సాక్షి, హైదరాబాద్: శాసన సభలో లఘుచర్చ సందర్భంగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి కేటీఆర్ పరోక్షంగా చురకలు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందంటూ ఆ పార్టీ నాయకులు చేసిన కామెంట్లపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘గతంలో ఓ పెద్ద మనిషి (చంద్రబాబు) ఇలాగే అన్నీ తానే చేశానని చెప్పుకునేవాడు.
అట్లానే ఈ మధ్య ఆయన ఎర్రగడ్డ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడున్న పేషెంట్లను పలకరించాడు. నేనెవరో తెలుసా? అని ఓ పేషెంట్‌ను అడిగితే.. తనకు తెలియదని బదులిచ్చాడు. దీంతో ఆ పెద్దమనిషి.. ‘నేను తెలియదా.. ఈ హైదరాబాద్ కట్టింది నేనే..’ అని చెప్పాడు. అప్పుడా పేషెంట్ బదులిస్తూ.. ‘అవునా విశాఖపట్నం పక్కన సముద్రాన్ని నేనే ఏర్పాటు చేశా అని నేను చెప్పినా వినకుండా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు..’ అని బదులిచ్చాడు.. మీరు చెప్తున్నదీ అలాగే ఉంది’’ అని ఎద్దేవా చేశారు.
రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ఏపీకి వెళ్లిపోయింది!
ఇక గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులలో బాగా పనిచేసిన వాళ్లు ఉన్నారని.. మంచి ఉంటే తామే చెప్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చారన్న విషయాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్వయంగా అసెంబ్లీలో చెప్పారని ఆయన గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ ఏపీకి వెళ్లిపోయిందని.. తెలంగాణ కాంగ్రెస్‌లో వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులు అధ్యక్షులు అయ్యారని వ్యాఖ్యానించారు.
చదవండి: ఇంతకంటే అభివృద్ధా?.. రుజువు చేస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్
Comments
Please login to add a commentAdd a comment