీరియస్‌
  • ధరణిలో అవకతవకలపై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించిన బీజేపీ.
  •  
2024-12-20 13:38:56

బీఆర్‌ఎస్‌పై సీతక్క సీరియస్‌..

  • మంత్రి సీతక్క చిట్ చాట్..
  • పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను, అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించారు..
  • కేబినెట్ ఆమోదం తీసుకొని ఈ కార్ రేస్‌కు కేటీఆర్ డబ్బులు చెల్లించారా?
  • ప్రభుత్వం అనుమతి లేని అంశానికి సభలో చర్చ ఎందుకు..
  • గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చిన కేసును సభలో చర్చ అవసరం లేదు..
  • బీఏసీలో ఈ-ఫార్ములా మీద చర్చ కోసం బీఆర్ఎస్ ఎందుకు అడగలేదు.
  • ముసుగు వేసుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది.
  • జైలుకు వెళ్లి యోగా చేస్తా అన్న కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారు.
  • కేటీఆర్ తన సమస్యను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు..
  • కేటీఆర్‌కు నిజాయితీ లేదు.. అందుకే అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారు.
2024-12-20 13:12:39

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన స్పీకర్ సమావేశం

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన స్పీకర్ సమావేశం
  • సభ జరిగేందుకు సహకరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరిన స్పీకర్
  • సభ జరిగేందుకు సహకరిస్తామన్న బీఆర్‌ఎస్‌ నేతలు..
  • కానీ, సభలో కార్ రేస్ వ్యవహారంపై చర్చకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించాలని స్పీకర్‌ను కోరిన గులాబీ నేతలు.
  • సభా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్..
2024-12-20 12:51:19

రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు..

  • అసెంబ్లీ సమావేశాలు రేపు కూడా కొనసాగనున్నాయి. 
  • నేడు ఆందోళనల మద్య భూభారతి బిల్లుపై చర్చ. 
2024-12-20 12:22:37

బీఆర్‌ఎస్‌ సభ్యులపై బీజేపీ ఏలేటి ఆగ్రహం...

  • బీఆర్‌ఎస్‌ సభ్యులపై ఏలేటి ఆగ్రహం...
  • సభలో బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి స్పీచ్‌ను అడ్డుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.
  • మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతుండగా బడే బాయి చోటే భాయి అంటూ  నినాదాలు.
  • దీంతో ఆగ్రహించిన బీజేపీ నేత ఏలేటి.
  • పదే పదే డిస్టర్బ్ చేస్తే ఎలా మాట్లాడాలి అంటూ మండిపడ్డారు?
  • సభను ఆర్డర్‌లో పెట్టాలని స్పీకర్‌ను కోరిన ఏలేటి
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపకపోవడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్
2024-12-20 11:55:54

ప్రజా సంక్షేమం బీఆర్‌ఎస్‌కు పట్టదు..

  • మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్‌..
  • ప్రజలకు సంక్షేమం చేయకూడదని బీఆర్ఎస్ చూస్తోంది.
  • ప్రజలకు మేలు చేసే భూభారతి తెస్తుంటే అడ్డుపడుతున్నారు.
  • ఈరోజు బిజినెస్ మొత్తం బీఏసీలో చర్చించే నిర్ణయం తీసుకున్నాం.
  • భూ భారతి పై చర్చకు బీఆర్ఎస్ సభ్యులు సమయం అడిగితేనే ఇచ్చాం..
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా సూచనలు చేయాలని కోరాం. 
  • బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన పై అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్..
  • భూభారతి ప్రజలందరికీ ఉపయోగపడే బిల్లు.. 
     
2024-12-20 11:19:58

తాగి ఎవరు వచ్చారు.. డాక్టర్‌ను పిలవండి..

  • అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద తలసాని కామెంట్స్‌..
  • ప్రభుత్వ డాక్టర్లను పిలిపించి టెస్టులు చేపించండి..
  • మద్యం తాగి ఎవరు వస్తారు చెప్పండి..
  • చెప్పడానికి ఏమీ లేక మా మీద ఎలా పడితే అలా ఎలా మాట్లాడుతారు..
  • అసెంబ్లీలో ఇప్పటి వరకు  ఇలా ఎప్పుడు జరగలేదు..
  • సీనియర్ ఎమ్మెల్యే మీద కేసు పెడుతున్నారు..
  • ఈ రేసింగ్ మీద చర్చ పెట్టండి అని అన్నాము..
  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేపర్లు, బాటిల్స్ విసిరారు.. చెప్పు చూపారు..
  • తాగి వచ్చారు అంటున్నారు..
  • ప్రభుత్వ డాక్టర్లను తీసుకువచ్చి.. టెస్ట్ చేయండి. మేము సిద్ధంగా ఉన్నాం.
  • చర్చ పెట్టే అవకాశం ఉన్న.. పెట్టడం లేదు.
  • రాష్ట్రం పరువు పోయే అంశం.. ఈ రేస్ మీద చర్చ పెట్టండి.
2024-12-20 11:17:13

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గూండాయిజం సరికాదు..

  • మంత్రి పొంగులేటి కామెంట్స్‌.. 
  • భూభారతి చట్టంపై చర్చ జరగకుండా బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోంది.
  • ఒక ఎమ్మెల్యే కేసు గురించి ఇలా చేయడం సరికాదు.
  • కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదు.
  • 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తి మాకు సూచనలు ఇస్తారనుకున్నాం.
  • భూభారతి బిల్లులో ఆయన పాల్గొంటారని ఆశించాం.
  • సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు దారుణం.
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గూండాయిజం, రౌడీయిజం చేయడం సరికాదు.
  • ధరణి చట్టానికి మూడేళ్లే నూరేళ్లు నిండాయి.
  • ఒక దొర కోసం చర్చించాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు గొడవ చేస్తున్నారు.
  • ఈ సభలో దొర కోసం చర్చించాల్సిన అవసరం ఉందా?. 
2024-12-20 11:14:08

అసెంబ్లీ ఘటనపై సీఎం ఆరా..

  • అసెంబ్లీ ఘటనపై సీఎం రేవంత్‌ ఆరా..
  • అసెంబ్లీలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
  • మంత్రులు శ్రీధర్‌ బాబు, పొంగులేటికి ఫోన్‌ చేసి మాట్లాడిన సీఎం రేవంత్‌.
     
2024-12-20 11:14:08

దళిత ఎమ్మెల్యే మీదకు చెప్పు చూపించారు..

  • ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
  • ఫార్ములా రేసుపై చర్చ పెట్టాలంటే అంటే అసెంబ్లీలో చర్చ జరగాలి
  • దళిత ఎమ్మెల్యే మీద చెప్పు చూపించారు..
  • ఇంతకంటే దారుణం ఉంటదా? ఇదేనా సభా సంప్రదాయం
  • ఆ ఎమ్మెల్యే మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి
  • ఫార్ములా రేసు కంటిన్యూ అయితే టెస్లా వచ్చేది
  • వేలాది మందికి ఉపాధి కలుగుతుంది
  • తెలంగాణ పేరు ప్రపంచ వ్యాప్తంగా చెడ్డ పేరు తీసుకొచ్చారు
  • ఎలాంటి అవినీతి లేదు, ప్రొసీజర్ ల్యాప్స్ అని నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
2024-12-20 11:01:31

కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు

  • మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్‌..
  • కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారు
  • కారు ఈ రేసింగ్ లో ఏం లేదని కేటీఆర్ చెప్తున్నారు
  • అసెంబ్లీలో ఈ కార్ రేసింగ్ చర్చకు అనుమతించాలి
  • కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే ఈ కార్ రేసింగ్ పై చర్చ పెట్టాలి
  • చర్చ పెట్టాలని తప్పించుకునే ప్రయత్నంలో చేస్తున్నారు
  • చర్చ జరిగేంత వరకు శాసనసభలో పోరాటం చేస్తా
2024-12-20 11:01:31

కమిషన్ అంటూ హంగామా చేస్తున్నారు

  • అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి కామెంట్స్‌..
  • ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించేందుకే  అక్రమ కేసులు పెడుతున్నారు  
  • కమిషన్ అంటూ హంగామా చేస్తున్నారు
  • ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు
  • చేసేదేమీ లేకనే కేటీఆర్‌పైన చిల్లర కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • ఈ కార్ రేసింగ్‌పై చర్చించాలని శాసనసభలో కేటీఆర్ డిమాండ్ చేశారు
  • శాసనసభలో చర్చ పెట్టాలి
  • అసెంబ్లీ చర్చ పెడితే నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తారు
  • కేటీఆర్ అడిగింది న్యాయమైన కోరిక
  • కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే.
  • గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఆధారాలున్నాయా చూపించండి
  • చర్చ పెట్టమంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతుంది
  • రైతు భరోసా పై చర్చ  లేదు
  • రైతులకు ఇచ్చిన హామీల పై చర్చ లేదు
  • చేయని అప్పులు చేసినట్లు  అసత్య ప్రచారం చేశారు
  • ఫార్ములా ఏ రేసింగ్ లో  కేటీఆర్ చేసిన నేరం ఏమిటి?
  • దానికి ఆధారాలు ఏంటో సభలో  చర్చ పెట్టి చూపించండి
  • సభలో చర్చ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాదు.. దమ్ము లేదు
  • ఈ  కార్ రేసింగ్‌పై చర్చ జరిగేంత వరకు సభలో ఆ పోరాటం కొనసాగుతుంది
  • శాసనసభలో ఒక్కటంటే ఒక్కటి ప్రజా సమస్యలపై చర్చించలేదు
  • బీజేపీ కాంగ్రెస్ ఒకటే
  • ఢిల్లీలో కాంగ్రెస్ ఏం ఆరోపణలు  చేస్తే ఇక్కడే అదే జరుగుతుంది
  • బడే బాయ్ చోటే బాయ్ ఒకే లైన్లో ఉన్నారు
2024-12-20 11:01:31

సభలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌

  • షాద్‌నగర్‌ ఎమ్మెల్యే శంకర్‌పై బీఆర్‌ఎస్ ఆగ్రహం..
  • శంకర్‌ తమకు చెప్పు చూపించారని బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు.
  • ఈ సందర్బంగా అసెంబ్లీలో వీడియోలు బయటపెట్టాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌.
  • దళిత ఎమ్మెల్యేకు చెప్పు చూపించారు.
  • శంకర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి.
  • కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందన్న హరీష్‌ రావు..
  • మేము తప్పు చేస్తే ప్రజలకు చెప్పండి.
2024-12-20 10:56:12

శాసనసభలో నేడు చీకటి రోజు..

  • అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం కామెంట్స్‌..
  • శాసనసభలో ఈరోజు చీకటి రోజు..
  • దళిత స్పీకర్‌పై అవహేళన చేస్తూ.. పేపర్లను చించేసి అవమానపరిచారు.
  • కౌశిక్ రెడ్డి అగ్రకుల అహంకారం చూయించారు.
  • స్పీకర్‌ను కొట్టేంత పనిచేశారు.
  • ఫ్లకార్డులు తీసుకురావొద్దు, నినాదాలు చేయవద్దని బీఆర్ఎస్ ప్రభుత్వామే రూల్స్ ఫ్రేమ్‌ చేసింది.
  • గతంలో ఇవే నిబంధనలతో సంపత్, కోమటిరెడ్డిని శాసనసభ నుంచి బయటకు పంపించారు..
  • ఇప్పుడు కౌశిక్ రెడ్డి సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదు
2024-12-20 10:39:54

స్పీకర్‌పైకి పేపర్లు విసిరిన హరీష్‌, పల్లా..

  • స్పీకర్‌పైకి పేపర్లు విసిరిన బీఆర్‌ఎస్‌ సభ్యులు..
  • దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ సభ్యులు పేపర్లు చించివేయడంపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం..
  • దళితులను అవమానించారని అంటున్న కాంగ్రెస్..
  • బీఆర్ఎస్ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలంటుంన్న కాంగ్రెస్ సభ్యులు.
  • స్పీకర్‌పైకి పేపర్లు విసిరిన హరీష్‌, పల్లా..
2024-12-20 10:35:08

అసెంబ్లీలో బాహాబాహీ..

  • అసెంబ్లీలో గందరగోళం నెలకొంది..
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు బాహాబాహీకి దిగారు.
  • ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్‌ విసిరేసుకున్న సభ్యులు.
  • సభ్యుల ఆందోళనతో 10 నిమిషాలు శాసనసభ వాయిదా
2024-12-20 10:26:07

భూభారతిపై చర్చ ప్రారంభం..

  • భూభారతిపై చర్చ ప్రారంభం..
  • మంత్రి పొంగులేటి కామెంట్స్‌..
  • ధరణితో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
  • ధరణి కాన్సెప్ట్‌ను పెట్టి పేదలకు చెందిన వేలాది ఎకరాలు తన్నుకుపోయారు.
  • ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల నినాదాలు.
  • శాసనసభ 15 నిమిషాలు వాయిదా..
  • ప్రారంభమైన కాసేపటికే శాసనమండలి వాయిదా. 
     
2024-12-20 10:24:01

చర్చ అనవసరం..

  • కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్స్‌..
  • గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఈ ఫార్ములాపై సభలో చర్చ అనవసరం.
  • ఇక, బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే భూ భారతి  బిల్లుపై జరుగుతున్న చర్చ..
2024-12-20 10:17:44

స్పీకర్‌ సీరియస్‌..

స్పీకర్ కామెంట్స్‌.. 

  • ఒక వ్యక్తికి సంబంధించిన కేసుపై చర్చ కోసం పట్టుబట్టడం తగదు.
  • బిల్స్ పై చర్చ తర్వాత  ఆలోచిద్దామన్న స్పీకర్‌


హరీష్‌ రావు కామెంట్స్‌..

  • రాష్ట్ర ప్రతిష్ట పెంచేందుకు ఈ-ఫార్ములా రేసును కేటీఆర్ తెచ్చారు..
  • సభలో చర్చ పెట్టండి.. ఎవరు తప్పు చేశారో తేలుద్దాం.
  • ఈ-కార్ రేసుపై చర్చ ఎప్పుడు పెడతారో క్లారిటీ ఇవ్వండి.
  • ఒక్క మంత్రి కూడా సభకు రాలేదు.. కాంగ్రెస్ మంత్రులకూ సభపై గౌరవం లేదు


పొంగులేటి కామెంట్స్‌..

  • నేను సభలో ఉండగా మంత్రులు లేరని హరీష్ రావు ఎలా అంటారు..
  • సభను హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారు.


స్పీకర్ ఆగ్రహం..

  • బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.
  • ఒక్క సభ్యుడి కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సుపై జరిగే చర్చను పక్కన పెట్టాలని అడగడం సరైంది కాదు.
  • ఈరోజు బిజినెస్‌పై చర్చ జరిగిన తర్వాత మిగతా అంశాలపై మాట్లాడండి
2024-12-20 10:16:15

బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన..

  • బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన..
  • నల్ల బ్యాడ్జీలు, ఫ్లకార్డులతో అసెంబ్లీకి  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.
  • ప్రభుత్వ హామీల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులా అంటూ నినాదాలతో  సభలోకి వెళ్లిన బీఆర్ఎస్ సభ్యులు.
2024-12-20 10:05:22

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరోరోజు ప్రారంభమయ్యాయి. 
  • ఫార్ములా ఈ -కార్ రేస్‌పై శాసనసభలో చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్
  • నిరుద్యోగ భృతిపై చర్చ చేపట్టాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ

 

2024-12-20 10:00:27
Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement