హరీష్‌ Vs సీఎం, మంత్రులు.. సభలో వాడీవేడీ చర్చ | Political Words Exchange Between Harish Rao And Ministers | Sakshi
Sakshi News home page

హరీష్‌ Vs సీఎం, మంత్రులు.. సభలో వాడీవేడీ చర్చ

Published Wed, Jul 24 2024 11:13 AM | Last Updated on Wed, Jul 24 2024 5:36 PM

Political Words Exchange Between Harish Rao And Ministers

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా సభలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ నడుస్తోంది. ఆర్టీసీ అంశంపై హరీష్‌ రావు వ్యాఖ్యలకు మంత్రులు శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్‌ కౌంటరిచ్చారు. దీంతో, మూడు సభ్యులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

హరీష్‌రావు కామెంట్స్‌..

  • ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.
  • ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.
  • ఆర్టీసీ పీఆర్‌సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.
  • ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.
  • 300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.
  • ఇంతవరకు అది బస్‌భవన్‌కు చేరలేదు.
  • ఆర్టీసి ప్రభుత్వంలో  విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..
  • మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.
  • కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.
  • ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు
  • గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.
  • కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారు
  • మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?
  • సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా?


హరీష్‌కు మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌..

  • హరీష్ రావుకు క్వశ్చన్ అవర్‌లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?
  • ఈ ఉపన్యాసం ఏంటి?.
  • కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.
  • సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు.
  • ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన చేసే హక్కు సభ్యులకు సభలో లేదు.
  • బీఆర్‌ఎస్‌ నాయకులు సభ రూల్స్ తెలుసుకోవాలి.
  • హరీష్ రావు రూల్స్ గురించి మాట్లాడుతున్నారు అందుకే చెప్తున్నా.
  • బీఆర్‌ఎస్‌కు ఏదైనా అభ్యంతరం ఉంటే వేరే ఫార్మాట్ ద్వారా రావాలి

 

శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన హరీష్‌..

  • శ్రీధర్ బాబు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.
  • ప్రశ్నోత్తరాల సమయంలో సరైన సమాధానాలు రాక గతంలో కాంగ్రెస్ చాలాసార్లు వాకౌట్ చేసింది.
  • ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌..

  • ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు మాటలు హస్యాస్పదం.
  • కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.
  • ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.
  • 2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.
  • కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.
  • ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్‌ఎస్‌ మాకు అప్పగించింది.
  • మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.
  • మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము.
  • ఓవర్ లోడ్ అవుతుంది.
  • కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.
  • గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్‌ఎస్‌ నడిపించింది.
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారు
  • ఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్‌లో అన్ని చర్యలు తీసుకుంటాం
  • బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదు
  • రిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి?
     

హరీష్‌కు సీఎం రేవంత్‌ కౌంటర్‌

  • హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.
  • హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.
  • స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.
  • ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.
  • ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.
  • సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.
  • హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.
  • ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్‌లో లేదు
  • ప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.
  • సభ సభ్యులందరి ఆస్తి.
  • ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.
  • రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.
  • గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి  సస్పెండ్ చేశారు.
  • గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.
  • కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.
  • కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.
  • హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.
  • సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement